“పునఃస్థాపన స్వరములు: మోర్మన్ గ్రంథము యొక్క అనువాదము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 2025)
“మోర్మన్ గ్రంథము యొక్క అనువాదము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
పునఃస్థాపన స్వరములు
మోర్మన్ గ్రంథము యొక్క అనువాదము
1829 ఏప్రిల్‌లో, సిద్ధాంతము మరియు నిబంధనలు 6–9 ప్రకరణములు పొందిన నెలలో, జోసెఫ్ స్మిత్ యొక్క ప్రధానమైన పని మోర్మన్ గ్రంథమును అనువదించడం. అద్భుతమైన అనువాద ప్రక్రియ గురించి మనకు చాలా వివరాలు తెలియవు, కానీ దేవుడు తయారుచేసిన పరికరాలైన యూరీము తుమ్మీము అని పిలువబడే రెండు పారదర్శక రాళ్ళు మరియు దీర్ఘదర్శి రాయి అని పిలువబడే మరొక రాయి సహాయము పొందిన జోసెఫ్ స్మిత్ ఒక దీర్ఘదర్శి అని మనకు తెలుసు.
ఈ గ్రంథము ఎలా అనువదించబడిందో వివరించమని తరువాత అడుగబడినప్పుడు, “ప్రపంచానికి అన్ని వివరాలను తెలియజేయడానికి ఉద్దేశించబడలేదని” జోసెఫ్ చెప్పెను. ఇది “దేవుని శక్తి మరియు బహుమానము చేత” అనువదించబడెనని అతడు తరచుగా చెప్పెను.
ప్రత్యక్ష సాక్షుల నుండి అనువాద ప్రక్రియ వరకు క్రింది ప్రకటనలు జోసెఫ్ సాక్ష్యమునకు మద్దతునిస్తున్నాయి.
హైరం స్మిత్‌కు చెందిన ఈ పెట్టె బంగారు పలకలను తాత్కాలికంగా దాచడానికి ఉపయోగించినట్లు భావిస్తున్నారు.
ఎమ్మా స్మిత్
“నా భర్త మోర్మన్ గ్రంథమును అనువదిస్తున్నప్పుడు, నేను దానిలో కొంత భాగాన్ని వ్రాసాను, ఆయన ప్రతి వాక్యాన్ని, మాటకు మాట చెప్పి వ్రాయిస్తున్నప్పుడు మరియు ఆయన పలుకలేని పేర్లు లేదా పొడవైన పదాలు వచ్చినప్పుడు ఆయన ఆ పదాల యొక్క అక్షరాలను చెప్పేవారు, నేను వాటిని వ్రాస్తున్నప్పుడు, నేను అక్షరాలు వ్రాయుటలో ఏదైనా పొరపాటు చేస్తే, ఆ సమయంలో నేను వాటిని ఎలా వ్రాస్తున్నానో చూడడం ఆయనకు అసాధ్యమైనప్పటికీ ఆయన నన్ను ఆపి ఆ అక్షరములను సరిచేసేవారు. శరయ అనే పదాన్ని కూడా ఆయన మొదట ఉచ్ఛరించలేకపోయారు, కానీ ఆ పదము యొక్క అక్షరాలు ఆయన పలుకవలసి వచ్చింది మరియు నేను ఆయన కొరకు ఆ పదాన్ని ఉచ్ఛరించాను.”
“పలకలను మరుగుపరచుటకు ఎటువంటి ప్రయత్నము చేయబడకుండా తరచు అవి బల్లపైన నేను ఆయనకు ఇచ్చిన చిన్న నారవస్త్రముతో చుట్టబడి ఉండేవి. ఒకసారి నేను పలకలు బల్లపై ఉండగా, వాటి రూపురేఖలు మరియు ఆకారాన్ని గుర్తించాను. అవి మందపాటి కాగితం వలె తేలికైనవిగా అనిపించాయి మరియు ఒక పుస్తకం యొక్క అంచులను బొటనవేలుతో కదిలించినప్పుడు కలిగే ధ్వనివలె ఆ పలకలు లోహపు ధ్వనితో సందడి చేస్తాయి. …
“నా నమ్మకం ఏమిటంటే, మోర్మన్ గ్రంథము దైవిక ప్రామాణికత కలిగి ఉంది—దాని గురించి నాకు కొంచెమైనా సందేహం లేదు. ప్రేరేపించబడితే తప్ప ఆ వ్రాతప్రతుల రచనను ఎవరూ చెప్పి వ్రాయించలేరని నేను నిజంగా నమ్ముతున్నాను; ఎందుకంటే, తన లేఖకురాలిగా వ్యవహరించేటప్పుడు, [జోసెఫ్] గంటల తరబడి నాకు చెప్పి వ్రాయించేవారు; మరియు భోజనం తర్వాత లేదా అంతరాయాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు, ఆయన ఆ వ్రాతప్రతులను చూడకుండా లేదా దానిలో కొంత భాగాన్ని చదివి వినిపించకుండానే, ఆయన విడిచిపెట్టిన చోటనే ప్రారంభించేవారు. ఇది ఆయనకు ఒక సాధారణ విషయం. ఒక పండితుడు దీన్ని చేయడం అసంభవం; ఆయన వలె జ్ఞానం, పాండిత్యం లేని వ్యక్తికి ఇది ఖచ్చితంగా అసాధ్యమే.”
ఆలీవర్ కౌడరీ
“దేవుని బహుమానము మరియు శక్తి ద్వారా, యూరీము తుమ్మీము ద్వారా లేదా పరిశుద్ధ అనువాదక సాధనములని ఆ గ్రంథముచే పిలువబడిన వాటి చేత ప్రవక్త అనువదించగా అది ప్రవక్త యొక్క నోటినుండి జారిపడినట్లుగా నా కలముతో (కొన్ని పేజీలు తప్ప మిగిలినవన్నీ) మోర్మన్ గ్రంథమును నేను వ్రాసాను. అది అనువదించబడిన ఆ బంగారు పలకలను నేను నా కళ్ళతో చూశాను మరియు నా చేతులతో పట్టుకున్నాను. అనువాదక సాధనములను కూడా నేను చూసాను.”