Doctrine and Covenants 2025
జనవరి 20–26: “పిల్లల హృదయాలు తమ తండ్రుల తట్టు తిరుగును”: సిద్ధాంతము మరియు నిబంధనలు 2; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–65


“జనవరి 20–26: ‘పిల్లల హృదయాలు తమ తండ్రుల తట్టు తిరుగును’: సిద్ధాంతము మరియు నిబంధనలు 2; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27-65,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 2; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–65,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

మొరోనై దూత యొక్క దర్శనాన్ని పొందుతున్న జోసెఫ్ స్మిత్

He Called Me by Name [ఆయన నన్ను పేరుపెట్టి పిలిచెను] నుండి వివరణ, మైఖేల్ మామ్ చేత

జనవరి 20–26: “పిల్లల హృదయాలు తమ తండ్రుల తట్టు తిరుగును”

సిద్ధాంతము మరియు నిబంధనలు 2; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–65

తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వనములో జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమై మూడు సంవత్సరాలు గడిచింది, కానీ అప్పటినుండి జోసెఫ్ ఎటువంటి అదనపు బయల్పాటులను పొందలేదు. ప్రభువు అతనిపై కోపంగా ఉన్నారేమోనని అతడు ఆశ్చర్యపడనారంభించాడు. మనందరివలె అతడు కూడా తప్పులు చేసి, వాటి మూలంగా దండించబడ్డాడు. అయినప్పటికీ ఇంకను అతడు చేయడానికి దేవుడు ఒక కార్యమును కలిగియున్నాడు. జోసెఫ్ చేయడానికి పిలువబడిన కార్యము, దేవుడు మనల్ని అడిగే దానితో సంబంధము కలిగియుంది. జోసెఫ్ మోర్మన్ గ్రంథాన్ని ఉనికిలోకి తెస్తాడు; దాని సందేశాన్ని పంచుకోవాలని మనము ఆహ్వానించబడ్డాము. పిల్లల హృదయాలను తమ తండ్రులతట్టు తిప్పే యాజకత్వ తాళపుచెవులను జోసెఫ్ పొందుతాడు; ఇప్పుడు మనము దేవాలయాల్లో మన పూర్వీకుల కొరకు విధులను పొందగలము. త్వరలో నెరవేరబోతున్న ప్రవచనాల గురించి జోసెఫ్‌కు చెప్పబడింది; ఈ ప్రవచనాలను నెరవేర్చడంలో సహాయపడేందుకు మనం పిలువబడ్డాము. మనము దేవుని కార్యములో పాలుపంచుకొనినప్పుడు, ప్రవక్తవలె మనము వ్యతిరేకతను, హింసను ఎదుర్కొంటామని ఆశించవచ్చు. కానీ ఆయన జోసెఫ్ కొరకు చేసినట్లుగా, ప్రభువు మనల్ని తన చేతిలో సాధనములుగా చేస్తారని కూడా మనము నమ్మకము కలిగియుండవచ్చు.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–33

సెమినరీ చిహ్నము
నేను చేయడానికి దేవుడు ఒక కార్యమును కలిగియున్నారు.

జోసెఫ్ స్మిత్ చేయడానికి దేవుడు ఒక కార్యమును కలిగియున్నారని నమ్మడం ఒక విషయము—మనం అతని జీవితాన్ని తిరిగి చూడవచ్చు మరియు అతను ఏమి సాధించాడో స్పష్టంగా చూడవచ్చు. కానీ దేవుడు మీ కొరకు కూడా ఒక కార్యమును కలిగియున్నారని మీరెప్పుడైనా ఆలోచించారా? మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–33 చదువుతున్నప్పుడు, ఆ కార్యము ఏమైయుండవచ్చని ఆలోచించండి. రక్షకుని సువార్త యొక్క కొనసాగుతున్న పునఃస్థాపనకు ఇది ఎలా దోహదపడుతుంది?

ఎల్డర్ గ్యారీ ఈ. స్టీవెన్‌సన్ ఇలా బోధించారు: “మనం క్రీస్తు నొద్దకు వచ్చి, ఇతరులు కూడా రావడానికి సహాయం చేసినప్పుడు, మనం రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యములో పాలుపంచుకుంటాము, అది దైవికంగా నియమించబడిన బాధ్యతలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. … ఈ బాధ్యతలు సరళమైనవి, స్ఫూర్తిదాయకమైనవి, ప్రేరేపితమైనవి మరియు చేయదగినవి. అవి ఏమనగా:

  • యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించుట

  • అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుట

  • సువార్తను పొందడానికి అందరిని ఆహ్వానించుట

  • నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయుట” (“సరళముగా అందమైనది—అందముగా సరళమైనది,” లియహోనా, నవ. 2021, 47).

