2024 రండి, నన్ను అనుసరించండి
ఫిబ్రవరి 16–22. “నీతికి గొప్ప అనుచరునిగాయుండుటకు”: ఆదికాండము 12–17; అబ్రాహాము 1–2


“ఫిబ్రవరి 16–22. ‘నీతికి గొప్ప అనుచరునిగాయుండుటకు’: ఆదికాండము 12–17; అబ్రాహాము 1–2,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“ఫిబ్రవరి 16–22. ‘నీతికి గొప్ప అనుచరునిగాయుండుటకు’,” రండి, నన్ను అనుసరించండి: 2026

అబ్రామును దీవించడానికి అతని తలపై తన చేతులుంచుచున్న మెల్కీసెదెకు

Melchizedek Blesses Abram [మెల్కీసెదెకు అబ్రామును దీవించును], వాల్టర్ రేన్ చేత (వివరణ)

ఫిబ్రవరి 16–22: “నీతికి గొప్ప అనుచరునిగాయుండుటకు”

ఆదికాండము 12–17; అబ్రాహాము 1–2

దేవుడు అతనితో చేసిన నిబంధన కారణంగా అబ్రాహాము “విశ్వాసులకు తండ్రి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:41) మరియు “దేవుని స్నేహితుడు” (యాకోబు 2:23) అని పిలువబడ్డాడు. వేలమంది నేడు అతడిని తమ ప్రత్యక్ష పూర్వీకునిగా గౌరవిస్తారు మరియు ఇతరులు యేసు క్రీస్తు సువార్తకు పరివర్తన చెందడం ద్వారా ఆయన కుటుంబంలోకి దత్తత తీసుకోబడ్డారు. అయినను అబ్రాహాము శ్రమలు గల కుటుంబం నుండి వచ్చాడు—అతని తండ్రి దేవుని యొక్క నిజమైన ఆరాధనను విడిచిపెట్టి, అబ్రాహామును అబద్ధ దేవుళ్ళకు బలి ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ, “నీతికి గొప్ప అనుచరునిగాయుండుటకు” (అబ్రాహాము 1:2) అబ్రాహాము కోరుకున్నాడు మరియు దేవుడు అతని కోరికను గౌరవించారని అతని జీవిత చరిత్ర చూపుతుంది. ఒక వ్యక్తి యొక్క కుటుంబ చరిత్ర ఏదైనప్పటికీ, భవిష్యత్తు నిరీక్షణతో నింపబడగలదు అనడానికి అబ్రాహాము జీవితం ఒక సాక్ష్యంగా నిలుస్తుంది.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

అబ్రాహాము 1:1–19

నా విశ్వాసము మరియు నీతిగల కోరికల మూలంగా దేవుడు నన్ను దీవిస్తారు.

“మనమందరం మన కుటుంబాలు [మరియు] మన సంస్కృతి ద్వారా ప్రభావితులమయ్యాము,” అని ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ బోధించారు, “అయితే మనం ప్రత్యేకంగా మరియు వ్యక్తిగతంగా నియంత్రించే మరియు సృష్టించే స్థలం మనలో ఉందని నేను నమ్ముతున్నాను. … చివరికి, మన అంతర్గత కోరికలకు జీవం ఇవ్వబడుతుంది మరియు అవి మన ఎంపికలలో, మన చర్యలలో కనిపిస్తాయి” (“Educate Your Desires, Elder Andersen Counsels,” ChurchofJesusChrist.org). ఎల్డర్ ఆండర్సెన్ బోధించిన దానిని అబ్రాహాము 1:1–19 ఎలా నిరూపిస్తుందో పరిగణించండి. ఇటువంటి ప్రశ్నలు సహాయపడవచ్చు:

  • అబ్రాహాము దేనిని కోరుకున్నాడు? అతని కోరికలు అతని చర్యలలో ఎలా స్పష్టంగా కనిపించాయి? దేవుడు అతని కోరికలకు ఎలా మద్దతిచ్చారు?

  • మీ కోరికలు ఏవి? మీ చర్యలలో అవి ఎలా కనిపిస్తాయి? దేవుడు మీకు ఎలా మద్దతు ఇస్తారు?

  • నీతిని కోరని కుటుంబ సభ్యులు గలవారి కొరకు ఈ వచనాలు ఏ సందేశాన్ని కలిగియున్నాయి?

