2024 రండి, నన్ను అనుసరించండి
ఫిబ్రవరి 9–15. “నోవహు యెహోవా దృష్టియందు కృప పొందెను”: ఆదికాండము 6–11; మోషే 8


“ఫిబ్రవరి 9–15. ‘నోవహు యెహోవా దృష్టియందు కృప పొందెను’: ఆదికాండము 6–11; మోషే 8,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“ఫిబ్రవరి 9–15. ‘నోవహు యెహోవా దృష్టియందు కృప పొందెను’,” రండి, నన్ను అనుసరించండి: 2026

నోవహు మరియు అతని కుటుంబంతో పాటు ఓడను విడిచిపెట్టిన జంతువులు ఒక బండపై నిలబడి ఉన్నాయి

Jehovah Keeps a Promise [యెహోవా వాగ్దానమును నిలబెట్టుకొనును], శామ్ లాలర్ చేత

ఫిబ్రవరి 9–15: “నోవహు యెహోవా దృష్టియందు కృప పొందెను”

ఆదికాండము 6–11; మోషే 8

కడవరి దినాలలో జీవిస్తున్న మనం, జలప్రళయం కథపై శ్రద్ధ పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఆయన రెండవ రాకడ కొరకు మనమెలా కనిపెట్టుకొని ఉండాలని యేసు క్రీస్తు బోధించినప్పుడు, ఆయన ఇలా అన్నారు, “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును ఆలాగే ఉండును” (జోసెఫ్ స్మిత్—మత్తయి 1:41). అదనముగా, నోవహు కాలమును వివరించే “చెడిపోయియుండెను” మరియు “బలాత్కారముతో నిండియుండెను” వంటి వాక్యభాగాలు సులువుగా మనకాలాన్ని వర్ణిస్తున్నాయి (ఆదికాండము 6:12–13; మోషే 8:28). గందరగోళము మరియు విభజనల చేత కలిగిన గర్వమును వర్ణిస్తున్న బాబెలు గోపురము యొక్క వృత్తాంతము కూడా మన కాలానికి అన్వయించదగినది.

చరిత్ర అంతటా దుష్టత్వము దానికదే పునరావృతమవుతుందని చూపుట వలన మాత్రమే ఈ ప్రాచీన వృత్తాంతాలు విలువైనవి కాదు. అంతకంటే ముఖ్యంగా, దానిని ఎలా ఎదుర్కోవాలో అవి మనకు బోధిస్తాయి. నోవహు “యెహోవా దృష్టియందు కృప పొందెను” (మోషే 8:27). జెరెడ్ మరియు అతని సహోదరుని కుటుంబాలు ప్రభువు తట్టు తిరిగి, బాబెలులోని గందరగోళము మరియు విభజనల నుండి దూరంగా నడిపించివేయబడ్డాయి (ఈథర్ 1:33–43 చూడండి). చెడిపోయి, బలాత్కారముతో నిండియున్న కాలంలో మనల్ని, మన కుటుంబాలను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలని మనము ఆశ్చర్యపడినట్లయితే, ఈ అధ్యాయాలలో ఉన్న కథలు మనకు బోధించడానికి ఎంతో కలిగియున్నాయి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆదికాండము 6; మోషే 8

సెమినరీ చిహ్నము
ప్రభువు యొక్క ప్రవక్తను అనుసరించడంలో ఆధ్యాత్మిక భద్రత ఉంది.

నోవహు కాలపు వర్ణనలో మన కాలంలోని పరిస్థితులకు సారూప్యంగా అనిపించేదేదైనా మీకు కనిపిస్తోందా? ప్రత్యేకించి, మోషే 8:15–24, 28లో చూడండి. ఏ ఇతివృత్తాలు పునరావృతం కావడాన్ని మీరు చూస్తున్నారు?

