2024 రండి, నన్ను అనుసరించండి
ఏప్రిల్ 20–26. “యెహోవా చెప్పినదంతయు మేము చేసెదము”: నిర్గమకాండము 19–20; 24; 31–34


“ఏప్రిల్ 20–26. ‘యెహోవా చెప్పినదంతయు మేము చేసెదము’: నిర్గమకాండము 19–20; 24; 31–34,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“ఏప్రిల్ 20–26. ‘యెహోవా చెప్పినదంతయు మేము చేసెదము,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

పది ఆజ్ఞల పలకలను మోసుకొస్తున్న మోషే

Moses and the Tablets [మోషే మరియు పలకలు], జెర్రీ హార్స్టన్ చేత (వివరణ)

ఏప్రిల్ 20-26: “యెహోవా చెప్పినదంతయు మేము చేసెదము”

నిర్గమకాండము 19–2024; 31–34

వారు గతంలో సణిగి, సందేహించినప్పటికీ, సీనాయి పర్వతం అడుగున మోషే ధర్మశాస్త్రమును చదివినప్పుడు, వారు ఈ నిబంధన చేసారు: “యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుము” (నిర్గమకాండము 24:7). తరువాత దేవుడు మోషేను కొండపైకి పిలిచి, “నేను వారిలో నివసించునట్లు” (నిర్గమకాండము 25:8) ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించుము అని అతడితో చెప్పారు.

కానీ మోషే పర్వతంపై ఉండి, ఇశ్రాయేలీయులు వారి మధ్య దేవుని యొక్క సన్నిధిని ఎలా కలిగి ఉండగలరో నేర్చుకొనుచుండగా, దానికి బదులుగా పర్వతం క్రింద ఇశ్రాయేలీయులు వారు పూజించుటకు ఒక బంగారు విగ్రహాన్ని చేస్తున్నారు. “వేరొక దేవుడు ఉండకూడదు” అని అప్పుడే వారు వాగ్దానము చేసారు, అయినప్పటికీ వారు దేవుని ఆజ్ఞలనుండి “త్వరగా తొలగిపోయిరి” (నిర్గమకాండము 20:3; 32:8; నిర్గమకాండము 24:3 కూడా చూడండి). అది విస్మయం కలిగించే మలుపు, కానీ కొన్నిసార్లు విశ్వాసము మరియు నిబద్ధత అనేవి అసహనము, భయము లేదా అనుమానంతో జయించబడవచ్చని అనుభవము నుండి మనకు తెలుసు. మన జీవితాలలో ప్రభువు యొక్క సన్నిధిని మనము వెదకినప్పుడు, ప్రభువు ప్రాచీన ఇశ్రాయేలును వదిలివేయలేదని, ఆయన మనల్ని మరియు మనం ప్రేమించేవారిని విడువరని తెలుసుకోవడం ప్రోత్సాహము కలిగిస్తుంది—ఏలయనగా ఆయన “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగలవాడు” (నిర్గమకాండము 34:6).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

నిర్గమకాండము 19:3–6

ప్రభువు యొక్క నిబంధన జనులు ఆయనకు ఒక నిధి వంటివారు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “పాత నిబంధనలో, సెగుల్లా అనే హెబ్రీయ పదమునుండి విశేషమైన అనేది అనువదించబడినది, దాని అర్థము ‘విలువైన ఆస్తి’ లేదా ‘నిధి.’ … ప్రభువు యొక్క సేవకుల చేత ఆయన విశేషమైన జనులుగా మనం గుర్తించబడడం అత్యున్నత శ్రేణి యొక్క అభినందన” (“Children of the Covenant,” Ensign, May 1995, 34). అధ్యక్షులు నెల్సన్ గారి మాటలు మీరు నిర్గమకాండము 19:3–6ను అర్థం చేసుకొనే విధానమును ఎలా ప్రభావితం చేస్తాయి? ఆయన మిమ్మల్ని నిధిగా యెంచుతారని ప్రభువు మీకెలా చూపారు?

నిర్గమకాండము 19:10–11, 17

పవిత్రమైన అనుభవాలకు సిద్ధపాటు అవసరము.

వారు “దేవునిని ఎదుర్కొనుటకు”(నిర్గమకాండము 19:10–11, 17) ముందు ఇశ్రాయేలీయులు సిద్ధపడవలసిన అవసరమున్నదని మరియు ఆయనతో ఒక నిబంధనను పాటించాల్సియున్నదని (నిర్గమకాండము 19:5 చూడండి) ప్రభువు మోషేతో చెప్పారు. సంస్కారము మరియు దేవాలయ విధులతో పాటుగా, ఆధ్యాత్మిక అనుభవాల కొరకు మీరెలా సిద్ధపడతారు? ఇతరులు సిద్ధపడేందుకు మీరు ఎలా సహాయపడగలరు? లూకా 6:12–13; ఈనస్ 1:2–6; ఆల్మా 17:2–3 నుండి సిద్ధపాటు గురించి మీరేమి నేర్చుకుంటారు?

