“మార్చి 10-16, ‘క్రీస్తు సంఘము ఉద్భవించుట’: సిద్ధాంతము మరియు నిబంధనలు 20–22,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 20–22,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
మార్చి 10-16: “క్రీస్తు సంఘము ఉద్భవించుట”
సిద్ధాంతము మరియు నిబంధనలు 20–22
మోర్మన్ గ్రంథమును వెలుగులోనికి తెచ్చే రక్షకుని కార్యము ఇప్పుడు పూర్తయింది. కానీ, ఆయన పునఃస్థాపన కార్యము ఇప్పుడే మొదలైంది. సిద్ధాంతమును మరియు యాజకత్వ అధికారాన్ని పునఃస్థాపించడానికి అదనంగా, ఒక క్రమబద్ధమైన నిర్మాణమును—ఆయన సంఘమును పునఃస్థాపించాలని కూడా ఆయన కోరుకుంటున్నట్లు మునుపటి బయల్పాటుల ద్వారా ప్రభువు స్పష్టం చేసారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 10:53; 18:5 చూడండి). 1830, ఏప్రిల్ 6వ తేదీన యేసు క్రీస్తు సంఘము యొక్క ఏర్పాటును చూడడానికి న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో నున్న విట్మర్ కుటుంబము యొక్క కలప గృహములో 40 కంటే ఎక్కువమంది విశ్వాసులు సమకూడారు.
క్రమబద్ధమైన సంఘము ఎందుకు అవసరమని కొంతమంది ఆశ్చర్యపడ్డారు. 1830లో జరిగిన ఆ మొదటి సంఘ సమావేశానికి సంబంధించిన బయల్పాటులలో కొంతవరకు జవాబు కనుగొనబడవచ్చు. కడవరి దినాలలో యేసు క్రీస్తు యొక్క నిజమైన సంఘము “క్రమబద్ధంగా ఏర్పాటు చేయబడి, స్థాపించబడకపోయినట్లయితే”, ఇక్కడ వివరించబడిన దీవెనలు సాధ్యమయ్యేవి కావు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:1).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 20–21
యేసు క్రీస్తు తన సంఘాన్ని పునఃస్థాపించారు.
ఒక క్రమబద్ధమైన సంఘమును మనమెందుకు కలిగియున్నాము? “ఎందుకంటే యేసు క్రీస్తు దానిని ఏర్పాటు చేసారు” అనేది బహుశా ఉత్తమమైన జవాబు అవుతుంది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 20–21 చదువుతున్నప్పుడు, ఆయన ప్రాచీనకాలంలో స్థాపించిన సంఘానికి మరియు నేడు పునఃస్థాపించిన సంఘానికి మధ్య పోలికలను మీరు గమనించవచ్చు. ప్రాచీనకాలంలో రక్షకుని సంఘము గురించి నేర్చుకోవడానికి క్రింది వచనాలను ఉపయోగించండి: మత్తయి 16:15–19; యోహాను 7:16–17; ఎఫెసీయులకు 2:19–22; 3 నీఫై 11:23–26; మొరోనై 4–5. పునఃస్థాపించబడిన సంఘము గురించి నేర్చుకోవడానికి ఈ వచనాలను ఉపయోగించండి: సిద్ధాంతము మరియు నిబంధనలు 20:17–25, 60, 72–79; 21:1–2. ఇటువంటి పట్టికలో మీరు కనుగొన్న దానిని మీరు వ్రాసియుంచవచ్చు:
|
సిద్ధాంతము |
విధులు |
యాజకత్వ అధికారము |
ప్రవక్తలు | |
|---|---|---|---|---|
క్రీస్తు యొక్క ప్రాచీన సంఘము | సిద్ధాంతము | విధులు | యాజకత్వ అధికారము | ప్రవక్తలు |
క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘము | సిద్ధాంతము | విధులు | యాజకత్వ అధికారము | ప్రవక్తలు |
యేసు క్రీస్తు తన సంఘాన్ని ఎందుకు స్థాపించారు—మరియు పునఃస్థాపించారు అనే దాని గురించి ఈ ప్రోత్సాహ కార్యక్రమం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
డాలిన్ హెచ్. ఓక్స్, “ఒక సంఘము యొక్క అవసరము,” లియహోనా, నవ. 2021, 24–26 కూడా చూడండి.
పంచుకోవడాన్ని ఆహ్వానించండి. వారు స్వయంగా నేర్చుకుంటున్న వాటిని పంచుకోమని మీరు జనులను ఆహ్వానించినప్పుడు, వారు తమ వ్యక్తిగత అధ్యయనాన్ని కొనసాగించడానికి ప్రోత్సహించబడతారు. ఏమి పంచుకోవడానికి ఇతరులను మీరు ఆహ్వానించగలరు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37, 75–79; 22
రక్షకుని వలె కావడానికి పవిత్ర విధులు నాకు సహాయపడతాయి.
