2024 రండి, నన్ను అనుసరించండి
ఏప్రిల్ 13–19. “యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి”: నిర్గమకాండము 14-18


“ఏప్రిల్ 13–19. ‘యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి: నిర్గమకాండము 14–18,’” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“ఏప్రిల్ 13–19. ‘యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

ఎఱ్ఱ సముద్రం

ఏప్రిల్ 13–19: “యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి”

నిర్గమకాండము 14–18

ఇశ్రాయేలీయులు చిక్కుకున్నారు. ఒక వైపు ఎఱ్ఱ సముద్రం ఉంది, మరోవైపు ఫరో సైన్యం ముందుకు వస్తోంది. ఐగుప్తు నుంచి వారు తప్పించుకోవడం స్వల్పకాలికంగా ఉండబోవునట్లుగా అనిపించింది. అయితే తరతరాలకు వారు గుర్తుంచుకోవాలని ఆయన కోరిన విధంగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక సందేశాన్ని ఇచ్చారు: “భయపడకుడి. … ప్రభువు మీ పక్షమున యుద్ధము చేయును” (నిర్గమకాండము 14:13–14).

ఆ సమయం నుండి, దేవుని జనులకు విశ్వాసం మరియు ధైర్యం అవసరమైనప్పుడు, వారు ఈ వృత్తాంతాన్ని చెప్పారు. నీఫై తన సోదరులకు స్ఫూర్తి కలిగించాలని కోరినప్పుడు, అతడు ఇలా చెప్పాడు, “కావున మనము వెళ్ళి మోషే వలే బలముగా నుండెదము; అతడు ఎఱ్ఱసముద్రపు నీళ్ళతో మాట్లాడగా అవి ఇటు అటు విడిపోయి, మన పితరులు దాని గుండా చెర నుండి బయటకు ఆరిన నేలమీద వచ్చిరి” (1 నీఫై 4:2). చెరలో ఉన్న తన జనులు ‘‘[వారి] తలలు పైకెత్తి ఆనందించవలెను’’ అని లింహై రాజు కోరుకున్నప్పుడు, అతడు ఇదే కథను వారికి గుర్తు చేసాడు (మోషైయ 7:19). దేవుని శక్తి గురించి ఆల్మా తన కుమారుడికి సాక్ష్యమివ్వాలని కోరుకున్నప్పుడు ఆయన కూడా ఇదే చేసాడు (ఆల్మా 36:28 చూడండి). మనం చిక్కుకున్నట్లు భావించినప్పుడు—“యెహోవా కలుగజేయు రక్షణను చూచుటకు” మనకు ఇంకొంచెం విశ్వాసం అవసరమైనప్పుడు—ఎలా “ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించెనో” మనం జ్ఞాపకము చేసుకోవచ్చు (నిర్గమకాండము 14:13, 30).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

నిర్గమకాండము 14; నిర్గమకాండము 15:1–21

ప్రభువు నా జీవితంలో “గొప్ప కార్యము” చేయగలరు.

మీరు నిర్గమకాండము 14:1–10 చదువుతున్నప్పుడు, ఫరో సైన్యం వారికి దగ్గరగా రావడాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఎలా భావించియుండవచ్చో ఊహించండి. మీరు ఎదుర్కొంటున్న కష్టమైన సవాలును జయించడానికి ఒక అద్భుతం అవసరం అని బహుశా మీరు భావించవచ్చు. మీ జీవితంలో దేవుని శక్తిని వెదకుటకు మిమ్మల్ని ప్రేరేపించేలా నిర్గమకాండము 14:13–31లో మీరు ఏమి కనుగొంటారు? గతంలో ఆయన శక్తిని మీరు ఎలా చూసియున్నారో ధ్యానించండి. ఈ అనుభవాల నుండి ఆయన గురించి మీరు ఏమి నేర్చుకున్నారు?

