“జనవరి 13–19: ‘నేను ఒక కాంతి స్తంభమును చూచితిని’: జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1–26,’” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1–26,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Sacred Grove [పరిశుద్ధ వనము], గ్రెగ్ కె. ఓల్సెన్ చేత
జనవరి 13-19: “నేను ఒక కాంతి స్తంభమును చూచితిని”
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1–26
సిద్ధాంతము మరియు నిబంధనలు ప్రార్థనలకు సమాధానాలు గల గ్రంథం అని మీరు చెప్పవచ్చు: ఈ గ్రంథములోనున్న అనేక పరిశుద్ధ బయల్పాటులు ప్రశ్నలకు సమాధానంగా వచ్చాయి. అన్నింటినీ ప్రారంభించిన ఆ ప్రశ్న—కడవరి దిన బయల్పాటు యొక్క క్రుమ్మరింపును ప్రేరేపించినది—14 ఏళ్ళ బాలుడి చేత అడగబడింది. “వాగ్వివాదము మరియు అభిప్రాయభేదములు” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:10) మతం మరియు దేవునితో అతని సంబంధం గురించి జోసెఫ్ స్మిత్‌ను గందరగోళానికి గురిచేసాయి. బహుశా మీరు దీనికి సంబంధం కలిగి ఉండవచ్చు. మన కాలములో మనం అనేక విరుద్ధమైన ఆలోచనలు మరియు ఒప్పించే స్వరాలు కనుగొంటాము. మనము ఈ సందేశాల ద్వారా క్రమబద్ధీకరించాలని మరియు సత్యాన్ని కనుగొనాలని అనుకున్నప్పుడు, జోసెఫ్ చేసిన పనిని మనం చేయవచ్చు. మనం ప్రశ్నలు అడగవచ్చు, లేఖనాలను అధ్యయనం చేయవచ్చు, ధ్యానించవచ్చు మరియు చివరికి దేవుడిని అడగవచ్చు. జోసెఫ్ ప్రార్థనకు ప్రతిస్పందనగా, ఒక కాంతి స్తంభం పరలోకము నుండి దిగివచ్చింది. తండ్రియైన దేవుడు మరియు యేసు క్రీస్తు ప్రత్యక్షమై అతడి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ అద్భుత అనుభవానికి జోసెఫ్ సాక్ష్యం ధైర్యంగా ఇలా ప్రకటించింది, “జ్ఞానము [కొదువగా] ఉన్నవాడు దేవునిని అడిగి, పొందవచ్చును” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:26). పరలోక దర్శనము కాకపోయినా, మనమందరం కనీసం పరలోకపు కాంతి ద్వారా ప్రకాశింపజేయబడిన ఒక స్పష్టమైన దర్శనమును పొందగలము.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్త.
“వాస్తవాలను మన యెదుట” ఉంచడమే జోసెఫ్ స్మిత్ చరిత్ర యొక్క ఉద్దేశ్యం, ఎందుకంటే జోసెఫ్ గురించిన వాస్తవం తరచూ వక్రీకరించబడింది (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1). మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1–26 చదువుతున్నప్పుడు, ఆయన దైవిక పిలుపుకు సంబంధించి మీ సాక్ష్యాన్ని ఏది బలపరుస్తుంది?
నా ప్రార్థనలకు జవాబులను నేనెలా పొందగలను?
మీరెప్పుడైనా మీకు “జ్ఞానం కొదువుగా ఉన్నట్లు” లేదా మీరు తీసుకోవలసిన నిర్ణయం గురించి గందరగోళంగా ఉన్నట్లు భావించారా? (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:13). 1820లో జోసెఫ్ స్మిత్ కలిగియున్న అనుభవం మన స్వంత వ్యక్తిగత బయల్పాటు కొరకు మంచి నమూనాగా పనిచేయగలదు. ఉదాహరణకు, మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:5–25 శోధిస్తున్నప్పుడు, మీకు సంబంధింపజేసుకోగల అనుభవాల కొరకు చూడండి. దీని గురించి మీరేమి నేర్చుకుంటారు:
-
ప్రార్థనలో ఒక పవిత్రమైన అనుభవం కొరకు జోసెఫ్ ఎలా సిద్ధపడ్డాడు? (8, 11, 14–15 వచనాలు చూడండి).
-
బయల్పాటును కోరడంలో లేఖన అధ్యయనము యొక్క పాత్ర? (11–12 వచనములు చూడండి).
-
వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు ఏమి చేయాలి? (15–16, 21–26 వచనాలు చూడండి).
-
మీరు పొందే జవాబులను అంగీకరించడం మరియు వాటిపై పనిచేయడం? (18–25 వచనాలు చూడండి).
పంచుకోవడాన్ని ఆహ్వానించండి. లేఖనాలను శోధించడం పరిశుద్ధాత్మ నుండి మనోభావాలను ఆహ్వానిస్తుంది. ఈ మనోభావాలను పంచుకోవడం ఇతరులకు, అలాగే పంచుకుంటున్న వ్యక్తికి సాక్ష్యమివ్వడానికి పరిశుద్ధాత్మను ఆహ్వానించగలవు.
