“ఏప్రిల్ 6–12. ‘మీరు ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి’: నిర్గమకాండము 7–13,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“ఏప్రిల్ 6–12. ‘మీరు ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
ఫరో సభలో మోషే మరియు అహరోను యొక్క వివరణ, రాబర్ట్ టి. బారెట్ చేత
ఏప్రిల్ 6–12: “మీరు ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి”
నిర్గమకాండము 7–13
తెగులు తరువాత తెగులు ఐగుప్తును బాధించింది, కానీ ఫరో ఇశ్రాయేలీయుల విడుదలకు ఇంకా తిరస్కరించాడు. అయినప్పటికీ దేవుడు తన శక్తిని రుజువు చేయడం కొనసాగించి, “నేను యెహోవానని” మరియు “సమస్త భూమిలో నావంటివారెవరును లేరని” (నిర్గమకాండము 7:5; 9:14) అంగీకరించుటకు ఫరోకు అవకాశాలు ఇవ్వడం కొనసాగించారు. మరోవైపు, మోషే మరియు ఇశ్రాయేలీయులు వారి తరఫున దేవుని శక్తి యొక్క ఈ ప్రత్యక్షతలను విస్మయముతో చూసియుండవచ్చు. ఈ ఎడతెగని సూచనలు నిశ్చయముగా దేవునియందు వారి విశ్వాసమును నిర్ధారించాయి మరియు దేవుని యొక్క ప్రవక్తను అనుసరించుటకు వారి సమ్మతిని బలపరిచాయి. తరువాత, తొమ్మిది భయంకరమైన తెగుళ్ళు ఇశ్రాయేలీయులను విడిపించుటకు విఫలమయ్యాక, అది పదవ తెగులు—ఫరో యొక్క జ్యేష్ఠ పుత్రునితో కలిపి, జ్యేష్ఠ పుత్రుని మరణము—చివరకు చెరను ముగించింది. ఇది సరిపోయినట్లుగా కనబడుతున్నది, ఎందుకనగా ప్రతీ ఆధ్యాత్మిక చెర యొక్క సందర్భములో తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గమున్నది. మనల్ని రక్షించేది జ్యేష్ఠ పుత్రుడైన యేసు క్రీస్తు యొక్క త్యాగము—మచ్చలేని గొఱ్ఱెపిల్ల రక్తము—మాత్రమే.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
నిర్గమకాండము 7–11
నా హృదయమును మృదువుగా చేయుటకు నేను ఎంచుకోగలను.
మీ చిత్తము ఫరో వలే దేవుని చిత్తానికి ఎప్పటికీ చాలా వ్యతిరేకం కాదని ఆశిద్దాము. ఇంకను, మన హృదయాలు అవి ఉండాల్సినంత మృదువుగా లేని సమయాలు మనకుంటాయి. నిర్గమకాండము 7:14–25; 8:5–32; 9:1–26; 10:12–29; 12:29–33 లోని తెగుళ్ళకు ఫరో యొక్క స్పందనలను గూర్చి మీకు ఆశ్చర్యము కలిగించేది ఏది? నిర్గమకాండము 7:3, 13; 9:12 యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదములో స్పష్టతను గమనించండి.
“కఠినము” అనేది ఫరో హృదయం గురించి ఎందుకు మంచి వర్ణన అయ్యున్నది? మృదువైన హృదయం కలిగియుండడం గురించి ఈ వచనాల నుండి మీరు నేర్చుకున్న దానిని పరిగణించండి: 1 నీఫై 2:16; మోషైయ 3:19; ఆల్మా 24:7–8; 62:41; ఈథర్ 12:27. మీరు ఫరో యొక్క కఠిన హృదయపు పర్యవసానాల గురించి చదువుతున్నప్పుడు, మీ హృదయపు స్థితి గురించి ఆలోచించండి. ఏ మార్పులు చేయడానికి మీరు ప్రేరణ పొందారు?
నిర్గమకాండము 12:1–42
ఆయన ప్రాయశ్చిత్తము కారణంగా యేసు క్రీస్తు నన్ను రక్షించగలరు.
