“ఫిబ్రవరి 3–9: ‘ఇదియే బయల్పాటు ఆత్మ’: సిద్ధాంతము మరియు నిబంధనలు 6–9,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 6–9,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
ఫిబ్రవరి 3–9: “ఇదియే బయల్పాటు ఆత్మ”
సిద్ధాంతము మరియు నిబంధనలు 6–9
1828 శరదృతువులో, ఆలీవర్ కౌడరీ అనే యువ పాఠశాల ఉపాధ్యాయుడు న్యూయార్క్‌లోని మాంఛెస్టర్‌లో అధ్యాపకునిగా పనిలో చేరి, లూసీ మరియు జోసెఫ్ స్మిత్ సీ. కుటుంబంతో కలిసి ఉన్నాడు. వారి కుమారుడైన జోసెఫ్ మరియు విశేషమైన అతని అనుభవాల గురించి ఆలీవర్ విన్నాడు మరియు తనను తాను సత్యాన్వేషిగా భావించే ఆలీవర్ మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు. దేవదూతల సందర్శనలు, ఒక ప్రాచీన గ్రంథము మరియు దేవుని శక్తితో అనువదించే బహుమానం గురించి స్మిత్‌లు వివరించారు. ఆలీవర్ ఆకర్షితుడయ్యాడు. ఇది నిజం కాగలదా? లూసీ మరియు జోసెఫ్ సీ. సత్యాన్ని కోరుకునే ఎవరికైనా వర్తించే సలహా అతనికి ఇచ్చారు, అదేమనగా ప్రార్థన చేసి ప్రభువును అడుగుట.
ఆలీవర్ ఆవిధంగా చేయగా, “[అతని] మనస్సుకు శాంతిని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:23) పలుకుతూ ప్రభువు సమాధానమిచ్చారు. బయల్పాటు జోసెఫ్ స్మిత్ వంటి ప్రవక్తల కొరకు మాత్రమే కాదని ఆలీవర్ కనుగొన్నాడు. దానిని కోరి, శ్రద్ధగా వెదికే వారెవరికైనా అది ఇవ్వబడుతుంది. ఆలీవర్ ఇంకా చాలా నేర్చుకోవలసి ఉంది, కానీ తదుపరి అడుగు వేయడానికి కావలసిన జ్ఞానాన్ని అతడు పొందాడు. ప్రభువు జోసెఫ్ స్మిత్ ద్వారా ఒక ముఖ్యమైన పని చేస్తున్నారని అతనికి తెలుసు మరియు ఆలీవర్ దానిలో భాగం కావాలని కోరుకున్నాడు.
Days of Harmony
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 6; 8–9
పరలోక తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడతారు.
1829 వసంత కాలములో, జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథమును అనువదించుచుండగా ఆలీవర్ కౌడరీ స్వచ్ఛందంగా అతడికి లేఖకుడిగా ఉన్నాడు. ఆ అనుభవం అతడిని ఆశ్చర్యపరిచింది, తాను కూడా బయల్పాటు మరియు అనువాదపు బహుమానమును పొందగలడా అని అతడు ఆశ్చర్యపోయాడు. అయితే, అతని మొదటి ప్రయత్నం సఫలం కాలేదు.
మీరెప్పుడైనా బయల్పాటును పొందడానికి లేదా అర్థం చేసుకోవడానికి శ్రమపడినట్లయితే, బహుశా మీరు ఆలీవర్ అనుభవానికి సంబంధింపజేసుకొని—దాని నుండి నేర్చుకోగలరు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 6, 8, మరియు 9లను చదువుతున్నప్పుడు, వ్యక్తిగత బయల్పాటు గురించి ప్రభువు ఆలీవర్‌కు ఏమి బోధించారో గమనించండి. ఉదాహరణకు:
-
ప్రభువు తన చిత్తాన్ని బయల్పరచడానికి ముందు మీ నుండి కోరుతున్న దాని గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 6:5–7; 8:1; 9:7–8 ఏమి సూచిస్తున్నాయి?
-
బయల్పాటు రాగల వివిధ మార్గాల గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 6:14–17, 22–24; 8: 2–3; 9:7–9 నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? మీరు దానిని ఎలా గుర్తించగలరు?
-
ఈ ప్రకరణముల నుండి బయల్పాటు గురించి మీరు ఇంకా ఏమి నేర్చుకుంటారు?
