“డిసెంబరు 1–7: ‘మృతుల విమోచనను గూర్చి దర్శనము’: సిద్ధాంతము మరియు నిబంధనలు 137–138,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 137–138,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Christ Preaching in the Spirit World [ఆత్మ లోకములో ప్రవచించుచున్న క్రీస్తు] నుండి వివరణ, రాబర్ట్ టి. బార్రెట్ చేత
డిసెంబరు 1-7: “మృతుల విమోచనను గూర్చి దర్శనము”
సిద్ధాంతము మరియు నిబంధనలు 137–138
సిద్ధాంతము మరియు నిబంధనలు 137 మరియు138లలో నమోదు చేయబడిన బయల్పాటులు 80 సంవత్సరాలు మరియు 1500 మైళ్ళు (2,400 కి.మీ.) కంటే ఎక్కువ వాటిచేత వేరుచేయబడ్డాయి. కర్ట్‌లాండ్ దేవాలయంలో 1836లో ప్రవక్త జోసెఫ్ స్మిత్ చేత 137వ ప్రకరణము పొందబడింది మరియు 138వ ప్రకరణము 1918లో సాల్ట్ లేక్ సిటీలో సంఘము యొక్క ఆరవ అధ్యక్షుడు జోసెఫ్ ఎఫ్. స్మిత్ చేత పొందబడింది. కానీ సిద్ధాంతపరంగా ఈ రెండు దర్శనములు ఒకదానితో ఒకటి సంబంధం కలిగియున్నాయి. మరణానంతర జీవితం గురించి దేవుని ప్రవక్తలతో సహా చాలామంది జనులు అడిగే ప్రశ్నలకు అవి రెండూ సమాధానమిస్తాయి. బాప్తిస్మము పొందకుండానే మరణించిన తన సోదరుడు ఆల్విన్ యొక్క తలరాత గురించి జోసెఫ్ స్మిత్ ఆశ్చర్యపోయాడు. తన తల్లిదండ్రులను మరియు 13 మంది పిల్లలను అకాల మరణాల కారణంగా కోల్పోయిన జోసెఫ్ ఎఫ్. స్మిత్ తరచుగా ఆత్మ లోకం గురించి ఆలోచిస్తూ, అక్కడ సువార్త ప్రకటించడం గురించి ఆశ్చర్యపోయేవాడు.
137వ ప్రకరణము తరువాతి జీవితంలో దేవుని పిల్లల గమ్యంపై కొంత సమాచారమునిస్తుంది మరియు 138వ ప్రకరణము దానిని మించిన సమాచారమునిస్తుంది. ఆ రెండు బయల్పాటులు కలిసి “తండ్రి మరియు కుమారుని చేత ప్రత్యక్షపరచబడిన గొప్ప అద్భుతమైన ప్రేమకు” సాక్ష్యమిస్తాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:3).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 137; 138:30–37, 57–60
పరలోక తండ్రి యొక్క పిల్లలందరూ నిత్యజీవాన్ని ఎన్నుకునే అవకాశాన్ని కలిగియుంటారు.
ప్రవక్త జోసెఫ్ యొక్క ప్రియమైన సోదరుడు ఆల్విన్ స్మిత్, దేవుడు బాప్తిస్మమిచ్చే అధికారాన్ని పునఃస్థాపించడానికి ఆరు సంవత్సరాల ముందు మరణించాడు. 1836లో క్రైస్తవుల మధ్యనున్న సాధారణ గ్రహింపు ఏమనగా, బాప్తిస్మము పొందకుండా ఒక వ్యక్తి మరణించినట్లయితే, ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. జోసెఫ్ చాలా సంవత్సరాలు—అతను సిద్ధాంతము మరియు నిబంధనలు 137లోని బయల్పాటును పొందే వరకు ఆల్విన్ యొక్క నిత్య రక్షణ గురించి ఆశ్చర్యపోయాడు.
నేడు చాలామందికి ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. చాలామందికి వాటిని పొందే అవకాశం లేనప్పుడు దేవుడు విధులు మరియు నిబంధనలను ఎందుకు కోరతారు? దీని గురించి ఆశ్చర్యపడే వ్యక్తికి మీరు ఏమి చెబుతారు? దేవునిపై వారి విశ్వాసాన్ని మరియు రక్షణ కోసం ఆయన అక్కరలను మీరెలా పెంపొందిస్తారు? 137వ ప్రకరణములో మరియు ప్రకరణము 138:30–37, 57–60లో మీరు పంచుకోగల సత్యాల కొరకు చూడండి. అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ గారి సందేశము “దేవుని యొక్క కుటుంబాన్ని సమకూర్చుట” (లియహోనా, మే 2017, 19–22)లో వ్యక్తపరచబడిన ఈ సత్యాల కొరకు కూడా మీరు చూడవచ్చు.
మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు మరియు ధ్యానిస్తున్నప్పుడు, మీరు ఈ క్రింది వాక్యాలను పూర్తి చేయడం ద్వారా మీ మనోభావాలను నమోదు చేయవచ్చు:
-
ఈ బయల్పాటుల కారణంగా, పరలోక తండ్రి అని నాకు తెలుసు.
-
ఈ బయల్పాటుల కారణంగా, తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక అని నాకు తెలుసు.
-
ఈ బయల్పాటుల కారణంగా, నేను కోరుకుంటున్నాను.
సిద్ధాంతము మరియు నిబంధనలు 138:1–11, 25–30
లేఖనాలను చదివి, ధ్యానించడం బయల్పాటు పొందడానికి నన్ను సిద్ధం చేస్తుంది.
కొన్నిసార్లు మనం దానిని కోరుకోకపోయినా బయల్పాటు వస్తుంది. కానీ చాలా తరచుగా, మనం దాని కోసం శ్రద్ధగా వెదికి, సిద్ధపడినందున అది వస్తుంది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 138:1–11, 25–30 చదువుతున్నప్పుడు, “[ఆయన] మనోనేత్రములు తెరువబడినప్పుడు” అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఏమి ఆలోచిస్తున్నారో గమనించండి. మీరు ఆయన అనుభవాన్ని 1 నీఫై 11:1–6; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:12–19తో కూడా పోల్చవచ్చు. తరువాత, అధ్యక్షులు స్మిత్ మాదిరిని మీరెలా అనుసరించగలరో పరిగణించండి. ఉదాహరణకు, మరింత వ్యక్తిగత బయల్పాటును పొందేందుకు మీ లేఖన అధ్యయనానికి మీరు ఏ మార్పులను చేయడానికి ప్రేరేపించబడినట్లు భావిస్తున్నారు?
ఆయన సందేశమైన “మృతుల విమోచనను గూర్చి దర్శనము” (లియహోనా, నవ. 2018, 71–74)లో, ఈ బయల్పాటును పొందడానికి అధ్యక్షులు స్మిత్ సిద్ధపరచబడిన ఇతర విధానాలను అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ సూచించారు. ఆయన అనుభవాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? మీరు అనుభవించే అనుభవాల కోసం ప్రభువు మిమ్మల్ని ఎలా సిద్ధం చేశారో మరియు మీ భవిష్యత్తులోని అనుభవాల కోసం ఆయన మిమ్మల్ని ఎలా సిద్ధం చేస్తున్నారో పరిగణించండి.
Ministry of Joseph F. Smith: A Vision of the Redemption of the Dead
Joseph F. Smith [జోసెఫ్ ఎఫ్. స్మిత్], ఆల్బర్ట్ సాజ్బ్రెన్నెర్ చేత
ఆత్మను ఆహ్వానించండి. “సువార్తను నేర్చుకునే ఆత్మీయ వాతావరణానికి ఏది దోహదం చేస్తుందని మీరు గమనించారు? దానిని ఏది పక్కదారి పట్టిస్తుంది?” (రక్షకుని విధానములో బోధించుట, 18). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 138:1–11లో అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ అనుభవాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, మీరు మీ కోసం మరియు మీరు బోధకులైతే, మీరు బోధించే వ్యక్తుల కోసం ధ్యానించడాన్ని ఎలా ప్రోత్సహించవచ్చో మరియు ఆధ్యాత్మిక మనోభావాలను ఎలా ఆహ్వానించవచ్చో పరిగణించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 138:25–60
రక్షకుని కార్యము తెరకు అవతలి వైపు కొనసాగుతుంది.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “ప్రపంచమునకు మన సందేశము సాధారణమైనది మరియు నిజాయితీగలది: వారి రక్షకుని వద్దకు వచ్చి పరిశుద్ధ దేవాలయము యొక్క దీవెనలు పొందాలని, శాశ్వతమైన ఆనందమును కలిగియుండాలని మరియు నిత్యజీవము కొరకు అర్హులు కావాలని తెరకు ఇరువైపులా గల దేవుని పిల్లలందరిని మేము ఆహ్వానిస్తున్నాము” (“మనమందరము ముందుకు త్రోసుకొని వెళదాము,” లియహోనా, మే 2018, 118–19). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 138:25–60 చదువుతున్నప్పుడు, ఈ వ్యాఖ్యానమును ధ్యానించండి. మీరు ఈ ప్రశ్నలను కూడా పరిగణించవచ్చు:
-
ఆత్మ లోకంలో రక్షకుని కార్యము ఏవిధంగా సాధించబడుతుంది అనేదాని గురించి ఈ వచనాల నుండి మీరేమి నేర్చుకుంటారు? ఈ కార్యము జరుగుతుందని తెలుసుకోవడం మీకెందుకు ముఖ్యమైనది?
