“పునఃస్థాపన స్వరములు: ఎమ్మా హేల్ స్మిత్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“ఎమ్మా హేల్ స్మిత్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
పునఃస్థాపన స్వరములు
ఎమ్మా హేల్ స్మిత్
ఎమ్మా స్మిత్ కొరకు సిద్ధాంతము మరియు నిబంధనలు 25 లో నమోదు చేయబడిన ప్రభువు యొక్క మాటలు ఆమె గురించి మరియు ఆయన కార్యములో ఆమె తోడ్పాటు గురించి ఆయన ఎలా భావించారో బయల్పరుస్తాయి. కానీ ఎమ్మా ఎటువంటిది? ఆమె వ్యక్తిత్వము, ఆమె సంబంధాలు, ఆమె బలాల గురించి మనకేమి తెలుసు? ”ఎన్నుకోబడిన ఈ స్త్రీ” (సిద్ధాంతము మరియు నిబంధనలు 25:3) గురించి తెలుసుకోవడానికి గల మార్గము, వ్యక్తిగతంగా ఆమె గురించి తెలిసిన వారి మాటలను చదవడమే.
జోసెఫ్ స్మిత్ జూ., ఆమె భర్త
“వర్ణించలేనంత సంతోషంతో, నా మనసంతా ఆనందంతో నింపబడి, నేను ఆ రాత్రి నా ప్రియమైన ఎమ్మా చేయి అందుకున్నప్పుడు—ఆమె నా భార్య, నా యౌవనకాలపు భార్య; నాకు అతిప్రియమైన వ్యక్తి. మేము చవిచూడవలసిన అనేక అనుభవాల గురించి ఒక్క క్షణం నేను ధ్యానించినప్పుడు, నా మనస్సులో ఎన్నో ఆలోచనలు కలిగాయి. మా శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు, ఆనందాలు మరియు ఓదార్పులు ఎప్పటికప్పుడు మా జీవితాలంతటా విస్తరించి మమ్మల్ని దీవించాయి. ఓ! ఆ క్షణానికి నా మదిని నింపిన ఆలోచనల కలయిక. మళ్ళీ ఆమె ఇక్కడ ఉంది, ఏడవ సమస్యలో కూడా, చెదరకుండా, దృఢంగా మరియు అచంచలమైన, మార్పులేని, ఆప్యాయతగల ఎమ్మా.
లూసీ మాక్ స్మిత్, ఆమె అత్తగారు
“అప్పుడామె యౌవనురాలైయుండి, సహజంగా ఆశలు గలదై, ప్రభువు యొక్క కార్యానికి పూర్తిగా అంకితమైంది మరియు సంఘము, సత్యము యొక్క హేతువు తప్ప మరి దేనిపై ఆమెకు ఆసక్తి లేదు. ఆమె ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేసింది మరియు ’దీని వల్ల మిగిలిన వారికంటే నేను ఎక్కువ లాభం పొందుతానా?’ అని స్వార్థంతో ఎన్నడూ ప్రశ్నించలేదు. ఆమె ఎటువంటి కష్టాలు పడుతున్నప్పటికీ, ఎల్డర్‌లు ప్రవచించడానికి దూరంగా పంపబడినప్పుడు వారి ప్రయాణానికి కావలసిన బట్టలు తయారుచేసి అందించడంలో ఆమె ఎప్పుడూ ముందుండేది.”
జోసెఫ్ స్మిత్ సీ., ఆమె మామగారు
ఎమ్మా యొక్క గోత్రజనకుని దీవెన జోసెఫ్ స్మిత్ సీ. చేత ప్రకటించబడింది, ఆయన సంఘము యొక్క గోత్రజనకునిగా సేవ చేసేవారు:
“ఎమ్మా, నా కోడలా, నీ విశ్వాసమును యధార్థతను బట్టి నీవు ప్రభువు చేత దీవించబడినదానవు: నీవు నీ భర్తతో పాటు దీవించబడెదవు, అతనిపై రాబోవు మహిమయందు ఆనందించెదవు: నీ సహచరుడిని నాశనం చేయాలని చూసే మనుష్యుల దుష్టత్వం కారణంగా నీ ఆత్మ బాధపడినది మరియు అతని విడుదల కొరకు నీ పూర్ణాత్మ ప్రార్థనలో కొనసాగింది: ఆనందించుము, ఏలయనగా ప్రభువైన నీ దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు.
“నీ తండ్రి ఇంటివారి హృదయముల కఠినత్వము కారణంగా నీవు దుఃఖించావు, వారి రక్షణ కొరకు నీవు ఆకాంక్షించావు. నీ రోదనల పట్ల ప్రభువు గౌరవము కలిగియుండును మరియు ఆయన తీర్పుల చేత వారిలో కొందరు తమ తప్పులు తెలుసుకొని, వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడేలా ఆయన చేయును; కానీ బాధలచేతనే వారు రక్షింపబడెదరు. నీవు దీర్ఘకాలము జీవించెదవు; నీవు సంతృప్తి చెందేవరకు ప్రభువు నిన్ను కాపాడును, ఏలయనగా నీవు నీ విమోచకుని చూచెదవు. ప్రభువు యొక్క గొప్ప కార్యమందు నీ హృదయము ఆనందించును మరియు ఏ ఒక్కరూ నీ నుండి నీ ఆనందాన్ని దూరం చేయలేరు.
“నీఫైయుల గ్రంథాన్ని దేవదూత నా కుమారునికి ఇచ్చినప్పుడు అతనితో పాటు నీవు ఉండేందుకు అనుమతించిన నీ దేవుని గొప్ప నమ్రతను నీవు ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవలెను. నీ పిల్లల్లో ముగ్గురిని ప్రభువు నీ నుండి దూరం చేసినందుకు నీవు చాలా దుఃఖమును అనుభవించావు: ఇందులో నీవు నిందించబడవలసినది లేదు, ఏలయనగా నా కుమారుని నామము దీవించబడునట్లు ఒక కుటుంబమును పెంచుటకు స్వచ్ఛమైన నీ కోరికలు ఆయన ఎరుగును. ఇప్పుడు నేను నీతో చెప్పుచున్నాను, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నమ్మినట్లయితే, నీవు ఈ విషయములో ఇంకను దీవించబడెదవు మరియు నీ ఆత్మ యొక్క ఆనందము, సంతృప్తి కొరకు, నీ స్నేహితుల ఆనందము కొరకు నీవు ఇంకా పిల్లలను కనెదవు.
“నీవు జ్ఞానముతో దీవించబడెదవు మరియు ఇతర స్త్రీలకు ఉపదేశించుటకు శక్తి కలిగియుందువు. నీ కుటుంబమునకు నీతిని, నీ పిల్లలకు జీవన విధానాన్ని బోధించుము, పరిశుద్ధ దేవదూతలు నిన్ను కావలి కాయుదురు: నీవు దేవుని రాజ్యములో రక్షింపబడెదవు; అట్లేయగును గాక. ఆమేన్.”
తన పిల్లలతో ఎమ్మా స్మిత్. Time to Laugh [ఆనందించు సమయము], లిజ్ లెమన్ స్విండిల్ చేత