Doctrine and Covenants 2025
ఏప్రిల్ 7–13: “నా సువార్తను ప్రకటించుటకు … మీ స్వరములను ఎలుగెత్తండి”: సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36


“ఏప్రిల్ 7–13, ‘నా సువార్తను ప్రకటించుటకు … మీ స్వరములను ఎలుగెత్తండి’: సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

ప్రారంభ సువార్తికులు

ఏప్రిల్ 7–13: “నా సువార్తను ప్రకటించుటకు … మీ స్వరములను ఎలుగెత్తండి”

సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36

సువార్తను బోధించడానికి “అరణ్యములోనికి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 32:2) అతడు పిలువబడినప్పుడు, పార్లీ పి. ప్రాట్ సంఘ సభ్యుడై దాదాపు నెల కావస్తున్నది. “నీ పరిచర్య గడియ వచ్చియున్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 31:3) అని చెప్పబడినప్పుడు, థామస్ బి. మార్ష్ అంతకంటే తక్కువ సమయం నుండి సభ్యునిగా ఉన్నాడు. అదేవిధంగా ఆర్సన్ ప్రాట్, ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ మరియు ఇతరులనేకులు వారి మిషను పిలుపులను అందుకోవడానికి కొంతకాలం ముందే బాప్తిస్మం పొందారు. బహుశా ఈ నమూనాలో నేడు మన కొరకు ఒక పాఠమున్నది: బాప్తిస్మము ద్వారా పునఃస్థాపించబడిన సువార్తను అంగీకరించడానికి తగినంత మీకు తెలిసినట్లయితే, దానిని ఇతరులతో పంచుకోవడానికి తగినంత మీకు తెలుసు. అయితే, మనము ఎల్లప్పుడూ మన సువార్త జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటాము, కానీ దేవుడు తన సువార్తను బోధించడానికి “విద్యలేని పామరులను” పిలువడానికి ఎన్నడూ సందేహించలేదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 35:13). వాస్తవానికి, “నా సువార్తను ప్రకటించుటకు నీ నోటిని విప్పు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 30:5) అని ఆయన మనందరినీ ఆహ్వానిస్తారు. మరియు మనం దానిని మన స్వంత జ్ఞానముతో, అనుభవముతో కాకుండా “ఆత్మ శక్తిచేత” (సిద్ధాంతము మరియు నిబంధనలు 35:13) బాగుగా చేస్తాము.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36

సెమినరీ చిహ్నము
నేను యేసు క్రీస్తుకు సాక్షిగా ఉండడానికి పిలువబడ్డాను.

సువార్తికునిగా మీకు అధికారిక పిలుపు ఉన్నా, లేకపోయినా మీరు “అన్ని సమయములలో, అన్ని విషయములలో, అన్ని స్థలములలో” (మోషైయ 18:9) యేసు క్రీస్తుకు సాక్షిగా ఉండగలరు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 30–36 చదువుతున్నప్పుడు, సువార్తను పంచుకోవడానికి మీకు గల అవకాశాల గురించి మీరు నేర్చుకున్న దానిని నమోదు చేయండి. ప్రభువు మీ నుండి అడిగే విషయాల జాబితాను మరియు మీరు సువార్తను పంచుకునేటప్పుడు ప్రభువు చేసే వాగ్దానాల జాబితాను మీరు తయారు చేయవచ్చు (ఉదాహరణకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 30:8; 31:3–5; 32:1, 5; 35:13–1524 చూడండి). సువార్తను పంచుకోవడంలో మీకు సహాయపడే సూత్రాల కోసం కూడా మీరు చూడవచ్చు. “సంతోషకరమైన సువర్తమానమును ప్రకటించడానికి” మిమ్మల్ని ప్రేరేపించేదిగా మీరు ఏమి కనుగొన్నారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 31:3).

“చిన్నతనం నుండి మనలో ప్రతీఒక్కరికి బోధించబడిన, తేలికైన, సులువుగా గ్రహింపదగిన సూత్రాలైన ప్రేమించు, పంచు మరియు ఆహ్వానించు అనే వాటి ద్వారా సువార్తను ప్రకటించుట సాధించబడగలదు” (“ప్రేమించు, పంచు, ఆహ్వానించు,” లియహోనా, మే 2022, 85) అని ఎల్డర్ గ్యారీ ఈ. స్టీవెన్‌సన్ బోధించారు. మీ పరిచయస్థులు, స్నేహితులు మరియు కుటుంబం గురించి ఆలోచిస్తూ ఆయన సందేశాన్ని అధ్యయనం చేయడాన్ని పరిగణించండి. “యేసు క్రీస్తు యొక్క సువార్తలో [మీకు] ఇష్టమైన దానిని” మీరు వారితో ఎలా పంచుకోగలరనే దాని గురించి మీకు వచ్చే ఉపాయాలేవి? “వచ్చి చూడండి,” “వచ్చి సేవ చేయండి” మరియు “వచ్చి చెందియుండండి” అని మీరు వారిని ఆహ్వానించగల విధానాలేవి?

