“మార్చి 24–30: ‘అన్నిసంగతులు సక్రమముగా జరుగవలెను’: సిద్ధాంతము మరియు నిబంధనలు 27–28” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 27–28,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
మార్చి 24–30: “అన్నిసంగతులు సక్రమముగా జరుగవలెను”
సిద్ధాంతము మరియు నిబంధనలు 27–28
పునఃస్థాపన విశదపరచబడుట కొనసాగుతున్నప్పుడు పరిశుద్ధులకు బయల్పాటు అనేది ఇంకా క్రొత్త భావనగా ఉన్నది. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ సంఘము కొరకు బయల్పాటును పొందగలరని ప్రారంభ సంఘ సభ్యులకు తెలుసు. కాని ఇతరులు కూడా పొందగలరా? బంగారు పలకలకు ఎనిమిదిమంది సాక్షులలో ఒకరైన హైరం పేజ్ తాను సంఘము కొరకు బయల్పాటులు పొందుతున్నాడని నమ్మడంతో ఇలాంటి ప్రశ్నలు క్లిష్టమైనవిగా మారాయి. విశ్వాసులైన అనేకమంది పరిశుద్ధులు ఈ బయల్పాటులు దేవుని నుండి వచ్చాయని నమ్మారు. ఆయన సంఘములో “అన్నిసంగతులు సక్రమముగా జరుగవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 28:13) అని బోధించుట ద్వారా ప్రభువు స్పందించారు. దీని అర్థము ఒక్క వ్యక్తి మాత్రమే సంఘమంతటి కొరకు “ఆజ్ఞలను, బయల్పాటులను పొందడానికి నియమింపబడును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 28:2). అయినప్పటికీ, ఇతరులు ప్రభువు కార్యములో తమ వంతుగా వ్యక్తిగత బయల్పాటులు పొందవచ్చు. వాస్తవానికి, ఆలీవర్ కౌడరీకి ప్రభువు చెప్పిన మాటలు మనమందరము జ్ఞాపకముంచుకోదగినవి: “నీవేమి చేయవలెనో… అది నీకు తెలియజేయబడును” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 28:15 ).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 27:1–4
యేసు క్రీస్తు యొక్క జ్ఞాపకార్థము నేను సంస్కారము తీసుకుంటాను.
1830 జూన్‌లో సాలీ నైట్, ఎమ్మా స్మిత్‌లు బాప్తిస్మము పొందారు, కాని వారి నిర్థారణలు ఒక అల్లరిమూక చేత ఆటంకపరచబడ్డాయి. రెండు నెలల తరువాత, సాలీ మరియు ఆమె భర్త న్యూవెల్, ఎమ్మా మరియు జోసెఫ్‌లను చూడడానికి వచ్చారు, అప్పుడే వారు నిర్ధారించబడతారని మరియు ఈ బృందం కలిసి సంస్కారములో పాల్గొంటుందని నిర్ణయించారు. సంస్కారము కొరకు ద్రాక్షారసము తేవడానికి వెళ్తున్నప్పుడు, జోసెఫ్ ఒక దేవదూత చేత ఆపబడ్డాడు.
సంస్కారము గురించి దేవదూత జోసెఫ్‌కు ఏమి బోధించాడో కనుగొనడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 27:1–4 చదవండి. సంస్కారమును మీరు ఏవిధంగా తీసుకోవాలని రక్షకుడు కోరుతున్నారు అనే దాని గురించి ఈ వచనాలు మీకు ఏమి బోధిస్తాయి? “[ఆయన] మహిమయే లక్ష్యముగా” దానిలో పాల్గొనడమంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు? దీనిని ధ్యానించండి—మరియు మీరు లూకా 22:19–20 మరియు 3 నీఫై 18:1–11 చదువుతున్నప్పుడు, సంస్కారము గురించి ఇతర అంతర్దృష్టుల కొరకు చూడండి.
