“మార్చి 17-23: ‘ఉత్తమమైన సంగతులను వెదకుము’: సిద్ధాంతము మరియు నిబంధనలు 23–26,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 23–26,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
మార్చి 17–23: “ఉత్తమమైన సంగతులను వెదకుము”
సిద్ధాంతము మరియు నిబంధనలు 23–26
చాలామందికి బాప్తిస్మము తీసుకోవడం భక్తితో కూడిన, ప్రశాంతమైన అనుభవము. అయితే, ఎమ్మా స్మిత్ మరియు ఇతరుల బాప్తిస్మము వారిని హేళనచేసి, బెదిరించి, పారిపోవడానికి బలవంతం చేసిన అల్లరిమూక చేత భంగపరచబడింది. తర్వాత, క్రొత్త సభ్యులను జోసెఫ్ నిర్ధారించబోవుచుండగా, అతని బోధనతో సమాజాన్ని కలవరపెడుతున్నాడని అతడిని ఖైదు చేసారు. ఈ వ్యతిరేకత అంతటిలో, తాను సరైన పని చేస్తున్నానని ఎమ్మాకు భరోసా ఎలా కలుగుతుంది? అదే చోట మనమందరం దానిని కనుగొనగలము—ప్రభువు నుండి బయల్పాటు ద్వారా. ఆయన ఎమ్మాతో “ఉత్తమమైన [లోక] విషయాలు”—ఆయన రాజ్యం—మరియు దానిలో ఆమె స్థానం గురించి మాట్లాడారు. భయపడవద్దని, “[ఆమె] హృదయమును పైకెత్తుకొని సంతోషించమని” మరియు “[ఆమె] చేసిన నిబంధనలను హత్తుకొనియుండమని” ఆయన ఆమెతో చెప్పారు. ఈ ప్రోత్సాహకరమైన మాటలు మరియు సలహా “అందరికి ఆయన స్వరమైయున్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 25:9–10, 13, 16).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
“[నా] శ్రమల నుండి” రక్షకుడు నన్ను లేవనెత్తగలడు.
శ్రమల కాలములో జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలను “బలపరచుటకు, ప్రోత్సహించుటకు, బోధించుటకు” సిద్ధాంతము మరియు నిబంధనలు 24లోని బయల్పాటు ఇవ్వబడింది (ప్రకరణ శీర్షిక; Saints, 1:94–96 కూడా చూడండి). వారిని బలపరిచేవిగా, ప్రోత్సహించేవిగా ఉన్నట్లు మీరు భావించిన పదాల కోసం సిద్ధాంతము మరియు నిబంధనలు 24లో చూడండి.
మీ సవాళ్ళలో రక్షకుడు మీకెలా సహాయపడతారనే దాని గురించి క్రింది లేఖనాలు మీకేమి సూచిస్తున్నాయి?
సిద్ధాంతము మరియు నిబంధనలు 24:1–3
సిద్ధాంతము మరియు నిబంధనలు 24:8
సిద్ధాంతము మరియు నిబంధనలు 121:7–8
యెషయా 40:28–31
He Healed Many of Diverse Diseases [ఆయన అనేక రకాల వ్యాధులను నయం చేశారు] నుండి వివరణ, జె. కిర్క్ రిఛర్డ్స్ చేత
దేవుని రాజ్యంలో నేను పోషించవలసిన ముఖ్య పాత్ర ఉంది.
ఎమ్మా స్మిత్ తన భర్త జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపన జరగడాన్ని వీక్షించినప్పుడు, తన పాత్ర ఏమైయుండవచ్చని ఆమె ఆశ్చర్యపడియుండవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 25 లో దేవుడు ఇచ్చిన జవాబుల కొరకు చూడండి. “[మీ కొరకు] ఆయన స్వరం” అని మీరు భావించేది ఏదైనా ఈ విభాగంలో మీరు కనుగొంటారా? (16వ వచనము).
“An Elect Lady” (video), Gospel Library; “Thou Art an Elect Lady,” in Revelations in Context, 33–39; జాయ్ డి. జోన్స్, “ప్రత్యేకంగా ఘనమైన పిలుపు,” లియహోనా, మే 2020, 15–18 కూడా చూడండి.
"An Elect Lady"
సిద్ధాంతము మరియు నిబంధనలు 25:5, 14
“సాత్వీకమైన ఆత్మయందు కొనసాగుము.”
