Doctrine and Covenants 2025
ఏప్రిల్ 21–27: “మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు”: సిద్ధాంతము మరియు నిబంధనలు 37–40


“ఏప్రిల్ 21–27: ‘మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు’: సిద్ధాంతము మరియు నిబంధనలు 37–40,”రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 37–40,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

వెళ్ళడానికి సిద్ధపడుతున్న పరిశుద్ధులు

Saints Move to Kirtland [కర్ట్‌లాండ్‌కు తరలిపోతున్న పరిశుద్ధులు] నుండి వివరణ, శామ్ లాలర్ చేత

ఏప్రిల్ 21–27: “మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు”

సిద్ధాంతము మరియు నిబంధనలు 37–40

ప్రారంభ పరిశుద్ధులకు సంఘమనేది ఆదివారం కొద్దిగా బోధనను వినడానికి వెళ్ళే ప్రదేశాన్ని మించినది. హేతువు, రాజ్యము, సీయోను మరియు చాలా తరచుగా, పని వంటి పదాలను బయల్పాటులు ఉపయోగించాయి. పునఃస్థాపించబడిన సంఘానికి జనులను ఆకర్షించిన దానిలో అది భాగమైయుండవచ్చు. వారు సిద్ధాంతాన్ని ప్రేమించినంతగా, చాలామంది తమ జీవితాలను అంకితం చేయగల పవిత్రమైనదాన్ని కూడా కోరుకున్నారు. అయినప్పటికీ, 1830లో ఒహైయోలో సమకూడమని ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించడం సులువుగా లేకుండెను. చాలామందికి దాని అర్థము, తెలియని ప్రాంతం కోసం సౌకర్యవంతమైన ఇళ్ళను వదిలిపెట్టడం (“పునఃస్థాపన స్వరములు: ఒహైయోలో సమకూడుట” చూడండి). ఆ పరిశుద్ధులు కేవలం విశ్వాసపు దృష్టితో చూడగలిగిన దానిని నేడు మనం స్పష్టంగా చూడగలము: ఒహైయోలో వారి కొరకు ప్రభువు గొప్ప దీవెనలను కలిగియున్నారు.

ఒహైయోలో సమకూడవలసిన అవసరం ఎప్పడో తీరిపోయింది, కానీ నేటికీ పరిశుద్ధులు ఇంకా అదే హేతువు, అదే కార్యమైన “సీయోనును స్థాపించుటకు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 39:13) ఏకమవుతారు. ఆ ప్రారంభ పరిశుద్ధుల వలె మనము “ఐహిక విచారములు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 40:2) విడిచిపెట్టడానికి మరియు ప్రభువు యొక్క వాగ్దానాన్ని నమ్మడానికి ఆహ్వానించబడ్డాము: “నీవు … నీవెన్నడు యెరుగని గొప్ప దీవెనను పొందెదవు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 39:10).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 37–38

మనల్ని దీవించడానికి ప్రభువు మనల్ని సమకూరుస్తారు.

న్యూయార్క్‌లోని ఫేయెట్‌లోనున్న సంఘ సభ్యులు 1831 శీతాకాలంలో ఒహైయోకు (250 మైళ్ళ కంటే ఎక్కువ దూరం) వెళ్ళేందుకు కష్టమైన త్యాగాలు చేయాల్సి వచ్చింది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 37:3–4లో ప్రభువు యొక్క ఆజ్ఞ గురించి చదువుతున్నప్పుడు, ప్రభువు మీ నుండి అడిగిన త్యాగాల గురించి ఆలోచించండి. తర్వాత, మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 38:1–33 చదువుతున్నప్పుడు, రక్షకుని గురించిన సత్యాల కోసం చూడండి, అది ఆయన సలహాను అనుసరించడానికి మీకు విశ్వాసాన్ని ఇస్తుంది. యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా సమకూడిక యొక్క దీవెనల గురించి 11–33 వచనాల నుండి మీరేమి నేర్చుకుంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:22

“నా స్వరము విని నన్ను వెంబడించుము.”

యేసు క్రీస్తును మీ “శాసనకర్తగా” మీరెలా చేయగలరు? ఆయన చట్టాలను అనుసరించడం మిమ్మల్ని “స్వేచ్ఛ కలిగిన జనముగా” ఎలా చేస్తుంది?

2 నీఫై 2:26–27 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:30

నేను సిద్ధపడియుండిన యెడల, నేను భయపడనవసరము లేదు.

“మీరు సిద్ధపడియుండిన యెడల మీరు భయపడనవసరము లేదు” అని సిద్ధాంతము మరియు నిబంధనలు 38:30లో ప్రభువు బయల్పరచిన సూత్రాన్ని మీరెప్పుడు అనుభూతి చెందారు? 38వ ప్రకరణమును మీరు చదివినప్పుడు, వారు భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోగలిగేలా ప్రభువు తన పరిశుద్ధులను ఎలా సిద్ధం చేస్తారో గమనించండి. మీరు భయపడాల్సిన అవసరం లేకుండా సవాళ్ళ కొరకు మీరు ఎలా సిద్ధం కావాలని ఆయన కోరుకుంటున్నారు?

