“మార్చి 16–22. ‘అది మేలుకే దేవుడు ఉద్దేశించెను’: ఆదికాండము 42–50,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“మార్చి 16–22. ‘అది మేలుకే దేవుడు ఉద్దేశించెను’,” రండి, నన్ను అనుసరించండి: 2026
Forgiveness [క్షమాపణ], మెగన్ రీకర్ చేత
మార్చి 16-22: “అది మేలుకే దేవుడు ఉద్దేశించెను”
ఆదికాండము 42–50
యోసేపు సహోదరులు అతన్ని బానిసగా విక్రయించి దాదాపు 22 సంవత్సరాలైంది. యోసేపు తప్పుడు ఆరోపణలు మరియు జైలు శిక్షతో సహా అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు. చివరకు అతడు మరలా తన సహోదరులను చూసినప్పుడు, ఫరోకు రెండవ స్థానములో, యోసేపు ఐగుప్తు అంతటికి గవర్నరుగా ఉన్నాడు. అతడు తన సహోదరులపై సులువుగా ప్రతీకారం తీర్చుకోవచ్చు మరియు వారు యోసేపుకు చేసిన దానిని పరిగణిస్తే, అది అర్థమయ్యేలా అనిపించవచ్చు. అయినప్పటికీ యోసేపు వారిని క్షమించాడు. అంతేకాకుండా తన బాధలో దైవిక ఉద్దేశ్యమును చూడడానికి అతడు వారికి సహాయపడ్డాడు. “అది మేలుకే దేవుడు ఉద్దేశించెను” (ఆదికాండము 50:20) అని అతడు వారికి చెప్పాడు, ఎందుకనగా అది “తన తండ్రి కుటుంబపు వారినందరిని” (ఆదికాండము 47:12) కరువునుండి రక్షించే స్థానములో అతడిని ఉంచింది.
అనేక విధాలుగా, యోసేపు యేసు క్రీస్తు వలె ఉన్నాడు. మన పాపములు ఆయనకు గొప్ప బాధను కలిగించినప్పటికీ, కరువు కంటే చాలా ఘోరమైన విధి నుండి మనందరినీ విడిపిస్తూ, రక్షకుడు క్షమాపణను అందిస్తున్నారు. మనము క్షమాపణ పొందవలసిన లేదా దానిని ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పటికీ—ఏదో ఒక సమయంలో మనమందరం రెండింటినీ చేయాలి—యోసేపు యొక్క మాదిరి, స్వస్థత మరియు సమన్వయము యొక్క నిజమైన ఆధారమైన రక్షకుని వైపు మనకు దారి చూపుతుంది.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
ఆదికాండము 45:5–7; 47:12
“కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.”
మీరు యోసేపు జీవితానికి మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త కార్యానికి మధ్య ఏవైనా సారూప్యతలను గమనించారా? ఈ సారూప్యతలకు కొన్ని ఉదాహరణలను చూడడానికి, వీటిని సరిపోల్చడానికి ప్రయత్నించండి:
-
మత్తయి 3:17తో ఆదికాండము 37:3.
-
మత్తయి 26:14–16తో ఆదికాండము 37:26–28.
-
లూకా 4:18తో ఆదికాండము 45:5–7.
-
యోహాను 6:35తో ఆదికాండము 47:12.
మీరు ఈ గద్యభాగాలను చదివినప్పుడు, రక్షకుడు మరియు ఆయన నియమితకార్యము గురించి మీకు కలిగిన మనోభావాలు ఏవి?
ఆదికాండము 45; 50:15–21
క్షమాపణ స్వస్థతను తెస్తుంది.
వారు అతడికి చేసిన భయంకరమైన విషయాల కొరకు యోసేపు తన సహోదరులను క్షమించడం గురించి చదవడం, మీరు ప్రస్తుతం క్షమించడానికి ప్రయాసపడుతున్న ఎవరైనా ఒకరి గురించి ఆలోచించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. మీరు ఈ సూత్రాన్ని వర్తింపజేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు క్రింది ప్రశ్నలు సహాయపడవచ్చు:
-
తన సహోదరులను క్షమించడం యోసేపుకు ఎందుకు కష్టమైయుండవచ్చు? (వారు అతని పట్ల ఏమి చేశారో సమీక్షించడానికి, ఆదికాండము 37 చూడండి). ఏ అనుభవాలు లేదా వైఖరులు యోసేపుకు క్షమించే శక్తిని ఇచ్చియుండవచ్చు? (ఉదాహరణకు, ఆదికాండము 45:1–15 లేదా 50:15–21 చూడండి).
-
యోసేపు తన సహోదరులను క్షమించడం వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయి? ఉదాహరణకు, కథ ప్రారంభంలో ఉన్న యాకోబు కుటుంబంలోని సంబంధాలను (ఉదాహరణకు, ఆదికాండము 37:3–11 చూడండి) చివరిలో ఉన్న సంబంధాలతో పోల్చండి (ఆదికాండము 45:9–15; 50:15–21 చూడండి). యోసేపు క్షమించడానికి ఇష్టపడకపోయి ఉంటే విషయాలు ఎలా భిన్నంగా మారియుండవచ్చు?
