2024 రండి, నన్ను అనుసరించండి
నవంబరు 2–8. “నూతన స్వభావము మీకు కలుగజేసెదను”: యెహెజ్కేలు 1–3; 33–34; 36–37; 47


“నవంబరు 2–8. ‘నూతన స్వభావము మీకు కలుగజేసెదను’: యెహెజ్కేలు 1–3; 33–34; 36–37; 47,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“నవంబరు 2–8. ‘నూతన స్వభావము మీకు కలుగజేసెదను,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

గోపురముపైన కావలికాయువాడు

నవంబరు 2–8: “నూతన స్వభావము మీకు కలుగజేసెదను”

యెహెజ్కేలు 1–3; 33–34; 36–3747

యెహెజ్కేలు నిర్గమంలో ఉన్న ప్రవక్త. మిగిలిన ఇశ్రాయేలీయులతోపాటు అతడు చెరపట్టబడి, బబులోనుకు పంపబడ్డాడు. యెరూషలేములో, యెహెజ్కేలు దేవాలయములో సేవ చేస్తున్న ఒక యాజకునిగా ఉండియుండవచ్చు. దేవాలయము నుండి వందల మైళ్ళ దూరంలో మరియు దేవుని యొక్క ప్రియమైన మందిరానికి తిరిగి వచ్చే స్వల్ప నిరీక్షణతో బబులోనులో, అతడు “చెరపట్టబడిన వారి” మధ్య ఉన్నాడు మరియు “వారు కూర్చున్న స్థలమందు కూర్చున్నాడు,” (యెహెజ్కేలు 3:15). తరువాత ఒకరోజు యెహెజ్కేలుకు ఒక దర్శనము కలిగింది. అతడు “ప్రభువు యొక్క తేజస్సు”ను (యెహెజ్కేలు 1:28) చూసాడు—యెరూషలేము వద్దనున్న దేవాలయములో కాదు, కానీ నిర్గమముల మధ్య బబులోనులో చూసాడు. యెరూషలేములో చెడుతనము తీవ్రమైందని, దేవుని సన్నిధి అక్కడ ఇక లేదని అతడు తెలుసుకొన్నాడు (యెహెజ్కేలు 8–11; 33:21 చూడండి).

అయినప్పటికీ, యెహెజ్కేలు సందేశం కొంత ఆశాజనకంగా ఉంది. నిబంధన జనులు ఎంతగా పతనమైనప్పటికీ, దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. వారు “యెహోవా మాట ఆలకించిన” (యెహెజ్కేలు 37:4) యెడల, ఒకసారి మృతమైన దాన్ని పునరుద్ధరించవచ్చు. వారి “రాతి గుండెకు” బదులుగా “నూతన హృదయము” (యెహెజ్కేలు 36:26) ఉంచబడవచ్చు. మరియు భవిష్యత్తులో, క్రొత్త దేవాలయమును, ఒక క్రొత్త యెరూషలేమును ప్రభువు స్థాపించును, “యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు” (యెహెజ్కేలు 48:35).

యిర్మీయా గ్రంథమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “యిర్మీయా” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

యెహెజ్కేలు 334

ఆయన గొఱ్ఱెపిల్లలను మేపమని ప్రభువు నన్ను ఆహ్వానిస్తున్నారు.

యెహెజ్కేలు 3 మరియు 34లో, ప్రభువు తన జనుల యొక్క నాయకులను కావలివారిగా, గొఱ్ఱెల కాపరులుగా సూచించారు. మీరు ఈ అధ్యాయాలను చదివినప్పుడు, ఒక నాయకునిగా ఉండుట అనగా అర్థమేమిటని ఈ శీర్షికలు సూచిస్తాయో పరిగణించండి.

మీరు మేపవలెనని ప్రభువు కోరిన “గొఱ్ఱెలు” ఎవరు? సువార్తసేవ చేయడానికి, పిల్లలను పెంచడానికి లేదా పరిచర్య బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధపడుతున్న వారెవరికైనా సహాయపడునట్లు యెహెజ్కేలు 34లో మీరు ఏమి కనుగొంటారు? మన కాపరిగా రక్షకుని మాదిరిని మీరు ఎలా అనుసరించగలరు? (11–31 వచనాలు చూడండి).