అబ్రాహాము మరియు శారా యొక్క గొప్ప కోరికలలో ఒకటి—బిడ్డను కనాలనేది—చాలా సంవత్సరాలుగా నెరవేరలేదు (ఆదికాండము 15:1-6 చూడండి). అబ్రాహాము మరియు శారా ఈ పరీక్షను ఎలా ఎదుర్కొన్నారనే దాని గురించి హెబ్రీయులకు 11:8–13 నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? తన వాగ్దానాలు “దూరంగా” ఉన్నా, వాటిని “హత్తుకోవడానికి” రక్షకుడు మీకు ఎలా సహాయం చేస్తారు?

1:38

Deliverance of Abraham

ఆదికాండము 12:1–3; 13:15–16; 15:1–6; 17:1–8, 15–22; అబ్రాహాము 2:6–11

సెమినరీ చిహ్నము
నేను ఆయనతో నిబంధనలు చేసి, పాటించాలని దేవుడు కోరుతున్నారు.

ప్రభువు అబ్రాహాముతో చేసిన నిబంధన గురించి తెలుసుకోవడం మీకెందుకు ముఖ్యమైనది? ఎందుకంటే దేవుడు మీతో అటువంటి నిబంధనే చేయాలనుకుంటున్నారు. ఈ నిబంధన అబ్రాహాము సంతతి లేదా “సంతానము” తో కొనసాగుతుందని మరియు ”ఈ సువార్తను అంగీకరించు వారందరు … నీ సంతానముగా యెంచబడుదురు” (అబ్రాహాము 2:10–11) అని ఆయన వాగ్దానమిచ్చారు. మరో మాటలో చెప్పాలంటే, నిబంధన మీలో కొనసాగుతుంది—మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరియు మీరు దేవాలయంలో నిబంధనలు చేసినప్పుడు మరింత పూర్తిగా (గలతీయులకు 3:26–29; సిద్ధాంతము మరియు నిబంధనలు 132:30–32 చూడండి).

ఆ కారణంగా, మీరు అబ్రాహాము 2:6–11ని అధ్యయనం చేసి, అబ్రాహాము మరియు శారాలకు దేవుడు వాగ్దానం చేసినవాటిని సరిగ్గా జాబితా చేయాలని అనుకోవచ్చు (ఆదికాండము 12:1–3; 13:15–16; 15:1–6; 17:1–8, 15–22 కూడా చూడండి). ఈ దీవెనలు మీకు ఎలా వర్తించవచ్చు?

ఈ వాగ్దానాలలో కొన్ని శాశ్వతమైన పోలికలు ఉన్నాయి. వారసత్వ భూమి లేదా అధిక సంతానం వంటి వాగ్దానాలు ఎలా శాశ్వతంగా నెరవేరుతాయి? (సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4; 132:20–24, 28–32 చూడండి).

వాగ్దానమివ్వబడిన దీవెనలకు అదనంగా, “ఆశీర్వాదముగా నుండుము” (ఆదికాండము 12:2; వివరణ చేర్చబడింది) అని దేవుడు అబ్రాహాముతో చెప్పారు. దాని అర్థం ఏమిటని మీరనుకుంటున్నారు? మీరు ఆశీర్వాదముగా ఎలా ఉంటారు? (అబ్రాహాము 2:11 చూడండి).

నిబంధనలను గురించి బోధించడానికి, ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ అమెజాన్ నదిలో బలమైన ఆటుపోట్ల గురించి మాట్లాడారు మరియు అధ్యక్షురాలు ఎమిలీ బెల్లి ఫ్రీమాన్ విరిగిన చీలమండతో రాతి మార్గంలో నడవడం గురించి మాట్లాడారు (“నిబంధనల ద్వారా దేవుని శక్తి పొందుట,” లియహోనా, మే 2023, 35–37; “క్రీస్తుతో నిబంధన అనుబంధములో నడుచుట,” లియహోనా, నవ. 2023, 76–79 చూడండి). “నేను ఆయనతో నిబంధనలు చేసుకోవాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నారు?” అనే ప్రశ్నకు సమాధానమివ్వడంలో సహాయపడే వాక్యాల కోసం ఈ సందేశాలలో ఒకటి లేదా రెండింటిని శోధించండి.