The Last Supper
Jesus Christ Blesses Bread in Remembrance of Him | 3 Nephi 18:1-7
Jesus Christ Blesses Wine in Remembrance of Him | 3 Nephi 18:8-11
సంస్కారమును ఒక ఆరాధనాపూర్వక అనుభవంగా చేయడం గురించి నేర్చుకోవడానికి, ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ గారి సందేశము “పరలోకము నుండి వచ్చిన జీవాహారము” (లియహోనా, నవ. 2017, 36–39) ను అధ్యయనం చేయడాన్ని పరిగణించండి. సంస్కారము ద్వారా రక్షకునితో గొప్ప అనుబంధాన్ని భావించడానికి మీకు సహాయపడగలిగేలా ఎల్డర్ క్రిస్టాఫర్‌సన్ ఏమి బోధించారు? రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క చిహ్నాలలో పాలుపొందడానికి మరియు వాటిని గొప్ప భక్తితో లేదా ఉద్దేశ్యముతో ఆదరించడానికి బాగా సిద్ధపడేందుకు మీరు ఏమి చేయగలరో ధ్యానించండి.
ఒక సంస్కార కీర్తనను పాడడం, వినడం లేదా చదవడాన్ని మరియు ఆ పవిత్ర విధిలో పాల్గొనడం గురించి మీ భావాలను నమోదు చేయడాన్ని పరిగణించండి.
సంగీతాన్ని ఉపయోగించండి. పవిత్రమైన సంగీతం సువార్త సత్యాల గురించి సాక్ష్యమివ్వడానికి ఆత్మను ఆహ్వానిస్తుంది. ఇది ఈ సత్యాలను గుర్తుంచుకునే విధంగా అర్థం చేసుకోవడానికి మరియు అనుభూతి చెందడానికి మీకు సహాయపడగలదు. సంగీతం మరింత ఆకర్షణీయంగా నేర్చుకోవడంలో సహాయపడుతుంది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79; 59:9–13 కూడా చూడండి.
Always Retain a Remission of Your Sins
సిద్ధాంతము మరియు నిబంధనలు 27:5–14
ప్రభువు తన కార్యాన్ని చేయడానికి తన సేవకులకు యాజకత్వ తాళపుచెవులను ఇస్తారు.
ఈ వచనాలలో పేర్కొనబడిన ప్రవక్తల గురించి మీకేమి తెలుసు? లేఖన దీపికలో మీరు వారి గురించి సమాచారం కోసం శోధించవచ్చు. ఈ ప్రవక్తలు కలిగియున్న తాళపుచెవుల ద్వారా మీకు ఏ దీవెనలు లభ్యమవుతున్నాయి?
సిద్ధాంతము మరియు నిబంధనలు 27:15–18
దేవుని కవచం చెడుకు వ్యతిరేకంగా నిలబడడానికి నాకు సహాయపడుతుంది.
అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ ఇలా అన్నారు: “ఆధ్యాత్మికంగా మనల్ని సాయుధపరచుకోవడానికి మనం చేయగలిగే గొప్పదైన, ఘనమైన విషయం ఏదీ లేదు. సమస్త కీడు నుండి రక్షించి, కాపాడే ఆత్మీయ రక్షణ దుర్గమనే వస్త్రములో అల్లబడిన అనేకమైన చిన్న చిన్న క్రియలలో నిజమైన ఆత్మీయ శక్తి కలదు” (“Be Strong in the Lord,” Ensign, July 2004, 8).
దేవుని కవచము గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 27:15–18లో మీరు నేర్చుకుంటున్నప్పుడు, ఇటువంటి పట్టికనొకదానిని మీరు తయారుచేయవచ్చు. దేవుని కవచం యొక్క ప్రతి భాగాన్ని ధరించడానికి మీరు ఏమి చేస్తున్నారు?
|
కవచం యొక్క భాగం |
రక్షించబడే శరీర భాగం |
ఆ శరీర భాగం దేనిని సూచించవచ్చు |
|---|---|---|
కవచం యొక్క భాగం నీతియను వక్షస్థల కవచము | రక్షించబడే శరీర భాగం హృదయము | ఆ శరీర భాగం దేనిని సూచించవచ్చు నా కోరికలు, ఆప్యాయతలు |
కవచం యొక్క భాగం రక్షణయను శిరస్త్రాణము | రక్షించబడే శరీర భాగం శిరస్సు లేదా మనస్సు | ఆ శరీర భాగం దేనిని సూచించవచ్చు |
కవచం యొక్క భాగం | రక్షించబడే శరీర భాగం | ఆ శరీర భాగం దేనిని సూచించవచ్చు |
కవచం యొక్క భాగం | రక్షించబడే శరీర భాగం | ఆ శరీర భాగం దేనిని సూచించవచ్చు |
ఎఫెసీయులకు 6:11–18; జార్జ్ ఎఫ్. జెబల్లోస్, “అపవాదిని నిరోధించే జీవితమును నిర్మించుట,” లియహోనా, నవ. 2022, 50–52 కూడా చూడండి.