మీరు చూసే ఒక ముఖ్యమైన సారూప్యత ఏమిటంటే, దేవుడు నోవహును ప్రవక్తగా పిలిచారు మరియు ఈరోజు కూడా ఆయన ప్రవక్తను పిలిచారు. మోషే 8:13–30 నుండి ప్రవక్తల గురించి మీరు నేర్చుకునే సత్యాల జాబితాను రూపొందించడాన్ని పరిగణించండి. మన సజీవ ప్రవక్త నోవహు వలె ఎలా ఉన్నారు? అయితే, నేడు ప్రభువు యొక్క ప్రవక్త జలప్రళయం గురించి హెచ్చరించడం లేదు లేదా ఓడను నిర్మించడంలో సహాయం చేయమని మనల్ని ఆహ్వానించడం లేదు. కానీ ఆయన మనల్ని దేని గురించి హెచ్చరిస్తున్నారు? మరియు ఆయన మనల్ని ఏమి చేయమని ఆహ్వానిస్తున్నారు?

“పరలోకములో ఉన్న పరిపూర్ణమైన ప్రేమగల తండ్రి ఒక ప్రవక్త ద్వారా తన పిల్లలకు సత్యాన్ని వెల్లడించే నమూనాను ఎంచుకున్నారు” (“కడవరి దినముల కొరకు జీవించియున్న ఒక ప్రవక్త,” లియహోనా, మే 2023, 25) అని ఎల్డర్ అలెన్ డి. హేనీ బోధించారు. పరలోక తండ్రి యొక్క ప్రేమకు చిహ్నంగా ఒక ప్రవక్తను కలిగియుండడానికి గల కారణాల కొరకు చూస్తూ, ఎల్డర్ హేనీ యొక్క సందేశాన్ని అధ్యయనం చేయడాన్ని పరిగణించండి. ప్రభువు యొక్క ప్రవక్తను అనుసరించడం కడవరి దినాల్లో సురక్షితంగా జీవించడానికి మీకు ఎలా సహాయపడింది?

1:37

Why Do We Have Prophets?

ఆదికాండము 6:5–13

జలప్రళయం దేవుని దయతో కూడిన చర్య.

“మనిషిని నాశనము చేయుటకు” (ఆదికాండము 6:7) జలప్రళయాన్ని పంపడంలో దేవుని న్యాయము గురించి కొందరు ఆశ్చర్యపోతారు. జలప్రళయపు సమయంలో, “అవినీతి కర్తృత్వాన్ని నాశనం చేసే స్థాయికి చేరుకుంది, న్యాయపరంగా ఆత్మలను ఇక్కడికి పంపలేము” (We Will Prove Them Herewith [1982], 58) అని ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ వివరించారు. జలప్రళయం ఎలా దయతో కూడిన చర్య అని కూడా మీరు ఆలోచించవచ్చు. జనులపట్ల ప్రభువు యొక్క మృదుకనికరమును మరియు ప్రేమను చూపేలా ఆదికాండము 6:5-13లో మీరు ఏమి కనుగొంటారు?

ఆదికాండము 9:8–17

ఆనవాళ్ళు లేదా చిహ్నములు ప్రభువుతో నా నిబంధనలను జ్ఞాపకముంచుకోవడానికి నాకు సహాయపడతాయి.

ఆదికాండము 9:8–17 ప్రకారము, ఇంద్రధనుస్సు మీకు దేనిని గుర్తుచేస్తుంది? జోసెఫ్ స్మిత్ అనువాదం, ఆదికాండము 9:21–25 (బైబిలు అనుబంధములో) మీ గ్రహింపుకు ఏమి జతచేస్తుంది? మీ నిబంధనలను మీకు గుర్తు చేయడానికి దేవుడు మీకు ఇచ్చిన ఇతర విషయాల (చిహ్నాలు, వస్తువులు వంటివి లేదా మరేదైనా) జాబితాను తయారు చేయడాన్ని కూడా మీరు పరిగణించవచ్చు. ఈ విషయాలు మీకు ఏమి బోధిస్తాయి? గుర్తుంచుకోవడానికి అవి మీకు ఎలా సహాయపడతాయి?

