నవంబరు 10–16: ‘విధేయత చూపుటకు నీవు చేసిన త్యాగములను నేను చూచియున్నాను’: సిద్ధాంతము మరియు నిబంధనలు 129–132” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 129–132,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Joseph Smith in Nauvoo, 1840 [నావూలో జోసెఫ్ స్మిత్, 1840] నుండి వివరణ, థియోడోర్ గోర్కా చేత
నవంబరు 10–16: “విధేయత చూపుటకు నీవు చేసిన త్యాగములను నేను చూచియున్నాను”
సిద్ధాంతము మరియు నిబంధనలు 129–132
జోసెఫ్ స్మిత్ ద్వారా, ప్రభువు కొన్ని రహస్యాలను నిత్యత్వం నుండి బయటకు తీశారు. పునఃస్థాపించబడిన సువార్త వెలుగులో దేవుని గొప్పతనం, పరలోకం యొక్క మహిమ మరియు నిత్యత్వం యొక్క విస్తారత మనలాంటి పరిమిత మనస్సులకు కూడా దాదాపుగా సుపరిచితం అనిపించవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 129–32 లోని బయల్పాటులు ఒక మంచి ఉదాహరణ. దేవుడు ఎలా ఉంటారు? “స్పర్శించగలుగు మనుష్యుని శరీరమువంటి … శరీరమును” ఆయన కలిగియున్నారు. పరలోకము ఎలా ఉంటుంది? “ఇక్కడ మన మధ్య ఉన్న సమాజ వ్యవస్థయే అక్కడ మన మధ్య ఉండును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22, 2). వాస్తవానికి, పరలోకం గురించిన అత్యంత సంతోషకరమైన సత్యం ఏమిటంటే, సరైన అధికారం ద్వారా ముద్ర వేయబడితే అది మన ప్రతిష్ఠాత్మకమైన కుటుంబ సంబంధాలను కలిగి ఉంటుంది. ఇటువంటి సత్యాలు పరలోకము ఎంతో దూరంలో లేనట్లుగా—మహికరమైనది, అయినను చేరుకోగలదిగా భావింపజేస్తాయి.
కానీ కొన్నిసార్లు అసౌకర్యంగా మరియు చేరుకోలేనిదిగా అనిపించే పనులను చేయమని దేవుడు మనల్ని అడగవచ్చు. అనేకమంది ప్రారంభ పరిశుద్ధులకు, బహు వివాహము అటువంటి ఒక ఆజ్ఞ. జోసెఫ్ స్మిత్, ఆయన భార్య ఎమ్మా మరియు దాదాపు దానిని పొందిన ప్రతీఒక్కరి కొరకు ఇది వారి విశ్వాసానికి తీవ్ర పరీక్షగా ఉండెను. ఈ పరీక్షను ఎదుర్కోవడానికి వారికి పునఃస్థాపించబడిన సువార్త గురించి కేవలం మంచి భావాలకంటే ఎక్కువ అవసరమైంది; దేవుని యందు అత్యంత లోతైన విశ్వాసము వారికి అవసరమైంది. నేడు ఆ ఆజ్ఞ అమలులో లేదు, కానీ దాని ప్రకారము జీవించిన వారి విశ్వాసపూరితమైన మాదిరి ఇంకా నిలిచియుంది. మరియు మనము “విధేయత చూపుటకు మన స్వంత త్యాగములను” (సిద్ధాంతము మరియు నిబంధనలు132:50) చేయమని అడుగబడినప్పుడు ఈ మాదిరి మనల్ని ప్రేరేపిస్తుంది.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 130–132
దేవుడు తన పిల్లలను హెచ్చించాలనుకుంటున్నారు.
సిలెస్టియల్ రాజ్యం యొక్క అత్యున్నత స్థాయిలో ఉన్న ఉన్నతస్థితి లేదా జీవితం—దేవుడు జీవించే జీవితం గురించి మనకు తెలియని అనేక విషయాలు ఉన్నాయి. అందులో చాలా వరకు మనం అర్థం చేసుకోగల ప్రస్తుత సామర్థ్యానికి మించి ఉండవచ్చు. కానీ దేవుడు కొన్ని విలువైన ఆధారాలను వెల్లడించారు మరియు వాటిలో చాలా వరకు సిద్ధాంతము మరియు నిబంధనలు 130–32లో కనుగొనబడతాయి. ఉదాహరణకు, ఇటువంటి ప్రశ్నలను మనస్సులో ఉంచుకొని మీరు చదవవచ్చు: దేవుని గురించి నేనేమి నేర్చుకుంటాను? మర్త్యత్వము తరువాతి జీవితం గురించి నేనేమి నేర్చుకుంటాను? నిత్య జీవము గురించిన ఈ సమాచారం ఇప్పుడు నా జీవితాన్ని ఎలా దీవిస్తుంది?
