2024 రండి, నన్ను అనుసరించండి
నవంబరు 23–29. “యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రదుకుదురు”: ఆమోసు; ఓబద్యా; యోనా


“నవంబరు 23–29. ‘యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రదుకుదురు’: ఆమోసు; ఓబద్యా; యోనా” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“నవంబరు 23–29. ‘యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రదుకుదురు,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

సముద్ర తీరంలో కొట్టుకుపోయిన యోనా

Jonah on the Beach at Nineveh [నీనెవె వద్ద సముద్ర తీరమున యోనా], డానియెల్ లూయిస్ చేత

నవంబరు 23–29: “యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రదుకుదురు”

ఆమోసు; ఓబద్యా; యోనా

తర్షీషుకు వెళ్ళే ఒక ఓడలో యోనా ఉన్నాడు. తర్షీషుకు వెళ్ళడంలో తప్పులేదు, అది నీనెవెకు దూరంగా ఉండటం తప్ప, అక్కడ యోనా దేవుని సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళాలి. ఓడ గొప్ప తుఫానును ఎదుర్కొన్నప్పుడు, అది తన అవిధేయత వలన అని యోనాకు తెలుసు. యోనా పట్టుబట్టడంతో, అతడి సహ ప్రయాణికులు తుఫానును ఆపడానికి సముద్రపు లోతులలోనికి అతడిని పడవేసారు. అది యోనా మరియు అతడి పరిచర్యకు ముగింపుగా కనబడింది. అయితే ఆయన నీనెవె జనులను, ఇశ్రాయేలు సంతతిని లేదా మనలో ఏ ఒక్కరిని విడిచిపెట్టనట్లుగా—ప్రభువు యోనాను విడిచిపెట్టలేదు.

కాబట్టి మనం పశ్చాత్తాపపడితే, మనం ఎప్పటికీ త్రోసివేయబడము అనే సందేశంతో ఆయన యోనా, ఆమోసు, ఓబద్యా మరియు నేటి మన ప్రవక్తల వంటి ప్రవక్తలను పంపుతూనే ఉన్నారు. దేవుడు బయల్పరిచే అన్ని “రహస్యాలలో” (ఆమోసు 3:7 చూడండి), ఇది అత్యంత విలువైన వాటిలో ఒకటి: యేసు క్రీస్తు కారణంగా, మారడానికి ఇంకా ఆలస్యం కాలేదు. మనము ఆయనతో చేసిన నిబంధనలకు అనుగుణంగా జీవించడానికి ఆయన ఇప్పటికీ మనకు సహాయం చేయాలనుకుంటున్నారు మరియు ఆయన మరొక అవకాశాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ గ్రంథాల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి, బైబిలు నిఘంటువులో “ఆమోసు,” “ఓబద్యా,” మరియు “యోనా” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆమోసు 3:1–8; 7:10–15

సెమినరీ చిహ్నము
ప్రభువు తన ప్రవక్తల ద్వారా సత్యమును బయల్పరుస్తారు.

ఆమోసు 3:3–6లో, ప్రవక్త ఆమోసు మనం వినే లేదా చూసే సంకేతాలను బట్టి మనం తీసుకోగల తుది నిర్ణయాలకు ఉదాహరణలను అందించాడు: సింహం గర్జించినప్పుడు, అది ఎరను బంధించి ఉండాలి; ఒక పక్షి ఉచ్చులో చిక్కుకుంటే, అక్కడ ఎర ఉండాలి. 7–8 వచనాలలో, ఆమోసు ప్రవక్తలకు ఈ తర్కమును అన్వయించాడు. ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు మనం ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోవచ్చు? ఆమోసు 7:10–15 నుండి ప్రవక్తల గురించి మీరు ఇంకా ఏమి నేర్చుకుంటారు?

ప్రభువు తన ప్రవక్తల ద్వారా మీకేమి బయల్పరిచారు?