ఆలీవర్ యొక్క అనుభవాలు ప్రభువు మీతో మాట్లాడుతున్నారని మీరు భావించిన క్షణాలను మీరు “జ్ఞాపకం చేసుకొనేలా” చేయవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:22). ఈ అనుభవాల గురించి మీ ఆలోచనలు లేదా భావాలను మీరెప్పుడైనా నమోదు చేసారా? చేసినట్లయితే, మీరు వ్రాసిన దానిని చదవడం గురించి ఆలోచించండి. చేయనట్లయితే, మీకు గుర్తున్న దానిని వ్రాయడానికి కొంత సమయం తీసుకోండి. ఈ అనుభవాల నుండి బలాన్ని పొందడాన్ని మీరు ఎలా కొనసాగించవచ్చో పరిగణించండి. కొన్ని ఉపాయాల కొరకు, ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ గారి సందేశము “ఆత్మీయంగా నిర్వచించే జ్ఞాపకాలు” ( లియహోనా, మే 2020, 18–22) చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 6:18–21, 29–37
ప్రతి తలంపులో క్రీస్తు వైపు చూడండి.
రాబోయే సంవత్సరాలలో జోసెఫ్ స్మిత్ “క్లిష్టమైన పరిస్థితులను” అనుభవిస్తాడని ప్రభువుకు తెలుసు ( సిద్ధాంతము మరియు నిబంధనలు 6:18). మీ భవిష్యత్తులో మీకు గల శ్రమలు ఆయనకు తెలుసు. ఆయనను నమ్మడానికి మీకు సహాయపడేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 6:18–21, 29–37 లో జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు ఆయన ఇచ్చిన సలహాలో మీరేమి కనుగొంటారు?
“ప్రతి తలంపులో [క్రీస్తు] వైపు చూడుడి” అంటే అర్థం ఏమిటని మీరనుకుంటున్నారు? (36వ వచనము). మంచి సమయాల్లో మరియు “క్లిష్టమైన పరిస్థితులలో”—దీనిని మీరు మరింత నిలకడగా ఎలా చేయగలరు? అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి ఈ సలహాను పరిగణించండి: “ప్రతీ తలంపులోను ఆయనవైపు చూచుటకు ప్రయాసపడుట మానసికంగా కఠినమైనది. కానీ మనం అలా చేసినప్పుడు, మన సందేహాలు మరియు భయాలు తొలగిపోతాయి” (“మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొ౦దుట,” లియహోనా, 41).
నీల్ ఎల్. ఆండర్సెన్, “యేసు క్రీస్తును గురించిన ఈ ఆలోచన నా మనస్సును పట్టుకొనియుంది,” లియహోనా, మే 2023, 91–94 కూడా చూడండి.
Behold My Hand [నా చేయి చూడండి] యొక్క వివరణ, జెఫ్రీ వార్డ్ చేత.
సిద్ధాంతము మరియు నిబంధనలు 6:29–37
“మంచిని చేయుటకు భయపడకుము.”
కొన్నిసార్లు మనమెందుకు “మంచిని చేయుటకు … భయపడతాము”? (33వ వచనము). మంచిని చేయడానికి మీకు ధైర్యాన్నిచ్చేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 6:29–37లో మీరేమి కనుగొంటారు? క్రీస్తుయందు ధైర్యాన్ని కలిగియుండడానికి మిమ్మల్ని ప్రేరేపించే ఒక కీర్తన పాడడాన్ని లేదా వినడాన్ని పరిగణించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 6–7; 9:3, 7–14
“నీవు నన్ను కోరినట్లే నీకు జరుగును.”
ప్రకరణములు 6 మరియు 7 లో “కోరిక” లేదా “కోరికలు” వంటి పదాలు ఎన్నిసార్లు కనిపిస్తాయో గమనించండి. మీ కోరికలకు దేవుడు ఇచ్చే ప్రాముఖ్యత గురించి ఈ ప్రకరణముల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? సిద్ధాంతం మరియు నిబంధనలు 7:1 లో ప్రభువు యొక్క ప్రశ్నను మీకు మీరు ప్రశ్నించుకోండి: “నీవేమి కోరుచున్నావు?”
ఆలీవర్ కౌడరీ యొక్క నీతివంతమైన కోరికలలో ఒకటి—జోసెఫ్ స్మిత్ అనువదించినట్లుగా అనువదించడం—అది నెరవేరలేదు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 9:3, 7–14 చదివేటప్పుడు, నీతివంతమైన మీ కోరికలు నెరవేరనప్పుడు మీకు సహాయపడేలా ఏ ప్రేరేపణలు మీరు పొందుతారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 11:8 కూడా చూడండి.
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 6:5, 15–16, 22–23; 8:2; 9:7–9
పరలోక తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడతారు.