“సాత్వీకమైన ఆత్మ” అనే వాక్యభాగము మీకు ఏ అర్థమును కలిగియున్నది? సాత్వీకముగా ఉండుట అనగా అర్థమేమిటో గ్రహించడానికి మీకు సహాయపడే పదాలు మరియు వాక్యభాగాల కొరకు 25వ ప్రకరణమును శోధించడాన్ని పరిగణించండి. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ గారి సందేశము, “సాత్వీకులు మరియు దీనులు” (లియహోనా, మే 2018, 30–33) కూడా సహాయపడవచ్చు. సాత్వీకానికి యేసు క్రీస్తు ఏవిధంగా మీకొక మాదిరి? (మత్తయి 11:28–30). “సాత్వీకమైన ఆత్మతో” మీ జీవితంలో మీరు చేయగల విషయాల గురించి ఆలోచించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 25:10, 13
“ఈ లోకసంబంధమైన విషయములను ప్రక్కన పెట్టి, ఉత్తమమైన సంగతులను వెదకవలెను.”
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 25: 10లో ప్రభువు యొక్క సలహాను ధ్యానించినప్పుడు, మీరు “ప్రక్కన పెట్టాలని” ఆయన కోరుకున్న “ఈ లోకసంబంధమైన విషయాలను” జాబితా చేయడం సహాయపడవచ్చు. తర్వాత మీరు వెదకాలని ఆయన కోరిన “ఉత్తమమైన [లోక] విషయాలను” మీరు జాబితా చేయవచ్చు. మీరు ప్రక్కన పెట్టే మొదటి జాబితా నుండి కనీసం ఒక విషయాన్ని మరియు మీరు కోరుకునే రెండవ జాబితా నుండి ఒక విషయాన్ని మీరు ఎంచుకోవచ్చు.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ “ఈ లోకము యొక్క అనేక విషయాలను ప్రక్కన [పెట్టడం]” గురించి సలహా మరియు వాగ్దానాలు ఇచ్చారు. “ఆత్మీయ నిధులు” అనే ఆయన సందేశం యొక్క 77వ పేజీలో దాని కొరకు చూడండి (లియహోనా, నవ. 2019). ఆయన సలహాను మీరెలా అనుసరిస్తారు?
మీరు 13వ వచనము చదువుతున్నప్పుడు, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మీరు చేసిన నిబంధనల గురించి ఆలోచించండి. ఈ నిబంధనలను “హత్తుకోవడం” అనగా అర్థమేమిటి? మీ నిబంధనలు “ఈ లోకసంబంధమైన విషయములను ప్రక్కన పెట్టి, ఉత్తమమైన సంగతులను వెదకడానికి” మీకెలా సహాయపడతాయి?
“ఈ లోకసంబంధమైన విషయాలు” మరియు “ఉత్తమమైన విషయాల” మధ్య తేడాను గుర్తించడంలో మీకు సహాయపడే కొన్ని ఇతర లేఖనాలు ఇక్కడ ఉన్నాయి: మత్తయి 6:19, 21, 25–34; లూకా 10:39–42; 2 నీఫై 9:51.
పంచుకోవడాన్ని ఆహ్వానించండి. మీరు ఇతరులకు “ఈ లోకసంబంధమైన విషయములను ఎలా ప్రక్కన పెట్టాలో” బోధిస్తున్నట్లయితే, ఈ సలహాను అనుసరించడానికి వారు ఏమి చేస్తున్నారో పంచుకోవడానికి వారిని ఆహ్వానించే మార్గాలను పరిగణించండి. ఒకరి అంతర్దృష్టులు మరియు అనుభవాలను మరొకరు వినడం ద్వారా మనం గొప్ప శక్తిని మరియు ధైర్యాన్ని పొందవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 25:11–12
నా “హృదయ కీర్తన” యందు ప్రభువు ఆనందిస్తారు.
మీ “హృదయ కీర్తన[లు]”— పరలోక తండ్రి లేదా యేసు క్రీస్తు గురించి మీ భావాలను తెలిపే కీర్తనలలో కొన్ని ఏవి? వాటిలో కొన్నింటిని పాడడం లేదా వినడం గురించి ఆలోచించండి. ఈ పాటలను మీకు ప్రత్యేకమైనవిగా చేసినది ఏమిటి?
