Doctrine and Covenants 2025
ఫిబ్రవరి 24–మార్చి 2: “ఆత్మల విలువ గొప్పది”: సిద్ధాంతము మరియు నిబంధనలు 18


“ఫిబ్రవరి 24–మార్చి 2: ‘ఆత్మల విలువ గొప్పది’: సిద్ధాంతము మరియు నిబంధనలు 18,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 18,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

బిడ్డను హత్తుకుంటున్న క్రీస్తు

ఫిబ్రవరి 24–మార్చి 2: “ఆత్మల విలువ గొప్పది”

సిద్ధాంతము మరియు నిబంధనలు 18

ఒక వ్యక్తి విలువను కొలవడానికి అనేక రకాల మార్గాలున్నాయి. నైపుణ్యం, విద్య, ఆస్తి మరియు రూపం అన్నీ మనం ఒకరినొకరం మరియు మనల్ని మనం విలువ కట్టడాన్ని ప్రభావితం చేయగలవు. కానీ దేవుని దృష్టిలో, మన విలువ చాలా సాధారణమైన విషయం మరియు అది సిద్ధాంతము మరియు నిబంధనలు 18లో స్పష్టంగా చెప్పబడింది: “దేవుని దృష్టిలో ఆత్మల విలువ గొప్పదని జ్ఞాపకముంచుకొనుము” (10వ వచనము). దేవుడు ఏమి చేస్తాడు మరియు ఎందుకు చేస్తాడనే దాని గురించి ఈ సాధారణ సత్యము చాలా వివరిస్తుంది. యేసు క్రీస్తు యొక్క సంఘమును మన కాలంలో స్థాపించమని ఆయన జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు ఎందుకు సూచించారు? (1–5 వచనాలు చూడండి). ఎందుకంటే ఆత్మల విలువ గొప్పది. ఆయన “పశ్చాత్తాపపడమని అన్ని ప్రాంతములలో నున్న మనుష్యులందరినీ” ఎందుకు ఆజ్ఞాపించారు మరియు పశ్చాత్తాపాన్ని ప్రకటించడానికి అపొస్తలులను ఎందుకు పంపారు? (9వ వచనము). ఎందుకంటే ఆత్మల విలువ గొప్పది. యేసు క్రీస్తు “శరీరమందు మరణమును” మరియు “మనుష్యులందరి బాధను” ఎందుకు అనుభవించారు? (11వ వచనము). ఎందుకంటే ఆత్మల విలువ గొప్పది. ఒకవేళ ఈ ఆత్మలలో కనీసం ఒకరు రక్షకుని బహుమానాన్ని అంగీకరించడానికి ఎంచుకున్నట్లయితే ఆయన ఆనందిస్తారు, ఎందుకంటే “పశ్చాత్తాపపడు ఆత్మయందు ఆయన ఆనందము ఎంతో గొప్పది!” (13వ వచనము).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:1–5

“నా సంఘమును కట్టండి.”

18వ ప్రకరణములో, యేసు క్రీస్తు యొక్క సంఘానికి పునాది వేయడంలో సహాయపడడానికి ప్రభువు ఆలీవర్ కౌడరీకి సూచనలిచ్చారు. ప్రత్యేకించి 1–5 వచనాలలో ఆయన ఇచ్చిన సలహా గురించి మీరేమి గమనిస్తారు? మీరు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని “పెంపొందించుకునేటప్పుడు” ఇదే సలహా మీకు ఎలా వర్తిస్తుందో మీరు పరిగణించవచ్చు. ఉదాహరణకు:

  • మీరు ప్రభువు నుండి ఏమి “నేర్చుకోవాలని కోరుతున్నారు”? (1వ వచనము).

  • “వ్రాయబడిన సంగతులపై ఆధారపడడం” అంటే మీకు గల అర్థమేమిటి? (3వ వచనము). ఈ సంగతులు సత్యమని ఆత్మ “మీకెలా తెలియజేసాడు”? (2వ వచనము; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:22–24 కూడా చూడండి).

  • మీ జీవితాన్ని మీరు “[రక్షకుని] సువార్త యొక్క పునాది మరియు [ఆయన] బండ” పైన ఎలా నిర్మించుకుంటారు? (5వ వచనము).

ప్రశ్నలు అడగండి. ప్రశ్నలు బయల్పాటుకు దారితీస్తాయనడానికి సిద్ధాంతము మరియు నిబంధనలే సాక్ష్యము. మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, మీకు వచ్చే ప్రశ్నలను నమోదు చేయండి. తర్వాత ధ్యానించండి మరియు జవాబుల కోసం ప్రార్థించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10-13

సెమినరీ చిహ్నము
“ఆత్మల విలువ దేవుని దృష్టిలో గొప్పది.”