నిర్గమకాండము 15:1–19 అనేది ప్రభువు ఎర్ర సముద్రాన్ని విభజించిన తర్వాత ఇశ్రాయేలీయులు పాడిన స్తుతి గీతం. ఈ పాటలో ఏ వాక్యభాగాలు మీకు ప్రత్యేకంగా అర్థవంతంగా అనిపిస్తాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2–3 కూడా చూడండి.

నిర్గమకాండము 15:22–27; 16:1–15; 17:1–7

ప్రభువు చేదుగా ఉండే విషయాలను తియ్యగా మార్చగలరు.

ఇశ్రాయేలీయుల ప్రయాణం గురించి చదవడం, మీ జీవితంలో మారా జలాల వలే ‘చేదు’ గా కనిపించిన విషయాల గురించి ఆలోచించడానికి దారితీయవచ్చు (నిర్గమకాండము 15:23–27 చూడండి). మీ జీవితంలో చేదుగా ఉండే విషయాలను ప్రభువు తియ్యగా ఎలా మార్చారు? మీ జీవితంలో ఈ అనుభవాలకు ఎటువంటి విలువ ఉంది?

నిర్గమకాండము 16 మరియు 17లో ఇశ్రాయేలీయుల చేదు అనుభవాలకు సంబంధించిన మరిన్ని ఉదాహరణలను మీరు గమనిస్తారు. వారి సణుగుడు లేదా ఫిర్యాదును విమర్శించడం ఉత్సాహం కలిగిస్తుంది, కానీ మీరు చదువుతున్నప్పుడు, మీరు ఎప్పుడైనా అదే పని చేశారా అని ఆలోచించండి. తక్కువగా సణగడానికి మరియు ప్రభువును ఎక్కువగా నమ్మడానికి మీకు సహాయపడగలిగేలా ఇశ్రాయేలీయుల అనుభవాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ఈ వచనాలు మీకు దేవుని గురించి ఏమి బోధిస్తున్నాయి?

1 నీఫై 2:11–12 కూడా చూడండి.

మన్నాను పోగుచేస్తున్న ఇశ్రాయేలీయులు

మన్నాను పోగుచేస్తున్న ఇశ్రాయేలీయులు. మధ్యయుగ-గోతిక్ కళాత్మక శైలి, ట్రనావా (వివరణ)

నిర్గమకాండము 16

సెమినరీ చిహ్నము
ప్రభువు నాకు ప్రతిరోజూ ఆధ్యాత్మిక పోషణను అందజేస్తారు.

మనమందరం తినవలసి ఉంటుంది కాబట్టి, ప్రభువు తరచుగా ఆధ్యాత్మిక విషయాలను ఆహారంతో పోలుస్తారు. నిర్గమకాండము 16లో మన్నాతో ఇశ్రాయేలీయుల అనుభవాలలో ఆయన ఆధ్యాత్మిక పాఠాల కోసం వెదకండి. ఉదాహరణకు, మీ ఆధ్యాత్మిక పోషణకు వర్తించేలా నిర్గమకాండము 16:16, 19, 22–26లోని ప్రభువు సూచనలలో మీరు ఏమి కనుగొంటారు?

మీరు ఈ అద్భుతం నుండి నేర్చుకోవాలని ప్రభువు కోరుకునే ఇతర పాఠాలను తెలుసుకోవడానికి, ఇలాంటి ప్రశ్నలను ధ్యానించండి:

  • యెహోవా ఇశ్రాయేలీయులకు రోజూ ఇచ్చిన మన్నా వంటి దేనిని నాకు ఇస్తారు?

  • మన్నాను పోగుచేయడం వంటి దేనిని నేను చేయగలను?

2:52

Daily Bread: Pattern

3:12

Daily Bread: Experience

3:0

Daily Bread: Change

మీరు ప్రతిరోజూ తినే ఆహారంతో పాటు ఇతర విషయాల గురించి ఆలోచించండి. ప్రభావవంతంగా ఉండాలంటే కొన్ని పనులను ప్రతిరోజూ ఎందుకు చేయాలి? అనుదిన ఆధ్యాత్మిక అనుభవాలను కోరడానికి మీరు ఏమి చేయడానికి ప్రేరేపించబడినట్లు భావిస్తున్నారు?

డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “అనుదిన పునఃస్థాపన,” లియహోనా, నవ. 2021, 77–79 కూడా చూడండి.

5:27

Daily Restoration

నిర్గమకాండము 17:1–7

యేసు క్రీస్తు నా ఆత్మీయ బండ మరియు జీవ జలమైయున్నారు.

మీరు నిర్గమకాండము 17:1–7 చదువుతున్నప్పుడు రక్షకుని గురించి ఆలోచించండి. యేసు క్రీస్తు మీకు ఒక బండగా ఎలా ఉన్నారు? (కీర్తనలు 62:6–7; హీలమన్ 5:12 చూడండి). ఆయన జలముగా ఎలా ఉన్నారు? (యోహాను 4:10–14; 1 కొరింథీయులకు 10:1–4; 1 నీఫై 11:25 చూడండి).

క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చే భౌతిక వస్తువుల కొరకు చూడండి. నిర్గమకాండము 17:1–7లో ఉన్నట్లుగా, యేసు క్రీస్తుకు చిహ్నాలుగా ఉండే వస్తువులను లేఖనాలు వివరించినప్పుడల్లా, అది ఒక వస్తుపాఠానికి అవకాశంగా ఉండవచ్చు. ఒక బండను లేదా నీటిని చూడటం లేదా తాకడం ద్వారా ఈ వస్తువులు యేసు క్రీస్తు వలె ఎలా ఉన్నాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మీరు నేర్చుకోవడంలో బహుళ ఇంద్రియాలను చేర్చగలిగితే, అది మరింతగా గుర్తుండిపోయేలా మరియు ప్రభావవంతంగా ఉంటుంది.

నిర్గమకాండము 17:8–16; 18:13–26

ప్రభువు యొక్క కార్యమును చేయుటలో “భారమును మోయుటకు” శిష్యులు ఒకరికొకరు సహాయపడతారు.

మీ జీవితంలో మీరు మోషేతో సంబంధింపజేసుకోగల సందర్భాలు —ఇతరులు మీపై ఆధారపడినప్పుడు, కానీ మీ “చేతులు [బరువు] ఎక్కినప్పటి సందర్భాలు ఉండవచ్చు” (నిర్గమకాండము 17:12). ఇతర సమయాల్లో, మీరు మోషేకు మద్దతిచ్చిన అహరోను, హూరు మరియు యిత్రో వలె ఉండవచ్చు. మీరు నిర్గమకాండము 17:8–16; 18:13–26 చదువుతున్నప్పుడు ఈ వ్యక్తులలో ప్రతీ ఒక్కరి స్థానంలో మిమ్మల్ని మీరు ఉంచుకోండి మరియు ప్రభువు తన పని గురించి మీకు ఏమి బోధిస్తున్నారో చూడండి.

మోషైయ 4:27; 18:8-9 కూడా చూడండి.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

నిర్గమకాండము 14:5–22

ప్రభువు నా జీవితంలో “గొప్ప కార్యము” చేయగలరు.

  • యెహోవా ఎఱ్ఱ సముద్రాన్ని చీల్చినప్పుడు, మోషే మరియు ఇశ్రాయేలీయులు ఆయన ఎంత శక్తిమంతుడో చూసారు. నిర్గమకాండము 14:5–22 నుండి కథను మళ్లీ ప్రదర్శించడానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం గురించి ఆలోచించడంలో మీ పిల్లలు మీకు సహాయం చేయనివ్వండి (పాత నిబంధన కథలు, 70–74లో “పస్కా పండుగ” కూడా చూడండి). బహుశా మీరు కుర్చీలు లేదా దుప్పట్లు ఏర్పాటు చేసి, వాటిని ఎఱ్ఱ సముద్రంలా “విభజించవచ్చు”. తర్వాత, మీరు మీ జీవితాల్లో దేవుని శక్తిని ఎలా చూశారో ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.

