2024 రండి, నన్ను అనుసరించండి
మార్చి 23–29. “నా నిబంధనను జ్ఞాపకము చేసికొనియున్నాను”: నిర్గమకాండము 1–6


“మార్చి 23–29. ‘నా నిబంధనను జ్ఞాపకము చేసికొనియున్నాను’: నిర్గమకాండము 1–6,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“మార్చి 23–29. ‘నా నిబంధనను జ్ఞాపకము చేసికొనియున్నాను’,” రండి, నన్ను అనుసరించండి: 2026

మోషే మరియు మండుచున్న పొద

Moses and the Burning Bush [మోషే మరియు మండుచున్న పొద], జెర్రీ థాంప్సన్ చేత

మార్చి 23-29: “నా నిబంధనను జ్ఞాపకము చేసికొనియున్నాను”

నిర్గమకాండము 1–6

ఐగుప్తులో నివసించమనే ఆహ్వానము యాకోబు యొక్క కుటుంబాన్ని రక్షించింది. కానీ వందల సంవత్సరాల తరువాత, వారి వారసులు “యోసేపును ఎరుగని” క్రొత్త ఫరో చేత బానిసలుగా మరియు భయభ్రాంతులుగా చేయబడ్డారు (నిర్గమకాండము 1:8). దేవుడు తన నిబంధన జనులైన వారికి ఇలా జరగడాన్ని ఎందుకు అనుమతించారోనని ఆశ్చర్యపడుట ఇశ్రాయేలీయులకు సహజమైనది. ఆయన వారితో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకముంచుకున్నారా? వారు ఇంకా ఆయన జనులేనా? వారు ఎంత బాధపడుతున్నారో ఆయన చూసారా?

మీరు ఇలాంటి ప్రశ్నలను అడగాలని భావించిన సందర్భాలు ఉండవచ్చు. “నేను అనుభవిస్తున్నది దేవునికి తెలుసా? సహాయము కొరకు నా మనవులను ఆయన వింటున్నారా?” అని మీరు ఆశ్చర్యపడవచ్చు. నిర్గమకాండములో ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల విడుదల వృత్తాంతము అటువంటి ప్రశ్నలకు జవాబిస్తుంది: దేవుడు తన జనులను మరచిపోరు. మనతో తన నిబంధనలను ఆయన జ్ఞాపకము చేసుకుంటారు మరియు తన యుక్తకాలములో, విధానములో వాటిని నెరవేరుస్తారు. “నా బాహువు చాపి మిమ్మును విడిపించెదను” అని ఆయన ప్రకటించారు. “[మీ] బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే” (నిర్గమకాండము 6:6–7).

నిర్గమకాండమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “నిర్గమకాండము యొక్క గ్రంథము” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

నిర్గమకాండము 1–2

ఆయన ఉద్దేశ్యాలు నెరవేర్చడానికి దేవుడు నా ద్వారా పని చేయగలరు.

నిర్గమకాండము 1–2లో వివరించిన స్త్రీల గురించి ఏది మిమ్మల్ని ఆకట్టుకున్నది? ఆయన పిల్లల కొరకు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి వారెలా సహాయపడ్డారు? వారి ప్రయత్నాలు దేవుని కార్యములో సేవ చేయడం గురించి మీకేమి బోధిస్తాయి?

నిర్గమకాండము 1–3

యేసు క్రీస్తు నా విమోచకుడు.

నిర్గమకాండమును చదవడం ప్రారంభించడానికి ముందు, మీరు పడుతున్న ఒక కష్టం గురించి మీరు ఆలోచించవచ్చు—ప్రభువు మిమ్మల్ని విడిపిస్తారని మీరు ఆశిస్తున్నది ఏదైనా. నిర్గమకాండము 1–3లోని ఏ పదాలు మరియు వాక్యభాగాలు ఆధ్యాత్మిక చెరను లేదా ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఇతర విషయాలను పోలియుంటాయి? ఇశ్రాయేలీయులు విమోచనను ఎలా కోరుకున్నారు మరియు ప్రభువు ఎలా స్పందించారో కూడా గమనించండి (ఉదాహరణకు, నిర్గమకాండము 2:23–25; 3:7–8 చూడండి). మిమ్మల్ని “విడిపించడానికి ప్రభువు ఎలా దిగివచ్చారు”?

