Doctrine and Covenants 2025
డిసెంబరు 15–21: “సృష్టికర్త ప్రణాళికకు కుటుంబము కేంద్రమైయున్నది”: కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన


“డిసెంబరు 15–21: ‘సృష్టికర్త ప్రణాళికకు కుటుంబము కేంద్రమైయున్నది’: కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

ఒక కుటుంబము

డిసెంబరు 15–21: “సృష్టికర్త ప్రణాళికకు కుటుంబము కేంద్రమైయున్నది”

కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన

మనం పుట్టక ముందు నుండి మనము ఒక కుటుంబములో, అనగా మన పరలోక తల్లిదండ్రుల కుటుంబములో భాగము. ఆ నమూనా భూమిపై కూడా కొనసాగుతుంది. ఇక్కడి కుటుంబాలు పరలోకములో నున్న పరిపూర్ణ నమూనాను ఉత్తమంగా అనుకరించాలి.

భూలోక కుటుంబాలు ఆదర్శవంతంగా లేదా ప్రయోజనాత్మకంగా ఉంటాయన్న హామీ ఏదీ లేదు. కానీ అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ బోధించినట్లుగా, కుటుంబాలు “పరలోకములో మనము అనుభవించిన ప్రేమకు దగ్గరగా ఉండే ఏకైక ప్రేమ—తల్లిదండ్రుల ప్రేమతో లోకానికి స్వాగతించుటకు దేవుని యొక్క పిల్లలకు మంచి అవకాశమిచ్చును” (“దేవుని యొక్క కుటుంబాన్ని సమకూర్చుట,” లియహోనా, మే 2017, 20). కుటుంబాలు అపరిపూర్ణమైనవని, అపవాది దాడులకు లోబడతాయని తెలుసుకొని దేవుడు మనల్ని విమోచించడానికి మరియు మన కుటుంబాలను స్వస్థపరచడానికి ఆయన ప్రియ కుమారుడిని పంపారు. మరియు కుటుంబాలను కాపాడి, బలపరచడానికి ఆయన కడవరి-దిన ప్రవక్తలను ఒక ప్రకటనతో పాటు పంపారు. మర్త్య కుటుంబాలు దైవికంగా ఆదర్శవంతంగా లేకపోయినప్పటికీ, మనము ప్రవక్తలను అనుసరించి, రక్షకునిపై విశ్వాసముంచినట్లయితే, భూమిపై మరియు పరలోకంలో కుటుంబాల కొరకు నిరీక్షణ గలదు.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సెమినరీ చిహ్నము
“సృష్టికర్త ప్రణాళికకు కుటుంబము కేంద్రమైయున్నది”

కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” స్పష్టముగా కుటుంబాలకు సంబంధించినది. కానీ, అది అంతే సమానముగా దేవుని రక్షణ ప్రణాళికకు సంబంధించినది. ప్రకటనను అధ్యయనం చేయడానికి ఒక విధానము ఒక కాగితంపై పూర్వమర్త్య జీవితము, మర్త్య జీవితము మరియు మర్త్యత్వము తరువాతి జీవితము అనే వాక్యభాగాలను వ్రాసి, ఈ విషయాలలో ప్రతీ దాని గురించి ప్రకటన ఏమి బోధిస్తుందో జాబితా చేయడం. ఈ విధానంలో మీరు ప్రకటనను చదివినప్పుడు, మీరేమి నేర్చుకుంటారు? వివాహము మరియు కుటుంబము దేవుని ప్రణాళికకు ఎందుకు ఆవశ్యకమైనవని మీరు గ్రహించడానికి ఇది ఎలా సహాయపడుతుంది? ప్రకటనలోని సత్యాలు మీ ఎంపికలను ఎలా ప్రభావితం చేస్తాయి?

వివిధ కారణాల వల్ల, వివాహం లేదా పిల్లలను పెంచడం గురించి భయపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒక స్నేహితుడు మీతో, “నేను ఎప్పుడూ పెళ్ళి చేసుకోవాలని లేదా కుటుంబాన్ని కలిగి ఉండాలని అనుకోను” అని చెప్తే, మీరు ఏమి చెప్తారు? బహుశా దేవుని ప్రణాళికపై నిరీక్షణ కలిగి ఉండడానికి మీ స్నేహితునికి సహాయపడే దాని కోసం వెదుకుతూ మీరు ప్రకటనను శోధించవచ్చు.