సీనాయి పర్వతము, ఐగుప్తు

ఐగుప్తులోని ఈ పర్వతమును సాంప్రదాయకంగా సీనాయి పర్వతం అని నమ్ముతారు.

నిర్గమకాండము 20:1–17

సెమినరీ చిహ్నము
దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడం ఆశీర్వాదాలను తెస్తుంది.

ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం క్రింది భాగంలో గుమిగూడి ఉండగా, దేవుని స్వరం పది ఆజ్ఞలు ఇవ్వడాన్ని వారు విన్నారు (ద్వితీయోపదేశకాండము 4:12–13 చూడండి). వాస్తవానికి, ఇవి మాత్రమే దేవుని ఆజ్ఞలు కాదు—లేఖనాల్లో అనేక ఇతర ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి మీరు నిర్గమకాండము 20:1–17 చదువుతున్నప్పుడు, దేవుడు ఈ పదిని ప్రత్యేకంగా ఎందుకు నొక్కిచెప్పారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ జీవితంలో పది ఆజ్ఞల ప్రాముఖ్యత గురించి మీరు ఆలోచించేటప్పుడు మీరు ఉపయోగించగల నమూనా పట్టిక ఇక్కడ ఉంది:

ఆజ్ఞ

మరో మాటలో చెప్పాలంటే, … అని ప్రభువు నన్ను అడుగుతున్నారు.

ఈ ఆజ్ఞను పాటించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు

  • ఈ పది ఆజ్ఞలను పాటించడం మత్తయి 22:34–40లో యేసు ఇచ్చిన రెండు గొప్ప ఆజ్ఞలను పాటించడంలో మీకు ఎలా సహాయపడుతుంది?

  • మీరు దేవుని కంటే ముందుగా ఉంచడానికి శోధించబడే విషయాలు ఏమిటి? దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా మీరు ఏ ఆశీర్వాదాలను చూశారు?

  • పది ఆజ్ఞలు చాలా కాలం క్రితం ఇవ్వబడ్డాయి మరియు ఈ రోజు వర్తించవని చెప్పే వ్యక్తిపట్ల మీరు ఎలా స్పందిస్తారు? మీ ప్రతిస్పందనలో భాగంగా మీ జీవితంలోని ఏ ఉదాహరణలను మీరు పంచుకుంటారు?

  • నిర్గమకాండము 20:6లో ఉన్న వాగ్దానాన్ని మీ జీవితంలో ప్రభువు ఎలా నెరవేర్చారు?

నిర్గమకాండము 24:1–11

నిబంధనలు చేయడం దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపుటకు నా సమ్మతిని చూపుతుంది.

మీరు నిర్గమకాండము 24:3–8 చదువుతున్నప్పుడు, దేవునితో మీరు చేసిన నిబంధనలను పరిగణించండి. ఇశ్రాయేలు యొక్క నిబంధన నేడు దేవునికి అవసరమైన దానినుండి భిన్నమైన ఆచారాలను కలిగియున్నప్పటికీ, కొన్ని పోలికలను మీరు గమనించవచ్చు. ఉదాహరణకు, 4, 5 మరియు 8వ వచనములు ఒక బలిపీఠము, జంతు బలులు మరియు రక్తమును ప్రస్తావిస్తాయి. ఈ విషయాలు వేటిని సూచిస్తాయి మరియు అవి మీ నిబంధనలతో ఎలా సంబంధం కలిగియున్నాయి?

నిర్గమకాండము 32–34

పాపము అనగా దేవుని నుండి దూరంగా తొలగిపోవడం; పశ్చాత్తాపం అనగా ఆయన వైపు తిరగడం మరియు చెడు నుండి దూరంగా ఉండడం.

ఇశ్రాయేలీయుల స్థానములో మీరున్నట్లు ఊహించడానికి ప్రయత్నించండి—మీరు అరణ్యములో ఉన్నారు, మోషే వెళ్లి 40 రోజులు అయ్యింది మరియు భవిష్యత్తులో వాగ్దాన దేశముపై కనానీయులతో ఒక యుద్ధమున్నది (నిర్గమకాండము 32:1–8 చూడండి). ఇశ్రాయేలీయులు ఒక బంగారు విగ్రహమును ఎందుకు కోరుకున్నారని మీరనుకుంటున్నారు? నిర్గమకాండము 33:11–17లో ప్రభువుకు మోషే యొక్క మనవి గురించి మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి?

