“మార్చి 31–ఏప్రిల్ 6: ‘యేసు క్రీస్తు తన జనులను చేర్చుకొనును’: సిద్ధాంతము మరియు నిబంధనలు 29,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 29,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
మార్చి 31–ఏప్రిల్ 6: “యేసు క్రీస్తు తన జనులను చేర్చుకొనును”
సిద్ధాంతము మరియు నిబంధనలు 29
యేసు క్రీస్తు సంఘము 1830లో స్థాపించబడినప్పటికీ, అనేక సువార్త సత్యాలు అప్పటికింకా బయలుపరచబడవలసి ఉండెను మరియు అనేకమంది ప్రారంభ సంఘ సభ్యులు ప్రశ్నలు కలిగియున్నారు. ఇశ్రాయేలీయులు సమకూర్చబడుట, సీయోను నిర్మించబడుటను గూర్చి మోర్మన్ గ్రంథములో ప్రవచనాలను వారు చదివారు (3 నీఫై 21 చూడండి). అది ఎలా జరుగుతుంది? ఆ విషయం గురించి బయల్పాటులు పొందానని హైరం పేజ్ ఆరోపించాడు, అది కేవలం సభ్యుల ఉత్సుకతను పెంచింది (సిద్ధాంతము మరియు నిబంధనలు 28 చూడండి). ఆదాము హవ్వల పతనం మరియు ఆత్మీయ మరణం గురించి ఇతరులు ఆశ్చర్యపడ్డారు. ప్రభువు 1830లో ఈ ప్రశ్నలను స్వాగతించారు మరియు ఈరోజు మన ప్రశ్నలను స్వాగతిస్తున్నారు. “నా ఆజ్ఞానుసారముగా ప్రార్థనలో ఏకమై, విశ్వాసముతో మీరు ఏమి అడిగినను, దానిని మీరు పొందెదరు” అని పరిశుద్ధులతో ఆయన చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 29:6). వాస్తవానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 29లో సిద్ధాంతపరంగా గొప్పదైన బయల్పాటు చూపినట్లుగా, ప్రభువు కొన్నిసార్లు మనం అడిగిన దానిని మించి మనకు సత్యాన్ని, జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా మన ప్రశ్నలకు స్పందిస్తారు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
తన పిల్లల రక్షణ కొరకు పరలోక తండ్రి ఒక ప్రణాళికను కలిగియున్నారు.
మీ కోసం దేవుని ప్రణాళిక గురించి అనేక సత్యాలను సిద్ధాంతము మరియు నిబంధనలు 29 బోధిస్తుంది. మీరు చదివేటప్పుడు, ఆయన ప్రణాళిక యొక్క క్రింది భాగాలలో ప్రతిదాని గురించి మీరు నేర్చుకొనే సత్యాల కోసం చూడండి:
-
పూర్వమర్త్య జీవితము (36–37 వచనములు చూడండి)
-
సృష్టి (31–33 వచనములు చూడండి)
-
ఆదాము హవ్వల పతనము (40–41 వచనములు చూడండి)
-
మర్త్య జీవితము (39, 42–45 వచనములు చూడండి)
-
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము (1, 42–43, 46–50 వచనములు చూడండి)
-
పునరుత్థానము (13, 26 వచనములు చూడండి)
-
అంతిమ తీర్పు (12–13, 27–30 వచనములు చూడండి)
ఏ క్రొత్త అంతరార్థములను మీరు పొందారు? ఇది మీకు సహాయకరంగా ఉంటే, మీరు వాటిని ఈ నమూనా చివరిలో చిత్రాలతో అందించిన స్థలంలో వ్రాయవచ్చు. ఈ సత్యాలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
Come Unto Me [నా యొద్దకు రండి] నుండి వివరణ, జెనెడి పైజ్ చేత
సిద్ధాంతము మరియు నిబంధనలు 29:1-28
యేసు క్రీస్తు తన రెండవ రాకడకు ముందు తన జనులను సమకూర్చడంలో సహాయపడమని నన్ను ఆహ్వానిస్తున్నారు.
“కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో” ఆ విధముగా తన జనులను సమకూర్చుట గురించి యేసు క్రీస్తు మాట్లాడతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 29:2). యేసు క్రీస్తు గురించి ఈ పోలిక మీకేమి బోధిస్తుంది? ఈ నమూనాలో కోడి మరియు కోడిపిల్లల దృష్టాంతాన్ని మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు మీకు ఏ అదనపు ఆలోచనలు లేదా మనోభావాలు వస్తాయి? యేసు క్రీస్తు మిమ్మల్ని చేర్చుకొని, రక్షిస్తున్నప్పుడు మీరు ఎలా భావించారో ఆలోచించండి.