మరొక ప్రశ్న మీరు అడుగబడవచ్చు—లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు—ఇలాంటిది ఒకటి: “నా కుటుంబ పరిస్థితి కుటుంబ ప్రకటనలో వివరించిన దానితో సరిపోలకపోతే ఏమి చేయాలి?” మీరు ప్రవచనాత్మక సలహా కొరకు చూడగల రెండు ప్రదేశాలు ఇక్కడున్నాయి: “ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ గారి సందేశము “యేసు క్రీస్తే తల్లిదండ్రుల బలము” (లియహోనా, మే 2023, 55–59)లో ఒక గొప్ప మార్పు” అనే విభాగము.

మీరు చదివిన దాని కారణంగా మీరు ఏమి చేయడానికి ప్రేరణ పొందారు?

డాలిన్ హెచ్. ఓక్స్, “ప్రణాళిక మరియు ప్రకటన,” లియహోనా, నవ. 2017, 28–31 కూడా చూడండి.

“ప్రతి [వ్యక్తి] పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన కుమారుడు లేదా కుమార్తెయైయున్నారు.”

మనము తరచు కుటుంబ ప్రకటనను కుటుంబ జీవితానికి మార్గదర్శిగా అనుకుంటాము. కానీ అది మన పరలోక కుటుంబము మరియు నిత్య గుర్తింపు గురించి ముఖ్యమైన సత్యాలను కూడా బోధిస్తుంది. మనమందరము ఈ కుటుంబములో భాగమని తెలుసుకోవడం మీకెందుకు ముఖ్యమైనది? మీరు చేసే ఎంపికలను ఈ సత్యం ఎలా ప్రభావితం చేస్తుంది?

“ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బోధనలపై పునాది వేయబడిన కుటుంబ జీవితములో సంతోషము మరింత అధికముగా పొందబడును.”

“కుటుంబ జీవితములో సంతోషము” కొరకు నమూనాగా కుటుంబ ప్రకటన యొక్క 6 మరియు 7వ పేరాల గురించి ఆలోచించండి. మీరు ఈ పేరాలను చదివినప్పుడు, “విజయవంతమైన వివాహములు మరియు కుటుంబాలు” యొక్క సూత్రాలను గుర్తించండి. మీరు మీ స్వంత కుటుంబంలో లేదా ఇతర కుటుంబాలలో చూసిన ఈ సూత్రాల ఉదాహరణల గురించి మీరు ఆలోచించవచ్చు. కుటుంబ జీవితానికి యేసు క్రీస్తును పునాదిగా చేసుకోవడానికి ఈ సూత్రాలు ఎలా సహాయపడతాయి?

తరువాత మీరు బలపరచాలని కోరుకున్న కుటుంబ బంధాన్ని గురించి మీరు ఆలోచించవచ్చు. మీరు పొందే మనోభావాలపై చర్య తీసుకోవడానికి, రక్షకుని సహాయంతో ఒక ప్రణాళిక చేయండి.

ఎల్. విట్నీ క్లేటన్, “శ్రేష్టమైన గృహాలు,” లియహోనా, మే 2020, 107–9 కూడా చూడండి.

తన పిల్లల కొరకు చదువుతున్న తండ్రి

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమలో మరియు నిజాయితీలో పెంచవలెను.

“కుటుంబమును … గ్రహించి, బలపరచుటకు బాధ్యత గల పౌరులకు మేము పిలుపునిచ్చుచున్నాము.”

కుటుంబ ప్రకటన యొక్క చివరి పేరా చర్య తీసుకోవడానికి పిలుపును కలిపియుంది. మీరు ఆ పిలుపుకు ఎలా ప్రతిస్పందిస్తారో పరిగణిస్తున్నప్పుడు, ప్రకటన యొక్క శీర్షికను అధ్యయనం చేయడం సహాయపడవచ్చు. ఉదాహరణకు, ప్రకటన అంటే ఏమిటి? ఈ పత్రం యొక్క సందేశం గురించి ఆ పదం మీకు ఏమి సూచిస్తుంది? కుటుంబాల గురించి ప్రపంచానికి ఒక ప్రకటన జారీ చేయడానికి ప్రథమ అధ్యక్షత్వానికి మరియు పన్నెండుమంది అపోస్తలులకు అర్హతనిచ్చినదేది? ప్రకటన యొక్క ప్రధాన సందేశాలుగా మీరు భావించే వాటి జాబితాను కూడా మీరు తయారు చేయవచ్చు. మీరు మీ జీవితంలో, మీ ఇంట్లో మరియు మీ సంఘంలో ఈ సందేశాలను ఎలా ప్రచారం చేయవచ్చు?

6:56

Defenders of the Faith

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 02

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

పరలోక తండ్రి ప్రణాళికలో కుటుంబాలు ముఖ్యమైనవి.