-
మీ క్షమాపణ అవసరమయ్యే వారి పేరును వ్రాయండి—వారు క్షమాపణ కోరినా లేదా కోరకపోయినా. ఆ పరిస్థితిలోకి రక్షకుని యొక్క స్వస్థపరిచే శక్తిని ఆహ్వానించడానికి మీరు ఏమి చేయవచ్చు? క్షమించడం చాలా కష్టంగా అనిపిస్తే, ఎల్డర్ గెరిట్ డబ్ల్యు. గాంగ్ గారి సందేశం “సంతోషంగా మరియు శాశ్వతంగా” (లియహోనా, నవ. 2022, 85) లోని చివరి ఆరు పేరాల్లో ఇచ్చిన సలహాను సమీక్షించండి. మీరు క్షమించగలరని మీకు నిరీక్షణను ఇచ్చేలా మీరు ఏమి కనుగొంటారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 64:9–11 కూడా చూడండి.
Forgiveness: My Burden Was Made Light
ఆదికాండము 49
యాకోబు తన కుటుంబానికి ప్రవచనాత్మకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు.
యాకోబు తన సంతానానికి ఇచ్చిన ఆశీర్వాదాలు స్పష్టమైన చిత్రాలను కలిగి ఉన్నాయి, కానీ వాటిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కృతజ్ఞతాపూర్వకంగా, పునఃస్థాపించబడిన సువార్త మనకు కొంత సహాయాన్ని అందిస్తుంది. ఆదికాండము 49:22–26లో యోసేపుకు ఇచ్చిన దీవెనలను మీరు చదివినప్పుడు, క్రింది వచనాలు కూడా చదవండి మరియు అవి ఏ అంతర్దృష్టులను ఇస్తాయో చూడండి: 1 నీఫై 15:12; 2 నీఫై 3:4–5; జేకబ్ 2:25; సిద్ధాంతము మరియు నిబంధనలు 50:44.
మీరు ఆదికాండము 49:8–12లో యూదాకిచ్చిన ఆశీర్వాదం గురించి చదువుతున్నప్పుడు, యేసు క్రీస్తు యూదా వంశస్థుడని గుర్తుంచుకోండి. రక్షకుడిని మీకు గుర్తుచేసేలా ఈ వచనాలలో మీరు ఏమి కనుగొంటారు? (ప్రకటన 5:5–6, 9; 1 నీఫై 15:14–15; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:59; 133:46–50 కూడా చూడండి).
ఈ ఆశీర్వాదాలను చదవడం మీ గోత్రజనక దీవెనను సమీక్షించడానికి లేదా మీకు అది లేనట్లయితే, దానిని స్వీకరించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. మీ దీవెనలో ఉన్న ఏ పదాలు మరియు వాక్యభాగాలు మీ ఆలోచనలను యేసు క్రీస్తు వైపుకు మళ్ళిస్తాయి?
రాండల్ కె. బెన్నెట్, “మీ గోత్రజనకుని దీవెన పరలోకపు తండ్రి నుండి ప్రేరేపించబడిన నడిపింపు,” లియహోనా, మే 2023, 42–44 కూడా చూడండి.
ఆదికాండము 50:19–21
నా కష్టాలకు అర్థాన్ని కనుగొనడానికి దేవుడు నాకు సహాయం చేయగలరు.
అతడు దానిని అనుభవిస్తున్నప్పుడు అది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, యోసేపు చివరికి ఐగుప్తులో తన కష్టాల వైపు తిరిగి చూచి, “అది మేలుకే దేవుడు ఉద్దేశించెను” (ఆదికాండము 50:20) అని చూడగలిగాడు. యోసేపు గోతిలో ఉన్నప్పుడు లేదా చెరసాలలో ఉన్నప్పుడు మీరు అతన్ని సందర్శించగలిగితే, మీరు అతన్ని ఎలా ఓదార్చియుంటారు? మీ కష్టసమయాల్లో ఆదికాండము 50:19–21 మీకు ఎలా సహాయం చేయగలదు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 122 కూడా చూడండి.
Joseph Smith among the Prophets [ప్రవక్తల మధ్య జోసెఫ్ స్మిత్], పాల్ మాన్ చేత (వివరణ)
ఆదికాండము 50:24–25
“నా దేవుడైన ప్రభువు ఒక దీర్ఘదర్శిని పైకిలేపును.”
మీరు ఆదికాండము 50:24–25 మరియు జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 50:24–38 (బైబిలు అనుబంధములో) చదువుతున్నప్పుడు, మోషే మరియు జోసెఫ్ స్మిత్ గురించి చాలా శతాబ్దాల ముందుగానే తెలుసుకోవడం యోసేపుకు ఎందుకు ముఖ్యమైయుండవచ్చో ధ్యానించండి. తన గురించి యోసేపు చెప్పిన ప్రవచనాలను జోసెఫ్ స్మిత్ ఎలా నెరవేర్చాడు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:17–23; 20:7–12; 39:11; 135:3 చూడండి).