సంఘము ఏర్పాటు చేయబడినప్పుడు, బాప్తిస్మము మరియు సంస్కారముతో పాటు పవిత్ర విధులను గురించి ప్రభువు తన పరిశుద్ధులకు బోధించారు. మీరు ఈ విధుల గురించి చదివినప్పుడు, రక్షకునితో సంబంధమున్నట్లు మీరు భావించడానికి అవి ఎలా సహాయపడతాయో ధ్యానించండి. ఉదాహరణకు, “అంతము వరకు [యేసు క్రీస్తు]ను సేవించుటకు మీ దృఢ సంకల్పమును” కాపాడుకోవడానికి ఈ విధులు మీకెలా సహాయపడతాయి? (37వ వచనము). మీరు సంస్కార ప్రార్థనలను కూడా చదువవచ్చు (77, 79 వచనాలు) మరియు వాటిని మీరు మొదటిసారి వింటున్నట్లు ఊహించుకోవచ్చు. ఏ అంతర్దృష్టులను మీరు పొందుతారు?
డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “నిబంధన మార్గము ఎందుకు,” లియహోనా, మే 2021, 116–19 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 20:38–60
యాజకత్వ సేవ సంఘ సభ్యులను మరియు వారి కుటుంబాలను దీవిస్తుంది.
ఆయన సంఘములో యాజకత్వాన్ని పునఃస్థాపించడం రక్షకునికి ఎందుకు ముఖ్యమైనదని మీరెప్పుడైనా ఆలోచించారా? సిద్ధాంతము మరియు నిబంధనలు 20:38–60 లో యాజకత్వము కలిగియున్న వారిని ఆయన చేయమని అడిగిన వాటిని చదవడం మీకు కొన్ని అంతర్దృష్టులను ఇవ్వవచ్చు. ఈ వచనాలలో వివరించబడిన కార్యము ద్వారా రక్షకుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఏవిధంగా దీవించారు?
యాజకత్వానికి నియమించబడిన వారికి అదనంగా, సంఘములో సేవ చేయడానికి ప్రత్యేకపరచబడిన స్త్రీలు కూడా ఆయన కార్యములో పాల్గొన్నప్పుడు దేవుని అధికారాన్ని సాధన చేస్తారు.
ఆయన ప్రవక్తల ద్వారా దేవుని వాక్యమునకు లోబడియుండడం నాకు దైవిక రక్షణనిస్తుంది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 21:4–9 ప్రభువు యొక్క ప్రవక్తను అనుసరించమనే ఆహ్వానాలను మరియు అలా చేసే జనుల కొరకు శక్తివంతమైన వాగ్దానాలను కలిగియుంది. క్రింది ఉపాయములు ఈ వచనాలను ధ్యానించడానికి మీకు సహాయపడగలవు:
-
ఆయన సజీవ ప్రవక్త మాటలతో మీరు ఏమి చేయాలని రక్షకుడు కోరుతున్నారు అనే దాని గురించి 4–5 వచనాలలోని పదాలు మీకు ఏమి వివరిస్తాయి? దీనిని చేయడానికి “సహనము మరియు విశ్వాసము” ఎందుకు అవసరమని మీరు భావిస్తున్నారు?
-
ఆయన ప్రవక్తను అనుసరించడం వలన వచ్చే దీవెనల గురించి వివరించడానికి 6వ వచనములో రక్షకుడు ఉపయోగించిన ఊహాచిత్రాన్ని ధ్యానించండి. “నరకపు ద్వారములు” అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? మీ కొరకు ప్రభువు ఏవిధంగా “అంధకారపు శక్తులను తరిమివేయును”? “మీ మంచి కొరకు పరలోకములు కంపించుట” అనగా అర్థమేమిటి?
-
ప్రస్తుత సంఘాధ్యక్షుని ద్వారా మీరు ఏమి చేయాలని ప్రభువు అడుగుతున్నారు? మీరు ఆయన సలహాను పాటించినప్పుడు ప్రభువు తన వాగ్దానాలను ఎలా నెరవేర్చారు?
ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ గారి సందేశము “దేవుని యొక్క ప్రవక్త” (లియహోనా, మే 2018, 24–27) లోని విభాగాలను అనుసరించడం నుండి మీరు పొందే అదనపు అంతర్దృష్టులను జాబితా చేయండి.
