“మే 18–24. ‘నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము’: యెహోషువ 1–8; 23–24,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2026 (2026)
“మే 18–24. ‘నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
Moses Ordaining Joshua [యెహోషువను నియమిస్తున్న మోషే], డారెల్ థామస్ చేత (వివరణ)
మే 18–24: “నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము”
యెహోషువ 1–8; 23–24
దానికి కొన్ని తరాలు పట్టింది, కానీ ప్రభువు యొక్క వాగ్దానము నెరవేరబోతున్నది: చివరకు ఇశ్రాయేలీయుల సంతతి వాగ్దాన దేశమును వారసత్వముగా పొందబోతున్నారు. కానీ వారి మార్గములో ఆటంకంగా యొర్దాను నది, యెరికో గోడలు మరియు ప్రభువును తిరస్కరించిన బలమైన జనులు ఉన్నారు (1 నీఫై 17:35 చూడండి). మరియు వారి ప్రియమైన నాయకుడు మోషే లేకుండా వారు వాటన్నింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. పరిస్థితి కొంతమంది ఇశ్రాయేలీయులను బలహీనంగా భావించునట్లు, భయపడేటట్లు చేసియుండవచ్చు, కానీ ప్రభువు, “నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము” అని చెప్పారు. వారు ధైర్యంగా ఉండడానికి కారణం ఏమిటి? వారి స్వంత బలము వలన కాదు—లేదా మోషే లేదా యెహోషువ వలన కాదు—ఎందుకనగా “నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును” (యెహోషువ 1:9). దాటడానికి మన స్వంత నదులను మరియు పడగొట్టడానికి గోడలను కలిగియున్నప్పుడు, మన జీవితాలలో అద్భుతమైన విషయాలు జరుగగలవు, ఎందుకనగా “ప్రభువు [మన] మధ్య అద్భుతకార్యములను చేయును” (యెహోషువ 3:5).
యెహోషువ గ్రంథమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో యెహోషువ గ్రంథము చూడండి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
యెహోషువ 1:1–9
నేను ఆయనపట్ల విశ్వాసంగా ఉన్నట్లయితే, దేవుడు నాతో ఉంటారు.
మోషేకు బదులుగా ఉంచబడడానికి పిలువబడడం యెహోషువకు ఎలా ఉండియుండవచ్చో ఊహించండి. అతడిని ప్రోత్సహించడానికి యెహోషువ 1:1–9 లో ప్రభువు చెప్పిన దానిని గమనించండి. మీరు ఎదుర్కొనే కష్టమైన సవాళ్ళ గురించి ఆలోచించండి; ఈ వచనాలలో ఉన్నది ఏది మీకు ధైర్యమునిస్తుంది?
జాషువా (హీబ్రూలో యెహోషువా లేదా యేషువా) అనే పేరుకు “యెహోవా రక్షిస్తారు” అని అర్థం. మరియు యేసు పేరు యెషువా నుండి వచ్చింది. కాబట్టి మీరు యెహోషువ గురించి చదువుతున్నప్పుడు, యొర్దాను నదిని దాటి వాగ్దాన దేశంలోకి ఇశ్రాయేలీయులను నడిపించడంలో ఆయన పాత్రను పరిగణించండి. క్రీస్తు మన కోసం చేసే పనికి అతని నియమితకార్యము ఎలా సమానంగా ఉంది?
యెహోషువ 1:8
దేవుని వాక్యం నా మార్గాన్ని సుసంపన్నం చేయగలదు.
ఆయన యెహోషువను ప్రోత్సహించినప్పుడు, ప్రభువు యెహోషువ 1:8లో లేఖనాల గురించి లేదా “ధర్మశాస్త్ర గ్రంథము” గురించి సలహా ఇచ్చారు. యెహోషువకున్న బరువైన బాధ్యతను పరిగణిస్తే, ఈ సలహా ప్రత్యేకంగా ఎందుకు సహాయపడి ఉండవచ్చు?