మార్కోస్ ఎ. అయిదుకైటిస్, “మీ హృదయమును పైకెత్తి, సంతోషించుము,” లియహోనా, మే 2022, 40–43 కూడా చూడండి.

4:30

Inviting All to Come unto Christ: Sharing the Gospel

ఒక స్త్రీల సమూహానికి బోధిస్తున్న సువార్తికురాళ్ళు

సిద్ధాంతము మరియు నిబంధనలు 31:1–2, 5–6, 9, 13

నా కుటుంబ సంబంధాలలో ప్రభువు నాకు సహాయపడగలరు.

నేడు కుటుంబాలు ఎదుర్కొంటున్న అనేకమైన అవే సమస్యలతో 1830లలోని కుటుంబాలు శ్రమించాయి. సిద్ధాంతము మరియు నిబంధనలు 31లో థామస్ బి. మార్ష్‌కు అతని కుటుంబం గురించి ప్రభువు ఇచ్చిన నడిపింపు మరియు వాగ్దానాలేవి? (ప్రత్యేకించి 1–2, 5–6, 9, 13 వచనములు చూడండి). మీ కుటుంబ సంబంధాలలో ఆయన మాటలు మీకెలా సహాయపడగలవు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 32–33; 35

నేను చేయాలని ఆయన కోరిన కార్యము కొరకు ప్రభువు నన్ను సిద్ధపరుస్తారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 32–33; 35లో చెప్పబడిన జనుల జీవితాలను అధ్యయనం చేయడం, ఆయన కార్యము కొరకు ప్రభువు మిమ్మల్ని ఎలా సిద్ధం చేస్తున్నారో గుర్తించడానికి మీకు సహాయపడగలదు. ఉదాహరణకు, “పునఃస్థాపన స్వరములు: తొలుత పరివర్తన చెందినవారు” లో పార్లీ పి. ప్రాటి మరియు సిడ్నీ రిగ్డన్‌ల మధ్య సంబంధం గురించి మీరు చదువవచ్చు. ఈ సంబంధం దేవుని పిల్లలను ఎలా దీవిస్తుంది? (సిద్ధాంతము మరియు నిబంధనలు 35 చూడండి).

ఇక్కడ మరొక ఉదాహరణ ఉంది: ఎజ్రా థైర్ తను బాప్తిస్మం పొందే ముందు తనకు ఒక దర్శనం కలిగిందని వ్రాశాడు, అందులో “ఒక వ్యక్తి వచ్చి నాకు ఒక కాగితపు చుట్టను అందించాడు, అలాగే ఒక బూర‌ను ఇచ్చి, దానిని [వాయించమని] చెప్పాడు. నా జీవితంలో నేను ఎప్పుడూ [వాయించలేదని] అతనితో చెప్పాను. నువ్వు దీన్ని [వాయించగలవు], ప్రయత్నించు అని అతను చెప్పాడు. … ఇది నేను ఎన్నడూ వినని అత్యంత అందమైన ధ్వనిని చేసింది” (“Revelation, October 1830–B, Revelation Book 1,” historical introduction, josephsmithpapers.org). తరువాత, ఎజ్రా థైర్ మరియు నార్థ్రోప్ స్వీట్ కోసం జోసెఫ్ స్మిత్ ఇప్పుడు సిద్ధాంతము మరియు నిబంధనలు 33గా నమోదు చేయబడిన బయల్పాటును అందుకున్నప్పుడు, ఎజ్రా ఆ బయల్పాటును తన దర్శనంలోని కాగితం చుట్టగా అర్థం చేసుకున్నాడు. సిద్ధాంతము మరియు నిబంధనలు 33: 1–13లో ప్రభువు అతనికిచ్చిన నియమితకార్యము కొరకు ఆయన ఎజ్రాను ఎలా సిద్ధం చేస్తున్నారు?

ఈ ప్రారంభ సంఘ సభ్యుల జీవితాల్లో ప్రభువు హస్తం ఉందనడానికి మీరు ఏ సాక్ష్యం చూస్తున్నారు? క్రీస్తు దగ్గరకు రావడానికి మీకు సహాయం చేయడానికి ప్రభువు మీ జీవితంలో ఎవరిని ఉంచారు? మీ విశ్వాసం, ప్రేమ లేదా ఆహ్వానం ద్వారా ఇతరులను దీవించడానికి ఆయన మిమ్మల్ని ఎలా సిద్ధం చేస్తున్నారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 33:12–18

నేను నా జీవితాన్ని రక్షకుని యొక్క సువార్తపై నిర్మించినట్లయితే, నేను పడిపోను.

సంఘము యొక్క క్రొత్త సభ్యులైన నార్థ్రోప్ స్వీట్, ఎజ్రా థైర్‌లకు సిద్ధాంతము మరియు నిబంధనలు 33 ఉద్దేశించబడింది. ఈ బయల్పాటు ఇవ్వబడిన వెంటనే నార్థ్రోప్ సంఘాన్ని విడిచివెళ్ళాడు. ఎజ్రా కొంతకాలము విశ్వాసంగా సేవ చేసాడు, కానీ కాలక్రమేణా అతడు కూడా దూరమయ్యాడు. ఈ ప్రకరణములో వారి గురించి చదవడం సువార్త యొక్క “బండపైన” (13వ వచనము) మీరు ఎంత స్థిరంగా నిర్మించబడ్డారో పరిగణించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. రక్షకుని పట్ల విశ్వాసంగా నిలిచియుండేందుకు ఈ వచనాలలోని ఏ సత్యాలు మీకు సహాయపడగలవు?