“ప్రవక్తలను కలిగియుండుట దేవుని యొక్క ప్రేమకు సూచనగా ఉన్నది” అని ఎల్డర్ యులిసెస్ సోవారెస్ అన్నారు (“ప్రవక్తలు పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మాట్లాడతారు, లియహోనా, మే 2018, 99). మీరు ఈ వాక్యాన్ని ఎలా పూర్తి చేస్తారో పరిగణించండి: “దేవుడు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు, ఎందుకంటే … ఆయన ప్రవక్తలను పంపుతారు.” సహాయపడే కొన్ని లేఖనాలు ఇక్కడ ఉన్నాయి: ద్వితీయోపదేశకాండము 18:18; యెహెజ్కేలు 3:16–17; ఎఫెసీయులకు 4:11–14; 1 నీఫై 22:2; సిద్ధాంతము మరియు నిబంధనలు 21:4–6; 84:36–38; 107:91–92.

నేడు ప్రవక్తల అవసరం లేదని భావించే వ్యక్తికి మీరు ఏమి చెబుతారు?

ఆమోసు 4–5

“యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రదుకుదురు.”

ఆమోసు 4:6–13 ప్రకారం, ఇశ్రాయేలీయులు శ్రమలను అనుభవించిన తరువాత ఏమి జరుగుతుందని ప్రభువు ఆశించారు? (హీలమన్ 12:3 కూడా చూడండి). మీ శ్రమలు దేవుని చేత పంపబడనప్పటికీ, ఆయన వైపు తిరగడానికి అవి మీకు ఎలా అవకాశాలను ఇచ్చాయి?

మీరు ఆమోసు 5:4, 14–15 చదివినప్పుడు, ప్రభువు మీ పట్ల ఎలా దయ చూపుతున్నారో ధ్యానించండి. ఆయనను వెదకడం మీకు ఎలా జీవం పోసింది?

ఆమోసు 8:11–12

ప్రభువు యొక్క వాక్యము ఆత్మీయ ఆకలిదప్పులను తృప్తిపరచగలదు.

మీరు ఆమోసు 8:11–12 చదివినప్పుడు, దేవుని వాక్యము లేకుండా జీవించడానికి కరువు ఎందుకు మంచి పోలిక అని ఆలోచించండి (యోహాను 6:26–35; 2 నీఫై 9:50–51; 32:3; ఈనస్ 1:4–8 కూడా చూడండి). మీరు ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్నప్పుడు మీకు ఎలా తెలుస్తుంది?

ఈ వచనాలు గొప్ప విశ్వాసభ్రష్టత్వానికి కూడా వర్తించగలవు. ఆ ఆధ్యాత్మిక “కరువు” దేవుని పిల్లలను ఎలా ప్రభావితం చేసింది? పునఃస్థాపన మీ ఆధ్యాత్మిక ఆకలిని ఎలా తృప్తిపరిచింది?

16:36

The Great Apostasy

ఓబద్యా 1:21

“సీయోను కొండమీద … రక్షకులు” ఎవరు?

ఓబద్యా 1:21ని సూచిస్తూ, చనిపోయిన వారి కోసం దేవాలయంలో విధులను పొందినప్పుడు మనం సీయోను పర్వతంపై రక్షకులమవుతామని అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ వివరించారు (see “Closing Remarks,” Liahona, Nov. 2004, 105). ఆ పని చేయడం—కొంతవరకు మాత్రమే అయినా—రక్షకుడు మన కోసం చేసిన దానివలె ఎలా ఉంటుంది? ఈ పని చేయడం రక్షకునితో సన్నిహితంగా ఉండేందుకు మీకు ఎలా సహాయం చేసింది?

దేవాలయము బయట యౌవనుల సమూహము

యోనా 1–4

ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు.

