“డిసెంబరు 22–28: ‘దేవుని యొక్క దైవపుత్రుని అసమాన బహుమానము,’” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“క్రిస్మస్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Nativity in Copper and Umber (రాగి మరియు పసుపు ఎరుపు వర్ణంలో జననస్థితి) నుండి వివరణ, జె. కర్క్ రిఛర్డ్స్ చేత
డిసెంబరు 22–28: దేవుని యొక్క దైవపుత్రుని అసమాన బహుమానము
క్రిస్మస్
ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా ప్రకటించారు, “మన మతం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏవనగా, యేసు క్రీస్తు మరణించారని, సమాధి చేయబడ్డారని, మూడవరోజు తిరిగి లేచారని మరియు పరలోకంలోకి ఆరోహణమయ్యారని ఆయనకు సంబంధించి అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క సాక్ష్యము; మన మతానికి సంబంధించిన మిగతావన్నీ దానికి అనుబంధములు మాత్రమే” (Teachings of Presidents of the Church: Joseph Smith [2011], 49). 160 సంవత్సరాల తర్వాత, రక్షకుని జననము యొక్క 2,000వ వార్షికోత్సవము యొక్క గౌరవార్థము “జీవముతోనున్న క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము” ను ప్రచురించడానికి ఈ వ్యాఖ్యానము ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమును ప్రేరేపించింది (రస్సెల్ ఎమ్. నెల్సన్, “మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొందుట,” లియహోనా, మే 2017, 40 చూడండి).
కడవరి-దిన పరిశుద్ధులుగా మనం, ఆధునిక ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా నిరంతర బయల్పాటు యొక్క దీవెనలో ఆనందిస్తాము. వారి ప్రేరేపిత సలహాలు, హెచ్చరిక మరియు ప్రోత్సాహము కొరకు మనము కృతజ్ఞులము. అన్నింటిని మించి, క్రిస్మస్ సమయంలో మరియు సంవత్సరమంతా యేసు క్రీస్తు గురించి వారి శక్తివంతమైన సాక్ష్యాలతో మనం దీవించబడ్డాము. ఇవి నైపుణ్యం గల రచయితలు లేదా బహిరంగ ప్రసంగీకుల ప్రేరేపిత పదాలు లేదా లేఖన నిష్ణాతుల నుండి అంతరార్థములను మించినవి. దేవుని చేత ఎంచుకోబడి, పిలువబడి, “ప్రపంచమంతటా క్రీస్తు నామమునకు ప్రత్యేక సాక్షులుగా” అధికారమివ్వబడిన వారి మాటలవి (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:23).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
“మరెవ్వరూ అంత అత్యధిక ప్రభావాన్ని కలిగియుండలేదు.”
“భూమిపై ఇంతకుముందు జీవించిన మరియు ఇకపై జీవించబోవు వారందరిపై (యేసు క్రీస్తు వలె) మరెవ్వరూ అంత అత్యధిక ప్రభావాన్ని కలిగియుండలేదు” అనే వ్యాఖ్యానానికి సహకారమిచ్చేలా మీరేమి చెప్తారు? “జీవముతోనున్న క్రీస్తు”లో రక్షకుని యొక్క అత్యధిక ప్రభావానికి సాక్ష్యమిచ్చే వాక్యభాగాల కొరకు చూడండి. ఆయన మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసారు?
క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారని క్రైస్తవ మతం గురించి తెలియని వ్యక్తి మిమ్మల్ని అడిగాడనుకోండి. మీరు ఎలా స్పందిస్తారు? ఈ ప్రశ్నను మనస్సులో ఉంచుకుని “జీవముతోనున్న క్రీస్తు” ను సమీక్షించండి మరియు మీకు వచ్చిన ఆలోచనలు లేదా మనోభావాలను వ్రాయడాన్ని పరిగణించండి.
Why We Need a Savior
“ఆయన సమాధి నుండి లేచారు.”
“జీవముతోనున్న క్రీస్తులో,” పునరుత్థానుడైన ప్రభువు యొక్క మూడు ప్రత్యక్షతలను వివరిస్తూ అపొస్తలులు రక్షకుని యొక్క పునరుత్థానము గురించి సాక్ష్యమిచ్చారు (ఐదవ పేరా చూడండి). యోహాను 20; 3 నీఫై 11; మరియు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:14–20లో ఈ దర్శనాల గురించి కొన్ని వృత్తాంతాలను చదవడాన్ని పరిగణించండి. ఈ ప్రత్యక్షతలలో ఆయన మాటలు మరియు క్రియల నుండి రక్షకుని గురించి మీరేమి నేర్చుకుంటారు?