ఒకరికొకరు బోధించడానికి వ్యక్తులను ఆహ్వానించండి. మీరు నిబంధనల గురించి మీ కుటుంబానికి లేదా సంఘ తరగతికి బోధిస్తున్నట్లయితే, ప్రతి వ్యక్తికి ఎల్డర్ రెన్‌లండ్ లేదా అధ్యక్షురాలు ఫ్రీమాన్ సందేశంలో కొంత భాగాన్ని అధ్యయనం చేయడానికి ఇవ్వండి. అప్పుడు వారు నేర్చుకున్న వాటిని కుటుంబం లేదా తరగతిలోని మిగిలిన వారితో వారు పంచుకోవచ్చు. ఇది జనులు సాక్ష్యమివ్వడానికి, ఒకరి నుండి ఒకరు నేర్చుకునేందుకు అనుమతిస్తుంది మరియు అది ఆత్మను ఆహ్వానిస్తుంది. (రక్షకుని విధానములో బోధించుట26 చూడండి.)

ఈ వనరులో “జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: నిబంధన,” కూడా చూడండి.

అబ్రాహాము మరియు శారా

The Abrahamic Covenant [అబ్రాహాము నిబంధన], డిల్లీన్ మార్ష్ చేత (వివరణ)

ఆదికాండము 14:18–19; జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 14:25–40

“మెల్కీసెదెకు విశ్వాసం గల వ్యక్తి.”

మీరు మెల్కీసెదెకును అతని గురించి తెలియని వ్యక్తికి పరిచయం చేస్తున్నారని ఊహించుకోండి. మీరు ఏమి చెబుతారు? ఉపాయాల కొరకు జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 14:26–27, 33–38 (బైబిలు అనుబంధములో); ఆల్మా 13:13–19; సిద్ధాంతము మరియు నిబంధనలు 107:1–4లో చూడండి. మెల్కీసెదెకు గురించిన ఈ వర్ణనలలో మీరు క్రీస్తు వంటి ఏ లక్షణాలను కనుగొంటారు? మెల్కీసెదెకు జీవితం గురించి మీ అధ్యయనం మెల్కీసెదెకు యాజకత్వాన్ని మీరు చూసే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

ఆదికాండము 14:18–24; జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 14:36–40

అబ్రాహాము దశమభాగము చెల్లించాడు.

ఆదికాండము 14:18–24 మరియు జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 14:36–40 (బైబిలు అనుబంధములో) నుండి సంపద పట్ల అబ్రాహాము వైఖరి గురించి మీరు ఏమి తెలుసుకుంటారు? ఉదాహరణకు, ఆదికాండము 14:23లో సొదొమ రాజుకు అతని ప్రతిస్పందనను గమనించండి. దశమభాగ చట్టానికి విధేయత చూపడం డబ్బు పట్ల మీ దృక్పథాన్ని ఎలా ప్రభావితం చేసింది?

ఆదికాండము 16

దేవుడు నా మాట వింటారు.

మీరు ఆదికాండము 16 చదువుతున్నప్పుడు, హాగరు వలె మీకు అన్యాయం జరిగిందని మీరు భావించిన సమయం గురించి మీరు ఆలోచించవచ్చు. “ఇష్మాయేలు” అంటే “దేవుడు వింటాడు” అని గమనించండి. దేవుడు మీ మాట విన్నట్లు ఆయన మీకు ఎలా చూపించారు?

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

అబ్రాహాము 1:18; 2:8

యేసు క్రీస్తు నన్ను చేయి పట్టుకొని నడిపిస్తారు.

  • మీరు మరియు మీ పిల్లలు అబ్రాహాము 1:18 మరియు 2:8 చదువుతున్నప్పుడు, రెండు వచనాలలో ప్రస్తావించబడిన శరీరంలోని కొంత భాగాన్ని వినమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. పిల్లవాడు కళ్ళు మూసుకునే ఆటను మీరు ఆడవచ్చు మరియు మీరు పిల్లవాడి చేయి పట్టుకొని ఎక్కడికైనా నడిపించవచ్చు. అప్పుడు యేసు క్రీస్తు మనల్ని చేయి పట్టుకొని నడిపించడం లేదా మనల్ని రక్షించడం ఎలా అనిపిస్తుందో మీరు మాట్లాడవచ్చు.