నీనెవె ఇశ్రాయేలు యొక్క శత్రువు, దాని దౌర్జన్యము మరియు క్రూరత్వానికి పేరుపొందినది. యోనాకు, వారు పశ్చాత్తాపపడటానికి సిద్ధంగా ఉన్నారనడం అవాస్తవమైనదిగా కనబడింది. యోనా స్వభావాన్ని (యోనా 1; 3–4 చూడండి) ఆల్మా మరియు మోషైయ కుమారుల భావాలతో (మోషైయ 28:1–5; ఆల్మా 17:23–25 చూడండి) పోల్చడం సహాయకరంగా ఉండవచ్చు. మారడానికి సిద్ధంగా లేని వ్యక్తులతో కూడా సువార్తను పంచుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా యోనా 3 నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

మీరు యోనాను చదివినప్పుడు, ప్రభువు యొక్క కనికరమును గూర్చి మాదిరుల కొరకు వెదకండి. నీనెవె జనులకు ప్రభువు కనికరమును చూపినప్పుడు, యోనా “చింతాక్రాంతుడై,” “కోపగించుకొన్నాడు” (యోనా 4:1) అని మీరెందుకు భావిస్తున్నారు? 4వ అధ్యాయములో అతనికి ఏమి బోధించడానికి ప్రభువు ప్రయత్నిస్తున్నారని మీరనుకుంటున్నారు? మీ జీవితంలో ఆయన కనికరమును మీరు ఎలా అనుభవించారో ధ్యానించండి. ఎక్కువ కనికరముగా ఉండటానికి మీకు సహాయపడేలా యోనా నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఈ ఆదివారం నెలలో ఐదవ ఆదివారం కాబట్టి, “అనుబంధం బి: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట”లోని అభ్యాస కార్యకలాపాలను ఉపయోగించమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.

ఆమోసు 3:7

ప్రవక్తలు యేసు క్రీస్తు యొక్క దూతలు.

  • మీ పిల్లలు ఆమోసు 3:7ని అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి, మీరు వారిలో ఒకరికి ఒక సాధారణ సందేశాన్ని గుసగుసగా చెప్పి, ఆ సందేశాన్ని ఇతర పిల్లలతో పంచుకోమని వారిని అడగవచ్చు. ఈ ప్రోత్సాహ కార్యక్రమంలో దూత ఎలా ప్రవక్తలా ఉన్నాడు? ప్రభువు మనకు ప్రవక్తలను ఎందుకు ఇస్తారు?

  • ప్రవక్తలు ఏమి చేస్తారనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు మరియు మీ పిల్లలు సంఘము యొక్క ప్రస్తుత అధ్యక్షుడి నుండి ఇటీవలి సందేశాలను సమీక్షించవచ్చు. మీరు దేవుని ప్రవక్తను అనుసరించడానికి ఎందుకు ఎంచుకున్నారో ఒకరితో ఒకరు పంచుకోండి.

లేఖనాలను కంఠస్థం చేయడానికి పిల్లలకు సహాయం చేయండి. ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ ఇలా పంచుకున్నారు: “ఒక లేఖనాన్ని కంఠస్థం చేయడమనేది ఒక క్రొత్త స్నేహాన్ని సృష్టించడం వంటిది. అది అవసరమైన సమయంలో సహాయపడగల, ప్రేరేపణను ఓదార్పును ఇవ్వగల, అవసరమైన మార్పుకు కావలసిన ప్రేరణకు మూలాధారము కాగల క్రొత్త వ్యక్తిని కనుగొనడం వంటిది” (“The Power of Scripture,” Ensign, Nov. 2011, 6). మీ పిల్లలు ఆమోసు 3:7ని పూర్తిగా లేదా కొంత భాగాన్ని గుర్తుంచుకోవడంలో సహాయపడటానికి, మీరు దానిని వ్రాసి, కలిసి పునరావృతం చేయవచ్చు. మీ పిల్లలు వారి జ్ఞాపకం నుండి మొత్తం వచనాన్ని పునరావృతం చేసే వరకు మీరు ఒక్కోసారి కొన్ని పదాలను చెరిపివేయవచ్చు లేదా మూసి ఉంచవచ్చు.

ఆమోసు 8:11–12

సువార్త పునఃస్థాపన విశ్వాసభ్రష్టత్వపు కరువును అంతం చేసింది.