రక్షకునిపై కేంద్రీకరించండి. “ప్రార్థనాపూర్వకంగా ‘జీవముతోనున్న క్రీస్తు’ ను చదవడం మత్తయి, మార్కు, లూకా, యోహాను మరియు మోర్మన్ గ్రంథ ప్రవక్తల సాక్ష్యాలను చదవడం వంటిది. అది రక్షకుని యందు మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఆయనపై కేంద్రీకరించడానికి మీకు సహాయపడుతుంది” (ఎమ్. రస్సెల్ బాల్లర్డ్, “తిరిగి రండి మరియు పొందుము,” లియహోనా, మే 2017, 65).
“ఆయన యాజకత్వము మరియు ఆయన సంఘము పునఃస్థాపించబడ్డాయి.”
ఈ సంవత్సరం మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు చదువుతున్నప్పుడు, రక్షకుని “యాజకత్వము మరియు ఆయన సంఘము ఎలా పునఃస్థాపించబడ్డాయి” అనే దాని గురించి ఎక్కువగా నేర్చుకొనే అవకాశాన్ని మీరు కలిగియున్నారు. పునఃస్థాపించబడిన ఏ సత్యాలు లేదా సూత్రాలు మీకు ప్రత్యేకంగా అర్థవంతంగా ఉన్నాయి? పునఃస్థాపన గురించి బోధించే క్రింది లేఖనాలలో కొన్నింటిని పునర్వీక్షించడాన్ని పరిగణించండి: సిద్ధాంతము మరియు నిబంధనలు 1:17–23; 13; 20:1–12; 65; 110; 112:30–32; 124:39–42; 128:19–21. పునఃస్థాపించబడిన సువార్త యొక్క సత్యాలు యేసు క్రీస్తును తెలుసుకొని, ప్రేమించడానికి మీకెలా సహాయపడతాయో ధ్యానించండి.
“ఆయన ఒకనాడు భూమికి తిరిగివస్తారు.”
క్రిస్మస్ అనేది యేసు క్రీస్తు జన్మించిన రోజు వైపు తిరిగి చూడడానికి మరియు ఆయన మరలా వచ్చే రోజు కోసం ఎదురు చూడడానికి సమయం. “జీవముతోనున్న క్రీస్తు” యొక్క చివరి నుండి రెండవ పేరాలో ఆయన తిరిగి రావడం గరించి మీరేమి నేర్చుకుంటారు? రెండవ రాకడ గురించి బోధించే క్రిస్మస్ కీర్తనలను చదవడం, పాడడం లేదా వినడాన్ని కూడా మీరు పరిగణించవచ్చు.
“ఆయనే లోకమునకు వెలుగును, జీవమును, నిరీక్షణయైయున్నాడు.”
“జీవముతోనున్న క్రీస్తు” యొక్క చివరి పేరాలో రక్షకుని లక్షణాలను, ఆయనకివ్వబడిన నామాలను గమనించండి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించడాన్ని పరిగణించండి. ఉదాహరణకు:
వెలుగు: యేసు క్రీస్తు ఏవిధంగా మీకు వెలుగువలె ఉన్నారు? ఆయన మీకు ఇచ్చే వెలుగును సూచించే చిత్రాన్ని గీయడం లేదా ఫోటో తీయడం వంటివాటిని మీరు పరిగణించవచ్చు. ఆయన వెలుగును పంచుకోవడానికి మీరు ఏమి చేయడానికి ప్రేరేపించబడ్డారు ? (యోహాను 8:12; 3 నీఫై 18:24; సిద్ధాంతము మరియు నిబంధనలు 50:24 కూడా చూడండి.)
జీవము: యేసు క్రీస్తును వర్ణించడానికి జీవము అనేది ఎందుకు మంచి పదం అవుతుంది? ఏ అర్థములో ఆయన మీకు జీవమునిస్తారు? ఆయన మరియు ఆయన సువార్త లేకపోతే మీ జీవితం ఎలా భిన్నంగా ఉండేది? (యోహాను 10:10; 1 కొరింథీయులకు 15:19-23; సిద్ధాంతము మరియు నిబంధనలు 66:2 కూడా చూడండి.)
నిరీక్షణ: యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త కారణంగా దేని గురించి మీరు నిరీక్షిస్తారు? భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా భావించే వారెవరైనా మీకు తెలుసా? యేసు క్రీస్తుపై మీకున్న నిరీక్షణను మీరు ఆ వ్యక్తితో ఎలా పంచుకోవచ్చో ధ్యానించండి. (రోమా 8:24–25; ఈథర్ 12:4; మొరోనై 7:41 కూడా చూడండి.)
“[ఆయన] అసమాన బహుమానము కొరకు దేవునికి కృతజ్ఞతలు.”