-
ఆత్మ లోకంలోని ప్రభువు సందేశకుల గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది?
-
ఈ బయల్పాటు దేవుని విమోచన ప్రణాళికపై మీ విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది?
మీరు ఆత్మ లోకం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ గారి సందేశము “ప్రభువు నందు నమ్మకముంచుము” (లియహోనా, నవ. 2019, 26-29) ను మీరు చదవవచ్చు.
A Visit from Father
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 137:5–10; 138:18–35
పరలోక తండ్రి యొక్క పిల్లలందరూ సువార్తను వినే అవకాశాన్ని కలిగియుంటారు.
-
బహుశా, మీకు తెలిసి బాప్తిస్మము పొందే అవకాశం లేకుండా మరణించిన ఒకరి గురించి మీరు మాట్లాడవచ్చు. ఆ వ్యక్తి గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 137:5–10 మనకేమి బోధిస్తుంది?
2:20Ministry of Joseph Smith: Temples
2:17Chapter 39: The Kirtland Temple Is Dedicated: January–March 1836
-
రక్షకుని సమాధి చిత్రాన్ని మరియు ఈ నమూనా చివర ఉన్న చిత్రాన్ని ఉపయోగించి యేసు శరీరం సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్లిందో మీ పిల్లలకు బోధించండి. తర్వాత యేసు అక్కడ ఉన్నప్పుడు ఏమి చేసారో తెలుసుకోవడానికి మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 138:18–19, 23–24, 27–30ను కలిసి చదవవచ్చు. ఆయన ఎవరిని దర్శించారు? ఏమి చేయమని ఆయన వారిని అడిగారు? ఆయన దీనిని ఎందుకు చేసారు?
-
సువార్తికులు తెరకు ఇటువైపు బోధించే దానిని (ఉదాహరణకు, విశ్వాస ప్రమాణాలు 1:4 చూడండి), ఆత్మ లోకంలో సువార్తికులు బోధించేదానితో (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:33 చూడండి) పోల్చడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు మీరు ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీని కూడా ఉపయోగించవచ్చు. ఈ వచనాలలో ఏవి సారూప్యమైనవి మరియు ఏవి భిన్నమైనవి? ఇది పరలోక తండ్రి మరియు ఆయన ప్రణాళిక గురించి మనకు ఏమి బోధిస్తుంది?
లేఖనాలను ధ్యానించడం పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తుంది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 138:1–11
నేను లేఖనాలను ధ్యానించినప్పుడు, వాటిని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయగలడు.
-
మీరు లేదా మీ పిల్లలు కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 138:1–11 చదువుతున్నప్పుడు, మీరు వారిని అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్‌గా నటించమని, 6 మరియు 11వ వచనములలోని పదాలకు అనుగుణంగా అభినయాలు చేయమని ఆహ్వానించవచ్చు. మీరు వారికి అధ్యక్షులు స్మిత్ చిత్రాన్ని కూడా చూపించవచ్చు (ఈ నమూనాలో ఒకటి ఉంది) మరియు ఆయన సంఘము యొక్క ఆరవ అధ్యక్షుడని వివరించవచ్చు. మీరు లేఖనములలో దేనినైనా ధ్యానించినప్పుడు మరియు దానిని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయం చేసిన సమయం గురించి కూడా మీరు మాట్లాడవచ్చు.
-
లేఖన అధ్యయనానికి సంబంధించిన పాటను కలిసి పాడడాన్ని పరిగణించండి. లేఖనాలను అర్థం చేసుకోవడానికి మనం ఏమి చేయాలని ఈ పాట చెబుతోంది?
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.