నిర్గమకాండము 11:4–5లో వివరించబడిన పదవ తెగులు నుండి ఇశ్రాయేలీయులు తప్పించుకోవడానికి గల ఏకైక మార్గము, నిర్గమకాండము 12లో పస్కా అని పిలువబడే ఆచారక్రియలో ప్రభువు మోషేకు ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించడం. ప్రభువు ఐగుప్తులో దాస్యము నుండి ఇశ్రాయేలీయులను విడిపించినట్లుగా, ఆయన మనల్ని కూడా పాపము యొక్క దాస్యము నుండి విడిపించగలరని చిహ్నముల ద్వారా పస్కా మనకు బోధిస్తుంది. నిర్గమకాండము 12:1–42లో ఈ ప్రతీకాత్మకతను అన్వేషించడానికి, మీరు ఇటువంటి పటమును ఉపయోగించవచ్చు:
|
చిహ్నము |
సాధ్యమైన అర్థాలు |
నాకు దేవుని సందేశము |
|---|---|---|
చిహ్నము నెలలలో ఈ నెల మీకు మొదటిది (2వ వచనము; వారి సంవత్సరానికి మొదటి నెలను నమోదు చేయడానికి ఈ సంఘటనను ఉపయోగించమని ప్రభువు ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించారు). | సాధ్యమైన అర్థాలు ఇశ్రాయేలీయుల కొరకు ఇది నూతనారంభము కావలెను. వారు “తిరిగి జన్మించవలెను.” | |
చిహ్నము గొర్రెపిల్ల (3–5 వచనములు). | సాధ్యమైన అర్థాలు యోహాను 1:29; 6:54; 1 పేతురు 1:19 చూడండి. | |
చిహ్నము యిండ్ల ద్వారబంధములపై గొర్రెపిల్ల రక్తము (7, 13, 23 వచనములు). | సాధ్యమైన అర్థాలు మోషైయ 4:2; ప్రకటన 12:11 చూడండి. | |
చిహ్నము పొంగని రొట్టె (8, 15, 19–20 వచనములు). | సాధ్యమైన అర్థాలు పులియబెట్టినది లేదా యీస్టు అవినీతికి చిహ్నంగా ఉంటుంది, ఎందుకంటే అది సులభంగా చెడిపోతుంది. మత్తయి 16:6–12; యోహాను 6:35 చూడండి. | |
చిహ్నము చేదు కూరలు (8వ వచనము). | సాధ్యమైన అర్థాలు పాపం మరియు చెరల చేదు యొక్క జ్ఞాపకార్థము. నిర్గమకాండము 1:14; మోషే 6:55 చూడండి. | |
చిహ్నము నడుము కట్టుకొని, త్వరపడుచు తినుట (11వ వచనము). | సాధ్యమైన అర్థాలు పాపము యొక్క చెరను విడిచిపెట్టుటకు అత్యవసర చిహ్నము. ఆదికాండము 39:12; 2 తిమోతి 2:22 చూడండి. | |
చిహ్నము సంహారకుడు (13, 23 వచనములు). | సాధ్యమైన అర్థాలు | |
చిహ్నము ఇశ్రాయేలీయులు స్వేచ్ఛను పొందారు (29–32 వచనములు). | సాధ్యమైన అర్థాలు 2 నీఫై 2:26; సిద్ధాంతము మరియు నిబంధనలు 138:15–19, 31 చూడండి. | |
యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమును గూర్చి మీకు గుర్తు చేసేలా పస్కా యొక్క సూచనలు మరియు చిహ్నములలో మీరు ఇంకేమి కనుగొంటారు? ఆయన ప్రాయశ్చిత్తము యొక్క దీవెనలను ఎలా పొందాలనే దాని గురించి ఈ చిహ్నములు మీకేమి సూచిస్తాయి?
