2024 రండి, నన్ను అనుసరించండి
ఆగష్టు 24–30. “ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను”: కీర్తనలు 49–51; 61–66; 69–72; 77–78; 85–86


“ఆగష్టు 24–30. ‘ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను’: కీర్తనలు 49–51; 61–66; 69–72; 77–78; 85–86,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“ఆగష్టు 24–30. ‘ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

రాత్రియందు లాంతరు పట్టుకొన్న యేసు

Saving That Which Was Lost [తప్పిపోయిన దానిని రక్షించుట], మైఖేల్ టి. మామ్ చేత

ఆగష్టు 24–30: “ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను”

కీర్తనలు 49–51; 61–66; 69–72; 77–78; 85–86

కీర్తనల రచయతలు వారి కవిత్వములో లోతైన వ్యక్తిగత భావాలను పంచుకున్నారు. నిరాశ చెందిన, భయపడిన మరియు పశ్చాత్తాపపడిన భావన గురించి వారు వ్రాసారు. కొన్నిసార్లు, వారు దేవుని చేత విడువబడినట్లుగా భావించినట్లు కనబడ్డారు మరియు కొన్ని కీర్తనలు విసుగు లేదా నిరాశచెందిన స్వరమును కలిగి ఉంటాయి. ఇటువంటి భావనలు మీకు ఎప్పుడైనా కలిగితే, కీర్తనలను చదవటం మీరు ఒంటరి వారు కాదని తెలుసుకొనుటకు మీకు సహాయపడగలదు. అటువంటి భావాలు మీకు కలిగినప్పుడు కీర్తనలు మిమ్మల్ని ప్రోత్సహించేవిగా కూడా మీరు కనుగొంటారు, ఎందుకనగా కీర్తనాకారులు ప్రభువును ఆయన మంచితనము కొరకు స్తుతించారు, ఆయన శక్తియందు ఆశ్చర్యపడ్డారు మరియు ఆయన కనికరమందు సంతోషించారు. చెడు మరియు పాపము చేత లోకము భారమైనదని, కానీ ప్రభువు “దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల వాడని” (కీర్తనలు 86:5) వారు ఎరుగుదురు. ప్రభువు నందు విశ్వాసము కలిగియుండుట అనగా మీరు ఎన్నడూ ఆందోళన, పాపము లేదా భయము చేత శ్రమపడరని అర్థము కాదని వారు గ్రహించారు. ఆ విధముగా మీరు శ్రమపడినప్పుడు ఎవరివైపు తిరగాలో మీకు తెలుసని దాని అర్థము.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

కీర్తనలు 49; 62:5–12

యేసు క్రీస్తు ద్వారా మాత్రమే విమోచన కలుగుతుంది.

49వ కీర్తన “సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి ఇరువురికి” (2వ వచనము) ఒక సందేశమును కలిగియున్నది. ఈ సందేశము ఏమిటని మీరు చెప్పుదురు? ఆ సందేశమునకు అదనముగా కీర్తనలు 62:5–12 ఏమి చేర్చుతుందని మీరు భావిస్తున్నారు?

ఈ కీర్తనలను చదవడం విమోచన కోసం దేవుణ్ణి కాకుండా వేరొకదానిని విశ్వసించాలని మనం శోధించబడిన మార్గాల గురించి ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు (కీర్తనలు 49:6–7 చూడండి). “పాతాళ బలములోనుండి ఆయన [మీ] ప్రాణమును విమోచించును” అనే మీ సాక్ష్యము చేత మీ జీవితం ఎలా ప్రభావితం చేయబడింది? (కీర్తనలు 49:15).

కీర్తనలు 51; 85–86

సెమినరీ చిహ్నము
రక్షకుని కనికరము వలన, నేను క్షమించబడగలను.

మనందరికీ అవసరమైన క్షమాపణ కోసం తన తీరని ఆవశ్యకతను గుర్తించిన తర్వాత, దావీదు రాజు 51వ కీర్తనను వ్రాశాడు. మీరు కలిగి ఉన్న భావాలను ఏ వచనాలు వివరిస్తాయి? క్షమాపణ కోసం మీకు నిరీక్షణనిచ్చేలా ఈ కీర్తనలో మీరేమి కనుగొంటారు?

పశ్చాత్తాపపడుట అనగా అర్థమేమిటనే దాని గురించి ఆధారాల కొరకు కూడా మీరు 51వ కీర్తనను పరిశోధించవచ్చు. మీరు కనుగొనే వాటిని జాబితా చేయండి. మీరు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశము “మనం ఉత్తమముగా చెయ్యగలము మరియు ఉత్తమముగా ఉండగలము” (లియహోనా, మే 2019, 67– 69)ను పరిశోధించడం ద్వారా మీ జాబితాకు జతచేయగలరేమో చూడండి.

