“జనవరి 27–ఫిబ్రవరి 2: ‘నా కార్యము ముందుకు సాగును’: సిద్ధాంతము మరియు నిబంధనలు 3–5,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 3–5,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
జనవరి 27–ఫిబ్రవరి 2: “నా కార్యము ముందుకు సాగును”
సిద్ధాంతము మరియు నిబంధనలు 3–5
ప్రభువు యొక్క ప్రవక్తగా మొదటి కొన్ని సంవత్సరాలలో అతడు చేయాలని పిలువబడిన “ఆశ్చర్యకార్యము” గురించి జోసెఫ్ స్మిత్‌కు పూర్తిగా తెలియదు. కానీ దేవుని కార్యానికి అర్హులయ్యేందుకు అతని కంటికి నిజంగా “దేవుని మహిమయే లక్ష్యముగా ఉండాలని” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 4:1, 5) తన పూర్వ అనుభవాలు అతనికి నేర్పించాయి. ఉదాహరణకు, అతని కోరికలకు విరుద్ధంగా ప్రభువు అతనికి ఉపదేశమిచ్చినట్లయితే, అతడు ప్రభువు యొక్క ఉపదేశాన్ని అనుసరించాలి. అతడు “అనేక బయల్పాటులు పొంది, … మహా గొప్ప కార్యాలనేకము చేయడానికి శక్తి కలిగియున్నప్పటికీ,” దేవుని చిత్తము కంటే అతని దృష్టిలో తన స్వంత చిత్తమే ముఖ్యమైనట్లయితే, అతడు “తప్పక పతనమైపోవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 3:4). కానీ దేవుని కార్యము చేయడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైన మరొక విషయాన్ని జోసెఫ్ నేర్చుకున్నాడు: “దేవుడు కనికరము గలవాడు,” మరియు జోసెఫ్ మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడినట్లయితే, అతడు “ఇంకను ఎన్నుకోబడియుండును” (10వ వచనము). ఏదేమైనా దేవుని కార్యము విమోచన యొక్క కార్యమైయున్నది. మరియు ఆ కార్యము “భంగపరచబడలేదు” (1వ వచనము).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 3:1–16
నేను దేవుడిని నమ్మగలను.
జోసెఫ్ స్మిత్ పరిచర్య యొక్క తొలినాళ్ళలో మంచి స్నేహితులు—ప్రత్యేకించి గౌరవనీయుడు, భాగ్యవంతుడు, విలువైన సహకారాన్ని అందించే స్థితిలో ఉన్న మార్టిన్ హారిస్ వంటి స్నేహితులు దొరకడం కష్టంగా ఉండేది. కాబట్టి మార్టిన్ మోర్మన్ గ్రంథ అనువాదపు మొదటి 116 చేతివ్రాత పేజీలను తన భార్యకు చూపించడానికి అనుమతి కోరినప్పుడు, ప్రభువు దానికి వ్యతిరేకంగా హెచ్చరించినప్పటికీ జోసెఫ్ సహజంగానే అతని అభ్యర్థనను గౌరవించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తూ, మార్టిన్ దగ్గర ఉన్నప్పుడు ఆ పేజీలు కోల్పోబడ్డాయి మరియు జోసెఫ్, మార్టిన్‌లు ప్రభువు చేత తీవ్రంగా గద్దించబడ్డారు (Saints, 1:51–53 చూడండి).
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 3:1–15 చదివినప్పుడు, వారి అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకోవాలని ప్రభువు కోరుతున్నారో ధ్యానించండి. ఉదాహరణకు, దీని గురించి మీరేమి నేర్చుకుంటారు:
-
దేవుని కార్యము? 1– 3, 16 వచనాలు చూడండి).
-
దేవుడిని నమ్మడం కంటే మనుష్యునికి భయపడడం వలన కలిగే పర్యవసానాలు? 4–8 వచనాలు చూడండి).
-
విశ్వాసంగా నిలిచియుండడం నుండి వచ్చే దీవెనలు? (8వ వచనము చూడండి).
-
ప్రభువు జోసెఫ్‌ను సరిదిద్దిన మరియు ప్రోత్సహించిన విధానం? (9–16 వచనాలు చూడండి).
వేరే పని చేయాలనే ఒత్తిడి ఎదురైనప్పుడు మీరు ప్రభువును విశ్వసించినప్పుడు మీరు కలిగియున్న అనుభవాలేవి? మీ చర్యల యొక్క ఫలితాలేవి?
డేల్ జి. రెన్లండ్, “వ్యక్తిగత బయల్పాటు కొరకు ఒక అంతర్లీన నిర్మాణం,” లియహోనా, నవ. 2022, 16–19 కూడా చూడండి.