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 29: 1–11 చదువుతున్నప్పుడు, వీటి గురించి అంతర్దృష్టుల కోసం చూడండి:
-
ఎవరు సమకూర్చబడతారు.
-
క్రీస్తు వద్దకు “సమకూడుట” అనగా అర్థమేమిటి.
-
మనమెందుకు ఆయన వద్దకు సమకూడుతాము.
ఇతరులు యేసు క్రీస్తు వద్దకు సమకూడాలని మీరెందుకు కోరుకుంటున్నారో ధ్యానించండి. సహాయపడేందుకు మీరు ఏమి చేయడానికి ప్రేరేపించబడ్డారు?
మిమ్మల్ని మీరు ఇవే ప్రశ్నలు అడగవచ్చు లేదా సమకూర్పు గురించి ఒక కీర్తనను చదువవచ్చు లేదా వినవచ్చు. ప్రభువు తన సమకూర్పు గురించి మీకు ఏమి బోధించడానికి ప్రయత్నిస్తున్నారని మీరు భావిస్తున్నారు?
A Witness of God
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు: “ఇప్పుడు సమకూర్పు ఒక్కో దేశంలో జరుగుతున్నది. ప్రభువు తన పరిశుద్ధులకు వారి జననము మరియు జాతీయతను ఇచ్చిన ప్రతీ రాజ్యంలో సీయోను స్థాపనను నిర్ణయించారు” (“The Gathering of Scattered Israel,” Liahona, Nov. 2006, 81). రక్షకుని రెండవ రాకడకు కొరకు “సమస్త విషయములలో సిద్ధపడియుండుటకు” ఈవిధంగా సమకూడుట మనకు ఎలా సహాయపడుతుంది? (8వ వచనము; 14–28 వచనములు కూడా చూడండి).
డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, “చెందియుండడం యొక్క సిద్ధాంతము,” లియహోనా, నవ. 2022, 53–56 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 29:31–35
“సమస్తము నాకు ఆత్మీయముగా నున్నవి.”
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 29:31–35 చదువుతున్నప్పుడు, “ఏ భావంలో అన్ని ఆజ్ఞలు ఆధ్యాత్మికమైనవి?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు కొన్ని ఆజ్ఞలను జాబితా చేసి, ప్రతిదానికి సంబంధించిన ఆత్మీయ సూత్రాలను పరిగణించవచ్చు. యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు మార్గదర్శి యొక్క సమీక్ష సహాయకరంగా ఉండగలదు—ఇది దేవుని యొక్క అనేక ఆజ్ఞల వెనుక ఉన్న కొన్ని నిత్య సత్యాలను బోధిస్తుంది.
“సమస్తము … ఆత్మీయమైనవి” అని తెలుసుకోవడం మీరు దేవుని ఆజ్ఞలను చూసే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మీ జీవితంలోని ఇతర అంశాలలో కూడా ఆధ్యాత్మిక అర్థం లేదా ప్రయోజనం కోసం చూడడాన్ని పరిగణించండి.
2 నీఫై 9:39 కూడా చూడండి.
యేసు క్రీస్తుపై కేంద్రీకరించండి. “ప్రతి సువార్త అంశం యేసు క్రీస్తు గురించి బోధించడానికి మరియు తెలుసుకోవడానికి ఒక అవకాశం” (రక్షకుని విధానములో బోధించుట, 6). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 29 చదువుతున్నప్పుడు, ఆయన లక్షణాలు, ఆయన పాత్రలు మరియు ఆయన మాదిరి గురించి మీరేమి నేర్చుకుంటారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 29:36–50
పతనము నుండి యేసు క్రీస్తు మనల్ని విమోచిస్తారు.
యేసు క్రీస్తు ద్వారా మనకు విమోచన ఎందుకు అవసరమో వివరించడానికి మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 29:36–50 ను ఎలా ఉపయోగించగలరు?
ఆదాము, హవ్వల పతనము ప్రపంచంలోకి మరణాన్ని మరియు పాపాన్ని తీసుకువచ్చింది, అయితే ఇది క్రీస్తు ద్వారా విమోచన మరియు ఆనందానికి మార్గాన్ని కూడా సిద్ధం చేసింది. ఆ ఆలోచనతో, 39–43 వచనాలను చదివి, మీకు ఆనందాన్ని కలిగించే పదాలు మరియు వాక్యభాగాలను గమనించండి. మోషే 5:10–12 లో పతనము గురించి ఆదాము హవ్వలు చెప్పినదేది మిమ్మల్ని ఆకట్టుకుంది?