ఒక తాడు మరియు మెట్ల సాయంతో పురుషులు పైకి ఎక్కుతున్న గోపురము

The Tower of Babel [బాబెలు గోపురము], డేవిడ్ గ్రీన్ చేత

ఆదికాండము 11:1–9

యేసు క్రీస్తును అనుసరించడం మాత్రమే పరలోక తండ్రి వద్దకు ఏకైక మార్గం.

బాబెలు‌లోని జనులు ఒక గోపురాన్ని నిర్మించారనే వృత్తాంతం, మీరు గత వారం అధ్యయనం చేసిన హనోకు మరియు అతని జనులు సీయోనును నిర్మిస్తున్న వృత్తాంతానికి ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని అందిస్తుంది. రెండు సమూహాల జనులు పరలోకాన్ని చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ వేర్వేరు మార్గాల్లో. సీయోను ప్రజలు పరలోకాన్ని ఎలా పొందారు? (మోషే 7:18–19, 53, 62–63, 69 చూడండి). బాబెలు జనుల గురించి మీరు ఆదికాండము 11:1–9 మరియు హీలమన్ 6:26–28 నుండి ఏమి నేర్చుకుంటారు? దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి మన స్వంత ప్రయత్నాల గురించి ఇది మనకు ఏమి బోధిస్తుంది? “పరలోకానికి చేరుకోవడానికి” మనకు సహాయం చేయడానికి దేవుడు ఏమి అందించారు? (ఆదికాండము 11:4; యోహాను 3:16 కూడా చూడండి).

చురుకుగా నేర్చుకోండి. నేర్చుకోవడంలో కేవలం చదవడం లేదా వినడం కంటే ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు, బాబెలు గోపురము గురించి నేర్చుకుంటున్నప్పుడు, మీరు మరియు మీ కుటుంబం లేదా తరగతి కాగితపు ముక్కలపై మనల్ని దేవుని నుండి దూరం చేసే విషయాలను వ్రాయవచ్చు. తర్వాత, ఇతర కాగితాలపై, మనల్ని దేవునికి దగ్గర చేసే విషయాలను మీరు వ్రాయవచ్చు. మొదటి కాగితాల సమూహాన్ని గోపురం ఆకారంలో మరియు రెండవ సమూహాన్ని దేవాలయం ఆకారంలో అమర్చండి.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆదికాండము 6:14–22; 7–8; మోషే 8:16-24

ప్రభువు యొక్క ప్రవక్తను అనుసరించడం నన్ను మరియు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది.

  • చాలామంది పిల్లలు నోవహు మరియు ఓడ కథను ఇష్టపడతారు. దాని గురించి తెలిసిన వాటిని పంచుకోవడానికి మీ పిల్లలకు అవకాశాలను ఇవ్వడాన్ని పరిగణించండి. వారికి సహాయం చేయడానికి, మీరు ఈ నమూనాలో ఉన్న పాత నిబంధన కథలు (22–25)లోని “నోవహు మరియు అతని కుటుంబము” అనే చిత్రాలను ఉపయోగించవచ్చు. మీ పిల్లలు కథలోని భాగాలను అభినయించడాన్ని ఆనందించవచ్చు—ఉదాహరణకు, ఓడను నిర్మించడానికి ఒక సాధనాన్ని ఉపయోగిస్తున్నట్లు నటించడం లేదా ఓడలోకి జంతువులు ప్రవేశించినట్లు నడవడం వంటివి.

  • మీరు కలిసి నోవహు గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ రోజు మనం దేవుని ప్రవక్తను కలిగి ఉన్నందుకు ఎంత ఆశీర్వదించబడ్డామో మీ పిల్లలకు తెలియజేయండి. నోవహు బోధించిన మరియు ప్రభువు యొక్క ప్రవక్తలు నేటికీ బోధించే విషయాలను కనుగొనడానికి మోషే 8:16–24లో వెదకడానికి మీ పిల్లలకు సహాయం చేయండి. మనం ఈ బోధనలను పాటించినప్పుడు మనం ఎలా ఆశీర్వదించబడ్డాము?

