Doctrine and Covenants 2025
నవంబరు 24-30: “ఆయన ‘తన పరిచర్యను, తన కార్యములను తన రక్తముతో ముద్రించెను’”: సిద్ధాంతము మరియు నిబంధనలు 135–136


“నవంబరు 24–30: ‘ఆయన “తన పరిచర్యను, తన కార్యములను తన రక్తముతో ముద్రించెను”’: సిద్ధాంతము మరియు నిబంధనలు 135–136,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 135–136,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

కార్తేజ్ చెరసాల

కార్తేజ్ చెరసాల

నవంబరు 24–30: “ఆయన తన పరిచర్యను, తన కార్యములను తన రక్తముతో ముద్రించెను”

సిద్ధాంతము మరియు నిబంధనలు 135–136

1844, జూన్ 27న జోసెఫ్ స్మిత్ మరియు హైరం స్మిత్‌లు మరోసారి చెరసాలలో ఉంచబడ్డారు, వారితోపాటు జాన్ టేలర్ మరియు విల్లార్డ్ రిఛర్డ్స్ ఉన్నారు. వారు ఏ నేరము చేయలేదని వారు నమ్మారు, కానీ నావూలోని పరిశుద్ధులకు వ్యతిరేకంగా హింసను నిరోధించాలని ఆశిస్తూ వారు ఖైదు చేయబడేందుకు ఒప్పుకున్నారు. సంఘము యొక్క శత్రువులు ప్రవక్త జోసెఫ్‌ను చెరసాలలో వేయడం ఇది మొదటిసారి కాదు, కానీ ఈసారి తాను తిరిగిరాడని ఆయనకు తెలిసినట్లు అనిపించింది. మోర్మన్ గ్రంథాన్ని చదువుతూ, కీర్తనలు పాడుతూ ఆయన మరియు ఆయన స్నేహితులు ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు కాల్పులు వినిపించాయి మరియు కొద్ది నిముషాలలో జోసెఫ్ స్మిత్ మరియు అతని అన్న హైరం యొక్క మర్త్య జీవితాలు ముగిసిపోయాయి.

అయినప్పటికీ, అది వారు హత్తుకున్న దైవిక కార్యము యొక్క అంతము కాదు. అది యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క అంతము కాదు. ఇంకా చేయవలసిన పని చాలా ఉంది మరియు సంఘాన్ని ముందుకు నడిపించే అధిక బయల్పాటు ఉంది. ప్రవక్త జీవితం యొక్క అంతము దేవుని పనికి అంతం కాదు.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 135; 136:37–39

జోసెఫ్ మరియు హైరం స్మిత్‌లు వారి సాక్ష్యాలను తమ రక్తంతో ముద్రించారు.

జోసెఫ్ మరియు హైరం స్మిత్‌లు చంపబడినప్పుడు మీరు నావూలో నివసిస్తున్నట్లయితే, మీరెలా భావించియుండేవారో ఊహించండి (Saints, 1:554–55 చూడండి). ఈ దుర్ఘటన యొక్క అర్థాన్ని కనుగొనడానికి మీరెలా ప్రయత్నించియుంటారు? మూడు నెలల తర్వాత ప్రచురించబడిన సిద్ధాంతము మరియు నిబంధనలు 135 సహాయపడియుండవచ్చు. మీరు ఈ విభాగాన్ని శోధిస్తున్నప్పుడు, మీకు అవగాహన మరియు భరోసాను కలిగించేది ఏమిటో పరిగణించండి. “తన ప్రవక్త చంపబడేందుకు దేవుడు ఎందుకు అనుమతించాడు,” అని అడిగిన వారికి మీరేమి జవాబిస్తారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 136:37–39 చూడండి).

మీరు జోసెఫ్ మరియు హైరం లాగా చివరి వరకు క్రీస్తుపట్ల నమ్మకంగా ఉండేందుకు మిమ్మల్ని ప్రేరేపించే పదాలు లేదా వాక్యభాగాల కోసం 135వ ప్రకరణమును కూడా శోధించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 5:21–22 కూడా చూడండి.