నేను నా పూర్ణ “హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో దేవునికి సేవ చేయగలను.
4వ ప్రకరణము తరచు పూర్తి-కాల సువార్తికులకు అన్వయించబడుతుంది. అయినప్పటికీ, ఈ బయల్పాటు వాస్తవానికి జోసెఫ్ స్మిత్ సీనియర్‌కు ఇవ్వబడిందని గమనించడం ఆసక్తికరమైనది, ఆయన సువార్తసేవకు పిలువబడలేదు, కానీ “దేవుని సేవించాలనే కోరిక” కలిగియున్నారు (3వ వచనము).
ఈ ప్రకరణమును చదివేందుకు ఒక విధానము, ప్రభువు కార్యము చేయాలని కోరుకునే వారి కొరకు ఉద్యోగ వర్ణనగా దానిని ఊహించుకోవడం. దేవుడు దేనికోసం చూస్తున్నారు? ఆయన ఏ ప్రయోజనాలను అందిస్తారు?
ఈ బయల్పాటు నుండి ప్రభువును సేవించడం గురించి మీరేమి నేర్చుకుంటారు?
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇశ్రాయేలు సమకూర్పును “అతిగొప్ప సవాలు, అతిగొప్ప హేతువు మరియు భూమిపై అతిగొప్ప కార్యము” అని పిలిచారు (“Hope of Israel” [worldwide youth devotional, June 3, 2018], Gospel Library). ఈ కార్యములో పాల్గొనడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా ఆయన ప్రసంగంలో మీరు ఏమి కనుగొన్నారు?
దేవుని సేవించాలనే కోరిక కలిగియున్న ప్రతీఒక్కరు సేవకు పిలువబడతారు.
పరిశుద్ధాత్మ ద్వారా నేను మోర్మన్ గ్రంథము యొక్క సాక్ష్యము పొందగలను.
1829, మార్చిలో మార్టిన్ హారిస్ భార్య లూసీ, జోసెఫ్ స్మిత్ బంగారు పలకలను అనువదిస్తున్నట్లు నటించి ప్రజలను మోసం చేస్తున్నాడని కోర్టులో దావా వేశారు (Saints, 1:56–58 చూడండి). అందువలన బంగారు పలకలు నిజమైనవని మరింత సాక్ష్యం కొరకు మార్టిన్, జోసెఫ్‌ను అడిగాడు. సిద్ధాంతము మరియు నిబంధనలు 5 మార్టిన్ అభ్యర్థనకు జవాబుగా ఇవ్వబడిన బయల్పాటు. క్రింది వాటి గురించి ఈ ప్రకరణము నుండి మీరేమి నేర్చుకుంటారు:
-
బంగారు పలకలను ప్రపంచానికి కనపడేలా ప్రదర్శిస్తే ఏమి జరుగుతుందని ప్రభువు చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 5:7 చూడండి). అలా అని మీరు ఎందుకు అనుకుంటున్నారు?
-
ప్రభువు యొక్క కార్యములో సాక్షుల పాత్ర (11–15 వచనాలు చూడండి; 2 కొరింథీయులకు 13:1 కూడా చూడండి).
-
మీకై మీరు మోర్మన్ గ్రంథము గురించి సాక్ష్యాన్ని ఎలా పొందవచ్చు (16, 24 వచనాలు చూడండి; మొరోనై 10:3–5 కూడా చూడండి).
సిద్ధాంతము మరియు నిబంధనలు 5:1–10
యేసు క్రీస్తు జోసెఫ్ స్మిత్ ద్వారా తన వాక్యాన్ని మనకిచ్చారు.
మన కాలములో—మరియు మీ జీవితంలో జోసెఫ్ స్మిత్ యొక్క పాత్ర గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 5:1–10 మీకేమి బోధిస్తుంది? (2 నీఫై 3:6–24 కూడా చూడండి.)
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 3:5–10; 5:21–22
ఇతరులు నా చేత తప్పు చేయించాలని ప్రయత్నించినప్పుడు నేను సరైనదాన్ని ఎంచుకోగలను.
-
పరలోక తండ్రిని విశ్వసించడాన్ని నేర్చుకోవడం గురించి చర్చను ప్రారంభించడానికి, మీరు కోల్పోబడిన చేతివ్రాత పేజీల కథనాన్ని సమీక్షించాలనుకోవచ్చు. తర్వాత, సరైనది కాదని తెలిసినది ఏదైనా చేయాలని మీ పిల్లలు శోధించబడిన సందర్భాలను మీరు వారితో నటింపజేయవచ్చు. ఈ సందర్భాలలో సిద్ధాంతము మరియు నిబంధనలు 3:5–8; 5:21–22 లోని ఏ పదాలు లేదా వాక్యభాగాలు వారికి సహాయపడగలవు?