నిర్గమకాండము యొక్క గ్రంథమంతటా, మీరు మోషే మరియు యేసు క్రీస్తుల మధ్య కొన్ని పోలికలను కూడా గమనించవచ్చు (ద్వితీయోపదేశకాండము 18:18–19; 1 నీఫై 22:20–21 చూడండి). నిర్గమకాండము 1:22; 2:1–10 మరియు మత్తయి 2:13–16 మధ్య మీరు ఏ పోలికలను చూస్తారు? లేదా నిర్గమకాండము 24:18 మరియు మత్తయి 4:1–2 మధ్య ఏ పోలికలను చూస్తారు? ఆయన గురించి మరియు ఆయన శక్తి గురించి మీరు ఏమి గ్రహించాలని ప్రభువు మిమ్మల్ని కోరుతున్నారని మీరు భావిస్తున్నారు?

యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చే చిహ్నాల కొరకు చూడండి. “ప్రవక్తలు మరియు లేఖనాలలో ఉన్న ఇతర నమ్మకమైన స్త్రీ పురుషుల జీవితాలలో రక్షకుని జీవితానికి సమాంతరాలను మీరు కనుగొనవచ్చు. [అలా చేయడం] మీరు పట్టించుకోని ప్రదేశాలలో రక్షకుని గురించిన సత్యాలను బయల్పరుస్తుంది” (రక్షకుని విధానములో బోధించుట, 7; హోషేయ 12:10 కూడా చూడండి).

నదిలో నుండి బుట్టను బయటికి లాగుతున్న స్త్రీ

Faith at Water’s Edge [నీటి అంచున విశ్వాసం], ఏన్ మారి ఓబోర్న్ చేత

నిర్గమకాండము 3:1–6

సెమినరీ చిహ్నము
నేను పరిశుద్ధమైన విషయాలు మరియు స్థలాల పట్ల గౌరవం చూపగలను.

ఏదైనా మిమ్మల్ని విస్మయం మరియు ఆశ్చర్యంతో నింపిన సమయం గురించి మీరు ఆలోచించగలరా? మీరు ఎలా స్పందించారు? మీరు అనుభవించిన భావోద్వేగాలను మీరెలా వివరిస్తారు?

దానిని మనస్సులో ఉంచుకొని, నిర్గమకాండము 3:1–6 చదవండి. మోషే యొక్క స్ఫూర్తిదాయకమైన అనుభవం గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? దేవుని పట్ల భక్తిని చూపించడానికి మోషే ఏమి చేశాడు? అతని చర్యలు మరియు పవిత్రమైన విషయాల పట్ల గౌరవం మధ్య మీరు ఏ సంబంధాలను చూస్తున్నారు?

ఈ వచనాలను చదవడం మీ జీవితంలోని పవిత్రమైన విషయాలు మరియు పవిత్ర స్థలాల గురించి ఆలోచించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. అవి మీకు ఎందుకు పవిత్రమైనవి? మీరు సాధారణమైన వాటి నుండి వాటిని భిన్నంగా ఎలా చూస్తారు? మీ ఆలోచనకు మార్గనిర్దేశం చేసేందుకు, మీరు ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ గారి సందేశం “అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానములు” (లియహోనా, నవ. 2017, 91–93)లోని “వాగ్దానములను జ్ఞాపకముచేసుకొనుట” అనే విభాగాన్ని చూడవచ్చు.