లేఖనాలను చదవమని ప్రభువు మనల్ని ఆహ్వానించినప్పుడు, ఆయన తరచుగా చదవడానికి మించిన పదాలను ఉపయోగిస్తారు. ఆయన గొప్ప ఆశీర్వాదాలను కూడా ఇస్తారు. ఈ ఆహ్వానాలను మరియు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను కనుగొనడంలో దిగువ పట్టిక మీకు సహాయపడుతుంది:
|
ఆహ్వానము |
వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు | |
|---|---|---|
|
యెహోషువ 1:8 | ఆహ్వానము దివారాత్రము ధ్యానించుము | వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు
|
ఆహ్వానము
| వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు
| |
ఆహ్వానము
| వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు
| |
ఆహ్వానము
| వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు దేశమందు వర్థిల్లుదురు | |
ఆహ్వానము
| వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు
| |
ఆహ్వానము
| వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు
| |
|
రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఈయనను ఆలకించుము,” లియహోనా, మే 2020, 89వ పేజీలో చివరి పేరా | ఆహ్వానము
| వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు
|
మీ జీవితంలో ప్రభువు ఈ వాగ్దానాలను ఎలా నెరవేర్చారు? మీ లేఖన అధ్యయన అలవాట్లను మూల్యాంకనం చేసుకోవడానికి ఇప్పుడు మంచి సమయం కావచ్చు. ఏది బాగా జరుగుతోంది? దేవుని వాక్యంతో మరింత అర్థవంతమైన అనుభవాలను పొందేందుకు మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడ్డారు?
యెహోషువ 2
విశ్వాసము మరియు క్రియలు రెండును రక్షణ కొరకు అవసరమైనవి.
ప్రాచీన క్రైస్తవులు రాహాబును విశ్వాసము మరియు క్రియలు రెండిటికి ఒక మాదిరిగా చూసారు (హెబ్రీయులకు 11:31; యాకోబు 2:25 చూడండి). యెహోషువ 2ను మీరు చదివినప్పుడు, తనను, తన కుటుంబాన్ని మరియు ఇశ్రాయేలీయ గూఢచారులను రక్షించుటలో రాహాబు యొక్క విశ్వాసము మరియు క్రియల పాత్రను పరిగణించండి. క్రీస్తునందు మీ విశ్వాసము మరియు మీ క్రియలు మిమ్మల్ని, ఇతరులను ఎలా ప్రభావితం చేయగలవనే దాని గురించి ఇది మీకేమి బోధిస్తుంది?
తన కిటికీ వద్ద రాహాబు. Waiting for the Promise [వాగ్దానము కొరకు ఎదురుచూచుట], ఎల్స్‌పెత్ యంగ్ చేత (వివరణ)
యెహోషువ 3–4
యేసు క్రీస్తుపై విశ్వాసంతో, నేను దేవుని “అద్భుతాలను” అనుభవించగలను.
ప్రభువు తన జనులను వాగ్దాన దేశానికి నడిపించినప్పుడు వారి మధ్య అద్భుతాలు చేసారు మరియు ఆయన మీ కోసం కూడా అదే చేయగలరు. యెహోషువ 3–4 గురించి మీ అధ్యయనానికి మార్గనిర్దేశం చేసేందుకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి:
-
ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటకముందు వారిని వారు శుద్ధి చేసుకోవడం ఎందుకు అవసరమని మీరనుకుంటున్నారు? (యెహోషువ 3:5 చూడండి).
-
“యాజకుల అరకాళ్లు … నీటి అంచున మునగగానే” (యెహోషువ 3:13, 15) నది చీల్చబడినదని గమనించండి. అది ఎందుకు ముఖ్యమైనది?
-
యొర్దాను నది వద్ద అనేక ఇతర ముఖ్యమైన సంఘటనలు జరిగాయి—2 రాజులు 2:6–15; 5:1–14; మరియు మార్కు 1:9–11 చూడండి. ఈ సంఘటనల మధ్య ఏ సంబంధాలను మీరు చూస్తున్నారు?