దేవునితో సంభాషిస్తున్న జనుల గురించి లేఖనాలలో ఇతర మాదిరుల కొరకు కూడా మీరు చూడవచ్చు. Gospel Art Book [సువార్త కళా పుస్తకము] లేదా ఇతర రండి, నన్ను అనుసరించండి పుస్తకాలలోని చిత్రాలు మీకు ఉపాయాలను ఇవ్వగలవు. మీరు కనుగొనే ప్రతీ ఉదాహరణ కొరకు అంతకుముందే జాబితా చేయబడిన ప్రశ్నలకు జవాబివ్వడానికి ప్రయత్నించండి. ప్రార్థనకు జవాబులు పొందడంలో మీరు ఏ అనుభవాలు కలిగియున్నారు? మంచి అనుభవాలు కలిగియుండడానికి ఇతరులకు సహాయపడేందుకు మీరేమి చేయగలరు?
రస్సెల్ ఎన్. నెల్సన్, “ఈయనను ఆలకించుము,” లియహోనా, మే 2020, 88–92 కూడా చూడండి.
తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును జోసెఫ్ స్మిత్ చూసాడు.
తన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తారని జోసెఫ్ స్మిత్ విశ్వసించాడు, కానీ ఆ సమాధానం తన జీవితాన్ని మరియు ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో అతడు ఊహించలేకపోయాడు. మీరు జోసెఫ్ అనుభవం గురించి చదువుతున్నప్పుడు, మొదటి దర్శనము యొక్క ఫలితాలు మీ జీవితాన్ని ఎలా మార్చాయో ధ్యానించండి.
ఉదాహరణకు, మొదటి దర్శనము తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు గురించి అనేక సత్యాలను బయల్పరిచింది, అవి జోసెఫ్ కాలంలో అనేకమంది నమ్మిన వాటి నుండి భిన్నంగా ఉన్నాయి. మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:15–20 చదువుతున్నప్పుడు, ఇటువంటి వ్యాఖ్యను పూర్తిచేయడానికి భిన్న విధానాలను వ్రాయడాన్ని పరిగణించండి: “మొదటి దర్శనము సంభవించినందున, … అని నేనెరుగుదును”
జోసెఫ్ అనుభవాన్ని మరియు దాని ఫలితంగా వచ్చిన వాటన్నిటిని మీరు ధ్యానిస్తున్నప్పుడు మీకు కలిగిన భావాలేవి?
Ask of God: Joseph Smith's First Vision
If Any of You Lack Wisdom [మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల] నుండి వివరణ, వాల్టర్ రానె చేత
మొదటి దర్శనము గురించి వివిధ వృత్తాంతాలు ఎందుకు ఉన్నాయి?
తరచూ లేఖకుడిని ఉపయోగిస్తూ జోసెఫ్ స్మిత్ తన జీవితకాలములో కనీసం నాలుగుసార్లు తన పరిశుద్ధ వనపు అనుభవాన్ని నమోదు చేసాడు. అదనంగా, జోసెఫ్ తన దర్శనము గురించి మాట్లాడినప్పుడు వినిన అనేకమంది తమ స్వంత వృత్తాంతములు వ్రాశారు. ఈ వృత్తాంతాలు కొన్ని వివరాలతో భిన్నంగా ఉన్నప్పటికీ, రచయిత, ప్రేక్షకులు మరియు సందర్భమును బట్టి అవి స్థిరంగా ఉంటాయి. క్రొత్త నిబంధన యొక్క నాలుగు సువార్తలలో ప్రతి ఒక్కటి రక్షకుని పరిచర్యను బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడినట్లే, ప్రతి వృత్తాంతము జోసెఫ్ స్మిత్ అనుభవాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే వివరాలను జోడిస్తుంది.
ఇతరులు నన్ను తిరస్కరించినప్పటికీ, నాకు తెలిసిన విషయాలకు నేను యధార్థముగా ఉండగలను.
విశేషమైన అతని మొదటి దర్శనం తర్వాత, జోసెఫ్ స్మిత్ సహజంగానే తన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలనుకున్నాడు. అతడు ఎదుర్కొన్న వ్యతిరేకత అతడిని ఆశ్చర్యపరిచింది. మీరు అతని వృత్తాంతమును చదువుతున్నప్పుడు, మీ సాక్ష్యానికి యధార్థముగా ఉండడానికి ఏది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది? మీకు కలిగిన ఆత్మీయ అనుభవాలకు యధార్థముగా ఉండడానికి—లేఖనాలు, పూర్వీకులు లేదా మీకు తెలిసిన వ్యక్తుల నుండి ఏ ఇతర మాదిరులు మీకు ధైర్యాన్ని ఇస్తాయి?
గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “మీ సాక్ష్యమును పోషించుట మరియు పంచుకొనుట,” లియహోనా, నవ. 2022, 111-14 కూడా చూడండి.
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్తగా ఉండేందుకు సిద్ధపరచబడ్డాడు.
