“మార్చి 30–ఏప్రిల్ 5. ‘మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును’: ఈస్టర్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“మార్చి 30–ఏప్రిల్ 5. ‘మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
ఖాళీ సమాధి యొక్క వివరణ
మార్చి 30–ఏప్రిల్ 5: “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును”
ఈస్టర్
యేసు క్రీస్తు యొక్క జీవితం “సమస్త మానవ చరిత్రకు ప్రధానమైనది” (“జీవముతో ఉన్న క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము,” సువార్త గ్రంథాలయము). దాని అర్థమేమిటి? కొంతవరకు, నిశ్చయముగా దాని అర్థము, ఎప్పటికీ జీవించిన లేదా జీవించబోయే ప్రతీ మానవుని యొక్క నిత్య భవితవ్యాన్ని రక్షకుని జీవితం ప్రభావితం చేస్తుంది. ఆ మొదటి ఈస్టర్ ఆదివారంనాడు యేసు క్రీస్తు పునరుత్థానం, చరిత్రలో ఉన్న దేవుని జనులందరినీ కలుపుతుందని కూడా మీరు అనవచ్చు: ఆయన పునరుత్థానానికి ముందు పుట్టిన వారు విశ్వాసముతో దాని కొరకు ఆతృతగా ఎదురు చూసారు (జేకబ్ 4:4 చూడండి), మరియు తరువాత పుట్టిన వారు విశ్వాసముతో దానిని జ్ఞాపకముంచుకున్నారు. పాత నిబంధన వృత్తాంతములు మరియు ప్రవచనాలను మనము చదువుతున్నప్పుడు, మనము యేసు క్రీస్తు యొక్క పేరును ఎప్పుడూ చూడము, కానీ మెస్సీయా మరియు విమోచకుని యందు ప్రాచీన విశ్వాసుల యొక్క విశ్వాసము మరియు ఆపేక్షలకు సాక్ష్యాన్ని మనము చూస్తాము. కనుక ఆయనను జ్ఞాపకముంచుకొనుటకు ఆహ్వానించబడినవారమైన మనము ఆయన కొరకు ఎదురు చూచిన వారితో సంబంధమును అనుభవించగలము. నిజముగా యేసు క్రీస్తు “మన అందరి దోషమును” (యెషయా 53:6 భరించారు; వివరణ చేర్చబడినది), మరియు “క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు” (1 కొరింథీయులకు 15:22; వివరణ చేర్చబడినది).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తలు రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగానికి సాక్ష్యమిస్తున్నారు.
పాత నిబంధనలో అనేక గద్యభాగాలు రక్షకుని పరిచర్య మరియు ప్రాయశ్చిత్త త్యాగము గురించి సూచిస్తాయి. దిగువ పట్టిక ఈ గద్యభాగాలలో కొన్నింటిని జాబితా చేస్తుంది. మీరు ఈ వచనాలను చదివినప్పుడు, రక్షకుని గురించి మీకు కలిగే మనోభావాలు ఏవి?
|
పాత నిబంధన |
క్రొత్త నిబంధన |
|---|---|
పాత నిబంధన జెకర్యా 9:9 | క్రొత్త నిబంధన మత్తయి 21:1–11 |
పాత నిబంధన జెకర్యా 11:12–13 | క్రొత్త నిబంధన మత్తయి 26:14–16; 27:3–8 |
పాత నిబంధన యెషయా 53:4 | క్రొత్త నిబంధన మత్తయి 8:16–17; 26:36–39 |
పాత నిబంధన యెషయా 53:7 | క్రొత్త నిబంధన మార్కు 14:60-61 |
పాత నిబంధన కీర్తనలు 22:16 | క్రొత్త నిబంధన యోహాను 19:17–18; 20:25–27 |
పాత నిబంధన కీర్తనలు 22:18 | క్రొత్త నిబంధన మత్తయి 27:35 |
పాత నిబంధన కీర్తనలు 69:21 | క్రొత్త నిబంధన మత్తయి 27:34, 48 |
పాత నిబంధన కీర్తనలు 118:22 | క్రొత్త నిబంధన మత్తయి 21:42 |
పాత నిబంధన యెషయా 53:9, 12 | క్రొత్త నిబంధన మత్తయి 27:57–60; మార్కు 15:27–28 |
పాత నిబంధన యెషయా 25:8 | క్రొత్త నిబంధన మార్కు 16:1–6; లూకా 24:6 |
పాత నిబంధన దానియేలు 12:2 | క్రొత్త నిబంధన మత్తయి 27:52–53 |
రక్షకుని గూర్చిన ప్రవచనాలు మరియు బోధనలు మోర్మన్ గ్రంథములో ఇంకా ఎక్కువ పుష్కలంగా, స్పష్టంగా ఉన్నాయి. ఇటువంటి గద్యభాగముల చేత మీ విశ్వాసము ఎలా బలపరచబడిందో ఆలోచించండి: 1 నీఫై 11:31–33; 2 నీఫై 25:13; మోషైయ 3:2–11; ఆల్మా 7:10–13.
యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త కార్యము గురించి కడవరి-దిన ప్రవక్తలు నిరంతరము ప్రత్యేక సాక్ష్యమిస్తున్నారు. ఈ ఈస్టర్ వారాంతములో మీరు సర్వసభ్య సమావేశాన్ని వింటున్నప్పుడు, క్రీస్తు గురించి మీరు వినే సాక్ష్యాలను నమోదు చేయండి. ఆయన గురించి అవి మీకేమి బోధిస్తాయి?
యేసు క్రీస్తు నాకు శాంతిని, ఆనందాన్ని ఇస్తారు.
ఈస్టర్ ఆనందకరమైన సమయం, ఎందుకంటే ఇది రక్షకుని ప్రాయశ్చిత్తాన్ని మరియు పునరుత్థానాన్ని జరుపుకునే సమయం. అయితే, ఈస్టర్ సమయంలో కూడా, వివిధ కారణాల వల్ల ఆనందంగా భావించని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ ఈస్టర్ సందర్భంగా రక్షకుని శాంతి మరియు ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి మీరు ఏమి చేయగలరు?
ఒక ఆలోచన ఏమిటంటే, యేసు క్రీస్తు అందించే శాంతి మరియు ఆనందం గురించి లేఖనాలలో ఇటువంటి సందేశాలను కనుగొనడం: కీర్తనలు 16:8–11; 30:2–5; యెషయా 12; 25:8–9; 40:28–31; యోహాను 14:27; 16:33; ఆల్మా 26:11–22. మీరు ఈ సందేశాలను ఇతరులతో ఎలా పంచుకోవచ్చో పరిగణించండి. ఉదాహరణకు, మీరు పంచుకోవడానికి ఈ సందేశాల ఆధారంగా ఈస్టర్ కార్డులను తయారు చేయవచ్చు. మీ ఈస్టర్ శుభాకాంక్షలను ఎవరు స్వీకరించాలనే దాని గురించి ప్రార్థించండి. మీరు మీ సందేశాలను చాలా మంది వ్యక్తులు చూడగలిగే సామాజిక మాధ్యమంలో కూడా పంచుకోవాలని నిర్ణయించుకోవచ్చు.
జెఫ్రీ ఆర్. హాలండ్, “లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు,” లియహోనా, మే 2021, 35–38; మార్క్ ఎస్. పామర్, “మన దుఃఖము సంతోషమగును,” లియహోనా, మే 2021, 88–90 కూడా చూడండి.
Why Weepest Thou [నీవెందుకు ఏడ్చుచున్నావు], సైమన్ డ్యూయీ చేత (వివరణ)
ఆయన ప్రాయశ్చిత్తము కారణంగా, పాపము, మరణము, శ్రమలు మరియు బలహీనతలను అధిగమించడానికి నాకు సహాయపడే శక్తి యేసు క్రీస్తుకు ఉన్నది.
యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా వచ్చే అనేక ఆశీర్వాదాలను చూడడంలో మీకు సహాయపడగల ప్రోత్సాహ కార్యక్రమమొకటి ఇక్కడ ఉంది. దేనిని అధిగమించడానికి యేసు క్రీస్తు మనకు సహాయం చేస్తారనే దాని గురించి క్రింది లేఖనాలను చదవండి. గద్యభాగాలను ఈ వర్గాలలోకి క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించండి: పాపం, మరణం, పరీక్షలు మరియు బలహీనతలు (కొన్ని భాగాలు ఒకటి కంటే ఎక్కువ వర్గాలకు సరిపోతాయి). మీరు చదువుతున్నప్పుడు, రక్షకుని శక్తి గురించి మీరు ఎలాంటి మనోభావాలు కలిగియున్నారు?
-
యెషయా 61:1–3
-
యెహెజ్కేలు 36:26–28
-
మత్తయి 11:28–30
-
లూకా 1:46–55
-
రోమా 8:35–39
యేసు క్రీస్తు మీకు ఎందుకు ముఖ్యమని క్రైస్తవుడు కాని ఒక స్నేహితుడికి మీరు ఎలా వివరిస్తారు? ఎల్డర్ అహ్మద్ ఎస్. కార్బిట్ గారి సందేశము, “ఒక క్రైస్తవుడిగా నేను క్రీస్తుని ఎందుకు నమ్ముతానో మీకు తెలుసా?” (లియహోనా, మే 2023, 119–21) సహాయపడగలదు.
రీనా ఐ. అబర్టొ, “సమాధికి విజయము లేదు,” లియహోనా, మే 2021, 85–87 కూడా చూడండి.
యేసు క్రీస్తు నా రక్షణ కొరకు అంతిమ మూల్యం చెల్లించారు.
మీ రక్షణ కొరకు యేసు క్రీస్తు చెల్లించిన వెల గురించి ఈ క్రింది వచనాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు: యెషయా 53:3–5; మోషైయ 3:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 19:16–19? పరలోక తండ్రి ఎంత వెల చెల్లించారు? (యోహాను 3:16 చూడండి).
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
యేసు క్రీస్తు నా కొరకు బాధలనుభవించి మరణించారు.
