“అక్టోబరు 27–నవంబరు 2: ‘నా నామమున ఒక మందిరము’: సిద్ధాంతము మరియు నిబంధనలు 124,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 124,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Nauvoo the Beautiful [అందమైన నావూ], లారీ సి. విన్బర్గ్ చేత కాపీరైటు 2025
అక్టోబరు 27–నవంబరు 2: “నా నామమున ఒక మందిరము”
సిద్ధాంతము మరియు నిబంధనలు 124
గత ఆరు సంవత్సరాలలో పరిశుద్ధుల పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నప్పటికీ, 1839 వసంతకాలంలో మెరుగుపడసాగాయి: ఇల్లినాయ్‌లోని క్విన్సీ నివాసుల మధ్య శరణార్థులైన పరిశుద్ధులు దయను కనుగొన్నారు. జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులు మిస్సోరిలో నిర్బంధం నుండి తప్పించుకోవడానికి కావలివారు అనుమతించారు. ఇటీవలే సంఘము ఇల్లినాయ్‌లో స్థలము కొనుగోలు చేసింది, అక్కడ పరిశుద్ధులు మరలా సమకూడగలరు. అది బురదనేల, దోమలు నిండిన నేల అయినప్పటికీ, పరిశుద్ధులు అప్పటికే అనుభవించిన సవాళ్ళతో పోల్చితే బహుశా ఇది సంభాళించదగినదిగా కనిపించియుండవచ్చు. కాబట్టి వారు ఆ బురదనంతా ఖాళీచేసి, ఒక క్రొత్త పట్టణానికి ప్రణాళిక రచించారు, దానికి వారు నావూ అని పేరు పెట్టారు. మొదట అది ఖచ్చితమైన వర్ణన కంటే ఎక్కువగా విశ్వాసము యొక్క వ్యక్తీకరణ అయినప్పటికీ, హెబ్రీ భాషలో దానర్థము “అందమైనది”. ఇంతలో ప్రభువు తన ప్రవక్తకు అత్యవసర భావనను కల్పించారు. ఆయన మరిన్ని సత్యాలను, విధులను పునఃస్థాపించవలసియున్నది మరియు “ఆయన [తన పరిశుద్ధులకు] ఘనత, అమర్త్యత్వము, నిత్యజీవమును కిరీటముగా” (సిద్ధాంతము మరియు నిబంధనలు 124:55) ఇవ్వగలిగేలా ఆయనకు ఒక పరిశుద్ధ దేవాలయము అవసరమైనది. అనేకవిధాలుగా, విశ్వాసము మరియు అత్యవసరత యొక్క ఇవే భావాలు నేడు ప్రభువు యొక్క కార్యములో స్పష్టముగా కనబడుతున్నాయి.
ఇల్లినాయ్‌లోని సంఘ చారిత్రక ప్రదేశాల గురించి మరింత తెలుసుకోండి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:2–11
క్రీస్తు వద్దకు రావడానికి నేను ఇతరులను ఆహ్వానించగలను.
“భూలోక రాజులందరికి (ఆయన) సువార్తను గూర్చి ఒక గంభీరమైన ప్రకటన చేయమని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 124: 2–11) ప్రభువు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు చెప్పారు. మీరు ఈ నియామకాన్ని పొందినట్లయితే, మీ ప్రకటన యేసు క్రీస్తు మరియు పునరుద్ధరించబడిన ఆయన సువార్త గురించి ఏమి చెబుతుంది? మీరు రోజువారీ సంభాషించే వ్యక్తులతో మీ సాక్ష్యాన్ని సాధారణంగా మరియు సహజంగా ఎలా పంచుకోవచ్చో కూడా ధ్యానించండి.
“యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: ప్రపంచమునకు ద్విశతాబ్ది ప్రకటన,” సువార్త గ్రంథాలయము కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:12–21
ప్రభువు నమ్మే శిష్యునిగా నేను కాగలను.