యేసు క్రీస్తు తన సంఘమును ఆయన సజీవ ప్రవక్త ద్వారా నడిపిస్తారు.
ఎవరైనా సంఘమంతటి కొరకు ఆజ్ఞలు, బయల్పాటులు పొందగలిగితే ఎలా ఉంటుందో ఊహించండి. హైరం పేజ్ అటువంటి బయల్పాటు అందుకున్నట్లు చెప్పినప్పుడు, చాలామంది సంఘ సభ్యులు గందరగోళానికి గురయ్యారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 28లో, ఆయన సంఘములో బయల్పాటు పొందుటకు ప్రభువు ఒక క్రమమును బయల్పరిచారు. సంఘ అధ్యక్షుని యొక్క నిర్దిష్ట పాత్ర గురించి ఈ ప్రకరణము నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించగలడు అనే దాని గురించి మీరు ఏమి నేర్చుకుంటారు?
డేల్ జి. రెన్లండ్, “వ్యక్తిగత బయల్పాటు కొరకు ఒక అంతర్లీన నిర్మాణం,” లియహోనా, నవ. 2022, 16-19 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 28:8–9
లేమనీయుల యొద్దకు వెళ్ళుటకు ఇవ్వబడిన నియమిత కార్యము ఎందుకు ముఖ్యమైనది?
మోర్మన్ గ్రంథము యొక్క ఒక ఉద్దేశమేమనగా, “లేమనీయులు వారి పితరులను గూర్చిన జ్ఞానమునకు రాగలిగి, ప్రభువు యొక్క వాగ్దానాలను వారు తెలుసుకొనగలుగుట” (సిద్ధాంతము మరియు నిబంధనలు 3:20). ఇది చాలామంది మోర్మన్ గ్రంథ ప్రవక్తలకు ప్రభువు ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఉంది (ఉదాహరణకు 1 నీఫై 13:34–41; ఈనస్ 1:11–18; హీలమన్ 15:12–13 చూడండి). ప్రారంభ సంఘ సభ్యులు అమెరికా వాసులను మోర్మన్ గ్రంథ జనుల వారసులుగా భావించారు. (లేమనీయులు “అమెరికన్ ఇండియన్ల యొక్క పూర్వీకుల మధ్య ఉన్నారు” అనేది నేడు సంఘము యొక్క అధికారిక సిద్ధాంతము [మోర్మన్ గ్రంథ పీఠిక].)
సమీపంలోని అమెరికన్ ఇండియన్ల తెగలకు ఆలీవర్ యొక్క నియమితకార్యము గురించి మరింత చదవడానికి, “A Mission to the Lamanites,” Revelations in Context, 45–49 చూడండి. ఈ నియమిత కార్యము ప్రభువు గురించి మరియు ఆయన కార్యము గురించి మీకు ఏమి బోధిస్తుంది?
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 27:1–2
యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకోవడానికి సంస్కారము నాకు సహాయపడుతుంది.
-
సంస్కారము కొరకు యేసు ద్రాక్షారసమును ఉపయోగించినప్పుడు మనమెందుకు నీటిని ఉపయోగిస్తున్నామని పిల్లలు ఆశ్చర్యపడవచ్చు (లూకా 22:19–20; 3 నీఫై 18:1–11 చూడండి). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 27: 1–2ను కలిసి చదువవచ్చు మరియు “[దేవుని] మహిమయే లక్ష్యముగా” (2వ వచనము) సంస్కారమును తీసుకొనుట అనగా అర్థమేమిటో చర్చించవచ్చు. మనం సంస్కారమును తీసుకునేటప్పుడు రక్షకునిపై దృష్టి కేంద్రీకరించడానికి మనం ఏమి చేయవచ్చు?