“జీవముతోనున్న క్రీస్తు” లో, అపొస్తలులు రక్షకుడిని మన పరలోక తండ్రి నుండి ఒక “బహుమానంగా” పేర్కొంటారు. “జీవముతోనున్న క్రీస్తు” లో మీరు కనుగొనే దానిపై ఆధారపడి, ఈ వాక్యాన్ని మీరు ఎలా పూరిస్తారు: “యేసు క్రీస్తు ద్వారా దేవుడు నాకు … యొక్క బహుమానాలను ఇస్తారు.” ఈ బహుమానాలను మరింత సంపూర్ణంగా పొందడానికి మీరు ఏమి చేయగలరో ధ్యానించండి.
“జీవముతోనున్న క్రీస్తు” ను చదవడం రక్షకుని యందు మీ విశ్వాసాన్ని, ఆయన పట్ల మీ ప్రేమను ఎలా ప్రభావితం చేసింది?
Excerpts from "The Living Christ: The Testimony of the Apostles"
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
యేసు జయంతి ఉత్సవమును జరుపుకొనుటకు నేను “[నా] సాక్ష్యాన్ని అందించగలను”.
-
“జీవముతోనున్న క్రీస్తు” ను మీ పిల్లలకు ఎలా పరిచయం చేయవచ్చో పరిగణించండి. బహుశా మీరు ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది సంతకాలలో మరియు శీర్షికలో క్రీస్తు పేరును చూపడానికి వారికి సహాయపడవచ్చు. ఇది యేసు క్రీస్తు గురించి వారు ప్రపంచంతో పంచుకోవాలనుకున్న సాక్ష్యం అని మీరు వివరించవచ్చు.
-
మీరు ప్రతీ బిడ్డకు “జీవముతోనున్న క్రీస్తు” నుండి ఒక వాక్యభాగాన్ని ఇచ్చి, ఆ వాక్యభాగమును కనుగొనమని లేదా బొమ్మ గీయమని వారిని అడగవచ్చు. తర్వాత “జీవముతోనున్న క్రీస్తు” లో వాక్యభాగాన్ని కనుగొనడానికి వారికి మీరు సహాయపడవచ్చు. ఆ చిత్రపటాలు మరియు వాక్యభాగాలను ఒక పుస్తకంగా కూడా మీరు సంగ్రహించవచ్చు.
-
యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యాన్ని మీరెలా పొందారో ఒకరితో ఒకరు పంచుకోండి. బహుశా మీరు రక్షకుని చిత్రాన్ని ఒకరికొకరు అందించుకోవచ్చు మరియు ఆయన గురించి మీకు తెలిసిన దానిని పంచుకోవచ్చు (“జీవముతోనున్న క్రీస్తు” లో బోధించబడిన సత్యాలతో సహా).
“ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను.”
-
మీరు, మీ పిల్లలు “జీవముతోనున్న క్రీస్తు” లో రెండవ పేరా చదువుతున్నప్పుడు, యేసు చేసిన కొన్ని విషయాల గురించి వారితో మాట్లాడండి. ఆయన జీవితం నుండి చిత్రాలను కూడా మీరు చూడవచ్చు (ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీ మరియు సువార్త కళా పుస్తకము చూడండి). చిత్రములలో రక్షకుడు చేస్తున్న దాని గురించి మాట్లాడమని మీ పిల్లలను ఆహ్వానించండి. ఆయన చేసినట్లుగా ఇతరులకు మనమెలా సేవ చేయగలము?
“ఆయనే లోకమునకు వెలుగును, జీవమును, నిరీక్షణయైయున్నాడు.”
-
రక్షకుని పుట్టుక ప్రపంచానికి అందించిన వెలుగు, జీవము మరియు నిరీక్షణను తెలిపే క్రిస్మస్ కీర్తనలను కనుగొనడంలో మీ పిల్లలకు సహాయపడండి. కలిసి కీర్తనలు పాడండి మరియు యేసు వారి జీవితాల్లో వెలుగు, జీవము మరియు నిరీక్షణను ఎలా తెచ్చారో మీ పిల్లలను పంచుకోనివ్వండి.
“ఆయన దైవపుత్రుని అసమాన బహుమానము కొరకు దేవునికి కృతజ్ఞతలు.”
-
యేసు క్రీస్తు మూలంగా మనం పొందిన బహుమానాలేవి? బహుశా మీరు, మీ పిల్లలు “జీవముతోనున్న క్రీస్తు”లో ఈ బహుమానాల కొరకు చూడవచ్చు. అప్పుడు వారు ఆ బహుమానాలను సూచించడానికి ఏదైనా బహుమతిగా చుట్టవచ్చు. రక్షకుడిని మరియు ఆయన మనకు అందించిన బహుమానాలను గుర్తుంచుకోవడానికి మీ పిల్లలు క్రిస్మస్ రోజున బహుమతులు తెరవాలని మీరు సూచించవచ్చు.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.