Doctrine and Covenants 2025
పునఃస్థాపన స్వరములు: ఉపశమన సమాజము


“పునఃస్థాపన స్వరములు: ఉపశమన సమాజము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“ఉపశమన సమాజము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

పునఃస్థాపన స్వరముల చిహ్నము

పునఃస్థాపన స్వరములు

ఉపశమన సమాజము

1842లో, ఇల్లినాయ్‌లోని నావూలో ఉపశమన సమాజము ఏర్పాటు చేయబడిన తర్వాత ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా అన్నారు, “స్త్రీలు ఈ విధంగా ఏర్పాటు చేయబడేవరకు సంఘము ఎన్నడూ పరిపూర్ణంగా ఏర్పాటు చేయబడలేదు.” అదేవిధంగా, ప్రభువు సంఘము మరియు ఆయన యాజకత్వ పునఃస్థాపన యొక్క అధ్యయనము ఉపశమన సమాజము యొక్క అధ్యయనమును చేర్చుకొనే వరకు పూర్తికాదు, అది దానికదే యేసు క్రీస్తు యొక్క ఆడ శిష్యుల “ప్రాచీన విధానము యొక్క పునఃస్థాపన”.

ఎలైజా ఆర్. స్నో ఆ పునఃస్థాపనలో ముఖ్యపాత్ర పోషించారు. ఉపశమన సమాజము మొదట ఏర్పాటు చేయబడినప్పుడు ఆమె హాజరయ్యారు మరియు సమాజము యొక్క కార్యదర్శిగా, సమావేశాలు జరుగుతున్నప్పుడు వివరాలు నమోదు చేసారు. ఉపశమన సమాజము “యాజకత్వము యొక్క విధానమును బట్టి” ఏర్పాటు చేయబడిందని ఆమె ప్రత్యక్ష సాక్ష్యమిచ్చారు. క్రిందివి ఆమె మాటలు, ఉపశమన సమాజము యొక్క రెండవ ప్రధాన అధ్యక్షరాలిగా సేవచేస్తున్నప్పుడు, దేవుని యొక్క నిబంధన కుమార్తెలకు అప్పగించబడిన దైవిక కార్యమును ఆమె సహోదరీలు గ్రహించేలా సహాయపడేందుకు వ్రాయబడినవి.

ఉపశమన సమాజము ఏవిధంగా ఏర్పాటు చేయబడిందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి Daughters in My Kingdom: The History and Work of Relief Society (2017), 1–25; The First Fifty Years of Relief Society (2016), 3–175 చూడండి.

ఉపశమన సమాజ సమావేశాన్ని నడిపిస్తున్న ఎమ్మా స్మిత్

ఉపశమన సమాజ నిర్మాణము యొక్క వర్ణచిత్రము, పౌల్ మన్ చేత

ఎలైజా ఆర్. స్నో

“(ఉపశమన సమాజము) అనే పేరు ఆధునికంగా ఉన్నప్పటికీ, నిర్మాణము మాత్రము ప్రాచీన మూలము గలది. ప్రాచీనకాలంలో సంఘములో ఇదే నిర్మాణము ఉండేదని [జోసెఫ్ స్మిత్] చేత మనకు చెప్పబడింది, ‘ఏర్పరచబడినదైన అమ్మగారు’ [2 యోహాను 1:1; సిద్ధాంతము మరియు నిబంధనలు 25:3 చూడండి] అనే నామాన్ని ఉపయోగిస్తూ క్రొత్త నిబంధనలో నమోదు చేయబడిన కొన్ని పత్రికలలో ఇది ఉదహరించబడింది.

“యాజకత్వము లేకుండా ఉండలేనటువంటి నిర్మాణమిది, ఎందుకంటే దాని అధికారము మరియు ప్రభావము మొత్తాన్ని ఆ మూలము నుండే అది గ్రహిస్తుందనేది వాస్తవము. భూమిపై నుండి యాజకత్వము తీసివేయబడినప్పుడు, భూమిపై నున్న యేసు క్రీస్తు సంఘము యొక్క నిజమైన క్రమము యొక్క ప్రతి అనుబంధముతోపాటు ఈ సమాజము కూడా అంతరించిపోయింది.…