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
ఆదికాండము 42–44; 45:4–15
నేను నా కుటుంబం పట్ల ప్రేమ మరియు క్షమాపణ చూపగలను.
-
యోసేపు తన కుటుంబాన్ని తిరిగి కలిసే కథను మళ్ళీ ప్రదర్శించడం మీ పిల్లలకు సరదాగా ఉండవచ్చు (ఆదికాండము 42–44 చూడండి). లేదా వారు ఒకరికొకరు కథను బోధించడానికి (పాత నిబంధన కథలు, 57–60లో) “యోసేపు మరియు కరువు” లేదా ఈ నమూనాలోని చిత్రాలను ఉపయోగించవచ్చు. కథ నుండి మీ పిల్లలు నేర్చుకోవడంలో సహాయపడే కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:
-
తన కుటుంబం పట్ల ప్రేమను చూపించడానికి యోసేపు ఏమి చేశాడు? (ఆదికాండము 45:4–15 చూడండి).
-
యోసేపు తన సహోదరులను క్షమించాడని మీరెందుకు అనుకుంటున్నారు?
-
యోసేపు తమను క్షమించాడని తెలుసుకున్నప్పుడు యోసేపు సహోదరులు ఎలా భావించియుంటారని మీరు అనుకుంటున్నారు? మీ జీవితంలో ఎవరిని క్షమించాలి? మీరు ప్రేమ మరియు క్షమాపణను ఎలా చూపించగలరు?
2:26Joseph and the Famine
-
మీరు బోధించడానికి సిద్ధమవుతున్నప్పుడు, “నేర్చుకోవడానికి నా పిల్లలు ఏమి చేస్తారు?” అని అడగండి. ఉదాహరణకు, ఈ ప్రోత్సాహ కార్యక్రమంలో మీ పిల్లలు కథను అభినయిస్తున్నారు లేదా తిరిగి చెబుతున్నారు. ఇలా చేయడం జరిగిన దానిని మరియు కథలో ఉన్న సువార్త సూత్రాలను గుర్తుంచుకోవడానికి వారికి సహాయపడుతుంది.
-
మీరు లేదా మీ పిల్లలు ఎవరినైనా క్షమించిన లేదా ఎవరైనా వారిని క్షమించిన అనుభవాన్ని పంచుకోవాలనుకోవచ్చు.
ఆదికాండము 48:8–9
యాజకత్వ దీవెనల ద్వారా ప్రభువు నాకు సహాయం చేస్తారు.
-
మీరు, మీ పిల్లలు ఈ నమూనా చివరలో యాకోబు తన కుమారులను దీవిస్తున్న చిత్రాన్ని చూడవచ్చు మరియు అక్కడ జరుగుతున్న దానిని చర్చించవచ్చు (ఆదికాండము 48:8–9 చూడండి). అవసరమైతే, యోసేపు తండ్రి యాకోబు తన కుటుంబానికి యాజకత్వ దీవెనలు ఇవ్వాలని కోరుకున్నాడని వివరించండి. బహుశా మీరు యాజకత్వ దీవెన ద్వారా దేవుని నుండి సహాయం పొందిన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. మనం యాజకత్వ దీవెన అడగడానికి గల కొన్ని కారణాలు ఏవి?
ఆదికాండము 45:5–11
నన్ను రక్షించడానికి పరలోక తండ్రి యేసు క్రీస్తును పంపారు.
-
కరువు నుండి తన కుటుంబాన్ని రక్షించిన యోసేపు కథలో రక్షకుడిని చూడడానికి మీరు మీ పిల్లలకు ఎలా సహాయం చేయగలరు? యోసేపు మరియు యేసు క్రీస్తు అని పేరు పెట్టబడిన రెండు నిలువు వరుసలతో ఒక పట్టికను రూపొందించండి. క్రింది లేఖన జతలను శోధించి, యోసేపు మరియు యేసు ఉమ్మడిగా కలిగియున్న విషయాలతో పట్టికను పూరించడానికి మీ పిల్లలకు సహాయం చేయండి: ఆదికాండము 37:3 మరియు మత్తయి 3:17; ఆదికాండము 37:26–28 మరియు మత్తయి 26:14–16; ఆదికాండము 45:5–7 మరియు లూకా 4:18; మరియు ఆదికాండము 47:12 మరియు యోహాను 6:35.
-
ఒకరిని రక్షించడం లేదా కాపాడడం అంటే ఏమిటో మీ పిల్లలను అడగండి. వారిలో ఎవరైనా రక్షించబడిన లేదా ప్రమాదం నుండి కాపాడబడిన అనుభవాన్ని కలిగి ఉంటే, పంచుకోవడానికి వారిని ఆహ్వానించండి. యోసేపు తన సహోదరులను ఎలా రక్షించాడు? (ఆదికాండము 42:1–3; 45:5–7 చూడండి). తర్వాత మీరు కలిసి రక్షకుని చిత్రాన్ని చూసి, యేసు మనల్ని ఎలా రక్షిస్తారనే దాని గురించి మాట్లాడమని మీ పిల్లలను అడగవచ్చు.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.