దైవికంగా నియమించబడిన ఈ బాధ్యతలలో ప్రతీదానిలో పాల్గొన్నప్పుడు మీకు కలిగిన అనుభవాలను ధ్యానించండి. తరువాత మీరు ఏమి చేయాలని రక్షకుడు కోరుతున్నారు? ఈ ప్రశ్నకు జవాబివ్వడానికి మీకు సహాయపడగలిగేలా మీరు ఈ పేజీలను పరిశోధించవచ్చు.

మీరు చేసిన తప్పిదాల మూలంగా ప్రభువు మిమ్మల్ని ఉపయోగించుకోలేరేమోనని కొన్నిసార్లు మీరు భావించవచ్చు. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:28–29లో జోసెఫ్ స్మిత్ అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? మీరు “[దేవుని] యెదుట నిలబడ్డారని” మీరెలా తెలుసుకోగలరు?

అర్థవంతమైన చర్చను ప్రోత్సహించే ప్రశ్నలు అడగండి. ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్న ప్రశ్నలు అభ్యాసకులను వారి వ్యక్తిగత ఆలోచనలు, భావాలు మరియు అనుభవాల ఆధారంగా ప్రతిస్పందించడానికి ఆహ్వానిస్తాయి. ఈ నమూనాలోని ప్రశ్నలు దీనికి మాదిరులు.

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము,” ప్రధాన చేతిపుస్తకము, 1.2 కూడా చూడండి.

3:15

Youth Responsibility in the Work of Salvation

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:34–47

తన సువార్తను పునఃస్థాపించడం ద్వారా రక్షకుడు ప్రాచీన ప్రవచనాలను నెరవేర్చారు.

మొరోనై జోసెఫ్‌ స్మిత్‌కు ప్రత్యక్షమైనప్పుడు, యెషయా 11; అపొస్తలుల కార్యములు 3:22–23; మరియు యోవేలు 2:28–32 వంటి అనేక పాత మరియు క్రొత్త నిబంధన ప్రవచనాలను అతడు ఉదహరించాడు. మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:34-47 చదువుతున్నప్పుడు, ఈ ప్రవచనాలను తెలుసుకోవడం జోసెఫ్‌కు ఎందుకంత ముఖ్యమైయుండవచ్చో ఆలోచించండి. మీరు వాటిని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమైనది?

గొప్ప మహిమయందు దేవుని శక్తితో” (లియహోనా, నవ. 2021, 28)లో జోసెఫ్ స్మిత్‌కు మొరోనై యొక్క మొదటి సందర్శన గురించి డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించిన దానిని కూడా మీరు చదువవచ్చు.

13:16

గొప్ప మహిమయందు, దేవుని శక్తితో

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:48-60

ఆయన రాజ్యములో సేవ చేయడానికి దేవుడు నన్ను సిద్ధపరుస్తారు.

జోసెఫ్ మొదటిసారి బంగారు పలకలను చూసినప్పుడు అతడికి కేవలం 17 సంవత్సరాలు. అయితే, నాలుగు సంవత్సరాలు గడిచేవరకు అవి అతనికి అప్పగించబడలేదు. ఆ సమయంలో జోసెఫ్ జీవితంలో ఏమి జరిగిందనే దాని కొరకు చూస్తూ, జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:48-60 చదవండి. అతడు చేయాలని దేవుడు కోరిన కార్యము కొరకు ఈ సంఘటనలు అతడిని ఎలా సిద్ధపరిచాయని మీరనుకుంటున్నారు? దేవునికి మరియు ఇతరులకు సేవచేయడానికి మిమ్మల్ని సిద్ధపరచిన ఏ అనుభవాలను మీరు కలిగియున్నారు? భవిష్యత్ సేవ కొరకు సిద్ధపడేందుకు మీకు సహాయపడునట్లు ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నదేమిటి?

కుమోరా కొండ యొక్క చిత్రపటము, న్యూయార్క్‌లోని మాంఛెస్టర్ దగ్గర

Hill Cumorah [కుమోరా కొండ], ఆల్ రౌండ్స్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 2

నా హృదయాన్ని నా పూర్వీకుల వైపు తిప్పడానికి ప్రభువు ఏలియాను పంపారు.

ఏలియా నియమితకార్యాన్ని గురించి, అతడు పునఃస్థాపించిన యాజకత్వ తాళపుచెవుల దీవెనల గురించి ఈ ప్రకరణములో ఉన్న “నాటుట,” “హృదయాలు,” “తిప్పుట” వంటి పదాలు మీకేమి బోధిస్తాయి? మీ హృదయము మీ పూర్వీకులవైపు తిరిగినట్లు మీరెలా భావించారు? అటువంటి భావాలను తరచుగా మీరు అనుభవించగలిగే మార్గాల గురించి ఆలోచించండి. మీ పూర్వీకులను వెదకడం మరియు వారి కొరకు దేవాలయంలో విధులు నిర్వహించడం ఒక మార్గము (FamilySearch.org చూడండి). మీరు ఆలోచించగల ఇతర మార్గాలు ఏవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 110:13–16; గెరిట్ డబ్ల్యు. గాంగ్, “సంతోషంగా మరియు శాశ్వతంగా,” లియహోనా, నవ. 2022, 83–86 కూడా చూడండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:28-29

నేను పశ్చాత్తాపపడగలను మరియు క్షమించబడగలను.