ఈ అధ్యాయంలో మీరు కనుగొన్న ప్రతీకవాదాన్ని కూడా మీరు ధ్యానించవచ్చు. 14వ వచనములో “మంచి మేత” మరియు “మంచి దొడ్డి” దేనిని సూచిస్తాయి? “తప్పిపోయిన” గొర్రె మరియు “తోలివేయబడిన” గొర్రె మధ్య తేడా ఏమిటి? (16వ వచనము). ఏ ఇతర చిహ్నాలను మీరు కనుగొంటారు?

యోహాను 21:15–17; గెరిట్ డబ్ల్యు. గాంగ్, “పరిచర్య,” లియహోనా, మే 2023, 16–19 కూడా చూడండి.

యెహెజ్కేలు 33:10–19

ప్రభువు క్షమించాలని కోరుతున్నారు.

“మా … పాపదోషములు మామీద పడియున్నవి,” “మనమెట్లు బ్రదుకుదుము?” అని చెరపట్టబడిన ఇశ్రాయేలీయులు ఆశ్చర్యపడ్డారు. (యెహెజ్కేలు 33:10). జవాబుగా, ప్రభువు పశ్చాత్తాపము మరియు క్షమాపణ గురించి ముఖ్యమైన సత్యములను వారికి బోధించారు. ఆయన బోధించిన దానిని ధ్యానించడానికి ఈ ప్రశ్నలు మీకు సహాయపడగలవు:

  • “[మీ] స్వనీతిని ఆధారము చేసుకొనుట” అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (యెహెజ్కేలు 33:12–13 చూడండి).

  • యెహెజ్కేలు 33:12–19 లో వివరించబడిన జనులు న్యాయంగా చూడబడలేదని భావించే వారికి మీరు ఏమని చెప్తారు? (మత్తయి 21:28–31; లూకా 18:9–14 కూడా చూడండి).

  • పశ్చాత్తాపపడుట అనగా అర్థమేమిటో గ్రహించటానికి మీకు సహాయపడేలా ఈ వచనాలలో మీరు ఏమి కనుగొంటారు? యెహెజ్కేలు 36:26–27 మరియు ఆల్మా 7:14–16లో ఏ అదనపు అంతరార్థములను మీరు కనుగొంటారు?

యెహెజ్కేలు 37

సెమినరీ చిహ్నము
ప్రభువు తన జనులను సమకూర్చి, వారికి క్రొత్త జీవితాన్ని ఇస్తున్నారు.

ఇశ్రాయేలు సమకూర్పు యెహెజ్కేలు 37లో రెండు చిహ్నముల ద్వారా చిత్రీకరించబడింది. మొదటిది—మృతమైన ఎముకలకు ప్రాణము తిరిగివ్వబడుట (1–14 వచనాలు చూడండి) గురించి మీరు చదివినప్పుడు—తెరకు ఇరువైపులా ఇశ్రాయేలును సమకూర్చడం గురించి అది మీకేమి సూచిస్తుందో ధ్యానించండి (యెహెజ్కేలు 36:24–30 కూడా చూడండి). ఇలాంటి ప్రశ్నలను పరిగణించండి:

  • ఇశ్రాయేలును సమకూర్చడం ద్వారా ప్రభువు ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు?

  • ఆయన దానిని ఎలా సాధిస్తున్నారు?

15–28 వచనాలలో రెండవ చిహ్నాన్ని గురించి మీరు చదివినప్పుడు, మిమ్మల్ని మీరు ఇవే ప్రశ్నలు అడగవచ్చు. ఈ చిహ్నము రెండు కర్రతునకలను కలిపియున్నది, దానిని చాలామంది పండితులు కీలుతో జతపరచి వ్రాసే చెక్క బోర్డులుగా వ్యాఖ్యానిస్తారు. యూదా కర్రతునక బైబిలును సూచిస్తుంది (బైబిలులో అధికము యూదా వంశస్థుల చేత వ్రాయబడినది కనుక) మరియు (లీహై కుటుంబము ఐగుప్తు యొక్క యోసేపు వంశస్థులు కనుక) యోసేపు కర్రతునక మోర్మన్ గ్రంథమును సూచిస్తుంది. దానిని దృష్టిలో ఉంచుకుని, ఇశ్రాయేలును సమకూర్చుటలో లేఖనాల పాత్ర గురించి ఈ వచనాలు మీకేమి బోధిస్తాయి?