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:12–21లో రక్షకుడు చేసినట్లుగా, మీరు వారిలో చూసే క్రీస్తువంటి సుగుణాలను ఇతరులతో పంచుకోవడాన్ని పరిగణించండి. ఆయన మీపట్ల తన ప్రేమ మరియు నమ్మకాన్ని ఎలా వ్యక్తపరిచారు?
రిఛర్డ్ జె. మేనెస్, “Earning the Trust of the Lord and Your Family,” లియహోనా, నవ. 2017, 75–77 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:22–24, 60–61
ఇతరులను ఆహ్వానించి, అంగీకరించమని ప్రభువు నన్ను కోరుతున్నారు.
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 124:22–24, 60–61లో ప్రభువు యొక్క ఉపదేశమును ధ్యానిస్తున్నప్పుడు, నావూ కోసం ప్రభువు ఊహించిన విధంగా మీరు మీ ఇంటిని మరియు మీ వార్డును ఎలా మార్చుకోవచ్చో ఆలోచించండి.
A Friend to All
Joseph Smith at the Nauvoo Temple [నావూ దేవాలయం వద్ద జోసెఫ్ స్మిత్] నుండి వివరణ, గ్యారీ ఇ. స్మిత్ చేత
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:25–45, 55
పవిత్రమైన విధులను పొందడానికి మనము ప్రభువుకు దేవాలయాలను నిర్మిస్తాము.
“[ఆయన] పరిశుద్ధ నామానికి [దేవాలయాలు] నిర్మించమని” ప్రభువు తన జనులను “ఎల్లప్పుడూ ఆజ్ఞాపించారు” అని మీరు ఎందుకు భావిస్తున్నారు? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 124:25–45, 55లో కనుగొనే కారణాల జాబితాను రూపొందించడాన్ని పరిగణించండి. దేవాలయాలను నిర్మించే పని ప్రభువుకు మీ పట్ల ఉన్న ప్రేమకు ఎలా సంకేతము?
What Is a Temple?
1840 లలో నావూ దేవాలయం నిర్మించబడినప్పటి నుండి, 300లకు పైగా దేవాలయాలు నిర్మించబడ్డాయి లేదా ప్రకటించబడ్డాయి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “దేవాలయంలో మనం గడిపే సమయం మన యొక్క మరియు మన కుటుంబాల యొక్క రక్షణకు, ఉన్నతస్థితికి ముఖ్యమైనది అని మనకు తెలుసు. … అపవాది యొక్క ముట్టడులు తీవ్రంగా, అనేకరకాలుగా, శరవేగంగా ఉధృతమవుతున్నాయి. క్రమముగా, తరచుగా దేవాలయములో ఉండుటకు మన అవసరత ఇంత గొప్పగా ఎప్పుడూ లేదు” (“మార్గదర్శకులైన కడవరి-దిన పరిశుద్ధులగుట,” లియహోనా, నవ. 2018, 114). “అపవాది యొక్క ముట్టడులు” తట్టుకోవడానికి దేవాలయము మీకెలా సహాయపడింది? అధ్యక్షులు నెల్సన్ గారి సలహాను అనుసరించడానికి ఏమి చేయాలని మీరు ప్రభావితం చేయబడ్డారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:45–55
ప్రభువు తన ఆజ్ఞలకు విధేయత చూపడానికి ప్రయత్నించే జనులను ఆశీర్వదిస్తారు.
మిస్సోరిలోని జాక్సన్ కౌంటీలో దేవాలయాన్ని నిర్మించాలని పరిశుద్ధులు ఆజ్ఞాపించబడ్డారు, కానీ “వారి శత్రువులచేత ఆటంకపరచబడ్డారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 124:51). 49–55 వచనములు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలనుకున్నప్పటికీ కుటుంబం లేదా ఇతర పరిస్థితుల కారణంగా అలా చేయకుండా నిరోధించబడిన వ్యక్తులకు భరోసా ఇచ్చే సందేశాన్ని కలిగి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఉన్నవారికి సహాయపడే ఏ సలహాను మీరు ఈ వచనాలలో కనుగొంటారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:91 92
నా గోత్రజనకుని దీవెన ద్వారా ప్రభువు నన్ను నడిపించగలరు.