డేవిడ్ ఎ. బెడ్నార్, “మనము దీనితో వారిని నిరూపిద్దాం,” లియహోనా, నవ. 2020, 8–11 చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:24–27

సెమినరీ చిహ్నము
మనము “ఒక్కటిగా ఉండాలని” దేవుడు కోరుతున్నారు.

ఒహైయోలో సమకూడిన పరిశుద్ధులు విభిన్న పరిస్థితుల నుండి వచ్చారు. మీ వార్డులోని జనుల విషయంలో అదే నిజము. కానీ “ఒక్కటిగా ఉండాలని” దేవుడు తన జనులను ఆజ్ఞాపించారు (27వ వచనము). ఈ విధమైన ఐక్యతను మనం ఎలా సాధించగలం? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 38: 24–27 చదువుతున్నప్పుడు, మనస్సులోకి ఏ ఆలోచనలు వస్తాయి? దేవుని జనులుగా ఉండాలంటే మనం ఎందుకు ఐక్యంగా ఉండాలి?

ఈ వచనాలను చదవడం మీ సంబంధాల గురించి ఆలోచించడానికి కూడా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు—ఉదాహరణకు, కుటుంబ సభ్యులు, వార్డు సభ్యులు మరియు సమూహము లేదా తరగతి సభ్యులతో. క్రీస్తులో ఐక్యంగా ఉండకుండా మిమ్మల్ని ఏది అడ్డుకుంటుంది? “ఒక్కటిగా ఉండడానికి” రక్షకుడు మీకు ఎలా సహాయపడగలరు? ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ గారి సందేశము క్రీస్తు యొక్క శాంతి శత్రుత్వాన్ని నిర్మూలించును,” లియహోనా, నవ. 2021, 83–85లో కూడా మీరు ఉపాయాలను కనుగొనవచ్చు.

4:1

A Friend to All

3:14

Love in Our Hearts

ఈ సమూహాలు మరింత ఏకీకృతం కావడానికి మీరు ఎలా సహాయపడగలరు? ఉదాహరణకు, మీ సమూహము, తరగతి లేదా కుటుంబ సభ్యులకు ఒక రకమైన గమనిక లేదా సందేశం పంపడాన్ని పరిగణించండి. మీరు ఎవరిని చేరుకోవడానికి ప్రేరణ పొందారు?

ఎఫెసీయులకు 2:14, 18–22; 2 నీఫై 26:24–28లో రక్షకుని మాదిరి గురించి మీకు ఏది స్ఫూర్తినిస్తుంది?

క్వింటిన్ ఎల్. కుక్, “నీతియందును, ఐక్యతయందును హృదయములు ముడివేయబడెను,” లియహోనా, నవ. 2020, 18–21 కూడా చూడండి.

ఆఫ్రికా‌లో యువకులు

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:3939-40

పరలోక తండ్రి నాకు నిత్యత్వపు ధనాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు.

మీ అభిప్రాయం ప్రకారం, “భూలోక సంపదలు” మరియు “నిత్యత్వపు ధనము” మధ్య తేడా ఏమిటి? (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:39). నిత్యత్వపు ధనాన్ని విలువైనదిగా గుర్తించడాన్ని ఏ అనుభవాలు మీకు నేర్పించాయి?

మీరు 39–40 ప్రకరణములలో జేమ్స్ కోవెల్ గురించి చదువుతున్నప్పుడు దీన్ని గుర్తుంచుకోండి (ప్రకరణ శీర్షికలలోని చారిత్రక నేపథ్యంతో సహా). అతని అనుభవము మీకెలా అన్వయించబడగలదో ఆలోచించండి. ఉదాహరణకు, మీ “హృదయము (దేవుని) యెదుట యధార్థముగా ఉన్న” (సిద్ధాంతము మరియు నిబంధనలు 40:1) సమయాల గురించి ఆలోచించండి. మీ విశ్వసనీయతను బట్టి మీరెలా దీవించబడ్డారు? అలాగే మీరు ఎదుర్కొనే “ఐహిక విచారాల” గురించి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని “సంతోషంగా” అందుకోకుండా అవి మిమ్మల్ని ఎలా అడ్డుకోవచ్చు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 39:9; 40:2). మరింత నిలకడగా దేవునికి విధేయులైయుండడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా దేనిని మీరు ఈ ప్రకరణాలలో కనుగొంటారు?

మత్తయి 13:3–23 కూడా చూడండి.

