“నవంబరు 17–23: ‘పెండ్లి కుమారుని రాక కొరకు మీరు సిద్ధపడుడి’: సిద్ధాంతము మరియు నిబంధనలు 133–134,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 133–134,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Ten Virgins [పదిమంది కన్యకలు], జార్జ్ కొక్కో చేత
నవంబరు 17-23: “పెండ్లి కుమారుని రాక కొరకు మీరు సిద్ధపడుడి”
సిద్ధాంతము మరియు నిబంధనలు 133–134
1833లో, అల్లరిమూకలు సంఘ ముద్రణాలయంపై దాడి చేసి ధ్వంసం చేశాయి. ఆ సమయంలో పురోగతిలో ఉన్న ముద్రణలలో ఆజ్ఞల గ్రంథం ఉంది—దేవుని యొక్క కడవరి-దిన బయల్పాటులను సంకలనం చేయడానికి సంఘము యొక్క మొదటి ప్రయత్నమది. అల్లరిమూకలు విడి కాగితాలను చెల్లాచెదురు చేసారు మరియు ధైర్యముగల పరిశుద్ధులు వాటిలో కొన్నింటిని కాపాడినప్పటికీ, ఆజ్ఞల గ్రంథము యొక్క కొన్ని అసంపూర్ణ ప్రతులు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలిసింది.
ఇప్పడు సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క 133వ ప్రకరణముగా మనకు తెలిసినది ఆజ్ఞల గ్రంథానికి అనుబంధము కావలసినది, ప్రభువు యొక్క ప్రచురించబడిన బయల్పాటుల అంతమున ఆశ్చర్యార్థకం వంటిది. ఇది రాబోయే తీర్పుదినము గురించి హెచ్చరించును మరియు ఆధునిక బయల్పాటు అంతటా కనుగొనబడు పిలుపును ప్రతిధ్వనించును: బబులోను చేత సంకేతమివ్వబడినట్లు ప్రాపంచికతత్వమా పారిపొమ్ము. సీయోనును నిర్మించుము. రెండవ రాకడ కొరకు సిద్ధపడుము. మరియు ఈ సందేశమును “ప్రతి జనమునకు, వంశమునకు, భాషకు, ప్రజలకు” (37వ వచనము) విస్తరింపజేయుము. ఆజ్ఞల గ్రంథము కొరకు వేసిన మొదటి ప్రణాళికలు నెరవేరనప్పటికీ, ఈ బయల్పాటు ప్రభువు యొక్క కార్యము ఆటంకపరచబడలేదు అనడానికి గుర్తుగా మరియు సాక్ష్యముగా ఉంది, “ఏలయనగా … ఆయన తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు, భూదిగంత నివాసులందరు తమ దేవుని రక్షణను చూచెదరు” (3వ వచనము).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:4–14
బబులోనును తిరస్కరించి సీయోనుకు రమ్మని యేసు క్రీస్తు నన్ను పిలుస్తున్నారు.
సీయోను యొక్క ఆధ్యాత్మిక వ్యతిరేకం బబులోను—ఒక పురాతన నగరం, ఇది లేఖనాలంతటా దుష్టత్వానికి మరియు ఆధ్యాత్మిక దాస్యానికి ప్రతీక. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 133:4–14 చదివినప్పుడు, “బబులోను నుండి బయలు వెళ్ళుటకు” (5వ వచనము) మరియు “సీయోను ప్రదేశమునకు … వెళ్ళుటకు” (9వ వచనము) రక్షకుడు మిమ్మల్ని ఎలా పిలుస్తున్నారో ధ్యానించండి. ఆయన పిలుపుకు మీరెలా స్పందిస్తున్నారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:1–19, 37-39
రక్షకుని రెండవ రాకడ కొరకు నేను ఇప్పుడు సిద్ధపడగలను.