-
మనము ప్రవక్తను ఎందుకు వెంబడిస్తాము:
-
గోపురముపైన కావలికాయువాడు:
-
ఆశ్చర్యపడకుము:
Watchman on the Tower
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 20–21
యేసు క్రీస్తు యొక్క సంఘము పునఃస్థాపించబడింది.
-
సంఘము ఏర్పాటు చేయబడిన రోజు ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు సిద్ధాంతము మరియు నిబంధనలు 21 యొక్క ప్రకరణ శీర్షికను ఉపయోగించడాన్ని పరిగణించండి.ChurchofJesusChrist.org
2:37యేసు క్రీస్తు యొక్క సంఘము ఏర్పాటు చేయబడింది: సంతోషకరమైన సంఘ సమావేశము
-
బహుశా మీ పిల్లలు యేసు క్రీస్తు, పరిచర్య చేసేవారు, బాప్తిస్మము మరియు సంస్కారము యొక్క చిత్రాలను 20వ ప్రకరణములోని వచనాలతో జతచేయవచ్చు (21–23, 47, 72–74, 75–79 వచనాలు చూడండి). యేసు క్రీస్తు తన సంఘాన్ని పునఃస్థాపించినందు వలన మనం కలిగియున్న దీవెనలను చర్చించడానికి ఈ చిత్రాలు మరియు వచనాలను ఉపయోగించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37, 41, 71–74
నేను బాప్తిస్మము పొంది, నిర్ధారించబడినప్పుడు నేను యేసు క్రీస్తును అనుసరిస్తానని వాగ్దానం చేస్తాను.
-
ఒక బిడ్డ బాప్తిస్మము పొంది, నిర్ధారించబడుతున్న చిత్రాన్ని చూడడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. ఇది సిద్ధాంతము మరియు నిబంధనలు 20:41, 71–74 లోని సూచనలను ఏవిధంగా జతపరుస్తుందో వారు చెప్పవచ్చు. బాప్తిస్మము పొందాలనుకొనే వారి గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 నుండి మనమేమి నేర్చుకుంటాము?
3:10The Baptism of Jesus
-
మీ పిల్లలు ఇదివరకే బాప్తిస్మము పొంది, నిర్ధారించబడినట్లయితే, వారి అనుభవం గురించి వారిని అడగండి. వారు పంచుకోగల చిత్రాలు ఏవైనా వారి వద్ద ఉన్నాయా? యేసు క్రీస్తును అనుసరించడానికి వారేమి చేస్తున్నారు మరియు ఆయన వారిని ఎలా దీవిస్తున్నారు అనే దాని గురించి వారితో మాట్లాడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 20:75–79
నేను యేసు నామమును నాపై తీసుకోగలను మరియు ఆయనను ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోగలను.
-
మీ పిల్లలు సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 (బాప్తిస్మము గురించి) మరియు 77వ వచనము రెండింటిలో “సమ్మతించు” అనే పదము కొరకు చూడవచ్చు. ఏమి చేయడానికి సమ్మతించమని యేసు క్రీస్తు మనల్ని కోరుతున్నారు? బహుశా మీ పిల్లలు ఏదైనా పేరు ఉన్న దానిని చూడవచ్చు (బ్రాండ్ పేరు లేదా వ్యక్తిగత పేరు వంటివి). వస్తువు గురించి పేరు మనకు ఏమి చెబుతుంది? యేసు క్రీస్తు నామమును మనపైకి తీసుకోవడం అంటే అర్థమేమిటి?
-
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77ను కలిసి చదివి, సంస్కారములో భాగంగా మనం చేసే వాగ్దానాలను గుర్తించమని మీ పిల్లలను అడగడాన్ని పరిగణించండి. రక్షకుడిని “ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవడానికి” వారు చేయగలిగినది ఏదైనా వంతులవారీగా చేయవచ్చు మరియు ఒకరి చర్యలు మరొకరు ఊహించవచ్చు. 77వ వచనము ప్రకారం, మనం రక్షకుడిని ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకున్నప్పుడు మనమెలా దీవించబడ్డాము?
సిద్ధాంతము మరియు నిబంధనలు 21:4–6
నేను ఆయన ప్రవక్తను అనుసరించినప్పుడు యేసు నన్ను దీవిస్తారు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 21:4–6 లోని ఆహ్వానాలను మరియు వాగ్దానాలను కనుగొన్న తర్వాత, మీ పిల్లలు ప్రస్తుత ప్రవక్త చిత్రాన్ని చూసి, ఆయన నుండి వారు నేర్చుకున్నది లేదా వినినది ఏదైనా పంచుకోవచ్చు. ఆయన ప్రవక్తను అనుసరించినందుకు యేసు క్రీస్తు మిమ్మల్ని దీవించిన మార్గాలను ఒకరితో ఒకరు పంచుకోండి.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.