4:39

Testimony of the Book of Mormon

సిద్ధాంతము మరియు నిబంధనలు 135:3

సెమినరీ చిహ్నము
జోసెఫ్ స్మిత్ యేసు క్రీస్తు యొక్క ప్రవక్త మరియు సాక్షి.

“ఇరవై సంవత్సరాల స్వల్ప వ్యవధిలో” జోసెఫ్ స్మిత్ సాధించిన విషయాలలో కొన్నింటిని సిద్ధాంతము మరియు నిబంధనలు 135:3 పేర్కొంటుంది. మిమ్మల్ని, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మీ సంబంధాన్ని ఈ విషయాలు ఎలా ప్రభావితం చేసాయి? మీరు ఇలాంటి వాక్యాన్ని ఎలా పూర్తి చేస్తారో పరిగణించండి: జోసెఫ్ స్మిత్ ద్వారా ప్రభువు చేసిన దాని కారణంగా, నేను … మీరు ప్రవక్త జోసెఫ్ స్మిత్ గురించి మీ సాక్ష్యాన్ని నమోదు చేసి ఇతరులతో పంచుకోవచ్చు.

జోసెఫ్ స్మిత్ యొక్క నియమితకార్యం గురించి తెలుసుకోవడానికి మరొక మార్గం ఆయన కోసం సంక్షిప్త సంస్మరణ లేదా ప్రశంసలను వ్రాయడం. క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్తపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మీరు ఏమి చెబుతారు? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 135 లేదా దిగువ వనరులలో పేర్కొన్న ముఖ్యమైన సంఘటనలు లేదా విజయాలను చేర్చాలనుకోవచ్చు.

యేసు క్రీస్తు జోసెఫ్ స్మిత్ ద్వారా తన గురించి మరియు తన ప్రాయశ్చిత్తం గురించి అనేక సత్యాలను బయల్పరిచారు. ఈ సంవత్సరం మీరు సిద్ధాంతం మరియు నిబంధనలను అధ్యయనం చేసిన అనుభవాన్ని ధ్యానించడాన్ని పరిగణించండి. ఏ సత్యాలు మీకు ముఖ్యమైనవిగా అనిపించాయి? మీరు ఈ వారం చదువుతున్నప్పుడు మీ కుటుంబం, తరగతి లేదా సమూహ సభ్యులు లేదా ఇతరులతో వీటిని పంచుకోవాలనుకోవచ్చు. అర్థం చేసుకోవడానికి మరియు రక్షకునికి దగ్గరవడానికి ఈ సత్యాలు మీకు ఎలా సహాయపడతాయి?

62:4

Joseph Smith: The Prophet of the Restoration

సంబంధిత సంగీతము

క్రింది కీర్తనలు పాడడం లేదా వీడియోలు చూడడం పరిశుద్ధాత్మను ఆహ్వానించవచ్చు లేదా ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క పని మరియు ఆయన తర్వాత కొనసాగిన పరిశుద్ధుల త్యాగాల గురించి చర్చను ప్రేరేపించవచ్చు.

A Poor Wayfaring Man of Grief” (కీర్తనలు, సం. 29). కార్తేజ్ చెరసాలలో ఉన్నప్పుడు, జాన్ టేలర్ ఈ కీర్తన పాడారు.

Praise to the Man” (కీర్తనలు, సం. 27;video కూడా చూడండి). ఈ కీర్తన యొక్క పదాలు జోసెఫ్ స్మిత్‌కు నివాళిగా వ్రాయబడ్డాయి.

6:16

Praise to the Man – The Tabernacle Choir at Temple Square

Come, Come, Ye Saints” (కీర్తనలు, సం. 30; video కూడా చూడండి).

4:58

Come, Come, Ye Saints - Mormon Tabernacle Choir

5:32

Faith in Every Footstep - Mormon Tabernacle Choir

సిద్ధాంతము మరియు నిబంధనలు 136

నేను ఆయన సలహాను అనుసరించడం ద్వారా ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడంలో నేను సహాయం చేయగలను.