ఈ కీర్తనలు ప్రార్థనలా ఎలా ఉన్నాయో కూడా మీరు ఆలోచించవచ్చు. పవిత్రమైన సంగీతం మరియు ప్రార్థనలో ఉమ్మడిగా ఏమి ఉన్నాయి? పవిత్రమైన మీ పాటలు ఎలా “ఒక దీవెనతో సమాధానమివ్వబడ్డాయి”?
సిద్ధాంతము మరియు నిబంధనలు 26:2
“సంఘములో అన్ని సంగతులు ఉమ్మడి అంగీకారము వలన చేయబడును.”
ఈ వచనంలోని “ఉమ్మడి అంగీకారము” అనే వాక్యభాగం, పిలుపు లేదా యాజకత్వ నియామకం పొందుతున్న వ్యక్తిని మనం ఆమోదిస్తున్నామని మరియు మద్దతు ఇస్తున్నామని చూపించడానికి మన చేతులను పైకెత్తే చర్యను సూచిస్తుంది. మనం ఒకరిని ఆమోదించినప్పుడు దాని అర్థం ఏమిటో మీరు సంఘ సమావేశానికి వచ్చిన సందర్శకుడికి ఎలా వివరిస్తారు? అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ గారి సందేశము “బలపరచు విశ్వాసము యొక్క శక్తి” లో మీరు ఏ జవాబులను కనుగొంటారు? (లియహోనా, మే 2019, 58-60).
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 24:1, 8
“(నా) శ్రమల నుండి” రక్షకుడు నన్ను లేవనెత్తగలడు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 24:1, 8లో అతని బాధల గురించి ప్రభువు జోసెఫ్‌కు ఏమి చెప్పారో మీరు మరియు మీ పిల్లలు కనుగొనగలరు. కష్ట సమయాల్లో ప్రభువు మీకు ఎలా సహాయం చేస్తారు అని కూడా మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.
1:52Chapter 11: More People Join the Church: April–June 1830
-
సహనము గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 24:8 మనకేమి బోధిస్తుంది? రక్షకుడు మన కష్టాల సమయంలో “[మన]తో” ఉన్నారని మనకు ఎలా తెలియజేస్తారు?
2:42Continue in Patience
సిద్ధాంతము మరియు నిబంధనలు 25:11–12
“హృదయ కీర్తన”ను యేసు ప్రేమిస్తారు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 25:12 చదివిన తర్వాత, మీరు ఒకరితో ఒకరు మీకిష్టమైన కీర్తన లేదా సంఘ పాట—మీ “హృదయ కీర్తన” గురించి చెప్పవచ్చు—మరియు కలిసి వాటిని పాడవచ్చు. మీరు ఈ పాటలను ఎందుకు ఇష్టపడుతున్నారో పరస్పరం పంచుకోండి. మనం ఈ పాటలు పాడినప్పుడు ప్రభువు ఎందుకు సంతోషిస్తారు? మన గానం ఎలా “[ఆయనకు] ప్రార్థన” వంటిది?
సిద్ధాంతము మరియు నిబంధనలు 25:13, 15
పరలోక తండ్రితో నా నిబంధనలు నాకు ఆనందాన్ని తీసుకొస్తాయి.
-
“నిబంధనలను హత్తుకొనియుండడం” (సిద్ధాంతము మరియు నిబంధనలు 25:13) అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి, మీ పిల్లలు వంతులవారీగా దేనినైనా తమకు వీలైనంత గట్టిగా పట్టుకోవచ్చు. తర్వాత మీరు మరియు మీ పిల్లలు మీ నిబంధనలను ఎలా “హత్తుకొనియుంటారు” లేదా పట్టుకొనియుంటారు అనే దాని గురించి మాట్లాడవచ్చు. అవసరమైతే, మనము చేసే నిబంధనలను మీ పిల్లలతో సమీక్షించండి (మోషైయ 18:8–10; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37; మరియు ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ చూడండి).
-
మీ పిల్లలకు సిద్ధాంతము మరియు నిబంధనలు 25:13 కోసం సందర్భం ఇవ్వడానికి, ఇది ఎమ్మా స్మిత్ బాప్తిస్మం తర్వాత ప్రభువు ఆమెకు చెప్పిన విషయం అని మీరు సూచించవచ్చు. ఇటీవల బాప్తిస్మం తీసుకున్న వ్యక్తికి ఇది ఎందుకు మంచి సలహా అవుతుంది?
2:51ఎమ్మా కోసం బయల్పాటు: ఆయన పని చేయడానికి ప్రభువు చేత ఎంపిక చేయబడింది
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.