Doctrine and Covenants 2025
జనవరి 6–12: “ఓ జనులారా, వినుడి”: సిద్ధాంతము మరియు నిబంధనలు 1


“జనవరి 6–12: ‘ఓ జనులారా, వినుడి’: సిద్ధాంతము మరియు నిబంధనలు 1,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 1,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

కలిసి లేఖనాలను చదువుతున్న కుటుంబము

జనవరి 6–12: “ఓ జనులారా, వినుడి”

సిద్ధాంతము మరియు నిబంధనలు 1

1831 నవంబరులో, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘము ప్రారంభించబడి కేవలం ఒకటిన్నర సంవత్సరాలైంది. అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అది ఇరవైల మధ్య వయస్సుగల ఒక ప్రవక్త నేతృత్వంలో ఇప్పటికీ సాపేక్షంగా చిన్న పట్టణాలలో నివసిస్తున్న అప్రసిద్ధ విశ్వాసుల సమూహము. కానీ దేవుడు ఈ విశ్వాసులను తన సేవకులుగా, తన దూతలుగా భావించారు మరియు ఆయన వారికిచ్చిన బయల్పాటులు ప్రపంచానికి ప్రచురించబడాలని ఆయన కోరారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1వ ప్రకరణము ఈ బయల్పాటులకు ప్రభువు ఇచ్చిన పీఠిక లేదా పరిచయము. సంఘ సభ్యత్వము తక్కువే అయినప్పటికీ, దేవుడు తన పరిశుద్ధులు పంచుకోవాలని కోరిన సందేశము అల్పమైనది కాదని స్పష్టంగా తెలుస్తుంది. పశ్చాత్తాపపడమని మరియు దేవుని “నిత్య నిబంధన”ను (4, 8, 22 వచనాలు) స్థిరపరచమని వారికి బోధిస్తూ, “భూలోక నివాసులు” అందరికీ ఇది “హెచ్ఛరించు స్వరము”. ఈ సందేశాన్ని తీసుకొనివెళ్ళే సేవకులు “బలహీనులు మరియు సామాన్యులు.” కానీ ఆయన సంఘాన్ని “చీకటి అంధకారముల నుండి బయటకు తీసుకొని వచ్చుటకు” వినయపూర్వకమైన సేవకులే అప్పుడు మరియు ఇప్పుడు దేవునికి కావాలి( 23, 30 వచనములు).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 1

“ఓ జనులారా, ఆలకించుడి”

పీఠిక ఒక గ్రంథాన్ని పరిచయం చేస్తుంది. ఇది గ్రంథం యొక్క ఇతివృత్తాలు, ఉద్దేశాలను గుర్తిస్తుంది మరియు చదవడానికి పాఠకులను సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. మీరు 1వ ప్రకరణము అనగా సిద్ధాంతము మరియు నిబంధనలకు ప్రభువు యొక్క “పీఠిక” (6వ వచనము) చదువుతున్నప్పుడు—ప్రభువు తన బయల్పాటుల కొరకు ఇచ్చిన ఇతివృత్తాలు మరియు ఉద్దేశాల కొరకు చూడండి. ఈ సంవత్సరం సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క మీ అధ్యయనంలో మీకు సహాయపడే విధంగా మీరు ఏమి నేర్చుకుంటారు? ఉదాహరణకు, ఈ బయల్పాటులలో “ప్రభువు స్వరమును వినుడి”(14వ వచనము) లేదా “ఈ ఆజ్ఞలను వెదకుడి” (37వ వచనము) అంటే ఏమిటో మీరు ఆలోచించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలకు పీఠిక కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:4-6, 23-24; 37-39

సెమినరీ చిహ్నము
కడవరి దిన ప్రవక్తలతో సహా, తన సేవకుల ద్వారా ప్రభువు మాట్లాడతారు.

ఆయన ఎంచుకున్న సేవకుల ద్వారా ఆయన మాట్లాడును అనే దేవుని ప్రకటనతో 1వ ప్రకరణము ప్రారంభమవుతుంది మరియు ముగుస్తుంది (4–6, 23–24, 38 వచనాలు చూడండి). ఈ బయల్పాటు నుండి మీరు నేర్చుకున్న వాటిని వ్రాయండి:

  • ప్రభువు మరియు ఆయన స్వరము.

  • మన కాలములో ప్రవక్తలు ఎందుకు అవసరము.

మీరు కనుగొన్న దాని ఫలితముగా ఏమి చేయాలని ప్రేరేపించబడినట్లు మీరు భావించారు?

ప్రభువు స్వరాన్ని ఆయన సేవకుల స్వరము ద్వారా మీరు ఎప్పుడు విన్నారు? (38వ వచనము చూడండి).