“‘నావూ యొక్క స్త్రీల ఉపశమన సమాజము’ యొక్క ఏర్పాటు సమయంలో ఉండి, … ఆ సమాజంతో చెప్పుకోదగిన అనుభవం కలిగియున్న నేను కొన్ని సూచనలివ్వదలిచాను, అవి క్రొత్త మరియు అనేక బాధ్యతలతో నిండిన ఈ అతిముఖ్యమైన స్థానంలో అడుగుపెట్టడానికి సీయోను కుమార్తెలకు సహాయపడతాయి. ఇశ్రాయేలులోని కుమార్తెలు మరియు తల్లులలో ఎవరైనా తమ ప్రస్తుత అధికారాలలో హద్దులు ఏర్పరచబడినట్లు భావిస్తున్నట్లయితే, మంచిని చేయడానికి అత్యంత ధారాళంగా వారికివ్వబడిన ప్రతి శక్తి మరియు సామర్థ్యం కొరకు ఇప్పుడు వారు కావలసినన్ని అవకాశాలను కనుగొంటారు….

ఇల్లినాయ్‌లోని నావూలో ఎర్ర ఇటుకల దుకాణం

ఎర్ర ఇటుకల దుకాణం యొక్క పైగదిలో ఉపశమన సమాజము ఏర్పాటు చేయబడింది.

“స్త్రీల ఉపశమన సమాజము యొక్క ఉద్దేశ్యమేమిటని ఎవరి మనస్సులోనైనా ప్రశ్న తలెత్తిందా? మంచి చేయడం—బీదవారికి సహాయం చేయడంలోనే కాకుండా ఆత్మలను రక్షించడంలో కూడా మంచిని చేయడానికి మేము కలిగియున్న ప్రతి సామర్థ్యాన్ని ఉపయోగించడం అని నేను జవాబిస్తాను. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగత ప్రయత్నం చేత సాధించబడే దానికంటే ఎంతో ఎక్కువగా సమిష్టి ప్రయత్నం చేత సాధించబడుతుంది.…

“బీదలకు సహాయపడడంలో కేవలం వారి భౌతిక అవసరాలను తీర్చడమే కాకుండా స్త్రీ ఉపశమన సమాజము నిర్వహించవలసిన ఇతర బాధ్యతలున్నాయి. మానసిక పేదరికం మరియు హృదయం యొక్క అస్వస్థత కూడా శ్రద్ధను కోరుతుంది; అనేకసార్లు ఒక దయగల వ్యక్తీకరణ—కొన్ని సలహాలు లేదా వెచ్చని, ప్రేమగల కరచాలనం ఎంతో మంచిని చేస్తుంది మరియు బంగారపు మూట కంటే ఎక్కువగా అభినందించబడుతుంది.…

“పరిశుద్ధులు విదేశాల నుండి సమకూడినప్పుడు, అందరికీ అపరిచితులైయుండి, మోసం చేయాలని చూసేవారి చేత తప్పు దారిలో నడిపించబడేందుకు లోబడినప్పుడు, [వారిని] కాపాడడానికి [ఉపశమన] సమాజము సిద్ధంగా ఉండాలి మరియు వారిని మెరుగుపరచి, వృద్ధిచేయగల సమాజానికి వారిని పరిచయం చేయాలి మరియు అన్నిటిని మించి సువార్త యొక్క విశ్వాసంలో వారిని బలపరచాలి, ఆవిధంగా చేయడంలో అనేకమందిని కాపాడడంలో సాధనంగా ఉండాలి.

“సమాజము యొక్క బాధ్యతలలో వచ్చే కర్తవ్యాలు, విశేషాధికారాలు మరియు బాధ్యతలను నిర్వచించడానికి అనేక పుస్తకాలు అవసరమవుతాయి.… ప్రశాంతంగా, ఆలోచనాపూర్వకంగా, ఉత్సాహంగా, సమిష్టిగా, ప్రార్థనాపూర్వకంగా (మీ బిషప్పు మార్గదర్శకత్వంలో) పనిచేయండి, దేవుడు మీ ప్రయత్నాలను విజయంతో దీవిస్తారు.”

వివరణలు

  1. Teachings of Presidents of the Church: Joseph Smith(2007),451.

  2. Daughters in My Kingdom: The History and Work of Relief Society (2017),7.

  3. Joseph Smith, in Sarah M. Kimball, “Auto-biography,” Woman’s Exponent, Sept. 1, 1883, 51.

  4. “Female Relief Society,” Deseret News, Apr. 22, 1868, 81.