1వ ప్రకరణము, సిద్ధాంతము మరియు నిబంధనలకు ప్రభువు యొక్క ముందుమాట మరియు 133వ ప్రకరణము, ఆజ్ఞల గ్రంథానికి మొదటి అనుబంధము రెండూ ప్రభువు నుండి ఒకే అభ్యర్థనతో మొదలవుతాయి: “నా సంఘ జనులైన మీరు ఆలకించుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:1; 133:1). బహుశా మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 133:1–19, 37–39 అధ్యయనం చేయవచ్చు మరియు మీరు ఆయన రెండవ రాకడ కోసం సిద్ధమవుతున్నప్పుడు “ఆలకించుడి” (వినండి మరియు విధేయులుకండి) అని ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తున్న సందేశాలను జాబితా చేయవచ్చు. ప్రత్యేకించి, (1) మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి మరియు (2) ఆయన రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి సహాయపడేందుకు మీరు చేయాలని ఆయన కోరుతున్న వాటిని మీరు జాబితా చేయవచ్చు. ఆ జాబితాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
రక్షకుడు తిరిగి వచ్చినప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది—మరియు ఎలా సిద్ధం కావాలి అనే దాని గురించి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ముఖ్యమైన సత్యాలను పంచుకున్నారు. ఆయన సందేశము “The Future of the Church: Preparing the World for the Savior’s Second Coming” (లియహోనా, ఏప్రి. 2020, 6–11) లో ఈ సత్యాల కొరకు చూడండి. “రక్షకుని పునరాగమనం కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి” మీరు ఏమి చేయాలని లేదా చేస్తూనే ఉండాలని ప్రేరేపించబడినట్లు భావించారు? (“Aaronic Priesthood Quorum Theme,” సువార్త గ్రంథాలయము).
మత్తయి 25:1–13; రస్సెల్ ఎమ్. నెల్సన్, “విశ్వాసంతో భవిష్యత్తును హత్తుకోండి,” లియహోనా, నవ. 2020, 73–76 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:19–56
నీతిమంతుల కొరకు యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ ఆనందకరంగా ఉంటుంది.
19–56 వచనములలో రక్షకుని రాకడ యొక్క వర్ణనను మీరు చదువుతున్నప్పుడు, మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారని మీరు కనుగొన్నారు? ఆయన జనుల కొరకు ప్రభువు యొక్క ప్రేమను వివరించే పదాలు లేదా వాక్యభాగాలేవి? “[మీ] ప్రభువు యొక్క ప్రేమాకనికరము, ఆయన వాత్సల్యమును బట్టి [మీ] మీద ఆయన క్రుమ్మరించిన యావత్తుతో” (52వ వచనము) పాటు మీ వ్యక్తిగత అనుభవాలను నమోదు చేయడాన్ని పరిగణించండి.
Healer [స్వస్థపరచువాడు] నుండి వివరణ, కెల్సీ మరియు జెస్సి లైట్‌వీవ్ చేత
“మానవ ప్రయోజనము కొరకు ప్రభుత్వములు దేవునిచేత స్థాపించబడినవి.”
ప్రభుత్వంతో ప్రారంభ పరిశుద్దుల సంబంధము సంక్లిష్టంగా ఉండేది. 1833లో, మిస్సోరిలోని జాక్సన్ కౌంటీ నుండి పరిశుద్ధులు తరిమివేయబడినప్పుడు, వారు సహాయం కొరకు అడిగినప్పటికీ స్థానిక లేదా కేంద్ర ప్రభుత్వం నుండి వారికి ఎటువంటి సహాయం అందలేదు. అదే సమయంలో, సంఘ సభ్యులు కాని కొందరు సీయోను గురించిన బోధనలకు అర్థం పరిశుద్ధులు భూలోక ప్రభుత్వాల అధికారాన్ని నిరాకరించడమని చెప్పారు. కొంతవరకు ప్రభుత్వంలో సంఘము యొక్క స్థానాన్ని స్పష్టం చేయడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 134 వ్రాయబడింది. ప్రభువు యొక్క పరిశుద్ధులు ప్రభుత్వం గురించి ఎలా భావించాలి అనే దాని గురించి ఈ ప్రకరణము ఏమి సూచిస్తుంది?
మీరు 134వ ప్రకరణమును చదివినప్పుడు, ప్రభుత్వం యొక్క నియమాలు మరియు పౌరుల బాధ్యతల కొరకు చూడడాన్ని పరిగణించండి. ప్రారంభ పరిశుద్ధులకు ఈ ఉపాయాలు ఎలా సహాయకరంగా ఉండియుండవచ్చు? మీరు నివసించే చోట అవి ఎలా అన్వయించబడతాయి?
విశ్వాస ప్రమాణాలు 1:11–12 కూడా చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:4–5, 14
నేను ప్రపంచంలోని చెడు నుండి దూరంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు.
-
మనం దూరంగా ఉండాలని ప్రభువు కోరుకునే కొన్ని ప్రదేశాలు మరియు పరిస్థితులను మీరు మరియు మీ పిల్లలు జాబితా చేయవచ్చు. అప్పుడు మీరు ఆ స్థలాలను మరియు పరిస్థితులను లేఖన దీపిక (సువార్త గ్రంథాలయము)లోని “బాబెలు, బబులోను” యొక్క నిర్వచనంతో పోల్చవచ్చు. తర్వాత వారు సిద్ధాంతము మరియు నిబంధనలు 133:4–5, 14ను చదవవచ్చు. “బబులోను నుండి బయలు వెళ్ళుడి” అనగా అర్థమేమిటి? (5వ వచనము). ప్రభువు మనల్ని ఆహ్వానించే స్థలాలు మరియు పరిస్థితుల జాబితాను కూడా మీరు తయారు చేయవచ్చు మరియు ఆ జాబితాను లేఖన దీపికలోని “సీయోను” యొక్క నిర్వచనంతో పోల్చవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:19–21, 25
యేసు క్రీస్తు మరలా వస్తారు.