Why We Need a Savior
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
తన పిల్లల రక్షణ కొరకు పరలోక తండ్రి ఒక ప్రణాళికను కలిగియున్నారు.
-
మన కోసం పరలోక తండ్రి యొక్క ప్రణాళిక గురించి సంభాషణను ప్రారంభించడానికి, మీరు మరియు మీ పిల్లలు ఒక పర్యటన కోసం లేదా ఒక పనిని పూర్తి చేయడం కోసం ప్రణాళికను రూపొందించిన సమయం గురించి మాట్లాడవచ్చు. కార్యకలాపాలు వ్రాసియున్న క్యాలెండరు లేదా ఏదైనా చేయడానికి సూచనలు వంటి ప్రణాళికల ఉదాహరణలను కూడా మీరు పంచుకోవచ్చు. ప్రణాళికలు ఎందుకు ఉపయోగపడతాయి? తర్వాత, పరలోక తండ్రి ఏమి సాధించాలనుకుంటున్నారు మరియు దానిని నెరవేర్చడానికి ఆయన ప్రణాళిక మనకు ఎలా సహాయం చేస్తుంది అనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు.
-
పరలోక తండ్రి ప్రణాళికలోని వివిధ భాగాల గురించి బోధించే సిద్ధాంతము మరియు నిబంధనలు 29లోని వచనాలను కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయడానికి మీరు ఈ నమూనా చివరిలో ఉన్న చిత్రాలను ఉపయోగించవచ్చు. మీరు చిత్రాలను కత్తిరించి, వాటిని సరైన క్రమంలో ఉంచమని కూడా మీ పిల్లలను అడగవచ్చు. పరలోక తండ్రి మన కోసం ఒక ప్రణాళికను కలిగియున్నారని తెలుసుకోవడానికి మనం ఎందుకు కృతజ్ఞత కలిగియున్నాము? దాని గురించి తెలుసుకోవడం మన దైనందిన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది?
సిద్ధాంతము మరియు నిబంధనలు 29:1–2, 7–8
యేసు క్రీస్తు మరలా రాకముందే తన జనులను సమకూరుస్తున్నారు.
-
కోడి తన పిల్లలను చేర్చుకోవడం గురించి క్రింది వివరణ మీ పిల్లలకు సిద్ధాంతము మరియు నిబంధనలు 29:1–2 లోని సారూప్యతను ఊహించడంలో సహాయపడగలదు. ChurchofJesusChrist.org అప్పుడు మీరు ఈ వచనాలను కలిసి చదివి, కోడి తన పిల్లలను ఎలా రక్షిస్తుంది మరియు రక్షకుడు మన కోసం చేయగల దానిని అది ఎలా పోలియున్నదనే దాని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు.
1:24Chicks and Hens
I Would Gather Thee [నేను మిమ్మును చేర్చుకొందును], లిజ్ లెమన్ స్విండిల్ చేత
-
రక్షకుడు తన జనులను చేర్చుకోవడంలో సహాయపడడానికి మీ పిల్లలను ఏది ప్రేరేపిస్తుంది? బహుశా ఆయన సంఘములో చేరడం ద్వారా ఆయన వద్దకు “చేర్చబడిన” ఒకరి అనుభవాన్ని వారు వినాలనుకోవచ్చు. ఉదాహరణకు, మీ కుటుంబాన్ని సంఘానికి ఎవరు పరిచయం చేశారు? ఆయన వద్దకు సమకూడమనే రక్షకుని పిలుపును అంగీకరించడం ద్వారా మనం ఎలా దీవించబడ్డాము? ఇతరులు ఆయన వద్దకు చేరడానికి మనమెలా సహాయపడగలము? ChurchofJesusChrist.org
3:30Video: A Message for Children from President Russell M. Nelson
సిద్ధాంతము మరియు నిబంధనలు 29:11
యేసు క్రీస్తు మరలా వస్తారు.
-
రక్షకుని రెండవ రాకడ యొక్క చిత్రము లేదా దాని గురించిన ఒక పాట మీరు, మీ పిల్లలు సిద్ధాంతము మరియు నిబంధనలు 29:11 చర్చించడానికి సహాయపడగలదు. చిత్రంలో లేదా పాటలో దేనికైనా సంబంధించి లేఖనాల్లోని వాక్యభాగాలను గమనించేలా మీ పిల్లలకు సహాయం చేయండి. యేసు క్రీస్తు మరలా భూమిపైకి రావడం గురించి మీరెలా భావిస్తున్నారో ఒకరితో ఒకరు పంచుకోండి.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.