బైబిలు మరియు మోర్మన్ గ్రంథము మీ జీవితంలో—ముఖ్యంగా, మీరు క్రీస్తు వద్దకు రావడానికి సహాయం చేయడంలో ఎలా కలిసి పని చేసాయో ఆలోచించండి. ఏ గద్యభాగాలు మీకు ప్రత్యేకంగా అర్థవంతంగా ఉన్నాయి?

2 నీఫై 3:11–13; 29:14 కూడా చూడండి.

1:31

The Book of Mormon Gathers Scattered Israel

ఎడారిచే చుట్టుబడియున్న మృత సముద్రము

దేవాలయము నుండి నది ప్రవాహమును మరియు మృత సముద్రమును స్వస్థపరచుటను ఒక దర్శనములో యెహెజ్కేలు చూసాడు.

యెహెజ్కేలు 47:1–12

నేను ప్రభువు యొక్క మందిరములో ఆధ్యాత్మిక స్వస్థతను పొందగలను.

మీరు యెహెజ్కేలు 47:1–12 చదివినప్పుడు, మృత సముద్రం చేపలు మరియు మొక్కలు జీవించలేనంత ఉప్పగా ఉంటుందని తెలుసుకోవడం మీకు సహాయపడవచ్చు. 1–12 వచనాలలో వివరించబడిన జలాల గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? (ప్రకటన 22:1 కూడా చూడండి). ఈ జలాలు దేనిని ప్రతీక? 12వ వచనములో వివరించబడిన చెట్లు దేనిని సూచిస్తాయి?

ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ గారి సందేశం, “కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము: బంధింపబడుట మరియు స్వస్థత” మీ అవగాహనకు ఏమి జోడిస్తుంది? (లియహోనా, మే 2018, 47–48). దేవాలయం వలన మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని మరియు స్వస్థతను ఎలా పొందారో ధ్యానించండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

యెహెజ్కేలు 3:17; 33:1–5

ప్రవక్తలు ప్రమాదం గురించి మనల్ని హెచ్చరించే కాపలాదారుల వంటివారు.

  • చిన్నపిల్లలు యెహెజ్కేలు 3:17కు సంబంధించిన అభినయాలను చేయడాన్ని ఆనందించవచ్చు. ఉదాహరణకు, మీరు “కావలి,” “ఆలకించు” మరియు “నోరు” అనే పదాలను చదివినప్పుడు, వారు తమ కళ్ళు, చెవులు మరియు నోటిని చూపవచ్చు. వారు బయటికి వెళ్లడాన్ని లేదా గది చుట్టూ వెళ్లడాన్ని కూడా ఇష్టపడవచ్చు. వారు నడుస్తున్నప్పుడు, నదులు దాటడం, కొమ్మల క్రిందకు వెళ్లడం లేదా తప్పించుకోవలసిన జంతువులు (నిజమైనవి లేదా నటించండి) వంటి వాటి గురించి వారిని హెచ్చరించండి. మనం చూడలేని ప్రమాదాల గురించి ప్రభువు యొక్క ప్రవక్త మనల్ని ఎలా హెచ్చరిస్తున్నారనే దాని గురించిన సంభాషణకు ఇది దారితీయవచ్చు.

  • యెహెజ్కేలు 3:17; 33:1–5ని వివరించడానికి ఇక్కడ మరొక మార్గం ఉంది. మీ పిల్లలలో ఒకరు కిటికీలోంచి బయటకు చూస్తూ, బయట ఏమి జరుగుతుందో అందరికీ చెప్పడం ద్వారా “కావలివాని” వలె నటించవచ్చు. ChurchofJesusChrist.org మన సజీవ ప్రవక్త మనకు ఒక కావలివానిగా ఎలా ఉన్నారు?

