Doctrine and Covenants 2025
ఫిబ్రవరి 17–23: “నా తోటి సేవకులైన మీపై”: సిద్ధాంతము మరియు నిబంధనలు 12–17; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–75


“ఫిబ్రవరి 17–23: ‘నా తోటి సేవకులైన మీపై’: సిద్ధాంతము మరియు నిబంధనలు 12–17; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–75,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 12-17; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–75,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

సస్క్వెహన్నా నది

పెన్సిల్వేనియాలోని హార్మొని దగ్గరున్న సస్క్వెహన్నా నది

ఫిబ్రవరి 17– 23: “నా తోటి సేవకులైన మీపై”

సిద్ధాంతము మరియు నిబంధనలు 12-17; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–75

ప్రపంచవ్యాప్తంగా చాలామంది పెన్సిల్వేనియాలోని హార్మొని అనే ప్రాంతం గురించి ఎన్నడూ వినియుండకపోవచ్చు. ప్రభువు తరచు ఆయన రాజ్యంలో అత్యంత ముఖ్యమైన సంఘటనల కొరకు అప్రసిద్ధ ప్రదేశాలను ఎంచుకుంటారు. 1829, మే 15న హార్మొని దగ్గర దట్టమైన చెట్లుగల ప్రదేశంలో బాప్తిస్మమిచ్చు యోహాను జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు అగుపించాడు. అతడు తన చేతులను వారి తలలపై ఉంచి, వారిని “నా తోటి సేవకులు” అని పిలుస్తూ వారికి అహరోను యాజకత్వాన్ని అనుగ్రహించాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1).

రక్షకునికి బాప్తిస్మమిచ్చి, ఆయన రాకడ కొరకు మార్గాన్ని సిద్ధం చేసిన బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని యొక్క నమ్మకమైన సేవకుడు (మత్తయి 3:1–6, 13–17 చూడండి). యోహాను యొక్క తోటి సేవకులు అని పిలువబడడం ఇరవైలలో ఉన్న ఈ ఇద్దరు యువకులను వినమ్రంగా, అలాగే ముంచివేయబడినట్లుగా భావింపజేసియుండవచ్చు. ఆ సమయంలో హార్మొని వలె జోసెఫ్, ఆలీవర్‌లు కూడా ప్రఖ్యాతి చెందినవారు కాదు. కానీ దేవుని కార్యములో సేవచేయడం ఎల్లప్పుడూ మనం ఎలా సేవచేస్తామనే దానికి సంబంధించినదే కానీ ఎవరు గమనిస్తారని కాదు. కొన్నిసార్లు మీ సహాయం ఎంత చిన్నదైనప్పటికీ, తెలియబడనప్పటికీ మీరు కూడా ప్రభువు యొక్క “గొప్ప ఆశ్చర్యకార్యము”లో (సిద్ధాంతము మరియు నిబంధనలు 14:1) తోటి సేవకులే.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 12; 14

దేవుని యొక్క “గొప్ప ఆశ్చర్యకార్యము”లో నేను పాల్గొనగలను.

ప్రభువు యొక్క కార్యములో తాము ఏవిధంగా సహాయపడగలమో తెలుసుకోవాలని జోసెఫ్ నైట్ మరియు డేవిడ్ విట్మర్ ఇద్దరూ కోరుకున్నారు. వారికి ప్రభువు యొక్క సమాధానాన్ని మీరు చదువుతున్నప్పుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 12; 14), “సీయోను హేతువును ముందుకుతెచ్చి స్థాపించుటకు” (12:6; 14:6 కూడా చూడండి) అనగా మీకు గల అర్థమేమిటో ఆలోచించండి. మీరు దీనిని చేయడానికి సహాయపడగలిగేలా ఈ ప్రకరణములలో మీరు ఏ సూత్రాలు మరియు క్రీస్తువంటి లక్షణాలను కనుగొంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 13

అహరోను యాజకత్వమును పునఃస్థాపించడానికి యేసు క్రీస్తు బాప్తిస్మమిచ్చు యోహానును పంపారు.

