“ఫిబ్రవరి 23–మార్చి 1. ‘యెహావాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా?’: ఆదికాండము 18–23,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“ఫిబ్రవరి 23–మార్చి 1. ‘యెహావాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా?’,” రండి, నన్ను అనుసరించండి: 2026
Sarah and Isaac [శారా మరియు ఇస్సాకు], స్కాట్ స్నో చేత
ఫిబ్రవరి 23–మార్చి 1: “యెహావాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా?”
ఆదికాండము 18–23
దేవుడైన [మన] ప్రభువు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని [మనము] గైకొందుమో లేదోనని” (అబ్రాహాము 3:25) పరీక్షించబడుటకు మనము భూమిపై ఉన్నామని—దర్శనములో అబ్రాహాము నేర్చుకున్న సత్యానికి సాక్ష్యమే బాధాకరమైన మరియు ఉన్నతమైన సంఘటనలతో నిండిన అబ్రాహాము జీవితము. అబ్రాహాము మరియు శారా విశ్వాసులుగా నిరూపించుకుంటారా? వారి ముసలితనంలో కూడా వారు సంతానము లేకయుండగా, అధిక సంతతిని పొందెదవను దేవుని వాగ్దానములో వారు విశ్వాసమును కొనసాగిస్తారా? ఇస్సాకు జన్మించిన తర్వాత, అనుకోని దానిని—ఆ నిబంధనను నెరవేర్చడానికి దేవుడు వాగ్దానం చేసిన అదే కుమారుడిని త్యాగం చేయమనే ఆజ్ఞను వారి విశ్వాసము సహించగలదా?
అబ్రాహాము మరియు శారా దేవుడిని నమ్మారు మరియు ఆయన వారిని నమ్మారు (ఆదికాండము 15:6; రోమా 4:3 చూడండి). ఆదికాండము 18–23లో, మనం అబ్రాహాము, శారా మరియు ఇతరుల జీవితాల నుండి వృత్తాంతాలను కనుగొంటాము, అవి దేవుడి వాగ్దానాలను నమ్మడానికి, దుష్టత్వము నుండి పారిపోయి మరలా ఎన్నడూ వెనుదిరగకుండా ఉండేందుకు మరియు త్యాగము అవసరమైనప్పటికీ దేవుడిని నమ్మడానికి మన సమ్మతి గురించి ఆలోచించడానికి మనల్ని ప్రేరేపించగలవు. మనల్ని నిరూపించడంలో, దేవుడు మనల్ని మెరుగుపరుస్తారు కూడా.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
ఆదికాండము 18:9–14; 21:1–7
ప్రభువు తన యుక్తకాలమందు తన వాగ్దానాలను నెరవేరుస్తారు.
ప్రభువు విశ్వాసులకు మహిమకరమైన వాగ్దానాలు చేసారు, కానీ కొన్నిసార్లు మన జీవితాల్లోని పరిస్థితులు ఆ వాగ్దానాలు నెరవేరడం సాధ్యమేనా అని మనం ఆశ్చర్యపడేలా చేస్తాయి. అబ్రాహాము మరియు శారా ఆవిధంగా భావించియుండవచ్చు. వారి అనుభవాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ఆదికాండము 17:4, 15–22లో ప్రభువు చేసిన వాగ్దానాన్ని పునర్వీక్షిస్తూ మీ అధ్యయనాన్ని ప్రారంభించడం సహాయకరంగా ఉండవచ్చు. అబ్రాహాము మరియు శారా ఎలా స్పందించారు? (జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 17:23 [ఆదికాండము 17:17, పాదవివరణ ఆ లో]; ఆదికాండము 18:9–12 చూడండి). ఆయన వాగ్దానాలందు అధిక విశ్వాసము కలిగియుండేందుకు వారికి సహాయపడడానికి ప్రభువు ఎలా స్పందించారు? (ఆదికాండము 18:14 చూడండి).
మీ విశ్వాసాన్ని వృద్ధిచేసేలా ఈ వచనాలలో దేనిని మీరు కనుగొంటారు? ప్రభువు తాను చేసిన వాగ్దానాలను ఆయన విధానంలో యుక్తకాలమందు నెరవేరుస్తారని మీ జీవితంలో లేదా మరెవరి జీవితంలోనైనా—ఏ ఇతర అనుభవాలు—మీ విశ్వాసాన్ని బలపరిచాయి? ఈ జీవితంలో వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు లభించనప్పుడు మీరు మీ విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవచ్చో కూడా మీరు ధ్యానించవచ్చు. హెబ్రీయులకు 11:8–13లో మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశము “క్రీస్తు లేచియున్నాడు; ఆయన యందు విశ్వాసం కొండలను కదిలిస్తుంది” లో ఏ సలహాను మీరు కనుగొంటారు? (లియహోనా, మే 2021, 101-–4).
