“మే 11–17. ‘యెహోవాను మరువకుండా జాగ్రత్తపడుము’: ద్వితీయోపదేశకాండము 6–8; 15; 18; 29–30; 34,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“మే 11–17. ‘యెహోవాను మరువకుండా జాగ్రత్తపడుము,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
Moses on Mount Nebo [నెబో కొండపై మోషే], జాన్ స్టీల్ చేత, © Providence Collection/licensed from goodsalt.com
మే 11– 17:“యెహోవాను మరువకుండా జాగ్రత్తపడుము”
ద్వితీయోపదేశకాండము 6–8; 15; 18; 29–30; 34
మండుచున్న పొద నుండి దేవుడు అతడితో మాట్లాడినప్పుడు, మోషే యొక్క భూలోక పరిచర్య ఒక కొండపై ప్రారంభమైంది (నిర్గమకాండము 3:1–10 చూడండి). 40 కంటే ఎక్కువ సంవత్సరాల తరువాత, దేవుడు నెబో కొండపై నుండి అతనికి వాగ్దాన దేశము యొక్క సంగ్రహావలోకనమును ఇచ్చినప్పుడు, అది కొండపైన ముగించబడింది కూడా (ద్వితీయోపదేశకాండము 34:1–4 చూడండి). ఆ వాగ్దాన దేశములో ప్రవేశించడానికి ఇశ్రాయేలీయులను సిద్ధపరచడంలో మోషే తన జీవితాన్ని గడిపాడు మరియు ఇశ్రాయేలీయులకు అతడి చివరి సూచనలు, జ్ఞాపికలు, ఉద్బోధలు, మరియు మనవులను ద్వితీయోపదేశకాండము నమోదు చేస్తుంది. మోషే మాటలను చదవడం అతని పరిచర్య యొక్క నిజమైన ఉద్దేశము—అనగా జనులకు అవసరమైన సిద్ధపాటు—అది అరణ్యములో బ్రతికియుండుట, శత్రువులను జయించుట లేదా ఒక సమాజమును నిర్మించుట గురించినది కాదని స్పష్టము చేస్తుంది. అది దేవుడిని ప్రేమించుట, ఆయనకు విధేయులగుట మరియు ఆయనపట్ల నమ్మకంగా నిలిచియుండుటను గూర్చినది. నిత్య జీవము యొక్క వాగ్దాన దేశములో ప్రవేశించడానికి మనందరికీ అవసరమైన సిద్ధపాటు అది. “పాలు తేనెలు ప్రవహించు దేశములో” (నిర్గమకాండము 3:8) మోషే ఎన్నడూ కాలు పెట్టనప్పటికీ, అతడి విశ్వాసము, విశ్వసనీయత వలన, ఆయనను వెంబడించు వారందరి కొరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దాన దేశములో అతడు ప్రవేశించాడు.
ద్వితీయోపదేశకాండమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “ద్వితీయోపదేశకాండము” చూడండి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
ద్వితీయోపదేశకాండము 6:4–7; 8:2–5, 11–17; 29:18–20; 30:6–10, 14–20
“నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను”
మోషే ధర్మశాస్త్రంలో అనేక బాహ్య వేడుకలు మరియు ఆచారాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండములోనున్న మోషే సలహాలో మీరు చూస్తున్నట్లుగా, ప్రభువు తన జనుల ఆంతరంగిక స్థితి గురించి—వారి హృదయాల ఆధ్యాత్మిక స్థితి గురించి కూడా చింతించారు.