-
ఆటల పోటీ, ముఖ్యమైన సందర్శకుడు లేదా ఇష్టమైన సెలవుదినం వంటి వాటి కోసం సిద్ధమవుతున్నట్లుగా నటించడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. సిద్ధపాటు ఎందుకు ముఖ్యమైనది? తర్వాత మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 133:17–19, 21 కలిసి చదవవచ్చు మరియు దేనికి సిద్ధపడాలని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారో దాని కోసం వెతకమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. మీరు వారికి ఈ వారపు నమూనా నుండి చిత్రాన్ని చూపించి, యేసు క్రీస్తు రెండవ రాకడ గురించి వారికి ఏమి తెలుసు అని మీ పిల్లల్ని అడగవచ్చు. 19–25, 46–52 వచనముల నుండి మనం ఇంకేమి నేర్చుకుంటాము? ఈ సంతోషకరమైన సంఘటన కోసం సిద్ధం కావడానికి మనం ఏమి చేయవచ్చు?
-
యేసు క్రీస్తు రెండవ రాకడ కోసం సిద్ధం కావడానికి మనం చేయగలిగే పనులను వివరించే వివిధ చిత్రాలు లేదా వస్తువులను మీరు దాచవచ్చు (లేఖనాలను చదవడం, సువార్తను పంచుకోవడం లేదా మన కుటుంబాలకు సేవ చేయడం వంటివి). మీ పిల్లలను చిత్రాలు లేదా వస్తువులు కనుగొననివ్వండి మరియు ఈ పనులు చేయడం రక్షకుడు తిరిగి వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవడానికి మనకు ఎలా సహాయపడుతుందనే దాని గురించి మాట్లాడనివ్వండి.
-
రెండవ రాకడ గురించి ఒక పాటను కూడా మీరు కలిసి పాడవచ్చు. రక్షకుని పట్ల మీకున్న ప్రేమను మరియు ఆయన తిరిగి రావడం గురించి మీ భావాలను ఒకరికొకరు పంచుకోండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:52-53
యేసు క్రీస్తు ప్రేమగలవాడు మరియు దయామయుడు.
-
యేసు ప్రేమగలవాడనీ, దయామయుడనీ చూపించే చిత్రాలను మీరు, మీ పిల్లలు చూడవచ్చు. యేసు తన ప్రేమ మరియు దయ చూపించడానికి ఇంకా ఏమి చేసారు? సిద్ధాంతము మరియు నిబంధనలు 133:52 కలిసి చదవండి మరియు మీ పిల్లలు ఇతరులకు “తమ ప్రభువు యొక్క ప్రేమపూర్వక దయను గురించి ప్రస్తావించగల” మార్గాల గురించి ఆలోచించడంలో వారికి సహాయపడండి.
In His Light [ఆయన వెలుగులో] నుండి వివరణ, గ్రెగ్ ఓల్సన్ చేత
స్పష్టమైన మరియు సరళమైన సిద్ధాంతాన్ని బోధించండి. ప్రభువు తన సువార్తను “సరళముగాను, సులువుగాను” బోధిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 133:57). మీ కుటుంబానికి లేదా తరగతికి సువార్తను బోధించడం గురించి ఈ పదాలు మీకేమి సూచిస్తాయి?
సిద్ధాంతము మరియు నిబంధనలు 134:1–2
నేను చట్టానికి లోబడాలని ప్రభువు కోరుతున్నారు.
-
మీ పిల్లలు వారు పాటించే నియమాలు లేదా చట్టాలను జాబితా చేయవచ్చు. ఈ చట్టాలను ఎవరూ పాటించకపోతే జీవితం ఎలా ఉంటుంది? అప్పుడు మీరు వారికి అర్థం కాని పదాలు లేదా వాక్యభాగాలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడుతూ, వారితోపాటు సిద్ధాంతము మరియు నిబంధనలు 134:1–2 చదవవచ్చు. మనం చట్టానికి లోబడాలని ప్రభువు ఎందుకు కోరుకుంటున్నారు? (విశ్వాస ప్రమాణాలు 1:12 కూడా చూడండి).
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.