“జనవరి 26–ఫిబ్రవరి 1. ‘ఈ సంగతులను నిస్సంకోచంగా నీ పిల్లలకు బోధించుము’: ఆదికాండము 5; మోషే 6,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“జనవరి 26–ఫిబ్రవరి 1. ‘ఈ సంగతులను నిస్సంకోచంగా నీ పిల్లలకు బోధించుము’,” రండి, నన్ను అనుసరించండి: 2026
Better Than Paradise [పరదైసు కంటే గొప్పది], కెండల్ రే జాన్సన్ చేత
జనవరి 26–ఫిబ్రవరి 1: “ఈ సంగతులను నిస్సంకోచంగా నీ పిల్లలకు బోధించుము”
ఆదికాండము 5; మోషే 6
ఆదికాండము 5లో అధికభాగము ఆదాము హవ్వలు మరియు నోవహు మధ్యగల తరాల జాబితా. మనం చాలా పేర్లు చదువుతాము, కానీ వారి గురించి మనం ఎక్కువగా నేర్చుకోము. తర్వాత, సూటిగా చెప్పబడినప్పటికీ, వివరించబడని ఈ వాక్యమును మనం చదువుతాము: “హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను” (ఆదికాండము 5:24). ఖచ్చితంగా ఆ వచనము వెనుక ఒక కథ ఉంది! కానీ మరింత వివరణ లేకుండా, తరాల జాబితా సంక్షిప్తపరచబడింది.
అదృష్టవశాత్తూ, మోషే 6 హనోకు వృత్తాంతము యొక్క వివరాలను బయల్పరుస్తుంది—నిజంగా ఇది గొప్ప వృత్తాంతము. హనోకు యొక్క వినయము, అతని అభద్రతాభావములు, దేవుడు అతనిలో చూసిన సామర్థ్యము మరియు దేవుని ప్రవక్తగా అతడు నిర్వర్తించిన గొప్ప కార్యము గురించి మనం నేర్చుకుంటాము. తరతరాల గుండా అది పురోగమించినప్పుడు ఆదాము హవ్వల కుటుంబము గురించి కూడా మనం స్పష్టమైన వివరణను పొందుతాము. సాతాను యొక్క ”గొప్ప ఏలుబడి” గురించి, పిల్లలకు “దేవుని మార్గముల గురించి” (మోషే 6:15, 21) బోధించిన తల్లిదండ్రుల గురించి కూడా మనం చదువుతాము. విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మను పొందుట గురించి ఈ తల్లిదండ్రులు బోధించిన సిద్ధాంతము గురించి మనము నేర్చుకొనేది చాలా అమూల్యమైనది (మోషే 6:50–52 చూడండి). దాని వెంట వచ్చే యాజకత్వము వలె ఆ సిద్ధాంతము ”ఆదియందు [మరియు] లోకాంతమునందు కూడా ఉండును” (మోషే 6:7).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
పాపం దేవుని విషయాలను చూడడానికి, అనుభూతి చెందడానికి మరియు వినడానికి నా సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది.
మీరు మోషే 6:26–36 చదువుతున్నప్పుడు, పాపము యొక్క ప్రభావాల గురించి మీరేమి నేర్చుకుంటారు? ఈ ప్రభావాలను మీరెలా చూసియున్నారు? హనోకు ఈ ప్రభావాలను అధిగమించడంలో అతనికి సహాయపడిన ఏ లక్షణాలను కలిగియున్నాడు? ఫలితంగా దేవుడు అతడిని ఎలా ఆశీర్వదించారు?
నాలో బలహీనతలున్నప్పటికీ, ఆయన కార్యము చేయడానికి దేవుడు నన్ను పిలుస్తారు.
ప్రభువు మిమ్మల్ని చేయమని పిలిచిన దానితో ముంచివేయబడినట్లుగా మీరు భావించినట్లయితే, మీరు ఒంటరివారు కాదు. ప్రభువు అతడిని ఒక ప్రవక్తగా పిలిచినప్పుడు హనోకు ఆవిధంగా భావించాడు. మీరు మోషే 6:26–36 చదువుతున్నప్పుడు, హనోకు ముంచివేయబడినట్లుగా ఎందుకు భావించాడు మరియు అతనికి ధైర్యమివ్వడానికి ప్రభువు ఏమి చెప్పారనే దాని కొరకు చూడండి.
37–47 వచనములలో, ప్రభువు హనోకుకు సహకారమిచ్చి, తన కార్యమును చేయుటకు అతనికి అధికారమిచ్చిన విధానాల కొరకు చూడండి (మోషే 7:13 కూడా చూడండి). అనర్హులమని భావించిన మోషే (నిర్గమకాండము 4:10–16 చూడండి), యిర్మీయా (యిర్మీయా 1:4–10 చూడండి), నీఫై (2 నీఫై 33:1–4 చూడండి) మరియు మొరోనై (ఈథర్ 12:23–29 చూడండి) వంటి ఇతర ప్రవక్తలతో హనోకు అనుభవాన్ని మీరు పోల్చవచ్చు. మీరు చేయాలని ఆయన ఇచ్చిన కార్యము గురించి ఈ లేఖనాల నుండి మీరు ఏమి నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నారని మీరు భావిస్తున్నారు?