దిగువ గద్యభాగాలలో, హృదయం అనే పదం కోసం చూడండి మరియు అది దేనిని సూచిస్తుందో ఆలోచించండి. మీరు ఈ గద్యభాగాలను మీ హృదయంలో ఒక రకమైన ఆధ్యాత్మిక పరిశీలనగా భావించవచ్చు. మీకై మీరు ఏ రోగ నిర్ధారణ ఇస్తారు? మీ హృదయం యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు ఏ చికిత్సలను సూచిస్తారు? మీ అభిప్రాయాలను వ్రాయండి:
-
ద్వితీయోపదేశ కాండము 6:4–7:
-
ద్వితీయోపదేశ కాండము 8:2–5:
-
ద్వితీయోపదేశ కాండము 8:11–17:
-
ద్వితీయోపదేశ కాండము 29:18–20:
-
ద్వితీయోపదేశ కాండము 30:6–10:
-
ద్వితీయోపదేశ కాండము 30:14–20:
మీ ఆలోచనలను క్రమబద్ధీకరించడానికి ఒక మార్గం ఏమిటంటే, ఒక హృదయాన్ని గీయడం మరియు మీ హృదయంలో ఉండాలని ప్రభువు చెప్పిన విషయాలను దానిలో రాయడం. అప్పుడు మీరు మీ హృదయం నుండి దూరంగా ఉంచవలసిన విషయాలను దాని వెలుపల వ్రాయవచ్చు.
మీరు మీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నారని ఎలా చూపిస్తారు? ఉపాయముల కొరకు, యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు మార్గదర్శి, 10–12 లోని “దేవుడిని ప్రేమించండి, మీ పొరుగువారిని ప్రేమించండి” చూడండి.
ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ “వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా,” లియహోనా, నవ. 2021, 51–53 కూడా చూడండి.
మీ స్వంత ఆత్మీయ అంతరార్థములను వెదకండి. రండి, నన్ను అనుసరించండి లేఖనాలలో దృష్టిసారించాల్సిన గద్యభాగాలను, సూత్రాలను సూచిస్తుంది, కానీ ఈ సూచనలు మీ అధ్యయనాన్ని పరిమితం చేయనివ్వకండి. మీరు ద్వితీయోపదేశకాండమును చదువుతున్నప్పుడు, ఇక్కడ చెప్పబడని ఒక సూత్రమును మీరు కనుగొనవచ్చు. మీరు నేర్చుకోవలసిన దానికి ఆత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి.
ద్వితీయోపదేశకాండము 6:4–12, 20–25
“యెహోవాను మరువకుండా జాగ్రత్తపడుము.”
వాగ్దాన దేశములో ప్రవేశించే ఇశ్రాయేలీయుల తరములో ఎక్కువమంది ఐగుప్తులోని వ్యాధులను చూడలేదు లేదా ఎఱ్ఱ సముద్రమును దాటలేదు. దేవుని జనులుగా నిలిచియుండడానికి వారు—మరియు భవిష్యత్తు తరములు—దేవుని యొక్క అద్భుతాలను, దేవుని చట్టాలను జ్ఞాపకముంచుకోవాల్సిన అవసరమున్నదని మోషేకు తెలుసు.
దేవుడు మీ కొరకు చేసిన గొప్ప విషయాలను జ్ఞాపకముంచుకోవడానికి మీకు సహాయపడేలా ద్వితీయోపదేశకాండము 6:4–12, 20–25లో ఏ సలహాను మీరు కనుగొంటారు? ప్రభువు యొక్క వాక్యము అనుదినము “మీ హృదయములో ఉండునట్లు” మీరేమి చేయడానికి ప్రేరేపించబడ్డారు? (6వ వచనము).
సహోదరుడు జేన్ ఈ. న్యూమాన్ గారి సందేశము “యువతరములోని నిబంధన జనుల స్వరాన్ని సంరక్షించుట” (లియహోనా, నవ. 2023, 36–38)ను కూడా మీరు చదవవచ్చు మరియు క్రీస్తు నందు మీ విశ్వాసాన్ని భవిష్యత్ తరాలకు ఎలా అందించగలరో పరిగణించవచ్చు.
ద్వితీయోపదేశకాండము 11:18–21; డేల్ జి. రెన్లండ్, “దేవుని యొక్క మంచితనము మరియు గొప్పతనాన్ని పరిగణించండి,” లియహోనా, మే 2020, 41–44 కూడా చూడండి.