అయితే, మనం అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలను పొందినప్పటికీ, పవిత్రమైన విషయాలను చాలా తేలికగా తీసుకొనే ప్రమాదం ఉంది. మీరు దీన్ని ఎలా నివారిస్తారు? ఈ సమస్యను పరిష్కరించే రెండు సందేశాలు ఇక్కడ ఉన్నాయి; ఒకదాన్ని ఎంచుకోండి మరియు మీకు సహాయపడే వ్యాఖ్యానాల కొరకు చూడండి: యులిసెస్ సోవారెస్, “క్రీస్తు మరియు ఆయన సువార్త పట్ల ఆశ్చర్యము” (లియహోనా, మే 2022, 115–17); జెరాల్డ్ కాస్సే, “Is It Still Wonderful to You?” (లియహోనా, మే 2015, 98-100).

సిద్ధాంతము మరియు నిబంధనలు 6:10–12; 63:64 కూడా చూడండి.

నిర్గమకాండము 3–4

ఆయన కార్యమును చేయడానికి ఆయన పిలిచిన వారికి దేవుడు శక్తిని ఇస్తారు.

మోషే ఒక గొప్ప ప్రవక్త మరియు నాయకుడని ఈరోజు మనకు తెలుసు. కానీ ప్రభువు మొదట అతడిని పిలిచినప్పుడు మోషే తననుతాను ఆవిధంగా చూడలేదు. మీరు నిర్గమకాండము 3–4 చదువుతున్నప్పుడు, మోషే యొక్క ఆందోళనలను మరియు ప్రతిదానికి ప్రభువు ఎలా స్పందించారనే దానిని జాబితా చేయండి. మీరు అయోగ్యులుగా భావించినప్పుడు మిమ్మల్ని ప్రేరేపించేలా ఈ అధ్యాయములలో మీరు ఏమి కనుగొంటారు? దేవుడు తన పనిని చేయడానికి మీకు లేదా ఇతరులకు శక్తినివ్వడాన్ని మీరు ఎప్పుడు చూశారు?

నిర్గమకాండము 5–6

ప్రభువు యొక్క ఉద్దేశ్యములు ఆయన యుక్త కాలములో నెరవేర్చబడతాయి.

మంచి చేయడానికి మన హృదయపూర్వక ప్రయత్నాలు పని చేయనప్పుడు—మనం ప్రభువు చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మనం ఆశించిన ఫలితాలను చూడనప్పుడు నిరుత్సాహంగా ఉంటుంది. మోషేకు ఎదురైన అలాంటి అనుభవం గురించి తెలుసుకోవడానికి, నిర్గమకాండము 5:4–9, 20–23 చదవండి. నిరుత్సాహ భావాలను అధిగమించడానికి ప్రభువు మోషేకు ఎలా సహాయం చేసారు? (నిర్గమకాండము 6:1–13 చూడండి). ఆయన చిత్తమును చేయుటలో మీరు పట్టుదలగా ఉండడానికి ప్రభువు మీకు ఎలా సహాయపడ్డారు?

జెఫ్రీ ఆర్. హాలండ్, “ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుండుట,” లియహోనా, నవ 2020, 115-17 చూడండి.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఈ ఆదివారం నెలలో ఐదవ ఆదివారం కాబట్టి, “అనుబంధం బి: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట”లోని అభ్యాస కార్యకలాపాలను ఉపయోగించమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.

నిర్గమకాండము 1–2

ఆయన ఉద్దేశ్యాలు నెరవేర్చడానికి దేవుడు నా ద్వారా పని చేయగలరు.

  • ఇశ్రాయేలీయులను దాస్యం నుండి విడిపించడంలో మోషే ప్రధాన పాత్ర పోషించాడు. కానీ అతని తల్లి, అతని సోదరి, ఫరో కుమార్తె మరియు ఇతర విశ్వాసులైన స్త్రీలు అతన్ని రక్షించి, శ్రద్ధ వహించకపోతే అతడు దీన్ని సాధించలేకపోయేవాడు. నిర్గమకాండము 1:15–20; నిర్గమకాండము 2:2–10 (సంఖ్యాకాండము 26:59 కూడా చూడండి); మరియు నిర్గమకాండము 2:16–21 నుండి ఈ స్త్రీల గురించి నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడండి. వారి కథలను చెప్పడానికి ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీని మరియు (పాత నిబంధన కథలు, 61–63 లో) “పసివాడైన మోషే” కూడా మీరు ఉపయోగించవచ్చు. ఈ స్త్రీలు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఎలా సహాయపడ్డారు? చిన్న మరియు సులభమైన మార్గాలతో సహా, దేవుని పనిలో సహాయం చేసినప్పుడు మీరు మెచ్చుకునే ఇతర వ్యక్తుల గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. వారి మాదిరిని మనము ఎలా అనుసరించగలము?