    4:17

    Watchman on the Tower

రెండు కాగితపు చుట్టలను పట్టుకున్న యెహెజ్కేలు

The Prophet Ezekiel [యెహెజ్కేలు ప్రవక్త], లైల్ బెడెస్ చేత

యెహెజ్కేలు 37:15-23

మోర్మన్ గ్రంథము మరియు బైబిలు మనల్ని యేసు క్రీస్తు వద్దకు “సమకూర్చడానికి” సహాయం చేస్తాయి.

  • యెహెజ్కేలు 37:15–23ని కలిసి చదివిన తర్వాత, మీరు మరియు మీ పిల్లలు రెండు కర్రతునకలను కనుగొని, ఒక దానిపై యూదా కొరకు (బైబిలు), మరొకదానిపై యోసేపు కొరకు (మోర్మన్ గ్రంథము) అని వ్రాయవచ్చు. రక్షకునికి దగ్గరగా భావించడానికి మరియు “[ఆయన] జనులు” (23వ వచనము) కావడానికి మీకు సహాయపడునట్లు బైబిలు మరియు మోర్మన్ గ్రంథము నుండి కథలు లేదా లేఖనాలను మీరు పంచుకోవచ్చు. లేఖనాల యొక్క ఈ రెండు గ్రంథాలను కలిగియుండడం ఎందుకు మంచిది?

ప్రతీది పొందుపరచడానికి ప్రయత్నించవద్దు. మీ పిల్లలతో మీరు యెహెజ్కేలులోని ప్రతీ సత్యమును అన్వేషించలేకపోవచ్చు. వారు ఏమి అర్థం చేసుకోవాలో ప్రార్థనాపూర్వకంగా పరిగణించండి మరియు దేనిపై దృష్టిసారించాలో తీర్మానించడానికి ఆత్మీయ నడిపింపును వెదకండి. (రక్షకుని విధానములో బోధించుట17 చూడండి.)

యెహెజ్కేలు 47:1-12

మన హృదయాలు మరియు కుటుంబాలు ప్రభువు యొక్క మందిరములో స్వస్థత కనుగొనగలవు.

  • దేవాలయము నుండి నీళ్లు ప్రవాహిస్తూ, మృత సముద్రమును స్వస్థపరిచే యెహెజ్కేలు దర్శనమును యెహెజ్కేలు 47 వర్ణిస్తుంది—ఆ సముద్రము ఎంత ఉప్పగా ఉంటుందంటే దానిలో చేపలు, మొక్కలు నివసించలేవు. దర్శనం నుండి దేవాలయం, నది, ఎడారి, మృత సముద్రం, అనేక చేపలు లేదా ఫలవంతమైన చెట్టు వంటి ఒకటి లేదా రెండు వస్తువులను మీ పిల్లలు గీయవచ్చు. తర్వాత, మీరు 1–12 వచనాలను కలిసి చదువుతున్నప్పుడు, ఆ వస్తువు ప్రస్తావించబడినప్పుడు వారు తమ చిత్రాల‌ను పంచుకోవచ్చు. ఈ దర్శనంలోని నది నుండి ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయి? ఈ ఆశీర్వాదాలు దేవాలయ నిబంధనలను పాటించేవారికి రక్షకుడు అందించే ఆశీర్వాదాల వలె ఎలా ఉన్నాయో చూడడానికి పిల్లలకు సహాయం చేయండి.

    3:43

    And the River Will Grow

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

యెరూషలేము దేవాలయం నుండి ప్రవహిస్తున్న నది

“మందిరపు గడప క్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. … ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును” (యెహెజ్కేలు 47:1, 9). goodsalt.com చేత చిత్రము అనుమతించబడింది

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: మోర్మన్ గ్రంథము మరియు బైబిలు మనల్ని యేసు క్రీస్తు వద్దకు “సమకూరుస్తాయి”