-
జోసెఫ్ స్మిత్ యవ్వనం గురించి నేర్చుకోవడం మీ పిల్లలు అతని అనుభవాల నుండి నేర్చుకుంటున్నప్పుడు అతనితో సంబంధం కలిగియుండడానికి వారికి సహాయపడగలదు. బహుశా వారు జోసెఫ్ స్మిత్ యొక్క చిత్రాన్ని పట్టుకొని, అతని గురించి వారికి తెలిసిన దానిని పంచుకోవచ్చు. అవసరమైతే, జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:3–14 నుండి అతని గురించి కొన్ని వాస్తవాలను మీరు జతచేయవచ్చు. జోసెఫ్ అనుభవం ఒక ప్రవక్తగా మారడానికి అతన్ని సిద్ధపరచడంలో ఎలా సహాయపడింది? ఏమి చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తుండవచ్చు?
3:22జోసెఫ్ స్మిత్ కుటుంబము: విశ్వాసము యొక్క కుటుంబము
Joseph Smith’s First Vision [జోసెఫ్ స్మిత్ మొదటి దర్శనము] నుండి వివరణ, గ్రెగ్ ఓల్సన్ చేత
లేఖనాల ద్వారా దేవుడు నా ప్రశ్నలకు జవాబివ్వగలరు.
-
లేఖనాలతో సహా వివిధ రకాల పుస్తకాలను మీ పిల్లలకు చూపడాన్ని పరిగణించండి. ఈ పుస్తకాలు జవాబివ్వగల ప్రశ్నల గురించి ఆలోచించడానికి వారికి సహాయపడండి. తర్వాత, జోసెఫ్ స్మిత్ ఏ ప్రశ్నలు కలిగియున్నాడో మరియు లేఖనాలలో అతడు ఏ జవాబులు కనుగొన్నాడో తెలుసుకోవడానికి మీరు కలిసి జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:10-11 చదువవచ్చు.
-
యాకోబు 1:5 చదవడం జోసెఫ్‌ను ఎలా ప్రభావితం చేసిందో వివరించే పదాలను 12వ వచనములో మీ పిల్లలు కనుగొనవచ్చు. తర్వాత ఒక లేఖన వాక్యభాగము మీపై శక్తివంతమైన ప్రభావమును కలిగియున్న అనుభవాలను మీరు ఒకరితోఒకరు పంచుకోవచ్చు.
పరలోక తండ్రి నా ప్రార్థనలను ఆలకిస్తారు మరియు జవాబిస్తారు.
-
పరలోక తండ్రి మనతో ఎలా సంభాషిస్తారనే దాని గురించి చర్చను ప్రారంభించడానికి, వచన సందేశము, ఫోను చేయడం లేదా చేతితో వ్రాసిన గమనిక వంటి వివిధ రకాల సంభాషణా విధానాలను ఉపయోగించి బహుశా మీరు మరియు మీ పిల్లలు ఒకరినొకరు ప్రశ్నలు అడగవచ్చు. పరలోక తండ్రిని మనం ఎలా ప్రశ్నలు అడుగుతాము? మన ప్రార్థనలలో మనము ఆయనను ప్రేమిస్తున్నామని, గౌరవిస్తున్నామని ఆయనకు ఎలా చూపుతాము? కలిసి జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:16-19 చదవండి మరియు పరలోక తండ్రి జోసెఫ్ స్మిత్ ప్రార్థనకు ఎలా జవాబిచ్చారో చర్చించండి. అప్పుడు మీరు సహాయం కొరకు దేవుడిని అడిగి, జవాబు పొందినప్పటి అనుభవాలను మీరు మరియు మీ పిల్లలు పంచుకోవచ్చు.
తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును జోసెఫ్ స్మిత్ చూసాడు.
-
మీరు మొదటి దర్శనం గురించి చెప్పేటప్పుడు చిన్న పిల్లలు పరిశుద్ధ వనములో చెట్లలా నటిస్తూ చేతులు చాచి నిలబడి ఆనందించవచ్చు. మీరు జోసెఫ్ ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు గాలికి కొట్టుకుపోయినట్లు ఊగమని పిల్లలను అడగండి. తర్వాత, మీరు పరలోక తండ్రి మరియు యేసు జోసెఫ్‌కు కనిపించారని చెప్పినప్పుడు చాలా నిశ్చలంగా మరియు నిశ్శబ్దంగా నిలబడమని వారిని అడగండి.
-
మొదటి దర్శనం గురించి తమకు తెలిసిన వాటిని మీకు తెలియజేయడానికి పెద్ద పిల్లలు ఈ నమూనాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చిత్రాలను ఉపయోగించడాన్ని ఆనందించవచ్చు. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:14-17 ను సూచించమని మరియు జోసెఫ్ అనుభవం గురించి వారి ఆలోచనలు మరియు భావాలను పంచుకోమని వారిని ప్రోత్సహించండి.
3:22జోసెఫ్ స్మిత్ కుటుంబము: విశ్వాసము యొక్క కుటుంబము
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.