జీవించియున్న ప్రవక్తల గురించి తెలియని ఒక స్నేహితుడు మీతో పాటు 1వ ప్రకరణము చదువుతున్నాడని కూడా మీరు ఊహించుకోవచ్చు. మీ స్నేహితుడు ఏ ప్రశ్నలను కలిగియుండవచ్చు? మన కాలంలో ప్రవక్తలను కలిగియుండడం గురించి మీరెలా భావిస్తారో అర్థం చేసుకోవడానికి అతనికి లేదా ఆమెకు సహాయపడేందుకు మీ స్నేహితునితో ఏ వచనాలు చర్చించాలని మీరు కోరుకుంటారు?

జోసెఫ్ స్మిత్ యొక్క బయల్పాటులను ప్రచురించడం గురించి మాట్లాడడానికి 1831లో పెద్దల సలహాసభ కలుసుకున్నప్పుడు, కొంతమంది ఆ ఆలోచనను వ్యతిరేకించారని తెలుసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు. వ్రాయడంలో జోసెఫ్ బలహీనతతో వారు సిగ్గుపడ్డారు మరియు బయల్పాటులను ప్రచురించడం వల్ల పరిశుద్ధులకు మరిన్ని సమస్యలు ఎదురవుతాయని వారు ఆందోళన చెందారు (see Saints, 1:140–43). మీరు ఈ సలహాసభలో సభ్యులైయున్నట్లయితే, ఈ సమస్యలను మీరెలా పరిష్కరించియుండేవారు? సహాయపడునట్లు 1వ ప్రకరణము లో ఏ అంతరార్థములను మీరు కనుగొంటారు? (ఉదాహరణకు, 6, 24, 38 వచనాలు చూడండి).

సర్వసభ్య సమావేశములో నాయకులను ఆమోదిస్తున్న సంఘ సభ్యులు

ప్రభువు తన సేవకులైన ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడతారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:12–30, 34–36

కడవరి దిన సవాళ్ళను ఎదుర్కోవడానికి పునఃస్థాపన నాకు సహాయపడుతుంది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1వ ప్రకరణము లో, ఆయన తన సువార్తను ఎందుకు పునఃస్థాపించారో ప్రభువు వివరిస్తారు. 12-23 వచనాలు చదువుతున్నప్పుడు మీరు ఎన్ని కారణాలను జాబితా చేయగలరో చూడండి. మీ అనుభవంలో, పునఃస్థాపన కొరకు ప్రభువు యొక్క ఉద్దేశాలు ఎలా సాధించబడ్డాయి?

మన కాలంలో గంభీరమైన సవాళ్ళు ఉంటాయని ప్రభువుకు తెలుసు (17వ వచనము చూడండి). ఈ సవాళ్ళు ఉన్నప్పటికీ శాంతిని, నమ్మకాన్ని అనుభవించడానికి మీకు సహాయపడునట్లు 17–30, 34–36 వచనాలలో మీరేమి కనుగొంటారు?

రస్సెల్ ఎమ్. నెల్సన్, “విశ్వాసముతో భవిష్యత్తును హత్తుకోండి,” లియహోనా, నవ. 2020, 73–76 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:19-28

ఆయన పనిని సాధించడానికి ప్రభువు “బలహీనులను, సామాన్యులను” ఉపయోగించుకుంటారు.

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 1:19-28 చదువుతున్నప్పుడు, ప్రభువు యొక్క సేవకునిగా ఉండడమంటే అర్థమేమిటో మీరు ధ్యానించవచ్చు. ఆయన సేవకులు ఎటువంటి లక్షణాలు కలిగియుండాలని ప్రభువు కోరుతున్నారు? ఆయన సేవకుల ద్వారా ప్రభువు ఏమి సాధిస్తున్నారు? ఈ వచనాలలోని ప్రవచనాలు ప్రపంచమంతటా మరియు మీ జీవితంలో ఏవిధంగా నెరవేర్చబడ్డాయి?

యేసు క్రీస్తు కొరకు చూడండి. రక్షకుడు మరియు ఆయన సువార్త గురించి సాక్ష్యమివ్వడమే లేఖనాల ఉద్దేశ్యం. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 1 చదువుతున్నప్పుడు, యేసు క్రీస్తు గురించి మీకు కొంత బోధించే వచనాలను గుర్తించడాన్ని లేదా గమనించడాన్ని పరిగణించండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 02

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:4, 37–39

ఆయన ప్రవక్తల ద్వారా, ప్రభువు నన్ను ఆధ్యాత్మిక ప్రమాదాల గురించి హెచ్ఛరిస్తారు.