-
గెత్సేమనేలో మరియు సిలువపై రక్షకుడు మన కోసం ఏమి చేసారనే దాని గురించి మీ పిల్లలకు బోధించడానికి ఈస్టర్ వారం మంచి సమయం. దిగువ చిత్రాలను వారికి చూపడం ద్వారా మరియు చిత్రాలలో జరుగుతున్న దాని గురించి మాట్లాడనివ్వడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు. మీ పిల్లలు చిత్రాలను చూస్తున్నప్పుడు, మీరు ఈ సంఘటనలను వివరించే వచనాలను చదవవచ్చు (మత్తయి 26:36–46; 27:35–50; లూకా 22:39–46; యోహాను 19:16–30 చూడండి). మీ పిల్లలు వచనాలలో విన్న చిత్రాలలోని వివరాలను చూపగలరు.
ఎడమ: Christ in Gethsemane [గెత్సేమనేలో క్రీస్తు], హ్యారీ ఆండెర్సన్ చేత. కుడి: The Crucifixion [సిలువ శ్రమ], హ్యారీ ఆండెర్సన్ చేత
-
మన కొరకు యేసు యొక్క త్యాగము కారణంగా మనము ఏవిధంగా దీవించబడతాము? ఈ ప్రశ్నకు జవాబిచ్చే పదాలు మరియు వాక్యభాగాల కొరకు యెషయా 53:4–12; ఆల్మా 7:11–13; మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 19:16–19లో చూడడానికి మీ పిల్లలకు సహాయపడండి. ఈ లేఖనాలను చదివిన తర్వాత రక్షకుని గురించి మీరు ఎలా భావిస్తున్నారో ఒకరితో ఒకరు పంచుకోండి.
యేసు క్రీస్తు నా కొరకు పునరుత్థానం చెందారు.
-
మీ పిల్లలకు పునరుత్థానం గురించిన కథను చెప్పడానికి మీరు ఈ వారం ప్రోత్సాహకార్యక్రమ పేజీని లేదా ఈ నమూనాలో ఉన్న ఇతర చిత్రాలను ఉపయోగించవచ్చు (కొత్త నిబంధన కథలు, 139–44లో “యేసు పునరుత్థానం చెందారు” కూడా చూడండి). తర్వాత మీ పిల్లలు మీకు కథను తిరిగి చెప్పనివ్వండి.
-
ఈ ఈస్టర్ నాడు మీ పిల్లలు క్రీస్తులో ఆనందాన్ని పొందేందుకు మీరు ఎలా సహాయం చేస్తారో పరిగణించండి. పునరుత్థానము గురించి కీర్తనలు కనుగొనడానికి, Hymns మరియు Children’s Songbook యొక్క విషయసూచికలో చూడండి. మీరు ఈ పాటలను ఎందుకు ఇష్టపడుతున్నారో మరియు వాటిని పాడినప్పుడు మీరు ఎలా భావిస్తారో మీరు మరియు మీ పిల్లలు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుల గురించి ఈ పాటలు మనకేమి బోధిస్తాయి?
పిల్లలు ఆత్మను అనుభవించగలరు, కానీ ఆయన ప్రభావాన్ని గుర్తించడంలో వారికి సహాయం కావాలి “ఆత్మ మనతో సంభాషించే వివిధ మార్గాల గురించి పిల్లలకు బోధించండి. ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించడంలో వారికి సహాయపడండి. ఇది వారి జీవితాంతం వ్యక్తిగత బయల్పాటును వెదకడంలో మరియు దానిపై పనిచేసే అలవాటును అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడుతుంది” (రక్షకుని విధానములో బోధించుట, 32). ఉదాహరణకు, మీరు మీ పిల్లలతో కలిసి రక్షకుని గురించి పాటలు పాడేటప్పుడు, ఆయన చిత్రాలను చూస్తున్నప్పుడు లేదా ఆయన గురించిన కథనాలను చదువుతున్నప్పుడు, మీకు కలిగిన ఆధ్యాత్మిక భావాలను ఒకరితో ఒకరు పంచుకోండి.
ప్రవక్తలు యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం గురించి సాక్ష్యమిస్తారు.
-
ఈ ఈస్టర్ వారాంతంలో మీరు, మీ పిల్లలు కలిసి సర్వసభ్య సమావేశాన్ని చూస్తున్నప్పుడు, రక్షకుని యొక్క ప్రత్యేక సాక్షులు పునరుత్థానానికి సాక్ష్యమివ్వడాన్ని గమనించడంలో వారికి సహాయపడండి. బహుశా మీరు దానితో ఒక ఆట తయారు చేయవచ్చు—ఈస్టర్, ప్రాయశ్చిత్తం లేదా పునరుత్థానం వంటి పదాలు విన్న ప్రతిసారీ నిలబడమని వారిని ఆహ్వానించండి. రక్షకుని గురించి జీవించి ఉన్న ప్రవక్తల సాక్ష్యాలపట్ల మీరు ఎందుకు కృతజ్ఞతతో ఉన్నారో పరస్పరం పంచుకోండి.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.