    2:54

    The Passover

  • నిర్గమకాండము 14లోని కథ గురించి మన అవగాహనకు సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2–3 ఏమి జోడిస్తుంది? పరిశుద్ధాత్మ మీ మనస్సులో లేదా హృదయంలో ఏదైనా చెప్పినప్పటి అనుభవం గురించి మీ పిల్లలకు చెప్పండి మరియు వారి అనుభవాల గురించి మాట్లాడమని వారిని ఆహ్వానించండి.

నిర్గమకాండము 15:22–25

ప్రభువు చేదుగా ఉండే విషయాలను తియ్యగా మార్చగలరు.

  • మీరు మరియు మీ పిల్లలు కలిసి నిర్గమకాండము 15:22–25 చదువుతున్నప్పుడు, తియ్యగా మరియు చేదుగా ఉన్నదేదైనా త్రాగవచ్చు. రక్షకుడు మన జీవితాలలోని “చేదు” అనుభవాలను ఎలా “తియ్యగా” చేసారు?

నిర్గమకాండము 15:23–25; 16:14–15; 17:1–6

యేసు నా జీవజలము, నా జీవాహారము మరియు నా బండయైయున్నారు.

  • మీరు మరియు మీ పిల్లలు నిర్గమకాండము 15:23–25; 16:14–15; 17:1–6 ​​చదువుతున్నప్పుడు, ప్రతి కథను చెప్పడంలో సహాయపడే వస్తువులను—ఒక కొమ్మ (మారా వద్ద నీటిని బాగు చేయడానికి), ఒక కూజా లేదా కుండ (మన్నాతో నింపడానికి) మరియు ఒక బండ (హోరేబు వద్ద నీటి కోసం) వంటివాటిని కనుగొనడంలో వారిని మీకు సహాయం చేయనివ్వండి. యేసు క్రీస్తు మన కొరకు ఏమి చేస్తారనే దాని గురించి ఈ కథలు మనకు ఏమి గుర్తు చేస్తాయి? మీ చర్చలో భాగంగా మీరు మత్తయి 7:24–27; యోహాను 4:10–14; 6:29–35, 48–51; హీలమన్ 5:12; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 కూడా చదువవచ్చు.

మోషే, అహరోను మరియు హూరులను చూపుతున్న వర్ణచిత్రము

One Before God [దేవుని ముందు ఏకమై], జోసెఫ్ బ్రిక్కీ చేత (వివరణ)

నిర్గమకాండము 17:8–16; 18:13–26

ప్రభువు యొక్క కార్యమును చేయుటలో “భారమును మోయుటకు” నేను సహాయపడగలను.

  • మీరు నిర్గమకాండము 17:8–16 చదువుతున్నప్పుడు, తన చేతులను గాలిలో పైకెత్తి ఉంచమని మీరు ఒక బిడ్డను ఆహ్వానించవచ్చు. బిడ్డ అలసిపోయినప్పుడు, అహరోను మరియు హూరులు మోషేకు సహాయం చేసిన విధంగా ఇతర పిల్లలు సహాయం చేయగలరు. దేవుని రాజ్యం విజయవంతం కావడానికి మనం ఎలా సహాయం చేయవచ్చనే దాని గురించి ఈ కథ ఏమి బోధిస్తుంది? మీరు నిర్గమకాండము 18:13–26 కూడా చదివి, మీ వార్డులో సేవచేసే వ్యక్తుల యొక్క బరువైన బాధ్యతల గురించి మాట్లాడవచ్చు. అహరోను మరియు హూరులు మోషే ప్రవక్తకు సహాయం చేసినట్లే, మన సంఘ నాయకులకు సహాయం చేయడానికి ఈరోజు మనం ఏమి చేయవచ్చు?

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ఎఱ్ఱ సముద్రమును చీల్చుతున్న మోషే

Crossing the Red Sea [ఎఱ్ఱ సముద్రమును దాటుట], ఆటో సెమ్లర్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: ప్రభువు నా జీవితంలో “గొప్ప కార్యము” చేయగలరు