2024 రండి, నన్ను అనుసరించండి
నవంబరు 16–22. “మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును”: హోషేయ 1–6; 10–14; యోవేలు


“నవంబరు 16–22. ‘మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును’: హోషేయ 1–6; 10–14; యోవేలు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“నవంబరు 16–22. ‘మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

దేవాలయము బయట క్రొత్తగా పెళ్ళైన జంట

నవంబరు 16–22: “మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును”

హోషేయ 1–6; 10–14; యోవేలు

ప్రభువుతో ఇశ్రాయేలీయుల యొక్క నిబంధన చాలా లోతైనదిగా, అర్థవంతమైనదిగా ఉండటానికి ఉద్దేశించబడింది, దానిని ప్రభువు ఒక వివాహముతో పోల్చారు. వివాహము వలే, నిబంధన నిత్య నిబద్ధతను, పంచుకోబడిన అనుభవాలను, జీవితాన్ని కలిసి నిర్మించుటను, ప్రత్యేక విశ్వాసమును మరియు అన్నిటికంటే ఎక్కువగా హృదయపూర్వకమైన ప్రేమను కలిపియున్నది. విచారకరంగా, ఇశ్రాయేలీయులు తమ నిబంధనపట్ల విశ్వాసంగా లేరు. అయినప్పటికీ, “నేను మిమ్మల్ని శాశ్వతంగా తిరస్కరించను” అనేది ప్రభువు వారికిచ్చిన సందేశము. బదులుగా “నేను నిన్ను తోడుకొనివచ్చెదను” (హోషేయ 2:14–15 చూడండి). “నీతిని బట్టి నిన్ను ప్రధానము చేసికొందును,” అని హోషేయ ద్వారా ఆయన ప్రకటించారు (హోషేయ 2:19). “వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును” (హోషేయ14:4). ప్రేమతో, భక్తితో మన నిబంధనలను జీవించటానికి మనము కోరినప్పుడు ఈరోజు ఆయన మనకిచ్చేది అదే సందేశము.

యోవేలు అలాంటి సందేశాన్నే పంచుకున్నాడు: “మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయున్నాడు, కనుక ఆయనతట్టు తిరుగుడి” (యోవేలు 2:13). ఈ ప్రవక్తల మాటలను చదవడం, ప్రభువుతో మీ స్వంత సంబంధం గురించి ఆలోచించేలా—మీ పట్ల ఆయన విశ్వాసం, ఆయన పట్ల విశ్వాసంగా ఉండడానికి మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తుందో ఆలోచించేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు.

హోషేయ మరియు యోవేలు గ్రంథాలను సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “హోషేయ” మరియు “యోవేలు” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

హోషేయ 1–314

ఆయన వద్దకు తిరిగి రమ్మని ప్రభువు ఎల్లప్పుడు నన్ను ఆహ్వానిస్తారు.

హోషేయ భార్య గోమేరు అతడికి నమ్మకద్రోహం చేసింది మరియు దేవుడు ఇశ్రాయేలీయుల గురించి మరియు ఆయనతో వారి నిబంధనల గురించి ఎలా భావించారో వారికి బోధించడానికి ఈ విచారకరమైన సంఘటనను ప్రత్యేకించి చూపారు. మీరు హోషేయ 1–3 చదివినప్పుడు, ప్రభువు తన నిబంధన జనులతో ఆయన అనుబంధాన్ని ఎలా చూస్తారో ధ్యానించండి. ప్రభువుతో నిబంధన చేసుకోవడం ఎలా వివాహబంధంలోకి ప్రవేశించడం లాంటిది? ఆ నిబంధనను నిలబెట్టుకోవడంలో విఫలమవడం ఎలా జీవిత భాగస్వామికి ద్రోహం చేయడం లాంటిది? (హోషేయ 2:5–7, 13 చూడండి). ప్రభువు యొక్క ప్రేమ మరియు కరుణ గురించి హోషేయ 2:14–23 మీకేమి బోధిస్తాయి? ఆయనపట్ల మీ ప్రేమను, విశ్వాసమును మీరు ఎలా చూపిస్తారు?