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:68 కూడా చూడండి.
ఆదికాండము 19:12–29
దుష్టత్వము నుండి పారిపోయి మరలా ఎన్నడూ వెనుదిరగకుండా ఉండమని ప్రభువు నన్ను ఆజ్ఞాపిస్తున్నారు.
మీరు లోతు మరియు అతని కుటుంబము గురించి చదువుతున్నప్పుడు, దుష్టత్వము నుండి పారిపోవడం గురించి మీరు ఏ పాఠాలను నేర్చుకుంటారు? ఉదాహరణకు, నాశనమును తప్పించుకోవడానికి లోతు మరియు అతని కుటుంబానికి సహాయపడేందుకు దేవదూతలు ఏమి చెప్పారు మరియు చేసారు అనేదాని గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? (ఆదికాండము 19:12–17 చూడండి). లోకములోని చెడు ప్రభావాల నుండి పారిపోవడానికి లేదా రక్షింపబడడానికి మీకు, మీ కుటుంబానికి ప్రభువు ఎలా సహాయం చేస్తారు? మీరు రక్షకునిపై విశ్వాసంతో ముందుకు చూడవలసి వచ్చినప్పుడు, మీరు “[వెనుదిరిగి] చూడాలని” (26వ వచనము) శోధించబడే పరిస్థితుల గురించి ఆలోచించండి. ఈ సూత్రం గురించి మీ గ్రహింపుకు లూకా 9:62 ఏమి జతచేస్తుంది?
జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 19:9–15 (బైబిలు అనుబంధములో) కూడా చూడండి.
ఆదికాండము 19:26
లోతు భార్య ఏమి తప్పు చేసింది?
ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇలా బోధించారు:
“స్పష్టంగా లోతు భార్య చేసిన తప్పు ఏమనగా, ఆమె వెనుదిరిగి మాత్రమే చూడలేదు; తన మనస్సులో ఆమె వెనుదిరిగి వెళ్ళాలని కోరుకుంది. ఆమె పట్టణ సరిహద్దులను దాటకముందే, సొదొమ మరియు గొమొఱ్ఱాలు ఆమెకు అందించిన వాటిని ఆమె కోల్పోతున్నట్లు భావించిందని కనబడుతున్నది. …
“ప్రభువు ఆమెను విడిచిపెట్టమని కోరిన వాటిని బట్టి లోతు భార్య ఆయన వైపు ఆగ్రహంతో వెనుదిరిగి చూసే అవకాశం ఉంది. … కాబట్టి ఆమె వెనుదిరిగి చూడడం మాత్రమే కాదు; ఆమె ఆత్రంగా వెనుదిరిగి చూసింది. సంక్షిప్తంగా, గతంతో ఆమె అనుబంధం భవిష్యత్తులో ఆమె విశ్వాసాన్ని మించిపోయింది. అది, స్పష్టంగా, ఆమె పాపంలో కనీసం కొంతభాగమైయుంది.
“… ఇప్పుడు గడిచిపోయిన రోజులలో జీవించవద్దని లేదా నిన్నటి కోసం వృథాగా ఆరాటపడవద్దని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఆ నిన్నలు ఎంత బాగున్నా సరే. గతం నుండి నేర్చుకోవాలి కానీ అందులోనే జీవించకూడదు. ప్రకాశించే అనుభవాల నుండి నిప్పులను తెచ్చుకోవడానికి మనము వెనక్కి తిరిగి చూస్తాము కానీ బూడిదను తెచ్చుకోవడానికి కాదు. మనం నేర్చుకోవలసినది నేర్చుకున్నప్పుడు మరియు మనం అనుభవించిన అత్యుత్తమమైన వాటిని మనతో తెచ్చుకున్నప్పుడు, మనం ముందుకు చూస్తాము మరియు విశ్వాసం ఎల్లప్పుడూ భవిష్యత్తు వైపు చూపిస్తుందని గుర్తుంచుకుంటాము. …
“… గత తప్పులతో సహా గత జీవితాల గురించి ఆలోచించడం సరికాదు! ఇది యేసు క్రీస్తు యొక్క సువార్త కాదు. …
“ప్రతి తరము యొక్క (జనులు) అందరికి, నేను చెప్తున్నాను, ‘లోతు భార్యను జ్ఞాపకముంచుకోండి’ [లూకా 17:32]. విశ్వాసము అనేది భవిష్యత్తు కొరకైనది. విశ్వాసము గతముపై నిర్మించబడుతుంది, కానీ అక్కడే ఉండిపోవాలని కోరుకోదు. మనలో ప్రతీ ఒక్కరి కొరకు దేవుడు గొప్ప విషయాలను కలిగియున్నారని మరియు క్రీస్తు నిజముగా ‘రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా వచ్చునని’ విశ్వాసము నమ్ముతుంది (హెబ్రీయులకు 9:11)” (“The Best Is Yet to Be,” Ensign, Jan. 2010, 24, 26–27).