    1:36

    Baby Moses

నిర్గమకాండము 3:1–5

నేను పవిత్ర స్థలాలను భక్తితో చూడగలను.

  • నిర్గమకాండము 3:1–5 కలిసి చదివిన తర్వాత, ఈ వచనాలను వారి స్వంత మాటలలో సంక్షిప్తపరచమని మీ పిల్లలను అడగండి (పాత నిబంధన కథలు, 64–21లో “మోషే ప్రవక్త” కూడా చూడండి). మోషే ప్రభువు సన్నిధిలో భక్తిని ఎలా చూపించాడు? మనం భక్తిని ఎలా చూపించాలని ప్రభువు కోరుకుంటున్నారు? మనము భక్తితో ఉండవలసిన పవిత్ర స్థలాలు లేదా ప్రోత్సాహకార్యక్రమాల చిత్రాలను కనుగొనడానికి (లేదా గీయడానికి) మీకు సహాయం చేయమని కూడా మీరు మీ పిల్లలను అడగవచ్చు. మన ఇంటిని పవిత్ర స్థలంగా మార్చుకోవడానికి మనం ఏమి చేయాలి?

    1:26

    Moses the Prophet

  • మనము మొదటిసారిగా ఒక స్నేహితుడిని సంఘానికి తీసుకువస్తుంటే, భక్తితో ఉండడం అంటే ఏమిటో మనం ఎలా వివరిస్తాము?

జనులతో మాట్లాడుతున్న మోషే మరియు అహరోను

Moses and Aaron Speak to the People [జనులతో మాట్లాడుతున్న మోషే మరియు అహరోను], జేమ్స్ జె. టిస్సో చేత

నిర్గమకాండము 3–4

ప్రభువు నన్ను ఏదైనా చేయమని అడిగినప్పుడు, ఆయన నాకు సహాయం చేస్తారు.

  • నిర్గమకాండము 3; 4:1–17లోని వృత్తాంతాన్ని ఉపయోగించి, మీ పిల్లల్ని వంతులవారీగా మోషేలా నటించనివ్వండి. ఫ్లాష్‌లైట్ మరియు మండుతున్న పొద‌ను సూచించడానికి ఒక మొక్క వంటి సాధారణ వస్తువులను చేర్చడం సరదాగా ఉండవచ్చు. ప్రభువు తనకు అప్పగించిన పని గురించి మోషే ఎలా భావించాడో తెలుసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి (నిర్గమకాండము 3:11; 4:1, 10 చూడండి). మీరు అలాంటి భావాలను కలిగియున్నప్పటి సమయాల గురించి మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. మోషేకు సహాయం చేయడానికి మనం అతనితో ఏ సలహాను పంచుకుంటాము? నిర్గమకాండము 3:12; 4:2–9, 11–12లో మోషేను ప్రభువు ఎలా ప్రోత్సహించారనే దాని గురించి చదవండి. మీ పిలుపును నెరవేర్చడానికి, ఒక ప్రేరేపణను అనుసరించడానికి లేదా మీకు కష్టమైనది ఏదైనా చేయడానికి రక్షకుడు మీకు ఎలా సహాయం చేసారో పిల్లలకు చెప్పండి.

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

మోషే తల్లి

The Mother of Moses [మోషే తల్లి], సిమియన్ సాలమన్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: నేను క్షమించగలను