హోషేయ 14లో, ప్రభువు తన వద్దకు తిరిగి వచ్చేవారికి చేసే అనేక అందమైన వాగ్దానాల కోసం చూడండి. “మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును” అనే వాక్యానికి మీకు గల అర్థం ఏమిటి? (4వ వచనము). పశ్చాత్తాపం యొక్క ఆశీర్వాదాలతో సహా ప్రభువు యొక్క ఆశీర్వాదాల గురించి 5–8 వచనములలో ఉన్న మొక్కల రూపకాలు మీకు ఏమి బోధిస్తాయి?

ఉదాసీనంగా ఉన్న స్త్రీ

ఇశ్రాయేలు సంతతిని మరియు వారి విచ్ఛిన్నమైన నిబంధనలను సూచించే గోమేరు, ప్రభువు ద్వారా విమోచన పొందింది. డెబ్ మిన్నర్డ్ చేత వివరణ, goodsalt.com నుండి అనుమతి పొందింది

హోషేయ 6:4–7; యోవేలు 2:12–13

దేవుని పట్ల భక్తిని బాహ్యంగా వ్యక్తపరచడమే కాకుండా, అంతర్గతంగా అనుభూతి చెందాలి.

హోషేయ కాలంలోని జనులు జంతు బలులు అర్పించారు, కానీ వారు మరింత ముఖ్యమైన ఆజ్ఞలను ఉల్లంఘించారు. “బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలుల కంటె దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది” అని ప్రభువు చెప్పినప్పుడు దాని అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (హోషేయ 6:6). నీతి మేఘము లేదా మంచు వలే ఉండుట అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (హోషేయ 6:4 చూడండి). మన నీతి ఎలా ఉండాలి? (యెషయా 48:18; 1నీఫై 2:9–10 చూడండి).

ఆయన పరిచర్య సమయంలో రక్షకుడు హోషేయ 6:6ను ఎలా ఉపయోగించారో చూడటానికి మత్తయి 9:10–13; 12:1–8 కూడా మీరు చదవవచ్చు. హోషేయ మాటలను గ్రహించడానికి ఈ గద్యభాగాలు మీకు ఎలా సహాయపడతాయి?

యోవేలు 2:12–13 చదువుతున్నప్పుడు, ఒకరి వస్త్రములను చింపుకొనుట లేదా చీల్చుట సాంప్రదాయకంగా సంతాపం లేదా పశ్చాత్తాపం యొక్క బాహ్య సంకేతం అని తెలుసుకోవడం సహాయపడవచ్చు. మన హృదయాలను నలుగగొట్టుట మన వస్త్రములను చింపుట నుండి భిన్నంగా ఎలా ఉన్నది?

యోవేలు 2

సెమినరీ చిహ్నము
“సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును.”

మన దినము మరియు యోవేలు ముందుగా చూసిన దినము మధ్య ఏ పోలికలను మీరు చూస్తారు? (ప్రత్యేకించి యోవేలు 2:1–2, 11, 18–32 చూడండి). 18–32 వచనములలో ప్రభువు వాగ్దానమిచ్చిన దీవెనల గురించి మిమ్మల్ని ఆకట్టుకున్నదేమిటి? ఈ ఆశీర్వాదాలు నేడు ప్రత్యేకంగా ఎందుకు విలువైనవి కావచ్చు?

మొరోనై 1823లో జోసెఫ్ స్మిత్‌ని సందర్శించినప్పుడు యోవేలు 2 గురించి ఏమి చెప్పాడో చదవడం ఆసక్తికరంగా ఉండవచ్చు (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:41 చూడండి). యోవేలు 2:28–32లోని ప్రవచనాలు మన కాలంలో నెరవేరుతున్నందుకు మీరెలా భావిస్తున్నారు? (అపొస్తలుల కార్యములు 2:1–21 కూడా చూడండి). ప్రభువు “సర్వజనుల మీద [ఆయన] ఆత్మను కుమ్మరించును” అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (యోవేలు 2:28).