జోసెఫ్ స్మిత్ మరణించిన తరువాత, పరిశుద్ధులు నావూ నుండి తరిమివేయబడ్డారు. వారు ఇప్పుడు 1,300-మైళ్ళు (2,100 కి.మీ) కఠినమైన అరణ్యంలో ప్రయాణించవలసి వచ్చింది. పన్నెండుమంది అపొస్తలుల సమూహ అధ్యక్షుడైన బ్రిగమ్ యంగ్, పరిశుద్ధులు ఆ ప్రయాణాన్ని ఎలా తట్టుకోగలరోనని ఆందోళన చెందారు. వింటర్ క్వార్టర్స్ అనే తాత్కాలిక నివాసంలో, ఆయన నడిపింపు కోసం వేడుకున్నారు. 136వ ప్రకరణములో ప్రభువు యొక్క జవాబు నమోదు చేయబడింది. “ప్రయాణంలో వారి ప్రవర్తన వారి గమ్యస్థానం వలె ముఖ్యమైనదని పరిశుద్ధులు గుర్తుంచుకోవడానికి సహాయం చేయడం ద్వారా, పశ్చిమమువైపు వలసపోవడాన్ని దురదృష్టకరమైన అవసరం నుండి ముఖ్యమైన పంచుకోదగిన ఆత్మీయ అనుభవంగా మార్చుకోవడానికి ఈ బయల్పాటు సహాయపడింది” (“This Shall Be Our Covenant,” in Revelations in Context, 308).

మీరు 136వ ప్రకరణము చదువుతున్నప్పుడు దీనిని మనస్సులో ఉంచుకోండి. మీ జీవితంలో కష్టమైన శ్రమను “ముఖ్యమైన … ఆత్మీయ అనుభవంగా” మార్చుకోవడానికి సహాయపడేలా ఏ సలహాను మీరు కనుగొంటారు? ప్రారంభ పరిశుద్ధులకు వారి ప్రయాణాలలో సహాయపడినట్లే, మీ స్వంత జీవితంలో ప్రభువు చిత్తాన్ని సాధించడానికి ఈ సలహా మీకెలా సహాయపడగలదో మీరు ధ్యానించవచ్చు.

వింటర్ క్వార్టర్స్ యొక్క వర్ణచిత్రము

Winter Quarters [వింటర్ క్వార్టర్స్] నుండి వివరణ, గ్రెగ్ ఓల్సన్ చేత

పిల్లల విభాగపు చిహ్నము 02

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 135:1–2, 4–5

జోసెఫ్ మరియు హైరం స్మిత్‌లు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త కోసం తమ ప్రాణాలను అర్పించారు.

  • మీ పిల్లల కొరకు సిద్ధాంతము మరియు నిబంధనలు 135:1ని సంక్షిప్తం చేయండి. రక్షకుడు మరియు ఆయన సువార్త కోసం జోసెఫ్ మరియు హైరం చేసిన త్యాగం గురించి మీ భావాలను పంచుకోవడానికి ఇది మీకు మరియు మీ పిల్లలకు మంచి అవకాశం.

    3:21

    Chapter 57: The Prophet Is Killed: June 1844

  • హైరం స్మిత్ కార్తేజ్ జైలుకు వెళ్ళే ముందు మోర్మన్ గ్రంథము నుండి ఒక గద్యభాగాన్ని చదివాడని సిద్ధాంతము మరియు నిబంధనలు 135:4–5 వ్యాఖ్యానిస్తుంది. మీరు మరియు మీ పిల్లలు కలిసి ఈ గద్యభాగాన్ని చదవవచ్చు (ఈథర్ 12:36–38 చూడండి). ఈ వచనాలు హైరం‌ను ఎలా ఓదార్చాయి? మీరు చింతిస్తున్నప్పుడు లేదా విచారంగా ఉన్నప్పుడు మీకు ఓదార్పునిచ్చే లేఖనాలను కూడా మీరు పంచుకోవచ్చు.

  • మీరు, మీ పిల్లలు ప్రవక్తల చిత్రాలను చూడవచ్చు మరియు దేవుడు ప్రవక్తలను చేయమని అడిగే కొన్ని విషయాల గురించి మాట్లాడవచ్చు. ఈ ప్రవక్తలు రక్షకుని కొరకు ఏమి త్యాగం చేసారు?

    The Old Testament prophet Noah standing on a log as he preaches to a group of assembled people. The people are laughing and mocking Noah. The partially completed ark is visible in the background.