దేని విలువనైనా మనం ఎలా నిర్ధారిస్తాము? ఉదాహరణకు, విపణిలో ఒక వస్తువు మరొకదాని కంటే ఎందుకు ఎక్కువ ఖరీదు ఉంటుంది? ఈ వారం మీరు 18వ ప్రకరణము, ప్రత్యేకించి 10–13 వచనాలు చదువుతున్నప్పుడు, దేవుని దృష్టిలో ఆత్మను విలువైనదిగా చేసే దానితో జనులు తరచుగా విలువను ఎలా నిర్ణయిస్తారు అని మీరు విభేదించవచ్చు. “ఆత్మ,” “ఆత్మలు” మరియు “జనులందరు” అనే పదాల స్థానంలో మీ పేరును ప్రత్యామ్నాయంగా ఉంచడాన్ని పరిగణించండి. అతని లేదా ఆమె విలువను ప్రశ్నించేవారికి ఈ వచనాలు ఎలా సహాయపడగలవు?

ఆత్మ విలువను గురించి బోధించే మరికొన్ని గద్యభాగాలు ఇక్కడున్నాయి: లూకా 15:1–10; యోహాను 3:16–17; 2 నీఫై 26:24–28; మోషే 1:39. ఈ గద్యభాగాలపై ఆధారపడి, మీ గురించి దేవుడు ఎలా భావిస్తారనే దానిని మీరెలా సంక్షిప్తపరుస్తారు?

మీరు ఆయనకు ఎంతో విలువైనవారని దేవుడు మీకు ఎలా చూపిస్తారు? ఇది మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు భావించే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

జాయ్ డి. జోన్స్, “లెక్కకు మించిన విలువ,” లియహోనా, నవ. 2017, 13–15 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:11–16

నేను పశ్చాత్తాపపడినప్పుడు ప్రభువు ఆనందిస్తారు.

పశ్చాత్తాపపడు మరియు పశ్చాత్తాపము వంటి పదాలు సిద్ధాంతము మరియు నిబంధనలు 18 అంతటా ఎంత తరచుగా ఉపయోగించబడ్డాయో గమనించండి. ఈ పదాలు ఉపయోగించబడిన ప్రతీసారి వాటి నుండి మీరు ఏమి నేర్చుకుంటారో ధ్యానించండి. ప్రత్యేకించి 11–16 వచనములను పరిగణించండి. పశ్చాత్తాపము—మీ స్వంత పశ్చాత్తాపము మరియు ఇతరులను పశ్చాత్తాపపడమని, వృద్ధిచెందమని ఆహ్వానించు బాధ్యత గురించి మీరు భావించేదానిని ఈ వచనాలు ఎలా ప్రభావితం చేస్తాయి? మీరు నేర్చుకునే దానిని నమోదు చేయడానికి ఇక్కడ ఒక మార్గముంది: “పశ్చాత్తాపము అనేది ” అనే వాక్యాన్ని మీరు పూర్తిచేసే అనేక విధాలను జాబితా చేయండి.

ఆల్మా 36:18–21 కూడా చూడండి.

కొడుకును హత్తుకుంటున్న తండ్రి

The Prodigal Son [తప్పిపోయిన కుమారుడు] నుండి వివరణ, కార్క్ కెల్లీ ప్రైస్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:14-16

ఇతరులు క్రీస్తు యొద్దకు వచ్చుటకు సహాయము చేయడం నుండి ఆనందం వస్తుంది.

మీరు 14–16 వచనాలు చదివినప్పుడు, “పశ్చాత్తాపము ప్రకటించుట” అంటే అర్థమేమిటి—మరియు అది ఎందుకంత ఆనందాన్ని తెస్తుందో ధ్యానించండి. ఇతరులు రక్షకుని యొద్దకు వచ్చి, క్షమాపణ పొందడానికి సహాయపడేందుకు మీరు కనుగొన్న కొన్ని మార్గాలేవి? ఇతరులు మీ కోసం దాన్ని ఎలా చేశారు?

క్రెయిగ్ సి. క్రిస్టెన్‌సెన్, “నా ఆనందమంత శ్రేష్ఠమైనది, మధురమైనది మరేదియు ఉండదు,” లియహోనా, మే 2023, 45–47 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:34–36

లేఖనములలో నేను ప్రభువు యొక్క స్వరమును వినగలను.