లేఖనాలను మీ జీవితానికి అన్వయించుకొనుట. “[లేఖనాల] ఔచిత్యాన్ని తెలుసుకోవడానికి మీరు అభ్యాసకులకు సహాయపడే ఒక మార్గం ఏమిటంటే, ‘మీరు ఇప్పుడు అనుభవిస్తున్న దానిలో ఇది మీకు ఎలా సహాయం చేస్తుంది?’ వంటి ప్రశ్నలను అడగడం. ‘దీనిని తెలుసుకోవడం మీకు ఎందుకు ముఖ్యమైనది?’ ‘ఇది మీ జీవితంలో ఎలాంటి మార్పును కలిగించగలదు?’ (రక్షకుని విధానములో బోధించుట23 చూడండి.) సిద్ధాంతము మరియు నిబంధనలు 39–40 గురించి ఈ ప్రోత్సాహ కార్యక్రమములోని ప్రశ్నలు మన జీవితాల్లో ఈ బయల్పాటులను అన్వయించడానికి మనకు సహాయపడగల ప్రశ్నలకు మరొక ఉదాహరణలు.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 02

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 3738:31–33

మనల్ని దీవించడానికి ప్రభువు మనల్ని సమకూరుస్తారు.

2:55

ఒహైయోలో సమకూడుట: లూసీ స్మిత్ విశ్వాసం మరియు ఒక అద్భుతం

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:24-27

మనము “ఒక్కటిగా ఉండాలని” దేవుడు కోరుతున్నారు.

  • మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 38: 24–25ను మీ పిల్లలతో కలిసి చదువుతున్నప్పుడు, మీ సోదరుడు లేదా సోదరిని మీలాగే గౌరవించడం అంటే ఏమిటో మాట్లాడండి (మత్తయి 7:12 చూడండి). “అతని సోదరుడు” స్థానంలో ఒక్కొక్కరి పేర్లతో లేఖనాన్ని పునరావృతం చేయడంలో వారికి సహాయపడండి.

  • మీ పిల్లలకు “ఒక్కటిగా ఉండడం” (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:27) అంటే ఏమిటో బోధించడానికి, మీరు సంఖ్య 1 ని పెద్దదిగా గీయడానికి మరియు మీ కుటుంబం లేదా తరగతిలోని ప్రతీ వ్యక్తి యొక్క పేర్లు మరియు రేఖాచిత్రా‌లు లేదా చిత్రాలతో దానిని అలంకరించడానికి వారికి సహాయపడవచ్చు. 1 ప్రక్కన, మరింత ఐక్యంగా ఉండడానికి మీరు చేసే పనులను వ్రాయవచ్చు.

  • ఒక మెత్తని బొంతను తయారు చేసే గుడ్డ ముక్కలు లేదా ఒక రొట్టెని తయారు చేసే పదార్థాలు వంటి వస్తువులను ఎలా కలపవచ్చు లేదా ఏకం చేయవచ్చు అనే విషయాన్ని వివరించే వస్తుపాఠాన్ని పంచుకోవడాన్ని పరిగణించండి. దేవుని జనులుగా ఒకటిగా మారడం గురించి ఈ ఉదాహరణలు మనకు ఏమి బోధిస్తాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:30

నేను సిద్ధపడియుండిన యెడల, నేను భయపడనవసరము లేదు.

  • మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 38:30ని కలిసి చదువుతున్నప్పుడు, సిద్ధపాటు అవసరమైన ఇటీవలి అనుభవాల గురించి మీరు మరియు మీ పిల్లలు మాట్లాడవచ్చు. తర్వాత, మనం సిద్ధపడాలని పరలోక తండ్రి కోరుకుంటున్న విషయాల గురించి మీరు మీ పిల్లలను అడగవచ్చు. మీరు సిద్ధపడియుండడం మీరు భయపడకుండా ఉండేందుకు మీకు సహాయపడిన అనుభవాన్ని మీ పిల్లలతో పంచుకోండి.

3:24

Men's Hearts Shall Fail Them

సిద్ధాంతము మరియు నిబంధనలు 39:6, 23

నేను నిర్ధారించబడినప్పుడు నేను పరిశుద్ధాత్మ వరమును పొందుతాను.

  • నిర్ధారించబడిన వ్యక్తి యొక్క చిత్రాన్ని చూపించడాన్ని పరిగణించండి. చిత్రంలో ఏమి జరుగుతుందో వివరించమని మీ పిల్లలను అడగండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 39:6, 23లో పరిశుద్ధాత్మ అనే పదాన్ని వారు వినినప్పుడల్లా చిత్రం వైపు చూపమని కూడా మీరు వారిని ఆహ్వానించవచ్చు. పరిశుద్ధాత్మ వరం మిమ్మల్ని ఎలా దీవించిందో ఒకరితో ఒకరు పంచుకోండి.

నిర్ధారించబడుతున్న బాలిక

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.