4:38మార్టిన్ హారిస్ జోసెఫ్కు సహాయపడతాడు: ప్రభువును విశ్వసించుట నేర్చుకొనుట
ఆయన కార్యములో సహాయపడమని ప్రభువు నన్ను ఆహ్వానిస్తారు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 4 లోని ప్రతీ వచనము అమూల్యమైన సత్యాలను కలిగియుంది, అవి దేవుడిని సేవించడం గురించి నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడగలవు. ఈ సత్యాలను కనుగొనడంలో వారికి సహాయపడేందుకు ఇక్కడ కొన్ని ఉపాయాలున్నాయి:
-
మీరు కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 4:1 చదివి, దేవుని యొక్క “ఆశ్చర్యకరమైన” కడవరి దిన కార్యమును వర్ణించే చిత్రాలను (సువార్తికులు, దేవాలయాలు మరియు మోర్మన్ గ్రంథము వంటివి) చూపించవచ్చు.
-
“మీ పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో ఆయనను సేవించుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 4:2) అనే వాక్యభాగమును వర్ణించే అభినయాల గురించి లేదా చిత్రాలను గీయడం గురించి మీ పిల్లలు ఆలోచించవచ్చు.
-
పొలంలో పనిచేయడానికి ఉపయోగించే సాధనాలను మీరు కలిసి చూడవచ్చు. ఈ సాధనాలు మనకెలా సహాయపడతాయి? తర్వాత, దేవుని కార్యము చేయడానికి సాధనాల వంటివాటిని సిద్ధాంతము మరియు నిబంధనలు 4:5–6లో మీ పిల్లలు కనుగొనవచ్చు.
-
పెద్ద పిల్లలు తమ స్వంతంగా సిద్ధాంతము మరియు నిబంధనలు 4 పరిశోధించి, దేవునికి సేవచేయడమంటే అర్థమేమిటనే దాని గురించి వారు నేర్చుకున్న విషయాలను జాబితా చేయవచ్చు.
-
సువార్త పరిచర్య గురించి ఒక పాటను కూడా మీరు కలిసి పాడవచ్చు.
-
ఇతరులకు సేవ చేయుట ద్వారా నేను దేవుని కార్యములో సహాయపడగలను.
వైకల్యాలున్న వ్యక్తులకు అనుగుణంగా కార్యకలాపాలను స్వీకరించండి. కార్యకలాపాలకు చిన్న అనుసరణలు చేయడం ప్రతి ఒక్కరూ నేర్చుకునే అవకాశాన్ని కలిగి ఉండేలా చేయవచ్చు. ఉదాహరణకు, ఏదైనా ప్రోత్సాహకార్యక్రమం చిత్రాన్ని చూపించమని సూచిస్తే, దానికి బదులుగా దృష్టి లోపం ఉన్న అభ్యాసకులను చేర్చడానికి మీరు సంబంధిత పాటను పాడవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 5:1-7, 11, 16, 23-24
మోర్మన్ గ్రంథము సత్యమని నేను సాక్షిగా ఉండగలను.
-
సాక్షుల గురించి మీ పిల్లలకు బోధించడానికి, పిల్లి తన ముందు కాళ్ళపై నడవడం చూసినట్లు ఒక స్నేహితుడు చెప్పడాన్ని ఊహించుకోమని మీరు వారిని అడగవచ్చు. వారు దీనిని నమ్ముతారా? అదే విషయం మరో స్నేహితుడు చెబితే? “సాక్షి” అంటే ఏమిటి మరియు సాక్షులు ఎందుకు ముఖ్యము అనే దాని గురించి మాట్లాడండి. అప్పుడు ఇటువంటి ప్రశ్నలకు జవాబుల కొరకు సిద్ధాంతము మరియు నిబంధనలు 5:1–3, 7, 11 పరిశోధించుటకు మీ పిల్లలకు మీరు సహాయపడవచ్చు:
-
ఏమి తెలుసుకోవాలని మార్టిన్ హారిస్ కోరుకున్నాడు?
-
జోసెఫ్ స్మిత్ బంగారు పలకలను ఎవరికి చూపించగలడు?
-
బహుశా పలకలను చూడడం మోర్మన్ గ్రంథము నిజమని ఒకరిని ఎందుకు ఒప్పించలేదు?
-
మోర్మన్ గ్రంథము యొక్క సాక్షులుగా ఉండేందుకు మనమేమి చేయగలము? (సిద్ధాంతము మరియు నిబంధనలు 5:16; మొరోనై 10:3–5 చూడండి).
-
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.