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పిన ఈ మాటలను మీరు ధ్యానించవచ్చు: “రాబోయే దినాలలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గదర్శకత్వము, ఆదరణ మరియు స్థిరమైన ప్రభావము లేకుండా ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యముకాదు” (“సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 96). మన ఆత్మీయ మనుగడకు బయల్పాటు ఎందుకు అవసరము?

మీరు ఆ కుమ్మరింపును పొందడం లేదని భావిస్తే మీరు ఏమి చేయవచ్చు? సహాయపడే కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. ప్రభువు ఆత్మ యొక్క కుమ్మరింపును పొందడానికి ఈ లేఖనాలలోని జనులు ఏమి చేసారు?

మీరు ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ చెప్పిన ఈ మాటలను చదువుతున్నప్పుడు, మీ అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును అనుభవించడం అంటే ఏమిటో ధ్యానించండి:

“వ్యక్తిగత బయల్పాటును పొందడంలో మనం తరచుగా కష్టపడతాము. నేను చెప్పేదేమిటంటే, మన నిబంధనలను మనం గౌరవిస్తున్నప్పుడు, మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను మన నిరంతర సహవాసిగా కలిగియుండవచ్చు అనేది నిబంధన వాగ్దానము. కానీ మనము దాని గురించి మాట్లాడతాము మరియు ప్రభువు స్వరాన్ని ఆయన ఆత్మ ద్వారా వినడం అరుదైన సంఘటనగా భావిస్తాము. … [ఆత్మ] అన్ని సమయాలలో మనతో ఉండాలి. ప్రతీ క్షణం కాదు, కానీ ఒక వ్యక్తి తన వంతు కృషి చేస్తున్నట్లయితే—మీరు పరిపూర్ణులుగా ఉండవలసిన అవసరం లేదు—కానీ మీరు మరియు నేను మన వంతు కృషి చేస్తున్నట్లయితే మరియు మనము తీవ్రమైన అతిక్రమములకు పాల్పడనట్లయితే, అప్పుడు మనల్ని నడిపించడానికి మనం పరిశుద్ధాత్మపై ఆధారపడవచ్చు. …

“… పరిశుద్ధాత్మ నాటకీయంగా, పెద్దగా మరియు ఆకస్మికంగా ఉంటారని మనం నమ్ముతున్నాము, అయితే ఆయన నిమ్మళముగా మాట్లాడుతూ కాలక్రమేణా పెరుగుతూ ఉంటారు” (“Elder David A. Bednar Discussion” [evening with a General Authority, Feb. 7, 2020], broadcasts.ChurchofJesusChrist.org).

గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “ఆత్మ యొక్క ప్రేరేపణలు,” లియహోనా, నవ. 2023, 42–45 కూడా చూడండి.

3:38

Enemy Territory

ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించండి. “సువార్తను నేర్చుకునే ఆత్మీయ వాతావరణానికి ఏది దోహదం చేస్తుందని మీరు గమనించారు? దానిని ఏది పక్కదారి పట్టిస్తుంది? … మీరు తరచుగా బోధించే [లేదా నేర్చుకొనే] స్థలము గురించి ఆలోచించండి. మీరు అక్కడ ఉన్నప్పుడు ఏవిధంగా భావిస్తారు? అక్కడ ఉండుటకు ఆత్మను మీరు మరింత సమర్థవంతంగా ఎలా ఆహ్వానించగలరు?” (రక్షకుని విధానములో బోధించుట7).

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

హోషేయ 2:19–20

నేను విశ్వాసంగా నా నిబంధనలను పాటించగలను.

  • హోషేయ గ్రంథంలో, ప్రభువు తన జనులతో ఆయన నిబంధనలను వివాహంతో పోల్చారు. ఈ పోలిక నుండి నేర్చుకోవడానికి, మీరు మరియు మీ పిల్లలు వధూవరుల చిత్రాన్ని చూసి, భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా చూసుకోవాలని పరలోక తండ్రి కోరుకుంటున్నారు అనే దాని గురించి మాట్లాడవచ్చు. ప్రభువు మన గురించి ఎలా భావిస్తున్నారో వివరించే పదాలను హోషేయ 2:19–20లో కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయండి. మనం ప్రభువును ప్రేమిస్తున్నామని మరియు ఆయనపట్ల నమ్మకంగా ఉంటామని ఆయనకు ఎలా చూపించగలము?