  • జోసెఫ్ స్మిత్ వలె మనందరము కొన్నిసార్లు “[మన] బలహీనతలు మరియు లోపముల కొరకు అపరాధులుగా” భావిస్తాము. జోసెఫ్ ఆవిధంగా భావించినప్పుడు అతడు ఏమి చేసాడనే దాని కొరకు చూస్తూ, మీరు మరియు మీ పిల్లలు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:29 ను చదువవచ్చు. మనము తప్పులు చేసినప్పుడు మనకు సహాయపడునట్లు అతని మాదిరి నుండి మనము ఏమి నేర్చుకోగలము? జోసెఫ్ పరిపూర్ణుడు కానప్పటికీ అతడు దేవునిచే పిలువబడ్డాడు అని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమైనది?

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–54

ఆయన కార్యమును చేయడంలో ఆయనకు సహాయపడేందుకు పరలోక తండ్రి జోసెఫ్ స్మిత్‌ను పిలిచారు.

  • జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:27–54 లో మొరోనై సందర్శనల వృత్తాంతమును మీరు చెప్తున్నప్పుడు జోసెఫ్ స్మిత్‌లాగా నటించడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. ఉదాహరణకు, వారు ప్రార్థిస్తున్నట్లు చేతులు కట్టుకోవడం లేదా కుమోరా కొండ ఎక్కుతున్నట్లు నటించడం మరియు మొదలైనవి. తర్వాత, జోసెఫ్ స్మిత్‌ను దేవుడు ఏమి చేయమని పిలిచారు మరియు దాని ఫలితంగా మనం ఎలా దీవించబడ్డాము అనే దాని గురించి మాట్లాడమని మీరు వారిని అడగవచ్చు. ఉదాహరణకు, జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథమును అనువదించినందువలన మనం ఎలా దీవించబడ్డాము? ఆయన పని పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు దగ్గరవ్వడానికి మనకు ఎలా సహాయపడింది?

2:29

జోసెఫ్ స్మిత్ను మొరోనై దూత దర్శించెను: ఒక పరిశుద్ధ గ్రంథము గురించి నేర్చుకొనుట

3:45

జోసెఫ్ మరియు ఎమ్మాలు: ప్రపంచానికి మోర్మన్ గ్రంథమును తేవడానికి కలిసి పనిచేయుట

సిద్ధాంతము మరియు నిబంధనలు 2

కుటుంబాలు దేవాలయంలో ముద్రవేయబడాలని పరలోక తండ్రి కోరుతున్నారు.

  • బహుశా దేవాలయం వద్ద మీ కుటుంబ చిత్రముతో పాటు మీరు మరియు మీ పిల్లలు మీ కుటుంబం యొక్క కొన్ని చిత్రాలను చూడడాన్ని ఆనందించవచ్చు (లేదా Gospel Art Book [సువార్త కళా పుస్తకము], సంఖ్య. 120 చూడండి). తర్వాత మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 2 చదివి, మనకు దేవాలయాలు ఎందుకు ఉన్నాయి మరియు కుటుంబాలు శాశ్వతంగా కలిసి ఉండాలని పరలోక తండ్రి ఎందుకు కోరుకుంటున్నారు అనే దాని గురించి మీ ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.

Young Couple Going to the Temple, English
పాల్మైరా న్యూయార్క్ దేవాలయము

పాల్మైరా న్యూయార్క్ దేవాలయము

సిద్ధాంతము మరియు నిబంధనలు 2

నా పూర్వీకుల గురించి తెలుసుకోవడం నాకు ఆనందాన్ని తీసుకురాగలదు.

  • పిల్లలు కుటుంబ చరిత్ర గురించి ఉత్సాహపడవచ్చు మరియు ఆనందాన్ని అనుభవించవచ్చు. వారికి సహాయం చేయడానికి, మీరు మీ పూర్వీకుల కథలు లేదా చిత్రాలను పంచుకోవచ్చు. పిల్లలుగా ఉన్నప్పుడు వారి పూర్వీకుల జీవితం ఎలా ఉండేది అనేదాని గురించి మీ పిల్లలతో మాట్లాడండి. FamilySearch.org/discovery వద్ద మీ పిల్లలు కొన్ని కుటుంబ చరిత్ర కార్యకలాపాలను కూడా ఆనందించవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

బంగారు పలకలు ఎక్కడ దాచిపెట్టబడ్డాయో జోసెఫ్ స్మిత్‌కు చూపుతున్న మొరోనై దూత

Joseph Receives the Plates [జోసెఫ్ పలకలను పొందుట], గ్యారీ ఈ. స్మిత్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