A Seer Hath the Lord Raised Up (Moses 6:36) [ఒక దీర్ఘదర్శిని ప్రభువు పుట్టించెను (మోషే 6:36)], ఈవా టిమోతి చేత
చాలామంది ఆధునిక-దిన అపొస్తలులు మరియు ప్రవక్తలు తమ పిలుపులను స్వీకరించడం ఎలా అనిపించిందో వివరించినప్పుడు హనోకు వంటి భావాలను వ్యక్తం చేశారు. ఉదాహరణకు, “ప్రవక్తలు పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మాట్లాడతారు” (లియహోనా, మే 2018, 98–99) లో ఎల్డర్ యులిసెస్ సోవారెస్ యొక్క సాక్ష్యాన్ని చూడండి.
మీ అసమర్థ భావాల గురించి ఈ ప్రవక్తలు మరియు అపొస్తలుల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు? కష్టమైన పనులు చేయమని మిమ్మల్ని కోరినప్పుడు రక్షకుడు మీకు సహాయం చేస్తున్నారని మీరెప్పుడు భావించారు? మీ భవిష్యత్తులో మీరు రక్షకుని సహాయంపై ఆధారపడవలసివచ్చే కొన్ని అనుభవాలను వ్రాయండి. యేసు క్రీస్తుపై విశ్వాసంతో మీరు ఈ సంఘటనలను ఎలా ఎదుర్కోవచ్చు?
డేవిడ్ ఎ. బెడ్నార్, “నీవు నాయందును నేను నీయందును నిలిచియుందుము; కాబట్టి నాతో నడువుము,” లియహోనా, మే 2023, 123–25 కూడా చూడండి.
యేసు క్రీస్తు యొక్క సువార్త మొదటి నుండి బోధించబడింది.
మోషే గ్రంథాన్ని మనం కలిగియున్నందు వలన, ఆదాము హవ్వల కాలం నుండి విమోచనను ఎలా కనుగొనాలో దేవుడు తన పిల్లలకు బోధిస్తున్నారని మనకు తెలుసు. మీరు మోషే 6:48–68 చదువుతున్నప్పుడు, విమోచింపబడడానికి మనం తప్పక తెలుసుకోవలసిన మరియు చేయవలసిన వాటి కోసం వెదకండి. 53వ వచనములో ఆదాము ప్రశ్నను గమనించండి. దాని గురించి మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? 53-65 వచనములలో ప్రభువు సమాధానం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ఈ వచనాలను ఆదాము బాప్తిస్మపు సేవలో ప్రభువు యొక్క సందేశంగా మీరు భావించవచ్చు. ఆయన సందేశము నుండి బాప్తిస్మము గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? ఆయన బాప్తిస్మమును “తిరిగి జన్మించడం”తో ఎందుకు పోల్చారని మీరనుకుంటున్నారు?(59వ వచనము). మీ జీవితాలంతటా “తిరిగి జన్మించడాన్ని” కొనసాగించడానికి మీరేమి చేయగలరు?
చిహ్నాల కోసం చూడండి. లేఖనములలో, వస్తువులు లేదా సంఘటనలు తరచు ఆత్మీయ సత్యాలను, ప్రత్యేకించి రక్షకుని గురించిన సత్యాలను సూచిస్తాయి లేదా వాటికి చిహ్నంగా ఉంటాయి (రక్షకుని విధానములో బోధించుట, 7 చూడండి). ఈ చిహ్నాలు ఆయన మరియు ఆయన సిద్ధాంతం గురించి మీ అవగాహనను మెరుగుపరచగలవు. ఉదాహరణకు, మోషే 6:27లో హృదయములు మరియు చెవులు, మోషే 6:35లో కళ్ళు మరియు మంటి లేదా మోషే 6:59–60లో నీరు వంటి చిహ్నాల నుండి మీరేమి నేర్చుకుంటారు?
“ఈ సంగతులను నిస్సంకోచంగా నీ పిల్లలకు బోధించుము.”
మోషే 6:51–63లో ఆదాముకు యేసు క్రీస్తు సువార్త యొక్క సత్యాలను బోధించిన తర్వాత, వాటిని భవిష్యత్తు తరాలకు బోధించమని ప్రభువు ఆదాముతో చెప్పారు. ఈ సత్యాల జాబితాను రూపొందించడాన్ని పరిగణించండి. (ఇది గద్యభాగాన్ని 51–52, 53–57, 58–60, 61–63 వచనములు వంటి చిన్న చిన్న వచన సమూహాలుగా విభజించడానికి సహాయపడవచ్చు). ఈ సత్యాలు నేటి యువతరానికి ఎందుకు విలువైనవి? మోషైయ 4:14–15 మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–28; 93:40–50లో తల్లిదండ్రులకు ప్రభువు యొక్క ఉపదేశాల నుండి మీరు ఇంకేమి నేర్చుకుంటారు?