-
బహుశా రక్షకుని గురించిన చిత్రాలు, లేఖన వచనాలు లేదా పాటల సాహిత్యం కలిగి ఉండడం మీ పిల్లలు సంస్కారమును తీసుకునేటప్పుడు ఆయనను గుర్తుంచుకోవడానికి సహాయపడవచ్చు. ఈ చిత్రాలు, వచనాలు మరియు సాహిత్యంలో కొన్నింటితో చిన్న పుస్తకాన్ని రూపొందించడాన్ని వారు ఆనందించవచ్చు. వారు తమ స్వంత చిత్రాలు గీయవచ్చు లేదా ఫ్రెండ్ పత్రికలో కొన్ని కనుగొనవచ్చు.
The Last Supper [ప్రభురాత్రి భోజనం] నుండి వివరణ, సైమన్ డ్యుయీ చేత
సిద్ధాంతము మరియు నిబంధనలు 27:15–18
దేవుని కవచము నన్ను కాపాడుతుంది.
-
ఈ నమూనాలో లేదా రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు: క్రొత్త నిబంధన 2023లో ఎఫెసీయుల కొరకు నమూనాలోని ప్రోత్సాహ కార్యక్రమ పేజీలో ఉన్నట్లుగా మీరు మీ పిల్లలకు కవచం యొక్క చిత్రాన్ని చూపించవచ్చు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 27:15–18 చదువుతున్నప్పుడు, చిత్రంలో కవచం యొక్క భాగాలను కనుగొనడంలో వారికి సహాయపడండి. “ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు” దేవుని కవచం మనకు ఎలా సహాయపడగలదు? (15వ వచనము).
సిద్ధాంతము మరియు నిబంధనలు 28:2, 6-7
సంఘం కొరకు ప్రవక్త బయల్పాటు పొందుతారు; నేను నా జీవితానికి బయల్పాటు పొందగలను.
-
మీకు చాలామంది పిల్లలు ఉన్నట్లయితే, “నాయకుడిని అనుసరించండి” అనే ఆట ఆడడానికి మీరు వారిని ఆహ్వానించవచ్చు, కానీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను ఒకే సమయంలో నాయకుడిగా ఉండమని అడగండి. ఒకరి కంటే ఎక్కువ మంది నాయకులు ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? తర్వాత మీరు హైరం పేజ్ గురించి నేర్చుకోవచ్చు ( సిద్ధాంతము మరియు నిబంధనలు 28 యొక్క ప్రకరణ శీర్షిక చూడండి). ప్రారంభ సంఘ సభ్యుల గందరగోళాన్ని పరలోక తండ్రి ఎలా సరిచేశారు? నేడు సంఘాన్ని ఆయన ఎలా నడిపిస్తున్నారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 28:2). ప్రస్తుత ప్రవక్త మన కాలంలో ఆయన సంఘాన్ని నడిపించడానికి ప్రభువు చేత పిలువబడ్డారని మీ సాక్ష్యాన్ని పంచుకోండి.
2:6హైరమ్ పేజ్ మరియు బయల్పాటు: ఆయన తన సంఘాన్ని ఎలా నడిపిస్తారో పరిశుద్ధులు నేర్చుకున్నారు
-
సంఘము కోసం బయల్పాటు ఎల్లప్పుడూ ప్రవక్త ద్వారా ఇవ్వబడినప్పటికీ, మనమందరం పరిశుద్ధాత్మ చేత నడిపించబడగలము. మీరు మీ పిల్లలకు ఈ క్రింది లేఖనాలలో కొన్నింటిని శోధించడంలో సహాయపడవచ్చు మరియు పరిశుద్ధాత్మ మనకు మార్గనిర్దేశం చేయగల మార్గాల జాబితాను తయారు చేయవచ్చు: సిద్ధాంతము మరియు నిబంధనలు 28:1, 4, 15; యోహాను 14:26; మొరోనై 8:26; 10:4–5. మీరు పరిశుద్ధాత్మ చేత ఎలా నడిపించబడ్డారో పరస్పరం పంచుకోండి.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.