సిద్ధాంతము మరియు నిబంధనలు 130:20–21; 132:5
దేవుడు తన చట్టాలను పాటించే జనులను ఆశీర్వదిస్తారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 130:20–21 మరియు 132:5లో ప్రభువు బోధించే దానిని మీ స్వంత మాటలలో మీరు ఎలా పేర్కొంటారు? ఈ సూత్రం మీ జీవితంలో ఎలా ప్రదర్శించబడిందో ధ్యానించండి.
కొన్నిసార్లు, మనం దేవునికి విధేయత చూపినప్పటికీ, మనం ఆశించే ఆశీర్వాదాలు వెంటనే రావు. ఇది జరిగినప్పుడు మీరు మీ విశ్వాసాన్ని మరియు నిరీక్షణను ఎలా కాపాడుకుంటారు? ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ గారి సందేశము “దేవునితో మన సంబంధము” (లియహోనా, మే 2022, 78–80 చూడండి) లో అంతర్దృష్టుల కొరకు చూడండి.
1 నీఫై 17:35; సిద్ధాంతము మరియు నిబంధనలు 82:10 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 132:13–21
కుటుంబాలు నిత్యము కలిసి ఉండేందుకు పరలోక తండ్రి అవకాశం కల్పించారు.
వివాహం మరియు కుటుంబ సంబంధాలు నిత్యము కాగలవు అనే సత్యాన్ని ప్రభువు ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా పునరుద్ధరించారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 132:13–21 చదివినప్పుడు, ఏది శాశ్వతంగా “ఉంటుంది” మరియు ఏది ఉండదు అనే వాటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే వాక్యభాగాల కోసం చూడండి. “[ప్రభువు] వలన” కలిగిన వివాహ బంధం అంటే అర్థం ఏమిటని మీరనుకుంటున్నారు? (14వ వచనము).
అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ తన కుటుంబ పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నప్పుడు అందుకున్న ఈ సలహాను పంచుకున్నారు: “నీవు సిలెస్టియల్ రాజ్యమునకు యోగ్యత కలిగి జీవించు, తరువాత కుటుంబ ఏర్పాట్లు నీవు ఊహించుకొనే దానికంటే మరింత అద్భుతముగా ఉంటాయి” (“ప్రభువు ఆత్మ నివసించే గృహము” లో, లియహోనా, మే 2019, 25). ఈ సలహా మీకు లేదా మీకు తెలిసిన వారికి ఎలా సహాయం చేస్తుంది?
వివాహము ప్రభువు మందిరంలో నిత్యత్వము కొరకు ముద్ర వేయబడగలదు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 132:1–2, 29–40
ఆయన ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే బహు వివాహములు దేవునికి అంగీకారమగును.
పాత నిబంధనను చదివిన వారెవరైనా అబ్రాహాము, యాకోబు, మోషే మరియు ఇతరులు అనేకమంది భార్యలను వివాహమాడడం గురించి ఆశ్చర్యపడియుండవచ్చు. ప్రభువు యొక్క ఈ సేవకులు వ్యభిచారము చేస్తున్నారా? వారి వివాహాలను దేవుడు అనుమతించాడా? జోసెఫ్ స్మిత్ ఇవే ప్రశ్నలు కలిగియున్నాడు. సిద్ధాంతము మరియు నిబంధనలు 132:1–2, 29–40లో దేవుడిచ్చిన జవాబుల కొరకు చూడండి.
ఒక స్త్రీ మరియు ఒక పురుషుని మధ్య వివాహము అనేది దేవుని యొక్క వివాహ నియమము (అధికారిక ప్రకటన 1 యొక్క ప్రకరణ శీర్షిక; జేకబ్ 2:27, 30 చూడండి). అయినప్పటికీ, తన పిల్లలు బహు వివాహమును ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించిన సందర్భాలు ఉన్నాయి.
పునఃస్థాపించబడిన సంఘము యొక్క ప్రారంభ సంవత్సరాలు మినహాయింపు కాలాలలో ఒకటి. ChurchofJesusChrist.org
Why was it necessary for Joseph Smith and others to practice polygamy?