హీలమన్ 5:12 కూడా చూడండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

అధ్యయన చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 30:1–2

నేను భూలోక సంగతుల కంటే దేవుని సంగతులపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

  • మీ పిల్లలు తమ కుటుంబ సభ్యులందరి పేర్లను రాసుకుంటూ ఇష్టమైన పాటకు పదాలు చెప్పడం వంటి రెండు పనులను ఒకేసారి చేయడానికి ప్రయత్నించడం సరదాగా ఉండవచ్చు. ఒకేసారి రెండు పనులు చేయడం ఎందుకు కష్టమైనది? తర్వాత మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 30:1–2ను కలిసి చదువవచ్చు. యేసు క్రీస్తును మరియు ఆయన సువార్తను గుర్తుంచుకోకుండా మన దృష్టిని మరల్చగల “భూలోక సంగతులు” ఏవి? మన దృష్టిని ఆయనపై మనము ఎలా నిలుపగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 33:2-3, 6–10

నేను యేసు క్రీస్తు సువార్తను పంచుకోగలను.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 33:8–10 అర్థం చేసుకోవడంలో మీ పిల్లలకు సహాయపడేందుకు, వారి నోరు మూసుకుని ఒక వాక్యభాగాన్ని చెప్పడానికి ప్రయత్నించమని మీరు వారిని ఆహ్వానించవచ్చు, అప్పుడు మీరు లేదా మీ ఇతర పిల్లలు వారు ఏమి చెబుతున్నారో ఊహించవచ్చు. 8–10 వచనములు చదవండి మరియు “మీ నోళ్ళను విప్పుము” అనే వాక్యభాగము మళ్ళీ మళ్ళీ చెప్పబడినప్పుడల్లా వారి నోళ్ళు తెరవమని వారిని అడగండి. మనం నోరు తెరిచి ఇతరులతో సువార్తను పంచుకోవాలని పరలోక తండ్రి ఎందుకు కోరుకుంటున్నారు? రక్షకుడు లేదా ఆయన సువార్త గురించి మన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు మనమేమి చెప్పగలము? సువార్తను పంచుకోవడం గురించి ఒక పాటను కూడా మీరు పాడవచ్చు.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 30–34లో ఉన్న సూత్రాలు లేదా వాగ్దానాలకు సంబంధించి మీరు కలిగియున్న అనుభవాలను పంచుకోవడాన్ని పరిగణించండి. మీ రక్షకుని గురించి మరియు మీరు ఆయనకు సేవ చేస్తున్నప్పుడు ఆయన కార్యము గురించి మీరు ఏమి నేర్చుకున్నారు లేదా అనుభూతి చెందారు?

పత్రికను చూస్తున్న పిల్లల సమూహం

సువార్తను పంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

వాగ్దానం చేయబడిన దీవెనలకు సాక్ష్యమివ్వండి. మీరు ఒక సువార్త సూత్రాన్ని జీవించమని పిల్లలను ఆహ్వానించినప్పుడు, ఆ సూత్రాన్ని బట్టి జీవించే జనులకు దేవుడు చేసిన వాగ్దానాలను మీరు పంచుకోవచ్చు. ఉదాహరణకు, మనం నోరు తెరిచి సువార్తను పంచుకున్నప్పుడు ఆయన మనకు ఇచ్చే దీవెనల గురించి మీరు సాక్ష్యమివ్వవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 33:12–13

యేసు క్రీస్తు సువార్తపై నేను నా జీవితాన్ని నిర్మించగలను.

  • మీరు మీ పిల్లలను వారి ఇల్లు లేదా సంఘ భవనం యొక్క పునాదిని చూడడానికి బయటకు తీసుకువెళ్ళవచ్చు మరియు దానిని వివరించమని వారిని అడగవచ్చు. ఒక భవనానికి బలమైన, దృఢమైన పునాది ఎందుకు అవసరం? మీరు వారితోపాటు సిద్ధాంతము మరియు నిబంధనలు 33: 12–33 చదివి, మన జీవితాలను ఆయన సువార్తపై మనం నిర్మించాలని ప్రభువు ఎందుకు కోరుకుంటున్నారు అనే దాని గురించి మీ భావాలను ఒకరితో ఒకరు పంచుకోండి. సువార్తను వర్ణించడానికి “బండ” అనేది ఎందుకు మంచి పదం అవుతుంది? సువార్త యొక్క బండపై మన జీవితాలను మనమెలా నిర్మించుకోగలము? (మత్తయి 7:24–29 కూడా చూడండి).

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

మంచులో ప్రయాణిస్తున్న ప్రారంభ సువార్తికులు

Go into the Wilderness [అరణ్యములోనికి వెళ్ళుము], రాబర్ట్ టి. బారెట్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