Abraham and Isaac [అబ్రాహాము మరియు ఇస్సాకు], హెరొల్డ్ కాపింగ్ చేత
ఆదికాండము 22:1–19
ఇస్సాకును బలిచ్చుటకు అబ్రాహాము సమ్మతి దేవుడు మరియు ఆయన కుమారుడిని పోలియున్నది.
ఇస్సాకును బలి ఇమ్మని దేవుడు అబ్రాహామును కోరడానికి గల కారణాలన్నీ మనకు తెలియవు; కానీ అది దేవునియందు అతని విశ్వాసానికి పరీక్షయని మనకు తెలుసు. అది “దేవుడు మరియు ఆయన అద్వితీయ కుమారుడిని పోలియున్నది” (జేకబ్ 4:5) అని కూడా మనకు తెలుసు. మీరు ఆదికాండము 22:1–19 చదువుతున్నప్పుడు, అబ్రాహాము ఇస్సాకును అర్పించడానికి మరియు తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తును అర్పించడానికి మధ్య చిహ్నాలు లేదా సారూప్యతల కొరకు మీరు చూడవచ్చు. మీరు కనుగొన్న దానిని ఇటువంటి పట్టికలో నమోదు చేయడాన్ని పరిగణించండి:
|
అబ్రాహాము మరియు ఇస్సాకు |
పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు |
|---|---|
అబ్రాహాము మరియు ఇస్సాకు ఇస్సాకు అబ్రాహాము మరియు శారాల ఏకైక కుమారుడు (ఆదికాండము 22:2; హెబ్రీయులకు 11:17 కూడా చూడండి) | పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యేసు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు (యోహాను 3:16) |
అబ్రాహాము మరియు ఇస్సాకు గొర్రెపిల్ల స్థానంలో ఇస్సాకు అర్పించబడాలి (ఆదికాండము 22:7–9) | పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యేసు క్రీస్తే దేవుని గొర్రెపిల్ల (యోహాను 1:29) |
రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగానికి ఏ చిహ్నాలు లేదా సారూప్యతలు మీకు అత్యంత అర్థవంతంగా అనిపిస్తాయి? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి, మీ కోసం వారి త్యాగం గురించి మీ భావాలను కూడా మీరు నమోదు చేయవచ్చు.
మీరు మన రక్షకుని త్యాగం గురించి మరింత అధ్యయనం చేయాలనుకుంటే, అధ్యక్షులు జెఫ్రీ ఆర్. హాలండ్ సందేశము “ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల” (లియహోనా, మే 2019, 44–46) చదవండి. గొర్రెపిల్ల దేవుని కుమారునికి అంత శక్తివంతమైన చిహ్నంగా ఎందుకు ఉంది? పరలోక తండ్రి యొక్క బహుమానం పట్ల మీ గౌరవాన్ని పెంచేలా అధ్యక్షులు హాలండ్ ఏమి బోధించారు?
Akedah (The Binding)
బోధించడానికి దృశ్యాలను ఉపయోగించండి. బోధన మరియు అభ్యాసంలో వైవిధ్యాన్ని జోడించడానికి, మీరు ఆదికాండము 18–23 లోని కథలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ నమూనాలో ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చిత్రాలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు మరియు మీ కుటుంబం లేదా తరగతి అబ్రాహాము మరియు ఇస్సాకు చిత్రాలలో వివరాలను గమనించవచ్చు. కథకు ఈ వివరాలు ఎందుకు ముఖ్యమైనవి అనే దాని గురించి మాట్లాడండి మరియు ఈ వివరాలను లేఖనాలలో కనుగొనండి. దేవుని కుమారుని త్యాగం యొక్క కథ యొక్క ప్రతీకాత్మకతను వారు ఎలా ఎత్తిచూపుతారు?
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
ఆదికాండము 17:15–21; 18:14; 21:1–7
దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటారని నేను విశ్వసించగలను.