క్రీస్తుకు సాక్ష్యమిచ్చే చిహ్నాలను గుర్తించడం ద్వారా ఆయన వద్దకు రండి. “సమస్త విషయాలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుటకు సృజించబడి, చేయబడినవి” అని ప్రభువు ప్రకటించారు (మోషే 6:63; 2 నీఫై 11:4 కూడా చూడండి). నిర్గమకాండము 12లో, గొర్రెపిల్ల, రక్తం, పులియని రొట్టె, అద్భుతాలు మరియు విమోచన వంటి చిహ్నాలు అన్నీ క్రీస్తును సూచిస్తాయి. “ఈ వస్తువులు రక్షకునితో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు, అవి ఆయన శక్తి మరియు లక్షణాల గురించి మనకు బోధించగలవు” (రక్షకుని విధానములో బోధించుట, 7).
In Remembrance of Me [నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు], వాల్టర్ రానె చేత
నిర్గమకాండము 12:14–17, 24–27; 13:1–16
యేసు క్రీస్తు ద్వారా నా విమోచనను జ్ఞాపకము చేసుకొనుటకు సంస్కారము నాకు సహాయపడుతుంది.
వారి చెర పాత జ్ఞాపకమైనప్పటికీ, ఆయన వారిని విడిపించారని జ్ఞాపకముంచుకోవడానికి వారికి సహాయపడేందుకు ప్రతీ సంవత్సరం పస్కాను జరుపుకోవాలని రక్షకుడు ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించారు. నిర్గమకాండము 12:14–17, 24–27; 13:1–16లో ఆయన ఉపదేశాలను మీరు చదివినప్పుడు, మీకు దేవుడిచ్చిన దీవెనలను జ్ఞాపకముంచుకోవడానికి మీరు ఏమి చేస్తున్నారో ఆలోచించండి. ఆ జ్ఞాపకమును “మీ తరతరములకు” మీరెలా భద్రపరచుకోగలరు? (నిర్గమకాండము 12:14, 26–27 చూడండి).
పస్కా విందు మరియు సంస్కారముల మధ్య మీరు చూసే పోలికలు ఏవి? యేసు క్రీస్తును “ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవడానికి” మీరేమి చేయగలరు? (మొరోనై 4:3; 5:2).
మీరు జ్ఞాపకముంచుకోవాలని ప్రభువు కోరిన ఇతర విషయాలను కూడా మీరు ధ్యానించవచ్చు, ఉదాహరణకు, హీలమన్ 5:6–12; మొరోనై 10:3; సిద్ధాంతము మరియు నిబంధనలు 3:3–5, 10; 18:10; 52:40 చూడండి.
కెవిన్ డబ్ల్యు. పియర్సన్, “మీరు ఇంకా సమ్మతిస్తున్నారా?,” లియహోనా, నవ. 2022, 67–69 కూడా చూడండి.
Always Remember Him
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
నిర్గమకాండము 7–11
ప్రభువుకు అన్నిటిపై అధికారము కలదు.
-
నిర్గమకాండము 7–11లో వివరించబడిన తెగుళ్ళు ప్రభువుకు గొప్ప శక్తి ఉందని ఐగుప్తీయులకు మరియు ఇశ్రాయేలీయులకు చూపించాయి. ఆయన శక్తిపై వారు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రభువు మీ పిల్లలకు వారి జీవితమంతా సహాయం చేస్తారు. ఈ కథ నుండి నేర్చుకోవడంలో వారికి సహాయపడడానికి, మీరు ప్రతి బిడ్డకు 10 విభాగాలుగా విభజించబడిన ఒక కాగితాన్ని ఇవ్వవచ్చు మరియు ఈ వచనాలలో వివరించబడిన తెగుళ్ళ చిత్రాలను గీయడానికి వారిని ఆహ్వానించవచ్చు: నిర్గమకాండము 7:17–18; 8:1–4; 8:16–17; 8:20–22; 9:1–6; 9:8–9; 9:22–23; 10:4–5; 10:21–22; 11:4–7 (పాత నిబంధన కథలు, 67–69లో “ఐగుప్తులో తెగుళ్ళు” కూడా చూడండి). ప్రభువు తెగుళ్ళను ఎందుకు పంపారో వివరించడానికి నిర్గమకాండము 7:5 మరియు 9:14 కలిసి చదవండి.