ఇశ్రాయేలీయుల పాపము తీవ్రమైయున్నప్పటికీ, దేవుని యొక్క కనికరము మరియు క్షమాపణ సందేశాన్ని కూడా ఈ కథ కలిగియున్నది. రక్షకుని గురించి నిర్గమకాండము 34:1–10 మీకేమి బోధిస్తుంది? (నిర్గమకాండము 32:30–32; మోషైయ 14:4–8; 15:9; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:3–5 చూడండి).

నిర్గమకాండము 31:13–16

విశ్రాంతిదినము ఒక సంకేతము.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా వివరించారు: “నా చిన్న వయస్సులో, విశ్రాంతిదినమున చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాలను సంకలనం చేసిన ఇతరుల పనిని నేను అధ్యయనం చేసాను. చాలాకాలం తర్వాత, నా ప్రవర్తన మరియు విశ్రాంతిదినమును గూర్చి నా వైఖరి నాకు మరియు నా పరలోక తండ్రికి మధ్య ఒక సంకేతమును కలిగియుందని నేను లేఖనముల నుండి తెలుసుకున్నాను [నిర్గమకాండము 31:13; యెహెజ్కేలు 20:12, 20 చూడండి]. ఆ అవగాహనతో, చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాలు ఇకపై నాకు అవసరం లేదు. ఒక కార్యక్రమం విశ్రాంతిదినమునకు తగినదా కాదా అనే నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, ‘నేను దేవునికి ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నాను’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్న విశ్రాంతిదినము గురించి నా ఎంపికలను సుస్పష్టం చేసింది” (“The Sabbath Is a Delight,” Liahona, May 2015, 130). విశ్రాంతిదినము‌ను పాటించడం ద్వారా మీరు దేవునికి ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నారో ధ్యానించండి.

నిర్గమకాండము 34:1–4

మోషే చేసిన రెండు జతల రాతి పలకల మధ్య తేడా ఏమిటి?

పర్వతంపై నుండి మోషే క్రిందకు వచ్చినప్పుడు, అతడు రాతి పలకలపై వ్రాయబడిన ధర్మశాస్త్రమును తెచ్చాడు. ఇశ్రాయేలీయులు వారి నిబంధనను ఉల్లంఘించారని తెలుసుకున్న తరువాత, మోషే పలకలను విరగగొట్టాడు (నిర్గమకాండము 31:18; 32:19 చూడండి). తరువాత, దేవుడు మోషేను మరొక జత రాతి పలకలను చేసి, పర్వతం పైకి తిరిగి తీసుకొనిరమ్మని ఆజ్ఞాపించారు (నిర్గమకాండము 34:1–4 చూడండి). మొదటి రాతి పలకల జత దేవుని “పరిశుద్ధ క్రమము” లేదా మెల్కీసెదెకు యాజకత్వము యొక్క విధులను కలిగియున్నదని నిర్గమకాండము 34:1–2 యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదము (బైబిలు అనుబంధములో) స్పష్టం చేస్తుంది. రెండవ జత “శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును” కలిగియున్నది. ఇది “లఘు యాజకత్వము” చేత నిర్వహించబడే చిన్న ధర్మశాస్త్రము (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:17–27 చూడండి), ఇది ఇశ్రాయేలీయులను ఉన్నతమైన ధర్మశాస్త్రము మరియు ఉన్నతమైన యాజకత్వము కొరకు సిద్ధపరచుటకు ఉద్దేశించబడింది, ఆవిధంగా వారు దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలరు.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

నిర్గమకాండము 20:3–17

దేవుడు నాకు ఆజ్ఞలను ఇస్తారు, ఎందుకంటే నేను సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.

  • పది ఆజ్ఞల గురించి నేర్చుకోవడాన్ని మీ పిల్లల కొరకు ఆహ్లాదకరంగా మీరెలా చేయగలరు? మీరు నిర్గమకాండము 20:3–17 కలిసి చదువుతున్నప్పుడు, పది ఆజ్ఞల్లో ప్రతిదానిని సూచించే చిత్రాన్ని కనుగొనడానికి లేదా గీయడానికి మీ పిల్లలు మీకు సహాయం చేయనివ్వండి. అప్పుడు మీ పిల్లలు ఒక చిత్రాన్ని ఎంచుకుని, ఆ ఆజ్ఞను ఎలా జీవించవచ్చనే దాని గురించి మాట్లాడవచ్చు. ఆ ఆజ్ఞను జీవించడం మీకు సంతోషాన్ని ఎలా తెస్తుంది అని ఒకరితో ఒకరు పంచుకోండి.