-
మీ జీవితంలో ప్రభువు “అద్భుతములను” ఎలా చేసారు? (యెహోషువ 3:5). ఆ అద్భుతకార్యములను మీరు ఎక్కువ తరచుగా ఎలా అనుభవించగలరు—లేదా గుర్తించగలరు? (ఉదాహరణకు, యెహోషువ 3:17 చూడండి).
యెహోషువ 6–8
విధేయత దేవుని యొక్క శక్తిని నా జీవితంలోకి తెస్తుంది.
యెహోషువ 6–8 యెరికో మరియు ఆయ్ దేశాలపై జరిగిన యుద్ధాలతో వ్యవహరిస్తాయి. మీరు ఈ అధ్యాయాలను చదివినప్పుడు, శోధనతో మీరు ఎలా పోరాడతారో పరిగణించండి (ఉదాహరణకు, యెహోషువ 7:10–13 చూడండి). దేవుడు మీకు ఎలా సహాయపడతారు మరియు ఆయన శక్తిని పొందడానికి మీరు ఏమి చేయాలనే దాని గురించి మీరేమి నేర్చుకున్నారు? ఉదాహరణకు, యెరికోను తీసుకొనుటకు ప్రభువు యొక్క సూచనలను గూర్చి మిమ్మల్ని ఆకట్టుకునేదేమిటి? (యెహోషువ 6:1–5 చూడండి). బహుశా యెహోషువ 7 లోని వివరణ మీ జీవితంలో “శాపగ్రస్థమైన వస్తువు” ఏదైనా ఉన్న యెడల మీరు తీసేయాల్సిన అవసరమున్నదని తీర్మానించుటకు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు (యెహోషువ 7:13).
యెహోషువ 23–24
“మీరెవరిని సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి.”
యెహోషువ 23–24లో ఇశ్రాయేలీయులకు యెహోషువ చేసిన చివరి బోధనలలో ముఖ్యమైన హెచ్చరికలు, సలహా మరియు వాగ్దాన దీవెనలు ఉన్నాయి. బహుశా మీరు కనుగొన్న వాటి జాబితాను మీరు తయారు చేయవచ్చు. ఇశ్రాయేలీయులు అనుభవించిన సమస్తమును పరిగణిస్తూ, యెహోషువ తన జీవితం ముగింపులో వారికి ఈ విషయాలను చెప్పడానికి ఎందుకు కోరాడని మీరనుకుంటున్నారు? “యెహోవాను హత్తుకొని యుండుటకు” మిమ్మల్ని ప్రేరేపించునట్లు మీరు కనుగొన్నదేమిటి? (యెహోషువ 23:8).
డేల్ జి. రెన్లండ్, “ఈ దినమున మీరు ఎంచుకోండి,” లియహోనా, నవ. 2018, 104–6 కూడా చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
యెహోషువ 1–4; 6
“నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము.”
-
యేసు క్రీస్తు ద్వారా మీ పిల్లలు “నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుటకు” (యెహోషువ 1:6) సహాయం చేయడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది. యెహోషువ 1:6, 9 మరియు 18లో పునరావృతమయ్యే వాక్యభాగాన్ని కనుగొనమని వారిని ఆహ్వానించండి మరియు దానిని వ్రాయండి లేదా గుర్తుంచుకోండి. యెహోషువ చేసినట్లుగా, ఈ సందేశం అవసరమయ్యే పరిస్థితుల గురించి ఆలోచించడంలో మీ పిల్లలకు సహాయపడండి. మీరు యెహోషువ 1–4; 6లోని కొన్ని కథలను కూడా కలిసి సమీక్షించవచ్చు (పాత నిబంధన కథలు, 85–91లో “ప్రవక్తయైన యెహోషువ” మరియు “రాహాబు మరియు వేగులవారు” కూడా చూడండి). ఈ కథలలోని వ్యక్తులు ప్రభువునందు ధైర్యాన్ని మరియు బలాన్ని ఎలా చూపించారు?
2:59Joshua the Prophet
1:39Rahab and the Spies
యెహోషువ 1:8
లేఖనాలను అధ్యయనం చేయడం నాకు ఆశీర్వాదాలను తెస్తుంది.
-
యెహోషువ 1:8ని చదవడం, స్వంతంగా లేఖనాలను చదవడానికి మీ పిల్లలను ప్రేరేపించగలదు. మనం లేఖనాలను ఎలా మరియు ఎందుకు చదవాలో వారికి బోధించే పదాలను ఈ వచనంలో కనుగొనడంలో వారికి సహాయపడండి. 1 నీఫై 15:23–24; 2 నీఫై 31:20; 32:3; జేకబ్ 4:6; హీలమన్ 3:29–30లో దాని కొరకు వారు చూడవచ్చు. లేఖనాలను చదవడానికి ప్రణాళికను రూపొందించడంలో మరియు అమలు చేయడంలో మీరు వారికి సహాయం చేయవచ్చు.
యెహోషువ 3–4
పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నేను తప్పక బాప్తిస్మము తీసుకోవాలి.
-
మీరు బాప్తిస్మము యొక్క చిహ్నంగా యొర్దాను నదిని దాటిన ఇశ్రాయేలీయుల కథను ఉపయోగించవచ్చు—అరణ్యంలో మన పాత జీవితాన్ని విడిచిపెట్టి, దేవునితో నిబంధన సంబంధంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడం. కాబట్టి మీరు యెహోషువ 3–4 (లేదా పాత నిబంధన కథలు, 85–89లో “ప్రవక్తయైన యెహోషువ”) కలిసి చదువుతున్నప్పుడు, మీరు యేసు బాప్తిస్మము పొందుతున్న చిత్రాన్ని కూడా చూడవచ్చు మరియు ఇశ్రాయేలీయులు దాటిన అదే నదిలో యేసు బాప్తిస్మము పొందారని వివరించవచ్చు. బాప్తిస్మము పొందడం అనేది యేసు క్రీస్తు రాజ్యంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడం లాంటిదని ఒకరితో ఒకరు పంచుకోండి.
2:59Joshua the Prophet
యెహోషువ 24:15
నేను యేసు క్రీస్తును సేవించడాన్ని ఎంచుకోగలను.
-
యెహోషువ ఇశ్రాయేలీయులను ఆహ్వానించినట్లుగా, యేసు క్రీస్తును అనుసరించాలని ఎంచుకోవడాన్ని నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయడానికి మీరు ఏమి చేయవచ్చు? మీరు వారిని ఇలా చేయడానికి ఆహ్వానించవచ్చు:
-
యెహోషువ 24:15 నుండి ఒక చిన్న వాక్యభాగాన్ని కంఠస్థం చేయండి. దానిని మీ పిల్లల కొరకు సరదాగా చేయడానికి ప్రయత్నించండి. వారు కంఠస్థం చేసే పదాల సంఖ్య వారి వయస్సుపై ఆధారపడి ఉంటుంది.
-
యేసు క్రీస్తును సేవించడానికి ఎంచుకున్న వ్యక్తుల గురించిన కథలను కనుగొనండి. వారు పాత నిబంధన కథలు మరియు ఇతర లేఖన కథల పుస్తకాల్లో చూడవచ్చు.
-
రక్షకుని అనుసరించడానికి మరియు సేవ చేయడానికి వారు ఎంచుకోగల అభినయ పరిస్థితులు.
-
వివిధ రకాల కార్యకలాపాలను ఉపయోగించండి. “పిల్లలందరూ భిన్నంగా ఉంటారు మరియు వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు, వారి అవసరాలు మారతాయి. మీ బోధనా పద్ధతులను మార్చుకోవడం వారి విభిన్న అవసరాలను తీర్చడంలో మీకు సహాయం చేస్తుంది” (రక్షకుని విధానములో బోధించుట, 31).
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.