ద్వితీయోపదేశకాండము 15:1–15
అవసరంలో ఉన్న వారికి సహాయపడేందుకు ఉదారమైన హస్తములు మరియు సమ్మతిగల హృదయాలు అవసరం.
“మీలో బీదలు ఉండనే ఉండరు” (ద్వితీయోపదేశకాండము 15:4) అనే రోజుకి మనము ఇంకా రాలేదు, కాబట్టి నిర్దిష్ట అభ్యాసాలు మారినప్పటికీ, ద్వితీయోపదేశకాండము 15లో పేదలకు సహాయం చేయడం గురించిన సూత్రాలు ఇప్పటికీ విలువైనవి. అవసరంలో ఉన్న జనులకు మనం ఎందుకు సహాయం చేస్తాము మరియు దాని గురించి మన వైఖరి ఎలా ఉండాలనే దాని గురించి 1–15 వచనములు ఏమి బోధిస్తున్నాయో గమనించండి.
అవసరంలో ఉన్న జనులకు “నీ చెయ్యి చాపవలెను” అంటే ఏమిటి? (8, 11 వచనములు). అవసరంలో ఉన్న జనులకు సహాయం చేయడం గురించి ప్రభువు యొక్క మాదిరి నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? (15వ వచనము చూడండి).
ద్వితీయోపదేశకాండము 18:15–19
మోషే యేసు క్రీస్తును “పోలి” ఉన్నాడు.
పేతురు, నీఫై, మొరోనై మరియు రక్షకుడు అందరూ ద్వితీయోపదేశకాండము 18:15–19 లోని ప్రవచనంపై వ్యాఖ్యానించారు (అపొస్తలుల కార్యములు 3:20–23; 1 నీఫై 22:20–21; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:40; 3 నీఫై 20:23 చూడండి). ఈ వచనాల నుండి రక్షకుని గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? గత కొన్ని వారాలుగా మీరు మోషే గురించి ఏమి చదివారో ఆలోచించండి. మోషే యేసు క్రీస్తును ఎలా “పోలియున్నాడు”?
“మోషే ప్రవక్త ఎవరిని గూర్చి చెప్పెనో ఆయనను నేనే” (3 నీఫై 20:23) అని యేసు క్రీస్తు ప్రాచీన అమెరికాలోని తన జనులకు చెప్పారు.
ద్వితీయోపదేశకాండము 29:9; 30:15-20
మంచి చెడుల మధ్య ఎంచుకోమని ప్రభువు నన్ను ఆహ్వానిస్తారు.
ద్వితీయోపదేశకాండము 29:9; 30:15–20లో ఉన్న మోషే మాటలను 2 నీఫై 2:26–29; 4:4లో తన కుటుంబానికి లీహై చేసిన చివరి బోధనలలో కొన్నింటితో పోల్చడం ఆసక్తికరంగా ఉండవచ్చు. మోషే బోధించిన దానిని లీహై ఎలా వివరించాడు? “జీవమును ఎంచుకోమని” మిమ్మల్ని ప్రేరేపించేలా దేనిని మీరు ఈ గద్యభాగాలలో కనుగొంటారు? (ద్వితీయోపదేశకాండము 30:19).
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
ద్వితీయోపదేశకాండము 6:5.
నా పూర్ణ హృదయముతో నేను దేవుణ్ణి ప్రేమించగలను.
-
మీ పిల్లలు ద్వితీయోపదేశకాండము 6:5 ను అర్థం చేసుకోవడంలో సహాయపడడానికి, మీరు హృదయం, శరీరం యొక్క రూపురేఖలు మరియు బలమైన చేతిని గీయవచ్చు. మీరు వచనంలోని “హృదయం,” “ఆత్మ” మరియు “శక్తి” అనే పదాలను చదువుతున్నప్పుడు మీ పిల్లలు చిత్రాలను చూపగలరు. మనము మన పూర్ణ హృదయంతో, ఆత్మతో మరియు శక్తితో ప్రభువును ప్రేమిస్తున్నామని ఎలా చూపించగలము?