ఆదికాండము 13:5–12

నేను సమాధానపరచువానిగా ఉండగలను.

  • మీ పిల్లలు ఆదికాండము 13:5–12లోని కథను అబ్రాహాము, లోతు మరియు పశువుల కాపరులుగా నటిస్తూ ఆనందించవచ్చు. మన కుటుంబంతో లేదా స్నేహితులతో సమాధానపరచువారిగా ఉండడంలో అబ్రాహాము మాదిరిని మనం ఎలా అనుసరించవచ్చు? వారి జవాబులను నటించి చూపడానికి ప్రయత్నించండి.

లోతుతో మాట్లాడుతున్న అబ్రాహాము

Lot’s Choice [లోతు ఎంపిక], విలియం ఫ్రెడెరిక్స్ చేత © Providence Collection/licensed from goodsalt.com

ఆదికాండము 13:16; ఆదికాండము 15:1–6; 17:1–8; అబ్రాహాము 2:9–11

నేను ఆయనతో నిబంధనలు చేయాలని దేవుడు కోరుకుంటున్నారు.

  • మీ పిల్లలకు ఒక పాత్రనిండా ఇసుక, రాత్రి ఆకాశంలో నక్షత్రాలు లేదా ఈ నమూనా చివర ఉన్న చిత్రాన్ని చూపించడాన్ని పరిగణించండి. ఇది ఆదికాండము 13:16; 15:1–6లో దేవుని వాగ్దానాలను అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేస్తుంది. దేవుని వాగ్దానాలు అసాధ్యమని అనిపించినప్పటికీ, వాటిని విశ్వసించడాన్ని మీరు ఎలా నేర్చుకున్నారనే దాని గురించి మాట్లాడండి.

  • మీ పిల్లలకు నిబంధనల గురించి బోధించడానికి, వారు వాగ్దానం చేసిన సమయం గురించి లేదా ఎవరైనా వారికి వాగ్దానం చేసిన సమయం గురించి చెప్పమని వారిని అడగండి. ఉపయోగకరంగా ఉన్నట్లయితే, బాప్తిస్మం సమయంలో లేదా దేవాలయంలో మీరు దేవునితో చేసిన నిబంధనలతో సహా మీ స్వంత ఉదాహరణలను పంచుకోండి. మీ నిబంధనలు దేవునితో మీ సంబంధాన్ని ఎలా ప్రభావితం చేశాయి? దేవుడు అబ్రాహాము మరియు శారాలకు వాగ్దానం చేసిన కొన్ని ఆశీర్వాదాలను పంచుకోవడానికి ఆదికాండము 15:1–6; 17:1–8; అబ్రాహాము 2:9–11 నుండి కొన్ని వాక్యభాగాలను ఎంచుకోండి.

  • మీ పిల్లలు బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవునితో నిబంధన చేయడానికి సిద్ధపడేందుకు వారికి సహాయం చేయడానికి, మీరు అనుబంధము ఎ లేదా అనుబంధము బిలో సూచించబడిన కొన్ని ప్రోత్సాహకార్యక్రమ ఉపాయాలను ఉపయోగించవచ్చు.

అబ్రాహాము 1:12–17; ఆదికాండము 16:7–11

దేవుడు నా మాట వింటారు.

  • అబ్రాహాము ప్రాణము ప్రమాదంలో ఉన్నప్పుడు, అతడు దేవుణ్ణి ప్రార్థించాడు. హాగరు అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుడు తన మాట విన్నారని ఆమె తెలుసుకుంది. ఈ రెండు కథలను మీ పిల్లలతో పంచుకోవడం గురించి ఆలోచించండి: పాత నిబంధన కథలు, 28–31, 32–33లోని “అబ్రాహాము మరియు శారా” మరియు “హాగరు”. ఈ కథల నుండి దేవుని గురించి మనం ఏమి నేర్చుకుంటాము? దేవుడు మీ మాట విన్నారని మీరు భావించినప్పటి అనుభవాలను మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.

2:20

Abraham and Sarah

1:23

Hagar

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

నక్షత్రాల వైపు చూస్తున్న శారా

Pondering God’s Promise [దేవుని వాగ్దానమును ధ్యానించుట], కోర్ట్ని మాట్జ్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: నేను ఆయనతో నిబంధనలు చేయాలని దేవుడు కోరుకుంటున్నారు