  • వాటి గురించి అందరికీ చెప్పాలని వారు కోరుకునేంత ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించడంలో మీ పిల్లలకు సహాయపడండి. మీ పిల్లలకు “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” యొక్క ప్రతిని చూపించండి మరియు కుటుంబాలు పరలోక తండ్రికి ఎంత ముఖ్యమైనవో మనందరికి చెప్పడానికి ప్రవక్తలు మరియు అపొస్తలులు దానిని వ్రాసారని వివరించండి. కుటుంబాలు ఆయనకు ఎందుకంత ముఖ్యమైనవి?ChurchofJesusChrist.org

    1:19

    What Is the Purpose of Family?

  • ప్రకటన నుండి మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీరు భావించే దేనినైనా మీ పిల్లలతో పంచుకోండి. ఆ సత్యాల గురించి వారి భావాలను పంచుకోవడానికి పిల్లలను ఆహ్వానించండి. మనకు ఈ విషయాలు తెలియకపోతే మన జీవితాలు ఎలా భిన్నంగా ఉండేవి? ప్రకటనలో కనుగొనబడే సత్యాలకు సంబంధించి ఒక పాటను కూడా మీరు కలిసి పాడవచ్చు.

  • ప్రణాళిక మరియు ప్రకటన” (లియహోనా, నవ. 2017, 30) అనే ఆయన సందేశము యొక్క IV విభాగములో, కుటుంబ ప్రకటన ఎలా వ్రాయబడిందో అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ వివరించారు. బహుశా మీరు మరియు మీ పిల్లలు కలిసి ఆయన వివరణను సమీక్షించవచ్చు మరియు కుటుంబాల గురించి ఈ సత్యాలను మనకు బోధించేలా ప్రభువు తన సేవకులను ప్రేరేపించినందుకు మీరు ఎందుకు కృతజ్ఞతతో ఉన్నారనే దాని గురించి మాట్లాడవచ్చు.

  • కుటుంబ ప్రకటనలో కనిపించే సత్యాలను చిత్రీకరించే చిత్రాలను కూడా మీరు మీ పిల్లలకు చూపించవచ్చు (లేదా కొన్నింటిని గీయడానికి వారిని ఆహ్వానించండి). ఇవి దేవాలయం, ఒక కుటుంబం ప్రార్థించడం లేదా కలిసి ఆడుకోవడం లేదా ఒక జంట వివాహం చేసుకున్న చిత్రాలు కావచ్చు. అప్పుడు మీ పిల్లలు కుటుంబ ప్రకటనలో చిత్రాలకు సంబంధించిన వాక్యాలను కనుగొనగలరు. ప్రకటనలో ఈ విషయాల గురించి ప్రభువు మనకు ఏమి బోధించారు?

పిల్లలతో ఒక స్త్రీ

కుటుంబాలు సంతోషంగా ఉండాలని పరలోక తండ్రి కోరుతున్నారు.

సున్నితంగా ఉండండి. కుటుంబ ప్రకటనలో బోధించబడిన సత్యాలను మీరు బోధిస్తున్నప్పుడు, ప్రకటనలో వివరించిన ఆదర్శాలకు సరిపోలని కుటుంబాలలో చాలామంది పిల్లలు నివసిస్తున్నారని దయచేసి గుర్తుంచుకోండి. మీరు వారిని ఎలా ప్రోత్సహించవచ్చో మరియు ప్రేరేపించవచ్చో పరిశీలించండి.

నేను “పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన ఆత్మ కుమారుడిని లేదా కుమార్తెను.”

  • కుటుంబ ప్రకటనలో “పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన ఆత్మ కుమారుడు లేదా కుమార్తె” అనే వాక్యభాగాన్ని కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయండి మరియు ఈ సత్యానికి మీ సాక్ష్యాన్ని అందించండి.

యేసు క్రీస్తును అనుసరించినప్పుడు కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి.

  • మీ కుటుంబాన్ని బలోపేతం చేయడం గురించి సంభాషణను ప్రారంభించడానికి, మీరు మరియు మీ పిల్లలు మన దంతాలు, మన శరీరాలు లేదా ఒక భవనం వంటి ఇతర వస్తువులను బలోపేతం చేయడానికి మనము ఏమి చేస్తాము అనే దాని గురించి మాట్లాడవచ్చు. తర్వాత మీరు దానిని ఒక బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడంతో పోల్చవచ్చు. కుటుంబ ప్రకటనలోని 7వ పేరాలో (ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీని కూడా చూడండి) కుటుంబ జీవితంలో సంతోషానికి దారితీసే క్రీస్తువంటి సూత్రాలను కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.