బాప్తిస్మమిచ్చు యోహాను జోసెఫ్ స్మిత్‌ మరియు ఆలీవర్ కౌడరీలను తన “తోటి సేవకులు” అని పిలిచాడు. బాప్తిస్మమిచ్చు యోహానుకు తోటి సేవకులుగా ఉండడమంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (మత్తయి 3:13–17; లూకా 1:13–17; 3:2–20 చూడండి).

13వ ప్రకరణములో అహరోను యాజకత్వము గురించి బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన దానిని మీరు చదువుతున్నప్పుడు, ప్రభువు యొక్క మార్గమును సిద్ధపరిచే యోహాను యొక్క నియమితకార్యమును సాధించడానికి ఈ యాజకత్వము యొక్క తాళపుచెవులు ఏవిధంగా సహాయపడ్డాయో ధ్యానించండి. ఉదాహరణకు:

మీ జీవితంలో రక్షకుడిని స్వీకరించడానికి మీ కొరకు మార్గాన్ని సిద్ధపరచడంలో అహరోను యాజకత్వ విధులు (బాప్తిస్మము మరియు సంస్కారము వంటివి) ఏవిధంగా సహాయపడతాయి?

యాజకత్వ తాళపుచెవులు అంటే ఏమిటి?

యాజకత్వ తాళపుచెవుల గురించి ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ మరియు ఆయన భార్య రూత్ ఈ వివరణ అందించారు:

“యాజకత్వ తాళపుచెవులు అనే పదం రెండు భిన్నమైన విధాలుగా ఉపయోగించబడింది. మొదటిది అహరోను లేదా మెల్కీసెదెకు యాజకత్వాన్ని పొందిన వారందరిపై అనుగ్రహించబడబోవు ప్రత్యేక హక్కు లేదా విశేషాధికారాన్ని సూచిస్తుంది. … ఉదాహరణకు, అహరోను యాజకత్వము కలిగియున్నవారు దేవదూతల పరిచర్య యొక్కయు, పశ్చాత్తాపము యొక్క సిద్ధపరచు సువార్త యొక్కయు, పాపక్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మము యొక్కయు తాళపుచెవులను పొందుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1; 84:26–27 చూడండి). మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్నవారు పరలోకరాజ్య మర్మముల తాళపుచెవులను, దేవుని జ్ఞానము యొక్క తాళపుచెవులను మరియు సంఘము యొక్క ఆత్మీయ దీవెనలన్నింటి యొక్క తాళపుచెవులను పొందుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19; 107:18 చూడండి). …

“యాజకత్వ తాళపుచెవులు అనే పదం ఉపయోగించబడిన రెండవ విధానం నాయకత్వాన్ని సూచిస్తుంది. యాజకత్వ నాయకులు అదనపు యాజకత్వ తాళపుచెవులను, సంఘము లేదా సమూహము యొక్క సంస్థాగత విభాగముపై అధ్యక్షత్వము వహించే హక్కును పొందుతారు. ఈ విషయంలో, యాజకత్వ తాళపుచెవులు సంఘములో నిర్దేశించడానికి, నడిపించడానికి మరియు పరిపాలించడానికి గల శక్తి మరియు అధికారము” (The Melchizedek Priesthood: Understanding the Doctrine, Living the Principles [2018], 26).

ఆలీవర్ కౌడరీకి బాప్తిస్మమిస్తున్న జోసెఫ్ స్మిత్

Joseph Smith Baptizes Oliver Cowdery [ఆలీవర్ కౌడరీకి బాప్తిస్మమిస్తున్న జోసెఫ్ స్మిత్], డెల్ పార్శన్ చేత

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–75

సెమినరీ చిహ్నము
విధులు నాకు దేవుని శక్తికి ప్రవేశాన్నిస్తాయి.