ప్రభువు యొక్క స్వరము ఎలా ఉంటుందని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేమి చెప్తారు? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 18:34–36 చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు చదువుట ద్వారా ప్రభువు యొక్క స్వరము గురించి మీరేమి నేర్చుకున్నారు? ఆయన స్వరమును మరింత స్పష్టముగా వినడానికి మీరేమి చేయగలరు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 03

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10-13

మనలో ప్రతి ఒక్కరూ దేవునికి చాలా విలువైనవారు.

  • మీరు మరియు మీ పిల్లలు సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13 చదువుతున్నప్పుడు, “ఆత్మ,” “ఆత్మలు” మరియు “జనులందరు” అనే పదాల స్థానంలో ఒకరి పేర్లను ఒకరు ప్రత్యామ్నాయంగా ఉంచడాన్ని పరిగణించండి. మనలో ప్రతీ ఒక్కరి గురించి పరలోక తండ్రి ఎలా భావిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఈ వచనాలు ఎలా సహాయపడతాయో అప్పుడు మీరు మాట్లాడవచ్చు.

  • జనులు విలువైనవిగా భావించే వాటి గురించి కూడా మీరు మీ పిల్లలను అడగవచ్చు. లేదా మీకు విలువైనది ఏదైనా వారికి చూపించవచ్చు. మనకు విలువైన వస్తువులతో మనం ఎలా వ్యవహరిస్తాము? అప్పుడు వారిని వంతులవారీగా అద్దంలో చూసుకోనివ్వండి. వారలా చేస్తున్నప్పుడు, ప్రతీ బిడ్డకు వారు దేవుని బిడ్డలని మరియు వారు చాలా విలువైనవారని చెప్పండి. మన దృష్టిలో “[వారి] ఆత్మల విలువ గొప్పదని” ఇతరులకు మనమెలా చూపించగలము?

  • జనులందరూ పరలోక తండ్రికి ఎంతో విలువైనవారని నొక్కి చెప్పడానికి, మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13 చదివేటప్పుడు మీ పిల్లలు ఈ నమూనా చివర ఉన్న చిత్రాన్ని చూడవచ్చు.

బిడ్డను పట్టుకున్న క్రీస్తు

Worth of a Soul [ఆత్మ యొక్క విలువ] నుండి వివరణ, లిజ్ లెమన్ స్విండిల్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:13-16

సువార్తను పంచుకోవడం గొప్ప ఆనందాన్నిస్తుంది.

  • యేసు క్రీస్తు సువార్తను పంచుకునేలా మీ పిల్లలను ప్రేరేపించడానికి, మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని కోరుకునేలా ఏదైనా కనుగొన్నప్పటి అనుభవాల గురించి మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. మీరు దాన్ని ఎందుకు పంచుకోవాలనుకుంటున్నారు మరియు దాన్ని పంచుకోవడం మిమ్మల్ని ఎలా భావించేలా చేసింది? తర్వాత మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 18:13, 16 చదువవచ్చు. ప్రభువుకు ఏది ఆనందాన్నిస్తుంది? మనకు ఏది ఆనందాన్నిస్తుందని ఆయన చెప్తారు? మీరు మరియు మీ పిల్లలు రక్షకుని సువార్త యొక్క ఆనందాన్ని పంచుకోవడంలో మీకు కలిగిన ఏవైనా అనుభవాల గురించి మాట్లాడవచ్చు.

  • సువార్తను పంచుకోవడం గురించిన ఒక పాట మీ పిల్లలు సువార్తను పంచుకునే మార్గాల గురించి ఆలోచించడంలో వారికి సహాయపడగలదు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 18:34–36

లేఖనములలో నేను ప్రభువు యొక్క స్వరమును వినగలను.

  • మీ పిల్లలు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సంఘ నాయకులు వంటి విభిన్న వ్యక్తుల స్వరాలను గుర్తించడానికి ప్రయత్నించే ఆట‌ను ఆనందించవచ్చు. మనం ఒకరి స్వరాలను ఒకరం ఎలా గుర్తిస్తాము? ప్రభువు స్వరాన్ని మనం ఎలా గుర్తించగలం? ఈ ప్రశ్నను చర్చించడానికి మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 18:34–36 ను కలిసి చదువవచ్చు. మీరు లేఖనాలలో ప్రభువు స్వరాన్ని ఎలా విన్నారో కూడా మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

వివిధ సంస్కృతుల నుండి వ్యక్తుల ముఖాల దృశ్య రూపకల్పన

ప్రతీ ఆత్మ దేవునికి విలువైనది.

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