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 130:2, 18–19; 132:13, 19
నేను నిత్య విషయాలపై దృష్టి పెట్టాలని పరలోక తండ్రి కోరుకుంటున్నారు.
-
లోక విషయాల గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 132:13 మనకేమి బోధిస్తుంది? సిద్ధాంతము మరియు నిబంధనలు 130:2, 18–19; 132:19 ప్రకారము మనము మనతోపాటు తరువాతి జీవితంలోకి తీసుకువెళ్ళగలిగే వాటిని సూచించే వస్తువులతో మీ పెట్టెను లేదా సంచిని మీరు మరియు మీ పిల్లలు సర్దుకోవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 130:20–21; 132:5, 21–23
నేను ఆయన చట్టాలను పాటించినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు.
-
బహుశా ఒక సాధారణ పోలిక మీ పిల్లలకు దేవుని ఆజ్ఞలను పాటించడం గురించి నేర్పించవచ్చు. ఉదాహరణకు, పాఠశాలకు లేదా సంఘ భవనానికి ఎక్కడికైనా నడవడానికి మీకు సూచనలను అందించమని మీరు వారిని అడగవచ్చు. మనము సూచనలను అనుసరించనప్పుడు ఏమి జరుగుతుంది? అప్పుడు మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 130:21 చదివి, ఈ సూచనలను దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలతో పోల్చవచ్చు.
-
మీరు విధేయత గురించి ఒక పాటను కూడా కలిసి పాడవచ్చు మరియు పాటలో ఉన్న పదాలను పోలియున్న పదాల కొరకు సిద్ధాంతము మరియు నిబంధనలు 130:20–21 మరియు 132:5లో చూడవచ్చు. మనం ఆయన ఆజ్ఞలను పాటించేందుకు కృషి చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22
పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు అమర్త్య భౌతిక శరీరాలను కలిగి ఉన్నారు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22ను కలిసి చదివిన తర్వాత, మీరు మరియు మీ పిల్లలు యేసు క్రీస్తు చిత్రాన్ని చూడవచ్చు మరియు ఆయన కళ్ళు, ఆయన నోరు మరియు ఆయన శరీరంలోని ఇతర భాగాలను చూపవచ్చు. మీ పిల్లలు తమ శరీరంలోని అవే భాగాలను సూచించవచ్చు. మన శరీరాలు పరలోక తండ్రి మరియు యేసు శరీరాలను పోలి ఉన్నాయని తెలుసుకోవడం మీకు ఎందుకు ముఖ్యమో వారికి చెప్పండి.
ప్రభువు మందిరము యొక్క విధుల కారణంగా, కుటుంబాలు శాశ్వతంగా ఉంటాయి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 132:19
కుటుంబాలు నిత్యము కలిసి ఉండేందుకు పరలోక తండ్రి అవకాశం కల్పించారు.
-
మీ పిల్లలకు శాశ్వతంగా ఉండని వాటి ఉదాహరణలను కనుగొనడంలో సహాయపడండి—పాడైన ఆహారం, వాడిపోయే పువ్వులు మొదలైనవి. అప్పుడు సిద్ధాంతము మరియు నిబంధనలు 132:19ని కలిసి చూడండి మరియు “శాశ్వతమైన నిబంధన,” “ముద్ర వేయబడిన,” “నిత్యత్వమంతటా” మరియు “శాశ్వతంగా” వంటి కీలకమైన వాక్యభాగాలను కనుగొనండి. మీరు మీ కుటుంబ చిత్రాలను కూడా చూడవచ్చు మరియు కుటుంబాలు శాశ్వతంగా ఉండేలా, దేవాలయంలోని విధులు మరియు నిబంధనల ద్వారా ప్రభువు దానిని సాధ్యం చేశారని సాక్ష్యమివ్వవచ్చు.
Chapter 55: A Revelation about Marriage: July 1843
కుటుంబ పరిస్థితుల పట్ల సున్నితంగా ఉండండి. “ఈ రోజు పిల్లలు అనేక విభిన్నమైన మరియు సంక్లిష్టమైన కుటుంబ ఆకృతులలో తమనుతాము కనుగొంటారు. … [మనము] ఒంటరిగా భావించే [వారిని], వదిలివేయబడేవారిని లేదా కంచె వెలుపల ఉన్న వారిని చేరుకోవాలి” (Neil L. Andersen, “Whoso Receiveth Them, Receiveth Me,” Liahona, May 2016, 49, 52).
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.