ఆదికాండము 9:15–16

దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు.

  • ఇంద్రధనుస్సు ఏమి సూచిస్తున్నదని మీరు మాట్లాడుతుండగా, మీ పిల్లలు దానిని చిత్రించడాన్ని లేదా రంగులు వేయడాన్ని ఆనందించవచ్చు (జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 9:21–25 [బైబిలు అనుబంధములో] చూడండి). నోవహు మరియు అతని కుటుంబం ఇంద్రధనుస్సును చూసినప్పుడల్లా ఏమి ఆలోచించాలని దేవుడు కోరుకున్నారు?

  • వివాహ ఉంగరం, చిత్రం లేదా దినచర్య పుస్తకం వంటి మీ జీవితంలో ముఖ్యమైన వాటిని గుర్తుచేసేలా మీ వద్ద ఉన్న వాటిని కూడా మీరు మీ పిల్లలకు చూపించవచ్చు. మీ పిల్లలు వారి స్వంత ఉదాహరణలను పంచుకోనివ్వండి. ఇది యేసు క్రీస్తును అనుసరించాలనే మన బాప్తిస్మపు నిబంధనను గుర్తుంచుకోవడంలో సహాయపడే సంస్కారము వంటి మన నిబంధనలను గుర్తుంచుకోవడంలో మనకు సహాయపడే విషయాల గురించి సంభాషణకు దారితీయవచ్చు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:75–79 చూడండి).

రెండింతల ఇంద్రధనస్సు

ఇంద్రధనుస్సు “నాకును మీకును మధ్య నేను ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు” (ఆదికాండము 9:12) అని దేవుడు నోవహు కుటుంబానికి చెప్పారు.

ఆదికాండము 11:1–9

యేసు క్రీస్తును అనుసరించడమే పరలోకానికి ఏకైక మార్గం.

  • మీ పిల్లలతో బ్లాకు‌లు లేదా ఇతర వస్తువులతో గోపురాన్ని నిర్మించడం సరదాగా ఉంటుంది. మీరు అలా చేస్తున్నప్పుడు, బాబెలు జనులు ఒక ఎత్తైన గోపురాన్ని నిర్మించడం ద్వారా పరలోకానికి వెళ్ళవచ్చని భావించారని వివరించండి. ఆ తర్వాత మీరు రక్షకుని చిత్రాన్ని కలిసి చూసి, పరలోకానికి వెళ్ళేందుకు ఆయన మనకు ఎలా సహాయం చేస్తారో మీ పిల్లలను అడగవచ్చు. అప్పుడు మీరు రక్షకుడిని అనుసరించడానికి మీరు చేయగలిగిన విషయాల గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు.

  • ఆదికాండము 11:1–9లోని బాబెలు గోపురము కథను చదవడంతో పాటు, మీరు మరియు మీ పిల్లలు హీలమన్ 6:28 చదవగలరు. ఈ వచనం ప్రకారం, బాబెలు జనులు గోపురాన్ని ఎందుకు నిర్మించారు? పరలోకానికి చేరుకోవడానికి ఈ గోపురాన్ని నిర్మించడం ఎందుకు తప్పు? అప్పుడు మీరు పరలోకానికి చేరుకోవడానికి సరైన మార్గాన్ని కనుగొనడానికి 2 నీఫై 31:20–21 మరియు హీలమన్ 3:28 శోధించవచ్చు. బాబెలు జనులకు మనం ఏ సలహా ఇస్తాము?

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

నోవహు ఓడ

Noah’s Ark [నోవహు ఓడ], ఆడమ్ క్లింట్ డే చేత.adamdayart.com

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: ప్రవక్తను అనుసరించడం నన్ను మరియు నా కుటుంబాన్ని దీవిస్తుంది