2:3The Plagues of Egypt
-
“భూమియందంతట [ఆయన] అంతటివాడు లేడని” ప్రభువు మీకు ఎలా చూపించారో మీ పిల్లలతో పంచుకోండి (నిర్గమకాండము 9:14). ప్రభువు శక్తిమంతుడని వారు ఎలా తెలుసుకుంటారో వారిని పంచుకోనివ్వండి.
నిర్గమకాండము 8:28-32; 9:7
మృదువైన హృదయాన్ని కలిగియుండడానికి ప్రభువు నాకు సహాయం చేయగలరు.
-
మృదువైన హృదయాన్ని కలిగియుండడం అంటే ఏమిటో మీ పిల్లలు ఊహించడంలో సహాయపడడానికి, వారికి ఒక రాయి వంటి గట్టి వస్తువును మరియు స్పాంజి వంటి మృదువైన మరియు శోషించే మరొక వస్తువును చూపించడం సరదాగా ఉంటుంది. మృదువైన హృదయం ప్రభువు వాక్యాన్ని ఎంత సులభంగా స్వీకరిస్తుందో చూపించడానికి మీరు ఈ వస్తువులపై నీటిని కూడా పోయవచ్చు. తర్వాత, ప్రభువు పంపిన తెగుళ్ళకు ఫరో ఎలా స్పందించాడో వివరించే కొన్ని వచనాలను మీరు కలిసి చదవవచ్చు (నిర్గమకాండము 8:28–32; 9:7 చూడండి). ఏ వస్తువులు ఫరో హృదయాన్ని లేదా వైఖరిని ఉత్తమంగా సూచిస్తాయి? మృదువైన హృదయాన్ని కలిగియుండడం అంటే అర్థమేమిటి? (మోషైయ 3:19 చూడండి).
-
మనము కఠినమైన హృదయాన్ని కలిగియున్నట్లు చూపగల కొన్ని చర్యల జాబితాను మీరు మరియు మీ పిల్లలు తయారు చేయవచ్చు (ఉదాహరణకు, దయలేని మాటలను ఉపయోగించడం లేదా పంచుకోవడానికి ఇష్టపడకపోవడం వంటివి). మనం మృదువైన హృదయాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రభువుకు మనమెలా చూపించగలము?
నిర్గమకాండము 12:1–13
యేసును జ్ఞాపకము చేసుకోవడానికి సంస్కారము నాకు సహాయపడగలదు.
-
రక్షకుడు మరియు మన కొరకు ఆయన చేసిన త్యాగం కోసం ఎదురుచూడాలని పస్కా ఇశ్రాయేలీయులకు నేర్పింది. మీరు నిర్గమకాండము 12:1–13 ను కలిసి అన్వేషిస్తున్నప్పుడు, పస్కా మరియు యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తానికి సంబంధించిన వివరాల మధ్య సంబంధాలను చూడడానికి మీ పిల్లలకు సహాయం చేయండి (పాత నిబంధన కథలు, 70–74లో “పస్కా పండుగ” కూడా చూడండి). ఉదాహరణకు, యేసు 5వ వచనములో వర్ణించబడిన గొర్రెపిల్లలా ఎలా ఉన్నారు?
2:54The Passover
-
నేడు, యేసు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం సంస్కారమును తీసుకుంటాము. మీరు మీ పిల్లలకు సంస్కారము యొక్క చిత్రాన్ని చూపవచ్చు మరియు యేసు క్రీస్తును గుర్తుంచుకోవడానికి ఈ విధి ఎలా సహాయపడుతుందనే దాని గురించి మాట్లాడవచ్చు. సంస్కార ప్రార్థనలలో “జ్ఞాపకముంచుకొను” అనే పదాన్ని కనుగొనడంలో మీరు మీ పిల్లలకు సహాయపడవచ్చు (మొరోనై 4–5 చూడండి). లేదా సంస్కారము గురించి ఇష్టమైన కీర్తనను కలిసి పాడండి మరియు రక్షకుని గురించి ఆలోచించినప్పుడు వారు కలిగియున్న ప్రశాంతమైన అనుభూతిని గమనించడంలో మీ పిల్లలకు సహాయపడండి. మనం సంస్కారమును తీసుకున్నప్పుడు ఆ అనుభూతిని మనమెలా కోరుకోగలము?
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.