గృహములో, నేర్చుకోవడం మరియు జీవించడం అనేవి విడదీయరానివి. “గృహములో సువార్త తక్షణ సంబంధాన్ని పొందుతుంది. అక్కడ అనుదినము మీరు ఎవరితో కలిసి సువార్త నేర్చుకుంటున్నారో వారితో కలిసి మీరు దానిని జీవిస్తారు. వాస్తవానికి, ఎక్కువ సమయం మనం సువార్తను నేర్చుకొనేది సువార్తను జీవించడం ద్వారానే” (రక్షకుని విధానములో బోధించుట, 31).

సిద్ధాంతము మరియు నిబంధనలు 135:3

జోసెఫ్ స్మిత్ యేసు క్రీస్తు యొక్క ప్రవక్త మరియు సాక్షి.

  • జోసెఫ్ స్మిత్ యొక్క నియమితకార్యము ద్వారా ప్రభువు మనల్ని ఎలా ఆశీర్వదించారో మీ పిల్లలు గుర్తుంచుకోవడానికి మరియు మెచ్చుకోవడంలో సహాయపడడానికి, మీరు జోసెఫ్ చేసిన పనులను సూచించే వస్తువులను ప్రదర్శించవచ్చు, అంటే మోర్మన్ గ్రంథము, సిద్ధాంతము మరియు నిబంధనలు లేదా దేవాలయ చిత్రం వంటివి (ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీ కూడా చూడండి). అప్పుడు మీ పిల్లలు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు దగ్గరికి రావడానికి మనకు సహాయపడేలా జోసెఫ్ స్మిత్ చేసిన కొన్ని విషయాల కోసం సిద్ధాంతము మరియు నిబంధనలు 135:3లో చూడవచ్చు. ఈ విషయాల కోసం వారు ఎందుకు కృతజ్ఞతతో ఉన్నారో పంచుకోవడానికి మీ పిల్లలను ఆహ్వానించండి.

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్

American Prophet [అమెరికా ప్రవక్త], డెల్ పార్సన్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 136

నేను కష్టపడుతున్నప్పుడు ప్రభువు నన్ను ఆశీర్వదించగలరు.

  • ఒక గదిలో ఒక వైపు నావూ దేవాలయ చిత్రాన్ని ఉంచడం మరియు మరొక వైపు సాధారణ ఆశ్రయాన్ని సృష్టించడం గురించి ఆలోచించండి. చిత్రం దగ్గర గుమికూడమని మీ పిల్లలను ఆహ్వానించండి మరియు జోసెఫ్ స్మిత్ మరణించిన తర్వాత నావూను విడిచిపెట్టాల్సిన పరిశుద్ధుల గురించి వారికి చెప్పండి. ఈ పరిశుద్ధుల‌కు యేసు క్రీస్తుపై ఉన్న విశ్వాసాన్ని నొక్కి చెప్పండి మరియు వింటర్ క్వార్టర్స్‌కు ప్రయాణాన్ని సూచించడానికి మీ పిల్లలను ఆశ్రయం వద్దకు నడిచి వెళ్ళమని ఆహ్వానించండి.

    1:31

    Chapter 58: A New Leader for the Church: July–August 1844

    3:51

    Chapter 60: The Saints Leave Nauvoo: September 1845–September 1846

    2:29

    Chapter 62: The Saints Establish Winter Quarters: 1846–1847

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 136లో, సాల్ట్ లేక్ లోయకు వారి ప్రయాణంలో పరిశుద్ధుల‌‌కు సహాయం చేయడానికి ప్రభువు సలహా ఇచ్చారని వివరించండి. మీ పిల్లలకు ఈ ప్రయాణంలో ధైర్యాన్నిచ్చేలా ఈ బయల్పాటులో ఏదైనా కనుగొనడంలో సహాయపడండి (4, 10–11, 18–30 వచనములు చూడండి). నేడు మనం ఎదుర్కొంటున్న శ్రమలలో ఈ ఉపదేశము మనకు ఎలా సహాయపడగలదు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

కార్తేజ్ చెరసాలలో జోసెఫ్ స్మిత్ మరియు ఇతరులపై దాడి చేస్తున్న అల్లరిమూక

Greater Love Hath No Man [ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు], కేసి చైల్డ్స్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