ద్వితీయోపదేశకాండము 6:6–15
దేవుని వాక్యాన్ని నేను నా హృదయంలో ఉంచుకోగలను.
-
ప్రతిరోజూ వారు చూసే చోట లేఖన గద్యభాగాలను ఉంచమని ప్రభువు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సలహాను మీ పిల్లలతో చదవండి (ద్వితీయోపదేశకాండము 6:6–9 చూడండి). మీరు “యెహోవాను మరువకుండా” (12వ వచనము) ఉండేలా నిశ్చయపరచడానికి మరియు ఆయన మీ కోసం చేసిన దానిని గుర్తుంచుకోవడానికి గల మార్గాల గురించి ఆలోచించేలా ఇది మీకు మరియు మీ పిల్లలకు స్ఫూర్తినిస్తుంది.
-
రక్షకుని జీవితంలో ఒక ముఖ్యమైన సమయంలో ద్వితీయోపదేశకాండము 6:13, 16 మరియు 8:3 ఆయనకు సహాయపడిందని మీరు సూచించవచ్చు. ఎలాగో చూడడానికి, మత్తయి 4:1–10 కలిసి చదవండి. తర్వాత, అవసరమైన సమయాల్లో మీకు సహాయం చేసిన కొన్ని లేఖన గద్యభాగాలను మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.
ద్వితీయోపదేశకాండము 18:15–18
ప్రవక్తలు యేసు క్రీస్తు గురించి మనకు బోధిస్తారు.
-
మీరు ద్వితీయోపదేశకాండము 18:18 కలిసి చదువుతున్నప్పుడు, ఈ వచనంలో మోషే వంటి ప్రవక్త యేసు క్రీస్తు అని మీ పిల్లలకు అర్థమయ్యేలా సహాయం చేయండి. బహుశా మీరు మోషే చేసిన మరియు యేసు క్రీస్తు చేసిన పనుల చిత్రాలను చూడవచ్చు మరియు మీ పిల్లలు వాటిని సరిపోల్చేలా చేయవచ్చు (Gospel Art Book [సువార్త కళా పుస్తకము], సంఖ్యలు. 15, 16, 38, 39 చూడండి). రక్షకుని గురించి మన ప్రవక్త నేడు మనకు ఏమి బోధించారు?
ద్వితీయోపదేశకాండము 29:12-13; 30:8-10
నా నిబంధనల కారణంగా, నేను దేవుని జనులలో భాగమైయున్నాను.
-
ద్వితీయోపదేశకాండము 29:12–13 గురించి మాట్లాడడం, మీరు మరియు మీ పిల్లలు పరలోక తండ్రితో చేసే లేదా చేసిన నిబంధనల గురించి మాట్లాడటానికి ఒక అవకాశం కల్పిస్తుంది. దేవుని యొక్క జనులుగా ఉండడమంటే అర్థమేమిటి? మన వాగ్దానాలు మనల్ని దేవుని జనులుగా ఎలా మారుస్తాయి? (13వ వచనము చూడండి; మోషైయ 18:8–10 కూడా చూడండి).
-
మీ పిల్లలకు సహాయం అవసరమైతే, నిబంధన అనేది దేవుడు మరియు ఆయన జనుల మధ్య ఒక వాగ్దానం అని వివరించండి. ద్వితీయోపదేశకాండము 30:8–10లో దేవుడు మరియు ఇశ్రాయేలీయులు ఒకరితో ఒకరు ఎలాంటి వాగ్దానాలు చేసుకున్నారు? మనం దేవునితో ఏ వాగ్దానాలు చేసాము?(సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37, 77 చూడండి). ఈ వాగ్దానాలు మనల్ని ఆయనతో ఎలా కలుపుతాయి?
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.