  • ప్రభువు నుండి వచ్చిన హెచ్ఛరికల గురించి చర్చను ప్రారంభించడానికి—మనం చూడలేని ప్రమాదాల గురించి ఇతరుల నుండి మనకు వచ్చే హెచ్ఛరికల గురించి మీరు మాట్లాడవచ్చు. జారుడు నేల, రాబోయే తుఫాను లేదా సమీపించే కారు వంటివి కొన్ని ఉదాహరణలు. మీరు మరియు మీ పిల్లలు హెచ్ఛరిక చిహ్నాల ఉదాహరణలను చూడవచ్చు మరియు ఈ హెచ్ఛరికలను ప్రభువు మనకిచ్చే హెచ్ఛరికలతో పోల్చవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:4, 37–39 ప్రకారము ప్రభువు మనల్ని ఎలా హెచ్ఛరిస్తారు? ఇటీవల ఆయన మనల్ని దేని గురించి హెచ్ఛరించారు? ఇటీవలి సర్వసభ్య సమావేశ సందేశాల యొక్క భాగాలను మీరు చూడవచ్చు లేదా చదవవచ్చు మరియు దేవుని “హెచ్ఛరిక స్వరం” యొక్క ఉదాహరణల కోసం చూడవచ్చు.

  • కలిసి ప్రవక్తల గురించి ఒక పాట పాడండి. ప్రవక్త దేవుని వాక్యాన్ని మాట్లాడతారని మీ సాక్ష్యాన్ని పంచుకోండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:17

కడవరి దిన సవాళ్ళను ఎదుర్కోవడానికి పునఃస్థాపన నాకు సహాయపడుతుంది.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 1:17 గురించి చర్చను ప్రోత్సహించడానికి, మీరు ఒక ప్రయాణానికి సిద్ధపడుతున్నట్లు మీరు మరియు మీ పిల్లలు ఊహించుకోవచ్చు. మీరు ఏమి సర్దుకుంటారు? వాన కురుస్తుందని లేదా మీ కారు లేదా బస్సు చక్రంలో గాలి తగ్గిపోతుందని మీకు ముందే తెలిస్తే, ప్రయాణం కోసం మీరు సిద్ధపడే విధానాన్ని అది ఎలా ప్రభావితం చేస్తుంది? కలిసి 17వ వచనము చదవండి మరియు మనకు ఏమి జరుగుతుందో ప్రభువుకు తెలుసనే దాని గురించి మాట్లాడండి. దాని కోసం ఆయన ఎలా సిద్ధపడతారు? (అవసరమైతే, “విపత్తు” అనగా అనర్థం లేదా భయంకరమైన విషయం అని వివరించండి.) మన కాలపు సవాళ్ళను ఎదుర్కోవడానికి దేవుని ఆజ్ఞలు మనకెలా సహాయపడతాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:17, 29

జోసెఫ్ స్మిత్‌ను ఒక ప్రవక్తగా ఉండడానికి ప్రభువు పిలిచారు.

  • రక్షకుని సువార్తను పునఃస్థాపించడంలో జోసెఫ్ స్మిత్ పాత్ర గురించి నేర్చుకోవడానికి, మీరు మరియు మీ పిల్లలు రక్షకుని చిత్రాన్ని మరియు జోసెఫ్ స్మిత్ చిత్రాన్ని (ఈ నమూనాలోని చిత్రాలను చూడండి) చూడవచ్చు మరియు జోసెఫ్ స్మిత్ ద్వారా రక్షకుడు మనకిచ్చిన దాని గురించి మాట్లాడవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:17, 29లో ఉదాహరణల కొరకు మీ పిల్లలు చూడవచ్చు. దేవుడు “నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. ను పిలిచి, పరలోకము నుండి మాట్లాడారని” (17వ వచనము) మీకెలా తెలుసో మీ పిల్లలకు చెప్పండి.

జోసెఫ్ స్మిత్ జూనియర్ యొక్క చిత్రము

© 1998 డేవిడ్ లిండ్స్లే

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:30

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ప్రభువు యొక్క “నిజమైన మరియు జీవముగల సంఘము.”

  • సంఘము “నిజమైనది, జీవము గలది” అని చెప్పడంలో అర్థమేమిటి? మీ పిల్లలు ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండడానికి, బహుశా మీరు వారికి జీవమున్న మరియు జీవములేని వస్తువులను—జీవముగల మొక్క మరియు చనిపోయిన మొక్క వంటివి చూపించవచ్చు. ఏదైనా జీవముతో ఉన్నదని మనకెలా తెలుస్తుంది? తర్వాత మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 1:30 చదివి, సంఘము “నిజమైనది, జీవము గలది” అనేదానికి అర్థమేమిటనే దాని గురించి మాట్లాడవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

యేసు క్రీస్తు యొక్క చిత్రము

Beside Still Waters [నిశ్చల జలముల ప్రక్కన], సైమన్ డ్యూయీ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