ప్రవక్త యొక్క తండ్రియైన జోసెఫ్ స్మిత్ సీనియర్ మరణించిన కొద్దికాలానికే, ప్రభువు హైరం స్మిత్‌ను అతని తండ్రి కలిగియున్న పిలుపుకు—సంఘము యొక్క గోత్రజనకునిగా పిలిచారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 124:91–92 లో దీని గురించి మీరు చదవవచ్చు.
గోత్రజనకుడు మరియు గోత్రజనకుని దీవెనల చరిత్ర గురించి మరింత నేర్చుకోవడానికి, ఇక్కడ నొక్కండి.
గోత్రజనకుని దీవెన గురించి ఎన్నడూ వినని వ్యక్తికి మీరు దానిని ఎలా వివరిస్తారు? దానిని పొందమని ఒకరిని ప్రోత్సహించడానికి మీరు ఏమి చెబుతారు? ఎల్డర్ రాండల్ కె. బెన్నెట్ గారి సందేశము “మీ గోత్రజనకుని దీవెన—పరలోకపు తండ్రి నుండి ప్రేరేపించబడిన నడిపింపు” (లియహోనా, మే 2023, 42–43)లో ఈ ప్రశ్నలకు జవాబుల కొరకు చూడండి.
మీరు అధ్యయనం చేసిన మరియు అనుభవించిన వాటి ఆధారంగా, మీరు ఈ వాక్యాన్ని ఎలా పూర్తి చేస్తారో పరిగణించండి: “గోత్రజనకుని దీవెన వంటిది.” పరలోక తండ్రి తన పిల్లలు గోత్రజనకుని దీవెన పొందాలని ఎందుకు కోరుకుంటున్నారు?
మీరు గోత్రజనకుని దీవెన పొందకపోతే, దానికి సిద్ధం కావడానికి మీరు ఏమి చేయగలరు? మీరు గోత్రజనకుని దీవెన పొందినట్లయితే, మీకు ఈ బహుమానం విలువైనదని దేవునికి మీరెలా చూపించగలరు?
కజుహికో యమషితా, “మీ గోత్రజనకుని దీవెనను ఎప్పుడు పొందాలి,” లియహోనా, మే 2023, 88–90; ప్రధాన చేతిపుస్తకము, 18.17, సువార్త గ్రంథాలయము కూడా చూడండి.
మనస్సులో నుండి బోధించండి. వ్యక్తిగత అనుభవాలు మరియు సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు బోధన చాలా అర్థవంతంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు గోత్రజనకుని దీవెనను పొందినట్లయితే, ఈ ప్రత్యేక దీవెనల గురించి బోధించడానికి మీరు సిద్ధమవుతున్నప్పుడు దాన్ని సమీక్షించండి. మీ దీవెన కొరకు మీరు ఎందుకు కృతజ్ఞత కలిగియున్నారు? ఇతరులను వారి దీవెనలు స్వీకరించడానికి లేదా గోత్రజనకుని దీవెనలను మరింత తరచుగా అధ్యయనం చేయడానికి మీరు ఎలా ప్రేరేపిస్తారు?
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:15, 20
యేసు క్రీస్తు నిజాయితీని ప్రేమిస్తారు.