-
దేవుని వాగ్దానాలపై అబ్రాహాము మరియు శారాలకు గల నమ్మకాన్ని గురించి తెలుసుకోవడానికి, మీరు మరియు మీ పిల్లలు వారు నిజంగా కోరుకునే దాని కోసం వేచి ఉండవలసివచ్చిన సమయం గురించి మాట్లాడవచ్చు. తర్వాత మీరు ఈ నమూనా ప్రారంభంలో ఉన్న శారా మరియు ఇస్సాకుల చిత్రాన్ని చూసి, ఆమెకు మరియు అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానం గురించి మాట్లాడవచ్చు (పాత నిబంధన కథలు, 28–31లో “అబ్రాహాము మరియు శారా” కూడా చూడండి). మనం విశ్వాసంగా ఉంటే దేవుడు మనకు వాగ్దానం చేసిన విషయాల గురించి ఆలోచించడానికి మీ పిల్లలకు సహాయం చేయండి. ఓపికగా ఉండమని మరియు దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటారని నమ్మమని వారిని ప్రోత్సహించండి.
2:20Abraham and Sarah
-
ఆదికాండము 18:14లోని ముఖ్యమైన సత్యాన్ని నేర్చుకునేందుకు మీ పిల్లలకు సహాయం చేయడానికి, మీరు ఆ వచనంలోని మొదటి వాక్యం నుండి ప్రతీ పదాన్ని వేర్వేరు కాగితాలపై వ్రాయవచ్చు. తర్వాత కాగితాలను కలిపి, పదాలను సరైన క్రమంలో ఉంచడానికి మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. తర్వాత ప్రభువు చేసిన అసాధ్యమైన దానికి ఉదాహరణను కనుగొనడానికి మీరు, మీ పిల్లలు ఆదికాండము 17:15–21; 21:1–7 చదవవచ్చు. అవి అసాధ్యం అనిపించినా లేదా ఎక్కువ సమయం పట్టినా, ప్రభువు తన వాగ్దానాలను నెరవేరుస్తారనే మీ విశ్వాసాన్ని మీ పిల్లలతో పంచుకోండి.
ఆదికాండము 19:15–26
నేను దుష్టత్వం నుండి పారిపోగలను.
-
సరైనది కాదని తెలిసిన పనిని చేయమని ఎవరైనా వారిని ఆహ్వానించే పరిస్థితుల గురించి మీ పిల్లలను అడగండి. ఈ పరిస్థితుల నుండి మనం ఎలా “పారిపోవాలి”? లోతు కుటుంబం చాలా చెడ్డ నగరంలో నివసించిందని మరియు దానిని విడిచిపెట్టమని దేవదూతలు వారిని హెచ్చరించారని వివరించడం ద్వారా ఆదికాండము 19:15–26ను సంక్షిప్తపరచండి. మీరు మరియు మీ పిల్లలు 15–17, 26 వచనాలను కలిసి చదువుతున్నప్పుడు, ఈ రోజు మనం చెడునుండి “పారిపోవడం” మరియు “వెనుదిరిగి చూడకపోవడం” (17వ వచనము) అంటే అర్థం ఏమైయుండవచ్చో వారిని అడగండి.
Sodom [సొదొమ], జూలియస్ ష్నార్ వాన్ కారోల్స్‌ఫెల్డ్ చేత
ఆదికాండము 22:1–14
అబ్రాహాము ప్రభువుకు లోబడ్డాడు.
-
అబ్రాహాము, ఇస్సాకు మరియు సిలువ వేయబడిన చిత్రాలను ఉపయోగించడం మీ పిల్లలు ఆదికాండము 22లోని కథను రక్షకుని త్యాగంతో (మత్తయి 27:26–37 చూడండి) పోల్చడానికి సహాయపడగలదు. అబ్రాహాము, ఇస్సాకు మరియు సిలువ వేయడం గురించిన వృత్తాంతాల నుండి పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి మనం ఏమి నేర్చుకోగలము? (పాత నిబంధన కథలు, 34–37లో “అబ్రాహాము మరియు ఇస్సాకు” కూడా చూడండి.)
2:0Abraham and Isaac
-
మీరు మీ పిల్లలతో కలిసి దిశానిర్దేశాలను అనుసరించవలసిన అవసరమున్న ఆట ఆడడం గురించి ఆలోచించగలరా? బహుశా దిశానిర్దేశాలు దాచియుంచిన రక్షకుని చిత్రానికి దారి తీయవచ్చు. మనం మళ్ళీ ఆయనతో మరియు యేసు క్రీస్తుతో కలిసి జీవించగలిగేలా పరలోక తండ్రి మనల్ని చేయమని ఆజ్ఞాపించిన విషయాల గురించిన సంభాషణను ఆ ఆట ప్రేరేపించవచ్చు. ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ సహాయపడగలదు.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.