-
వ్యక్తిగత బయల్పాటు గురించి ఆలీవర్ కౌడరీ నేర్చుకున్న సత్యాలు మీ పిల్లలు పరిశుద్ధాత్మను గుర్తించడానికి వారి సామర్థ్యమును వృద్ధిచేసుకుంటున్నప్పుడు వారికి సహాయపడగలవు. కథలో మీకు నచ్చిన భాగాలను ఒకరితో ఒకరు పంచుకోండి. మీరలా చేసినప్పుడు, దేవుని స్వరాన్ని ఎలా వినాలి మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 6:23 లేదా 9:7–9 వంటి సంబంధిత వచనాలను ఎలా చదవాలి అనే దాని గురించి ప్రభువు ఆలీవర్‌కు బోధించిన విషయాలను నొక్కిచెప్పండి.
3:10ప్రభువు ఆలీవర్ కౌడరీని పంపును: దేవుడు మనతో ఎలా మాట్లాడతారో తెలుసుకొనుట
మోర్మన్ గ్రంథ అనువాదములో జోసెఫ్ స్మిత్‌కు సహాయపడుతూ ఆలీవర్ కౌడరీ బయల్పాటు గురించి నేర్చుకున్నాడు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2లో “మనస్సు” మరియు “హృదయము” అనే పదాలను మీరు చదువుతున్నప్పుడు వారి తలలు మరియు వారి ఛాతీలపై తాకమని కూడా మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. పరిశుద్ధాత్మ మీ మనస్సు మరియు హృదయములో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో మీ అనుభవాల నుండి మీ పిల్లలకు చెప్పండి. ఈ వచనాలలో “పరిశుద్ధాత్మ మనతో ఎలా మాట్లాడతారు?” అనే ప్రశ్నకు జవాబులు కనుగొనడానికి వారికి సహాయపడండి: సిద్ధాంతము మరియు నిబంధనలు 6:15–16, 22–23; 8:2; 9:7–9.
కథలు ఉపయోగించండి. పిల్లలు సువార్త సూత్రాలను అర్థం చేసుకోవడానికి కథలు సహాయపడతాయి, ఎందుకంటే ఇతరులు ఈ సూత్రాలను ఎలా జీవిస్తారో అవి ప్రదర్శిస్తాయి. మీరు బోధిస్తున్నప్పుడు, లేఖనాల నుండి, సంఘ చరిత్ర నుండి లేదా మీ స్వంత జీవితం నుండి కథలను చేర్చడానికి మార్గాలను కనుగొనండి, అది లేఖనాలలోని సూత్రాలను వివరిస్తుంది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 6:34
యేసు క్రీస్తు మూలముగా నేను “భయపడను.”
-
“చిన్న మందా, భయపడకుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:34) అని ప్రభువు జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు చెప్పారు. అనేకమార్లు మీతో పాటు ఈ వాక్యభాగాన్ని తిరిగి చెప్పమని మీరు పిల్లలను ఆహ్వానించవచ్చు. బెదిరిపోయిన గొర్రెల మందలా నటించడాన్ని కూడా వారు ఆనందించవచ్చు. గొర్రెలు దేనికి భయపడవచ్చు? అప్పుడు మీరు మరియు మీ పిల్లలు గొర్రెల కాపరిగా ఉన్న రక్షకుని చిత్రాన్ని (ఈ నమూనా చివరలో ఒకటి ఉంది) చూసి, ఒక గొర్రెల కాపరి తన గొఱ్ఱెలను కావలి కాస్తున్నట్లుగా ఆయన మనలను ఎలా కావలి కాస్తున్నారనే దాని గురించి మాట్లాడవచ్చు.
-
క్రీస్తు నందు ధైర్యాన్ని కనుగొనుట గురించి ఒక పాట వాయించడాన్ని లేదా పాడడాన్ని పరిగణించండి. భయపడకుండా ఉండేందుకు రక్షకుడు మనకెలా సహాయపడతారనే దాని గురించి ఈ పాట ఏమి బోధిస్తుంది?
సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36
ప్రతి తలంపులో నేను క్రీస్తు వైపు చూడగలను.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36ను కలిసి చదివిన తర్వాత, మీరు మరియు మీ పిల్లలు “ప్రతి తలంపులో [యేసు క్రీస్తు] వైపు చూడాలని” గుర్తుంచుకోవడానికి మీకు సహాయం చేసేలా చిత్రాలు గీయవచ్చు. మీ చిత్రాలను ఒకరితో ఒకరు పంచుకోండి మరియు మీ పిల్లలు వాటిని తరచూ చూడగలిగేలా వాటిని ఉంచగలిగే ప్రదేశాల గురించి ఆలోచించడంలో సహాయపడండి.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.