హోషేయ 10:12

“యెహోవాను వెదకుటకు ఇదే సమయము.”

  • హోషేయ 10:12 ప్రభువును వెదకమని మనల్ని ఆహ్వానించడానికి విత్తడం, కోయడం, సమయం మరియు వర్షాన్ని సూచిస్తుంది. మీరు ఈ వచనం చదువుతున్నప్పుడు, ఆయనను వెదకడానికి పిల్లలను ప్రేరేపించేలా ఏ సృజనాత్మక ఆలోచనలు గుర్తుకు వస్తాయి? ఉదాహరణకు, మీ పిల్లలు గడియారాన్ని గీయవచ్చు మరియు రోజంతా వేర్వేరు సమయాల్లో వారు ప్రభువును వెదకగల మార్గాలను వ్రాయవచ్చు.

  • ఒక విత్తనాన్ని నాటడం మరియు మంచి ఆహారాన్ని కోయడాన్ని నీతిగా జీవించడం మరియు ప్రభువు ఆశీర్వాదాలను పొందడంతో పోల్చడానికి మీ పిల్లలకు సహాయం చేయండి. అప్పుడు మీరు ఆయనను వెదకడానికి ప్రయత్నించినప్పుడు ప్రభువు మీపై కురిపించిన ఆశీర్వాదాల గురించి ఒకరితో ఒకరు చెప్పుకోవచ్చు.

హోషేయ 13:4, 14

యేసు క్రీస్తు నా రక్షకుడు మరియు విమోచకుడు.

  • యేసు క్రీస్తు తప్ప ఏ రక్షకుడు లేడనే హోషేయ 13:4లోని సత్యాన్ని నొక్కి చెప్పడానికి, మీరు మీ పిల్లలకు యేసుతో సహా అనేకమంది వ్యక్తుల చిత్రాలను చూపించవచ్చు. పాపం మరియు మరణం నుండి మనల్ని రక్షించే శక్తి ఉన్న వ్యక్తిని మీ పిల్లలు వంతులవారీగా చూపవచ్చు. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోండి.

  • మీ పిల్లలు హోషేయ 13:4, 14లో యేసు క్రీస్తును వర్ణించే పదాల కోసం చూడవచ్చు. ఆయన గురించి ఈ పదాలు మనకేమి బోధిస్తాయి? యేసు క్రీస్తు గురించి మీరు ఎలా భావిస్తున్నారో ఒకరితో ఒకరు పంచుకోండి.

ప్రార్థిస్తున్న బాలుడు

యోవేలు 2:28–29

పరిశుద్ధాత్మ నన్ను నడిపించగలరు.

  • మీ పిల్లలు ఒక ద్రవాన్ని కుమ్మరించడం, తరువాత దానికి విరుద్ధంగా బిందువులుగా లేదా చుక్కలుగా కారేలా చేయడం ద్వారా యోవేలు 2:28–29ను అర్థం చేసుకోవడంలో మీరు వారికి సహాయపడవచ్చు. మనపై ఆత్మ “కుమ్మరింపబడుట” అనగా అర్థమేమైయుండవచ్చు?

  • మీరు యోవేలు 2:28–29ని కలిసి చదువుతున్నప్పుడు, “మీ కుమారులు” మరియు “మీ కుమార్తెలు” అనే వాక్యభాగాల స్థానంలో ఒకరి పేర్లను మరొకరు చేర్చమని మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. తర్వాత ఆత్మ వారికి ఎలా సహాయపడగలదో కనుగొనడానికి యోహాను 14:16; మొరోనై 10:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 42:17 వంటి లేఖనాలను పరిశోధించడానికి వారికి సహాయపడండి.

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ద్వారంలో సైగ చేస్తున్న యేసు

Savior [రక్షకుడు], కెల్లీ ప్యు చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: పరిశుద్ధాత్మ నన్ను నడిపించగలరు