-
మీ పిల్లలు సిద్ధాంతము మరియు నిబంధనలు 124:15, 20 నుండి నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోవడంలో వారికి సహాయపడడానికి, కాగితం హృదయాలను గీయడానికి మరియు కత్తిరించడానికి మీరు వారికి సహాయపడవచ్చు. హృదయాలపై, ఈ వచనాల నుండి కీలకమైన వాక్యభాగాలను వ్రాయడంలో మీరు వారికి సహాయం చేయవచ్చు. “Stand for the Right” (Children’s Songbook,159) వంటి పాట ప్రభువు మాటలను బలపరచగలదు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:15, 20 కలిసి చదివిన తర్వాత, For the Strength of Youth: A Guide to Making Choices యొక్క 31వ పేజీలో మీ పిల్లలు నిజాయితీగా జీవించడం అంటే ఏమిటో కనుగొనడానికి బహుశా మీరు సహాయం చేయవచ్చు. “[జార్జ్] హృదయం యొక్క నిజాయితీ కారణంగా” 20వ వచనములో జార్జ్ మిల్లర్ గురించి ప్రభువు ప్రత్యేకంగా ఏమి చెప్పారు? మీరు మీ స్వంత అనుభవం నుండి లేదా ఫ్రెండ్ పత్రిక నుండి నిజాయితీని చూపించే పిల్లల ఉదాహరణలను కూడా పంచుకోవచ్చు. ఈ వారంలో నిజాయితీని చూపించడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోమని మరియు వారు అలా చేసినప్పుడు వారు ఎలా భావిస్తారో మీకు చెప్పమని మీ పిల్లలను ఆహ్వానించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:28-29, 39
దేవాలయాలు నిర్మించమని యేసు తన జనులను ఆజ్ఞాపించారు.
-
మీ పిల్లలు ఒక పురాతన దేవాలయం మరియు వారు నివసించే ప్రదేశానికి దగ్గరగా ఉన్న దేవాలయంతో సహా దేవాలయాల చిత్రాలను చూసి ఆనందించవచ్చు (ChurchofJesusChrist.org/temples/list చూడండి). పురాతన కాలంలో మరియు మన కాలంలో దేవాలయాలను నిర్మించమని యేసు క్రీస్తు ఎల్లప్పుడూ తన జనులకు ఆజ్ఞాపించారని వివరించడానికి మీరు ఈ చిత్రాలు మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 124:39 ఉపయోగించవచ్చు (ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీ కూడా చూడండి).
-
మీరు దేవాలయానికి తగినంత దగ్గరగా నివసిస్తుంటే, మీ పిల్లలను అక్కడికి తీసుకెళ్ళి, దేవాలయ ప్రాంగణంలో భక్తిపూర్వకంగా నడవండి. దేవాలయం వెలుపలి భాగంలో “ప్రభువుకు పరిశుద్ధత—ప్రభువు యొక్క మందిరము” అనే పదాలను కనుగొనమని వారిని ఆహ్వానించండి. ఈ పదాలకు అర్థం ఏమిటో మీ పిల్లలతో మాట్లాడండి.
-
మీ పిల్లలు దేవాలయంలోకి ప్రవేశించే రోజు కోసం ఎదురుచూడడంలో సహాయపడేందుకు అనుబంధం ఎ లోని “పూర్వీకుల కొరకు బాప్తిస్మము తీసుకొనుట మరియు నిర్ధారించబడుట”లోని ఆలోచనలను ఉపయోగించడాన్ని పరిగణించండి (అనుబంధం బి లోని “దేవాలయము మరియు సంతోష ప్రణాళిక” కూడా చూడండి).
Solomon’s Temple [సొలొమోను దేవాలయము], శామ్ లాలర్ చేత
సిద్ధాంతము మరియు నిబంధనలు 124:91 92
నా గోత్రజనకుని దీవెన ద్వారా ప్రభువు నన్ను దీవిస్తారు.
-
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 124:91–92 కలిసి చదువుతున్నప్పుడు, హైరం స్మిత్‌ని ప్రభువు ఏమి చేయమని పిలిచారో కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయండి. గోత్రజనకుని దీవెన అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడండి: ప్రభువు మన గురించి మరియు మనం ఏమి చేయాలని, మనం ఏమి కావాలని కోరుతున్నారో బోధించే ఒక ప్రత్యేక దీవెన. మీ పిల్లలు గోత్రజనకుని దీవెన పొందడానికి సిద్ధపడేందుకు అనుబంధం ఎ లోని “గోత్రజనకుని దీవెనను పొందడం” అనే విభాగాన్ని ఉపయోగించడాన్ని పరిగణించండి.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.