ఆదాము హవ్వల కుటుంబము భద్రపరచిన “జ్ఞాపకార్థ గ్రంథము” గురించి చదువుట మీ స్వంత జ్ఞాపకార్థ గ్రంథమును తయారు చేయడానికి మీ కుటుంబాన్ని ప్రేరేపించవచ్చు. మీరు ఏమి చేర్చాలని ప్రభువు మిమ్మల్ని కోరుతున్నారని మీరు భావిస్తున్నారు? FamilySearch.org లో మీ జ్ఞాపకార్థ గ్రంథము నుండి సమాచారాన్ని భద్రపరచడాన్ని పరిగణించండి.
డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “యేసు క్రీస్తే తల్లిదండ్రుల బలము,” లియహోనా, మే 2023, 55–59 కూడా చూడండి.
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
కష్టమైన పనులు చేయడానికి దేవుడు నాకు సహాయపడగలరు.
-
సువార్త ప్రకటించడానికి హనోకు పిలువబడినప్పుడు, అతను విఫలమవుతానేమోనని ఆందోళన చెందాడు. కానీ దేవుడు అతనికి సహాయపడ్డారు. మోషే 6:26–34లోని ఈ కథనాన్ని కలిసి చదవండి (పాత నిబంధన కథలు, 19–21లో “హనోకు ప్రవక్త” కూడా చూడండి). తాను సువార్త ప్రకటించలేనని హనోకు ఎందుకు భావించాడు? (మోషే 6:31 చూడండి). ప్రభువు హనోకుకు ఎలా సహాయపడ్డారు? (మోషే 6:32–34; 7:13 చూడండి).
-
కష్టమైన పనులు చేయడానికి దేవుడు జనులకు సహాయం చేసిన ఇతర ఉదాహరణలను పంచుకోవడాన్ని లేదా నటించడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు—ఉదాహరణకు, నోవహు, దావీదు, అమ్మోన్ లేదా లేమనీయుడైన సమూయేలు (Gospel Art Book [సువార్త కళా పుస్తకము], సంఖ్యలు. 7, 19, 78, 81 చూడండి). మీరు కూడా మీ స్వంత అనుభవాన్ని పంచుకోవచ్చు మరియు కష్టమైన పనులు చేయడానికి దేవుడు వారికి ఎలా సహాయం చేస్తారు అనే దాని గురించి మీ పిల్లలను మాట్లాడనివ్వండి.
క్రీస్తుపై విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మను పొందడం దేవుని వైపుకు తిరిగి రావడానికి నన్ను సిద్ధం చేస్తాయి.
-
మనం ఆయన వద్దకు తిరిగి రావడానికి ఏమి చేయాలో దేవుడు ఆదాముకు బోధించారు—యేసు క్రీస్తుపై విశ్వాసం కలిగియుండి, పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మ వరాన్ని పొందాలి. మోషే 6:52, 57లో ఈ సూత్రాలను కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయండి. అప్పుడు మీరు ఒక సూత్రం గురించి చిన్న ప్రసంగాన్ని వ్రాయడంలో వారికి సహాయం చేయవచ్చు. ప్రతి ప్రసంగంలో మోషే 6 నుండి ఒక లేఖనం, ఒక అనుభవం మరియు ఒక సాక్ష్యం ఉండవచ్చు. వారు తమ ప్రసంగాలను ఒకరితో ఒకరు పంచుకోనివ్వండి.
-
సువార్త యొక్క మొదటి సూత్రాలను సూచించే చిత్రాలను కూడా మీరు ప్రదర్శించవచ్చు (నాల్గవ విశ్వాస ప్రమాణం చూడండి). యేసు క్రీస్తు చిత్రానికి దారితీసే వరుసలో వాటిని ఉంచండి. మీరు మోషే 6:52 చదువుతున్నప్పుడు, మీ పిల్లలు చిత్రం సూచించే పదాలను విన్నప్పుడు సరైన చిత్రం పక్కన నిలబడగలరు.
-
మోషే 6:52లో ఈ సూత్రాలను కనుగొనడానికి వారికి సహాయపడండి.
తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించాలని పరలోక తండ్రి కోరుకుంటున్నారు.
-
సువార్త బోధకులుగా వారి పాత్రలో వారి తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వమని మీ పిల్లలను ప్రోత్సహించడానికి, మోషే 6:58 చదవమని మరియు దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞను గుర్తించమని పిల్లలను అడగడాన్ని పరిగణించండి. ఆ తర్వాత మీరు ఆదాము హవ్వలు తమ పిల్లలకు బోధిస్తున్న చిత్రాన్ని చూపవచ్చు (ఈ నమూనా చివరలో ఉన్నటువంటిది) మరియు చిత్రంలో వారు చూసే దాని గురించి మీ పిల్లలు మాట్లాడనివ్వండి. మీ పిల్లలు తమ కుటుంబాలు కలిసి లేఖనాలను చదువుతున్నట్లు, కలిసి ప్రార్థిస్తున్నట్లు లేదా కలిసి ఆడుకుంటున్నట్లు చిత్రాలను గీయవచ్చు.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.