  • మీరు ఆమోసు 8:11–12ను చదివేటప్పుడు ఆకలితో ఉన్నట్లు నటించమని మీ పిల్లలను ఆహ్వానించండి. మనం దేవుని వాక్యం కోసం ఆకలితో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మీకు ఇష్టమైన కొన్ని లేఖనాలను మీరు ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు మీ పిల్లలు తింటున్నట్లు నటించవచ్చు.

  • మన కాలంలో ప్రభువు తన సువార్తను పునఃస్థాపించారని మీరు కృతజ్ఞతతో ఉన్నందుకు కారణాలను ఒకరితో ఒకరు పంచుకోండి.

    2:52

    After the New Testament

యోనా 1–3

కష్టమైనప్పటికీ, ఆయనకు లోబడేందుకు ప్రభువు నాకు సహాయం చేస్తారు.

  • మీ పిల్లలు యోనా కథను నేర్చుకోవడంలో సహాయపడటానికి, మీరు పాత నిబంధన కథలులో “ప్రవక్తయైన యోనా”ని సమీక్షించవచ్చు; ఈ వారం ప్రోత్సాహ కార్యక్రమ పేజీని కూడా చూడండి). అప్పుడు మీరు అడగవచ్చు:

    • యోనా ప్రభువుకు లోబడనప్పుడు ఏమి జరిగింది? (యోనా 1:4–17 చూడండి).

    • పశ్చాత్తాపపడడానికి యోనా ఏమి చేశాడు? (యోనా 1:10–12; 2:1–4, 9; 3:1–4 చూడండి).

    • యోనా విధేయత చూపినప్పుడు ఏమి జరిగింది? (యోనా 3:5 చూడండి).

    2:30

    Jonah the Prophet

  • మీ పిల్లలు యోనా కథను మళ్లీ చెప్పడాన్ని లేదా నటించడాన్ని ఆనందించవచ్చు. మీకు కష్టమైన ఒక పనిని మీరు చేయాలని ప్రభువు కోరుకున్నప్పటి కొన్ని అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోండి. ఆయనకు లోబడడానికి ఆయన మీకు ఎలా సహాయం చేశారు?

యోనా 1–4

ప్రభువు తన వైపు తిరిగే వారందరిపట్ల దయతో ఉంటారు.

  • బహుశా మీ పిల్లలు యోనాను అతని అనుభవం గురించి ఇంటర్వ్యూ చేస్తున్నట్లు నటించవచ్చు. వారు అతడిని ఏ ప్రశ్నలు అడుగుతారు? ప్రభువు గురించి యోనా ఏమి నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి ప్రశ్నలు అడగమని వారిని ప్రోత్సహించండి. ఉదాహరణకు, ప్రభువు కనికరం గురించి యోనా ఏమి చెప్పవచ్చు? (ఉదాహరణకు, యోనా 2:7–10; 3:10; 4:2 చూడండి).

పైకప్పు గుండా దింపబడుతున్న మనుష్యుని సమీపిస్తున్న యేసు

Christ and the Palsied Man [క్రీస్తు మరియు పక్షవాతముగల మనుష్యుడు], జె. కర్క్ రిఛర్డ్స్ చేత

  • రక్షకుడు ఇతరులపై దయ చూపిన ఉదాహరణల గురించి ఆలోచించేలా మీ పిల్లలకు సహాయం చేయండి, మార్కు 2:3–12; లూకా 23:33–34; మరియు యోహాను 8:1–11 వంటివి. మీరు మరియు మీ పిల్లలు ఈ ఉదాహరణల చిత్రాల కోసం శోధించవచ్చు. ఇతరుల పట్ల దయ చూపడానికి మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

పెద్ద చేప నీడ మసకగా కనిపిస్తున్న చోట పడవలో నుండి సముద్రములోకి పడవేయబడుతున్న యోనా

Jonah and the Whale [యోనా మరియు తిమింగలము], కెవిన్ కార్డెన్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: కష్టమైనప్పటికీ, ఆయనకు లోబడేందుకు ప్రభువు నాకు సహాయం చేస్తారు