పునఃస్థాపన యొక్క ప్రధాన సంఘటనలలో జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలతో కలిసి ఉంటే ఎలా ఉండేదోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 71వ వచనము చివరనున్న గమనికతో కలిపి మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–75 చదువుతున్నప్పుడు, వారు భావించిన దానిలో కనీసం కొంత మీరు గ్రహించియుండవచ్చు. వారి మాటల గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది? ప్రత్యేకించి, వారు యాజకత్వము పొంది, బాప్తిస్మము తీసుకున్నందువలన వారు పొందిన దీవెనలను గమనించండి. యాజకత్వ విధుల ద్వారా రక్షకుడు మీకిచ్చిన దీవెనలేవి?

మరింత నేర్చుకోవడానికి, విధులు మరియు దీవెనలు అనే శీర్షికలతో ఒక పట్టికను రూపొందించడాన్ని పరిగణించండి. తర్వాత, వాటి నుండి వచ్చే విధులు మరియు దీవెనలను జాబితా చేయడానికి మీరు ఇటువంటి లేఖనాలను పరిశోధించవచ్చు: యోహాను 14:26; అపొస్తలుల కార్యములు 2:38; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19–22; 131:1–4; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:73–74. జాబితాకు మీరు జతచేసే అదనపు దీవెనలేవి? మీరు పొందిన విధులు మీ జీవితంలోకి రక్షకుని శక్తిని ఏవిధంగా తెచ్చాయి?

డేవిడ్ ఎ. బెడ్నార్, “గొప్ప మహిమయందు దేవుని శక్తితో,” లియహోనా, నవ. 2021, 28–30 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 15–16

క్రీస్తు యొద్దకు ఆత్మలను తీసుకురావడం ఎంతో విలువైనది.

జాన్ మరియు పీటర్ విట్మర్‌ల వలె, మీ జీవితంలో ఏది “అత్యంత విలువైనది కాగలదని” మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా? (సిద్ధాంతము మరియు నిబంధనలు 15:4; 16:4). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 15–16 చదువుతున్నప్పుడు, క్రీస్తు యొద్దకు ఆత్మలను తెచ్చుట ఎందుకు అత్యంత విలువైనదో ధ్యానించండి. క్రీస్తు యొద్దకు “ఆత్మలను తెచ్చుటకు” మీరేమి చేస్తున్నారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 17

ప్రభువు తన వాక్యమును స్థిరపరచుటకు సాక్షులను ఉపయోగిస్తారు.

సాక్ష్యము అంటే ఏమిటి? ప్రభువు తన పనిలో సాక్షులను ఎందుకు ఉపయోగిస్తారు? (2 కొరింథీయులకు 13:1 చూడండి). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 17 లో ముగ్గురు సాక్షులకు ఇవ్వబడిన దేవుని మాటలు చదివేటప్పుడు ఈ ప్రశ్నలను ధ్యానించండి. (మోర్మన్ గ్రంథములో “ముగ్గురు సాక్షుల సాక్ష్యము” కూడా చూడండి.) దేవుని యొక్క “నీతిగల ఉద్దేశ్యములు” నెరవేర్చుటకు సాక్షులు ఏవిధంగా సహాయపడతారు? (4వ వచనము).

దేనికి మీరు సాక్ష్యమివ్వగలరు?

23:10

A Day for the Eternities

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 02

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 13; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:68–74

బాప్తిస్మమిచ్చు యోహాను అహరోను యాజకత్వమును పునఃస్థాపించాడు.

  • ఈ నమూనా‌లోని కళాకృతి మీ పిల్లలు అహరోను యాజకత్వము యొక్క పునఃస్థాపనను దృశ్యమానం చేయడంలో సహాయపడగలదు. వారితో కలిసి జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:68–74లో మీరు చదివిన దానిపై ఆధారపడి ఆ సంఘటనను చిత్రీకరించడాన్ని వారు ఆనందిస్తారా?

    2:12

    దేవదూతలు యాజకత్వమును పునఃస్థాపించారు: దేవుని పనిని చేయడానికి అధికారము

  • మీరు కలిసి మత్తయి 3:13–17; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:68–70 చదివేటప్పుడు, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క చిత్రాన్ని కూడా మీరు చూపించవచ్చు. బాప్తిస్మమివ్వడానికి జోసెఫ్ స్మిత్‌కు యాజకత్వ అధికారాన్ని ఇవ్వడానికి ప్రభువు బాప్తిస్మమిచ్చు యోహానును పంపడం ఎందుకు ముఖ్యమైనది?

దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట. యాజకత్వ శక్తి, అధికారము మరియు తాళపుచెవుల గురించి నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేలా మరిన్ని ఉపాయాల కొరకు, అనుబంధము ఎ లేదా అనుబంధము బి చూడండి.

యేసు క్రీస్తుకు బాప్తిస్మమిస్తున్న బాప్తిస్మమిచ్చు యోహాను

బాప్తిస్మము తీసుకుంటున్న యేసు యొక్క వివరణ, డాన్ బర్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 13

పరలోక తండ్రి అహరోను యాజకత్వము ద్వారా నన్ను దీవిస్తారు.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 13లో చెప్పబడిన తాళపుచెవుల గురించి చర్చను ప్రేరేపించడానికి, మీరు మరియ మీ పిల్లలు ఒక తాళపుచెవుల గుత్తిని చూచి, ఏమి చేయడానికి తాళపుచెవులు మనల్ని అనుమతిస్తాయనే దాని గురించి మాట్లాడవచ్చు. బహుశా మీరు 13వ ప్రకరణములో తాళపుచెవులు అనే పదాన్ని కనుగొనడానికి వారికి సహాయపడవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 13 లోని ఏ ఇతర పదాలు లేదా వాక్యభాగాలు అహరోను యాజకత్వ దీవెనలను వర్ణిస్తాయి?

3:5

Blessings of the Priesthood

సిద్ధాంతము మరియు నిబంధనలు 15:4–6; 16:4–6

ఇతరులు యేసు క్రీస్తు వద్దకు వచ్చుటకు సహాయపడడం “అత్యంత విలువైనది.”

  • జాన్ మరియు పీటర్ విట్మర్‌లు తమ జీవితాలలో ఏది అత్యంత విలువైనదో తెలుసుకోవాలని కోరుకున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 15:4; 16:4 చూడండి). బహుశా మీరు మరియు మీ పిల్లలు మీకు అత్యంత విలువైన విషయాల గురించి మాట్లాడవచ్చు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 15:6 లేదా 16:6 చదువుతున్నప్పుడు, “అత్యంత విలువైనది” అని ప్రభువు చెప్పినది వారు వినినప్పుడు మీ పిల్లలను చేతులు పైకెత్తమని అడగండి.

  • “[యేసు క్రీస్తు] వద్దకు ఆత్మలను తెచ్చుట” అనగా అర్థమేమిటి? ఇతరులతో స్నేహం చేయడం, స్నేహితునితో లేఖనాలను పంచుకోవడం లేదా అవసరంలో ఉన్నవారి కోసం ప్రార్థించడం వంటి ఆలోచనల జాబితాను రూపొందించడంలో మీ పిల్లలకు సహాయం చేయండి. మీ పిల్లలు సంఘ పత్రిక‌లలో ఈ విషయాల చిత్రాల కోసం వెదకవచ్చు. లేదా వారు వారి స్వంత చిత్రాలను గీయవచ్చు. వారి జాబితా నుండి వారు చేయబోయే వాటిని ఎంచుకోవడానికి వారిని ఆహ్వానించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 17

నేను మోర్మన్ గ్రంథము యొక్క సాక్షిని కాగలను.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 17:5–6 చదివిన తరువాత, మోర్మన్ గ్రంథము సత్యమని మీకెలా తెలుసో మీ పిల్లలకు చెప్పండి. మోర్మన్ గ్రంథానికి మనం ఏవిధంగా సాక్షులు కాగలము?

    4:58

    సాక్షులు మోర్మన్ గ్రంథము యొక్క పలకలను చూచెను: లోకమునకు సాక్ష్యము వహించుట

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

బాప్తిస్మమిచ్చు యోహాను నుండి అహరోను యాజకత్వమును పొందుతున్న జోసెఫ్ మరియు ఆలీవర్

Upon You My Fellow Servants [నా తోటి సేవకులైన మీపై], లిండా కర్లీ క్రిస్టెన్‌సెన్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