పిల్లలు ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకున్నప్పుడు, వారి సాక్ష్యం పెరుగుతుంది. మీరు అడిగే ప్రశ్నలు మీ పిల్లలు రక్షకుని గురించి ఎలా భావిస్తున్నారో మరియు సువార్తను జీవించడం వారిని ఎలా ఆశీర్వదించిందో పంచుకునేలా ప్రోత్సహిస్తుంది (రక్షకుని విధానములో బోధించుట32 చూడండి). వారు దీనిని చేసినప్పుడు, వారు సాక్ష్యమిస్తున్నారు. పది ఆజ్ఞలను పాటించడం వల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి చర్చించేటప్పుడు మీరు దీన్ని ఎలా చేయవచ్చో పరిగణించండి.

నిర్గమకాండము 20:12

నా తల్లిదండ్రులను నేను గౌరవించాలని ప్రభువు కోరుకుంటున్నారు.

  • “నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” (నిర్గమకాండము 20:12) అనే వాక్యభాగాన్ని నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడండి. ఎవరినైనా “గౌరవించడం” అంటే వారిపట్ల గౌరవం చూపించడం లేదా వారికి సంతోషాన్ని కలిగించడం అని మీరు వివరించాలనుకోవచ్చు. తన మర్త్య తల్లిని మరియు తన పరలోక తండ్రిని గౌరవించడానికి యేసు ఏమి చేసారు? (లూకా 2:48–51; యోహాను 19:26–27 చూడండి). బహుశా మీ పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించడం కోసం వారు చేయగలిగిన పనులను వంతులు తీసుకొని నటించి చూపవచ్చు, మిగతా పిల్లలు వారు ఏమి చేస్తున్నారో ఊహించవచ్చు.

నిర్గమకాండము 31:13, 16–17

విశ్రాంతిదినమును ఘనపరచుట ప్రభువుపై నాకున్న ప్రేమకు సంకేతము.

  • మీ పిల్లలు రహదారి గురుతులు లేదా భవనంపై ఉన్న గురుతులు వంటి సంకేతాల ఉదాహరణలను చూసి ఆనందించవచ్చు. సంకేతాల ఉద్దేశ్యం ఏమిటి? తర్వాత, నిర్గమకాండము 31:13, 16–17లో “గురుతు” అనే పదాన్ని మీ పిల్లలు కనుగొనవచ్చు. మనకు మరియు ఆయనకు మధ్య ఏది సంకేతమని ప్రభువు చెప్పారు? విశ్రాంతిదినమున ప్రభువు పట్ల మీ ప్రేమను చూపించడానికి మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ప్రయత్నించే కొన్ని మార్గాలను ఒకరితో ఒకరు పంచుకోండి.

పది ఆజ్ఞలను పట్టుకున్న మోషే

పది ఆజ్ఞలను పట్టుకున్న మోషే యొక్క వివరణ, శామ్ లాలర్ చేత (వివరణ)

నిర్గమకాండము 32:1–8, 19–24; 34:6–7

నేను దేవుని మార్గాలనుండి “తొలగిపోను”.

  • నిర్గమకాండము 32:1–8, 19–24లోని కథను నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు (పాత నిబంధన కథలు, 77–82లో) “సీనాయి పర్వతముపైన మోషే”ను ఉపయోగించడాన్ని పరిగణించండి. ఇశ్రాయేలీయులు దేవునికి బదులుగా విగ్రహాన్ని పూజించడం ఎందుకు తప్పు?

    2:55

    Moses on Mount Sinai

  • నిర్గమకాండము 32:8 నుండి ఈ పదాలను వివరించడానికి నేలపై ఒక మార్గాన్ని సృష్టించడం (లేదా మీ ఇంటి దగ్గర ఒకదాన్ని కనుగొనడం) సరదాగా ఉండవచ్చు: “వారికి నియమించిన త్రోవనుండి వారు త్వరగా తొలగిపోయారు.” మార్గంలో నడుస్తున్నప్పుడు, దేవుని నుండి దూరంగా తొలగిపోవడానికి మనము ఎదుర్కొనే శోధనల గురించి మీ పిల్లలు మాట్లాడవచ్చు. దేవుని మార్గంలో నిలిచియుండడానికి మరియు మనం దారితప్పినట్లయితే దాని వైపుకు తిరిగి రావడానికి మనకు ఏది సహాయపడుతుంది? (నిర్గమకాండము 34:6–7 చూడండి).

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

పది ఆజ్ఞలను పడవేస్తున్న మోషే

Worship of the Calf [దూడను పూజించుట], డబ్ల్యు. సి. సిమండ్స్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: దేవుడు నాకు ఆజ్ఞలను ఇస్తారు, ఎందుకంటే నేను సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు