Doctrine and Covenants 2025
డిసెంబరు 30–జనవరి 5: “వాగ్దానం చేయబడిన పునఃస్థాపన పురోగమిస్తుంది”: యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన


“డిసెంబరు 30–జనవరి 5: ‘వాగ్దానం చేయబడిన పునఃస్థాపన పురోగమిస్తుంది’: యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తాడు

డిసెంబరు 30–జనవరి 5: “వాగ్దానం చేయబడిన పునఃస్థాపన పురోగమిస్తుంది”

యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన

ప్రపంచాన్ని మార్చిన ఒక సంఘటన యొక్క 200వ వార్షికోత్సవాన్ని మీరెలా జరుపుకుంటారు? జోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శనం నుండి 200 సంవత్సరాలను పూర్తిచేస్తూ 2020, ఏప్రిల్ సమీపిస్తుండగా, ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము ఆలోచిస్తున్న ప్రశ్న అదే. “ఒక స్మారక చిహ్నం నిర్మించాలా అని మేము ఆలోచించాము,” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గుర్తు చేసుకున్నారు. “కానీ మొదటి దర్శనము యొక్క ప్రత్యేకమైన చారిత్రాత్మక మరియు అంతర్జాతీయ ప్రభావాన్ని మేము పరిగణించినప్పుడు, స్మారక చిహ్నాన్ని గ్రానైట్ లేదా రాతితో కాకుండా పదాలతో … , ‘రాతి పలకల’ మీద చెక్కబడుట కాదు, కానీ మన మెత్తని హృదయములు అనే ‘పలకల’ మీద పొందుపరచబడటం ద్వారా సృష్టించాలి అనే విషయం మమ్మల్ని ఆకట్టుకుంది [2 కొరింథీయులకు 3:3]” (“ఈయనను ఆలకించుము,” లియహోనా, మే 2020, 90).

వారు సృష్టించిన స్మారక చిహ్నం యొక్క పదాలు ఇలా పేరుపెట్టబడ్డాయి, “యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: ప్రపంచమునకు ద్విశతాబ్ది ప్రకటన.” ఇది కేవలం మొదటి దర్శనానికి స్మారక చిహ్నం కాదు, కానీ అప్పటి నుండి యేసు క్రీస్తు చేసిన—మరియు చేస్తున్న—సమస్తమునకు చిహ్నము. ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగి, ఆయనను ఆలకించినప్పుడు ఆయన సువార్త యొక్క పునఃస్థాపన ప్రారంభమైంది. అదే విధంగా ఇది కొనసాగుతోంది: మీతో పాటుగా—ఒక్కోసారి ఒక హృదయం, ఒక పవిత్రమైన అనుభవం.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

“ప్రపంచములోని ప్రతి దేశములోనున్న తన పిల్లలను దేవుడు ప్రేమిస్తున్నారు.”

మీ అభిప్రాయములో, పునఃస్థాపనను గురించిన ఒక ప్రకటన దేవుని ప్రేమ గురించిన వ్యాఖ్యానముతో ఎందుకు ప్రారంభమవుతుంది? మీరు ప్రకటనను అధ్యయనం చేస్తున్నప్పుడు, “ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉన్న తన పిల్లలపట్ల” దేవుని ప్రేమ యొక్క వ్యక్తీకరణల కొరకు చూడండి. ఆయన ప్రేమను అనుభవించడంలో సువార్త యొక్క పునఃస్థాపన మీకు ఏవిధముగా సహాయం చేసింది?

గెరిట్ డబ్ల్యు. గాంగ్, “ప్రతీ రాజ్యములు, జాతులు మరియు ఆయా భాషలు మాట్లాడువారు,” లియహోనా, నవ. 2020, 38–41 కూడా చూడండి.

ఒక ప్రశ్నకు సమాధానంతో పునఃస్థాపన ప్రారంభమైంది.

ఒక ప్రశ్నకు జవాబివ్వడం ద్వారా రక్షకుడు తన సువార్త యొక్క పునఃస్థాపనను ప్రారంభించారని చెప్పవచ్చు. దేవుడు, సువార్త లేదా “అతని [లేదా ఆమె] ఆత్మ యొక్క రక్షణ” గురించి ప్రశ్నలున్న ఒక వ్యక్తి కోసం పునఃస్థాపన ప్రకటన ఏ సందేశాన్ని కలిగియుందని మీరనుకుంటున్నారు? సువార్త ప్రశ్నలకు జవాబులు కనుగొనడం గురించి జోసెఫ్ స్మిత్ నుండి మీరు ఏమి నేర్చుకోగలరో చూడడానికి మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:5–20 కూడా అధ్యయనం చేయవచ్చు.

చెట్ల వనములో పైకి చూస్తున్న జోసెఫ్ స్మిత్ చిత్రము

The Desires of My Heart [నా హృదయవాంఛలు] నుండి వివరణ, వాల్టర్ రానె చేత

సెమినరీ చిహ్నము
యేసు క్రీస్తు తన సంఘాన్ని పునఃస్థాపించారు.

జోసెఫ్ స్మిత్ ద్వారా రక్షకుడు పునఃస్థాపించిన “క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన సంఘము” గురించి మీకేమి తెలుసు? ఈ లేఖనాలను అధ్యయనం చేసి, ఆయన సంఘము యొక్క కొన్ని లక్షణాలను జాబితా చేయడాన్ని పరిగణించండి:

  • మత్తయి 16:15–19

  • మార్కు 16:15–18

  • లూకా 6:12–13

  • అపొస్తలుల కార్యములు 4:34–35

  • 1 కొరింథీయులకు 15:29

  • ఎఫెసీయులకు 4:11–15

తరువాత, మీరు పైన ఉన్న లేఖనాలను క్రింద ఉన్నవాటితో జతపరచవచ్చు, అవి జోసెఫ్ స్మిత్ ద్వారా ఆయన సంఘము యొక్క లక్షణాలను యేసు క్రీస్తు ఎలా పునఃస్థాపించారో వివరిస్తాయి:

యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన కొరకు మీరెందుకు కృతజ్ఞత కలిగియున్నారు?

సంఘము పునఃస్థాపించబడక ముందు జీవించడం గురించి వారెలా భావించియుండవచ్చో అని ఊహించడానికి ఒకసారి ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ మరియు ఆయన భార్య ప్రయత్నించారు. “ఏమి కలిగియుండాలని మనం కోరుకుంటాము?” అని వారు తమనుతాము ప్రశ్నించుకున్నారు. “పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ” లో వారి అనుభవాల గురించి చదవండి ( లియహోనా, మే 2020, 81–82). మీ ఆధ్యాత్మిక నిరీక్షణలను నెరవేర్చడంలో పునఃస్థాపన మీకేవిధంగా సహాయపడింది?

“వాగ్దానం చేయబడిన పునఃస్థాపన పురోగమిస్తుంది.”

మిమ్మల్ని మీరు సువార్త యొక్క పునఃస్థాపనలో భాగంగా ఎప్పుడైనా భావించారా? అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ నుండి ఈ మాటలను పరిగణించండి: “కొన్నిసార్లు మనం సువార్త యొక్క పునఃస్థాపనను పూర్తయిన విషయంగా, ఇప్పటికే మన వెనుక ఉన్నట్లుగా యెంచుతాము. … వాస్తవానికి, పునఃస్థాపన అనేది జరుగుతున్న ప్రక్రియ; మనము ప్రస్తుతం దానిలో నివసిస్తున్నాము” (“Are You Sleeping through the Restoration?,” Liahona, May 2014, 59).

1800 లో సువార్త ఎలా పునఃస్థాపించబడిందో అధ్యయనం చేయడానికి మీరు సిద్ధపడుతున్నప్పుడు, అది మీ జీవితంలో ఎలా పునఃస్థాపించబడిందో ధ్యానించడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు. ఇటువంటి ప్రశ్నలు మనస్సులో ఉంచుకొని పునఃస్థాపన ప్రకటనను చదవండి: ఇది నిజమని నేనెలా తెలుసుకున్నాను? నేడు పునఃస్థాపనలో నేను ఎలా పాల్గొనాలి?

“పరలోకములు తెరువబడియున్నాయి.”

“పరలోకములు తెరువబడియున్నాయి” అనే వాక్యభాగము మీకు ఏ అర్థమునిస్తుంది? పరలోకములు నిజంగా తెరువబడియున్నాయి అనడానికి—పునఃస్థాపన ప్రకటనలో, నేడు సంఘములో, లేఖనములలో మరియు మీ జీవితములో—ఏ రుజువును మీరు చూస్తున్నారు?

క్వింటిన్ ఎల్. కుక్, “ప్రవక్తలకు నిరంతర బయల్పాటు మరియు మన జీవితాలను నడిపించడానికి వ్యక్తిగత బయల్పాటు యొక్క దీవెన,” లియహోనా, మే 2020, 96–100 కూడా చూడండి.

కలిసి నేర్చుకోండి. “[పునఃస్థాపన ప్రకటన]ను వ్యక్తిగతంగా మరియు [మన] కుటుంబసభ్యులతో, స్నేహితులతో కలిసి అధ్యయనం చేయండి” అని అధ్యక్షులు నెల్సన్ మనల్ని ఆహ్వానించారు (“ఈయనను ఆలకించుము,” 92). మీ అధ్యయనంలో ఇతరులను మీరెలా చేర్చుకోగలరో పరిగణించండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

“మేము గంభీరముగా ప్రకటిస్తున్నాము.”

  • మీరు మీ పిల్లలతో కలిసి పునఃస్థాపన ప్రకటన యొక్క భాగాలను చదువుతున్నప్పుడు (లేదా అధ్యక్షులు నెల్సన్ దానిని చదువుతున్న వీడియో చూస్తున్నప్పుడు), “మేము ప్రకటిస్తున్నాము,” “మేము చాటిస్తున్నాము,” లేదా “మేము సాక్ష్యమిస్తున్నాము” వంటి వాక్యభాగాలతో ప్రారంభమయ్యే వాక్యాలను కనుగొనడానికి వారికి సహాయపడండి. మన ప్రవక్తలు మరియు అపొస్తలులు ప్రకటిస్తున్న సత్యాలేవి? బహుశా మీరు, మీ పిల్లలు ఇవే సత్యాలలో కొన్నింటి గురించి మీ స్వంత సాక్ష్యాలను పంచుకోవచ్చు.

    6:0

    The Restoration of the Fulness of the Gospel of Jesus Christ

“జోసెఫ్ స్మిత్ … ప్రశ్నలు కలిగియున్నాడు.”

  • రక్షకుని సువార్త యొక్క పునఃస్థాపనకు దారితీసేలా జోసెఫ్ స్మిత్ కలిగియున్న ప్రశ్నలలో కొన్నింటిని పరిశోధించడం మీ పిల్లలకు ఆసక్తికరంగా ఉండవచ్చు. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:10, 29, 68లో కొన్ని ఉదాహరణలను కనుగొనడానికి వారికి సహాయపడండి. దేవుడు జోసెఫ్ స్మిత్ ప్రశ్నలకు జవాబిచ్చినందువలన నేడు మనమెలా దీవించబడ్డాము?

  • వారు కలిగియున్న ప్రశ్నల గురించి మాట్లాడడానికి కూడా మీరు మీ పిల్లలకు ఒక అవకాశాన్ని ఇవ్వవచ్చు. జవాబులు ఎలా కనుగొనాలి అనేదాని గురించి జోసెఫ్ స్మిత్ నుండి మనం ఏమి నేర్చుకుంటాము? (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:8–17 చూడండి).

“జోసెఫ్‌కు ఉపదేశించడానికి పరలోక దూతలు వచ్చారు.”

  • “జోసెఫ్‌కు ఉపదేశించడానికి వచ్చిన పరలోక దూతలు” ఎవరు? Gospel Art Book [సువార్త కళా పుస్తకము] (సంఖ్య. 91, 93, 94, 95 చూడండి)లో వారి చిత్రాల కొరకు చూడడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. “యేసు క్రీస్తు యొక్క సంఘాన్ని తిరిగి స్థాపించడానికి” ఈ దూతలలో ప్రతీఒక్కరు ఎలా సహాయపడ్డారు? ఈ ప్రశ్నకు జవాబివ్వడానికి ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీలో సూచించబడిన లేఖనాలు మీ పిల్లలకు సహాయపడగలవు.

The Prophet Joseph Smith sitting on his bed in the Smith farm house. Joseph has a patchwork quilt over his knees. He is looking up at the angel Moroni who has appeared before him. Moroni is depicted wearing a white robe. The painting depicts the event wherein the angel Moroni appeared to the Prophet Joseph Smith three times in the Prophet's bedroom during the night of September 21, 1823 to inform him of the existence and location of the gold plates, and to instruct him as to his responsibility concerning the plates.

యేసు క్రీస్తు తన సంఘాన్ని పునఃస్థాపించారు.

  • రక్షకుని సంఘము పునఃస్థాపించబడింది అంటే అర్థమేమిటో గ్రహించడానికి మీ పిల్లలకు మీరెలా సహాయపడవచ్చు? బహుశా వారు బ్లాకులతో లేదా కప్పులతో ఒక సాధారణ గోపురాన్ని నిర్మించవచ్చు మరియు దానిని “పునఃస్థాపించవచ్చు” లేదా తిరిగి నిర్మించవచ్చు. లేదా ఏదైనా కోల్పోబడినందున లేదా పాడైపోయినందున మీ పిల్లలు దానిని భర్తీ చేయవలసి వచ్చినట్లయితే, మీరు ఆ అనుభవాన్ని రక్షకుడు తన సంఘాన్ని పునఃస్థాపించడంతో పోల్చవచ్చు. రక్షకుడు పునఃస్థాపించిన, పునఃస్థాపన ప్రకటనలో పేర్కొనబడిన ప్రత్యేక విషయాలను కనుగొనడానికి వారికి సహాయపడండి.

బ్లాకులతో ఆడుకుంటున్న తండ్రీ పిల్లలు

“పరలోకములు తెరువబడియున్నాయి.”

  • “పరలోకములు తెరువబడియున్నాయి” అనే వాక్యభాగము యొక్క అర్థాన్ని వివరించడానికి, మీరు మీ పిల్లలతో ఒక సందేశాన్ని మొదట మూసివున్న తలుపు వెనుక నుండి మరియు తర్వాత తెరచియున్న తలుపు గుండా పంచుకోవచ్చు. వంతులవారీగా వారిని కూడా ఒక సందేశాన్ని పంచుకోనివ్వండి. యేసు క్రీస్తు మన కోసం ఏ సందేశాలను కలిగియున్నారు? మన కొరకు పరలోకములు తెరువబడియున్నాయని తెలుసుకొనుటకు ఏ అనుభవాలు మనకు సహాయపడ్డాయి?

2:39

సిద్ధాంతము మరియు నిబంధనలు గురించి: ప్రభువు మరలా మాట్లాడతారు

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.