క్రీస్తు ద్వారా క్షమాపణను పొందడం ఎలా అనిపిస్తుందనే దానిని మీరు ఎలా వివరిస్తారు? మీ భావాలను వివరించడంలో మీకు సహాయం కావాలంటే, మీరు కీర్తనలు 51:1–2, 7–12; 85:2–9లో చూడవచ్చు. కొంతమంది వ్యక్తులు తమ భావాలను వ్యక్తీకరించడానికి చిత్రాలను గీయడాన్ని లేదా కనుగొనడాన్ని ఇష్టపడతారు; మీరు దానిని ప్రయత్నించవచ్చు.

పశ్చాత్తాపపడాలంటే, యేసు క్రీస్తు మనల్ని శుద్ధి చేయగలరు అని మాత్రమే కాకుండా, ఆయన చేస్తారు అనే విశ్వాసం కూడా మనం కలిగియుండాలి. రక్షకుడు క్షమించగలరు మరియు క్షమిస్తారు అని తెలుసుకోవడంలో మీకు సహాయం చేసేలా కీర్తనలు 86:5, 13, 15లో మీరు ఏమి కనుగొంటారు?

ఆల్మా 36; పీటర్ ఎఫ్. మ్యుర్స్, “ఆయన నన్ను స్వస్థపరచగలరు!,” లియహోనా, మే 2023, 39–41 కూడా చూడండి.

కీర్తనలు 51:13–15; 66:5-20; 71:15–24

యేసు క్రీస్తును గూర్చి నా సాక్ష్యము ఇతరులు ఆయన యొద్దకు రావడానికి సహాయపడగలదు.

యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త శక్తి గురించి మీ సాక్ష్యమును మీరు ఎలా పొందారో ధ్యానించండి. తరువాత , మీరు కీర్తనలు 51:13–15; 66:5-20; 71:15–24 చదివినప్పుడు, “దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి” (కీర్తనలు 66:5) అని మీరు ఇతరులను ఎలా ఆహ్వానించగలరో ఆలోచించండి. “[ప్రభువు] [మీ] కొరకు చేసిన కార్యములను” (కీర్తనలు 66:16) మీరు వినిపించాలంటే, మీరు ఏమి వినిపిస్తారు?

“[ఆయన] నీతిని దినమెల్ల వర్ణించుట” అనగా మీకు గల అర్థమేమిటి? (కీర్తనలు 71:24).

ఆల్మా 26 కూడా చూడండి.

ఇతరులతో లేఖనాలను పంచుకుంటున్న యువకుడు

వచ్చి ఆలకించుడి, … [దేవుడు] నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను”(కీర్తనలు 66:16).

కీర్తనలు 63; 69; 77–78

నా అత్యవసర సమయములో ప్రభువు నాకు సహాయపడతారు.

దేవుని నుండి దూరంగా ఉన్నట్లు మరియు ఆయన సహాయం ఎంతో అవసరమైనట్లు భావించడం ఎలా ఉంటుందో అనేక కీర్తనలు వివరిస్తాయి (కీర్తనలు 63:1, 8; 69:1–8, 18–21; 77:1–9 చూడండి). కీర్తనాకారులకు అభయమిచ్చేలా కీర్తనలు 6369; 77–78లో మీరు ఏమి కనుగొంటారు?

మీరు నిరాశ చెందినప్పుడు, “పూర్వము జరిగిన ఆశ్చర్యకార్యములను” మరియు “యెహోవా చేసిన కార్యములను మనస్సునకు తెచ్చుకొనుట” మీకు ఎలా సహాయపడుతుంది? (కీర్తనలు 77:11). ఆ ఆశ్చర్యకార్యములలో కొన్ని కీర్తనలు 78 లో వివరించబడ్డాయి. మీరు వాటి గురించి చదివినప్పుడు, “[మీరు] దేవుని యందు నిరీక్షణ గలవారైయుండుటకు” (7వ వచనము) ఏమి సహాయపడుతుందో ధ్యానించండి.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఈ ఆదివారం నెలలో ఐదవ ఆదివారం కాబట్టి, “అనుబంధం బి: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట”లోని అభ్యాస కార్యకలాపాలను ఉపయోగించమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.

కీర్తనలు 51; 86:5, 13, 15

నేను తప్పు ఎంపిక చేసుకున్నప్పుడు, నేను మారడానికి యేసు సహాయం చేయగలరు.

  • 51వ కీర్తనలో పశ్చాత్తాపం గురించిన సత్యాలను కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయడానికి, మీరు పెద్ద హృదయాన్ని గీయవచ్చు. అప్పుడు సాతాను మనల్ని ప్రలోభపెట్టే చెడు విషయాలను హృదయంలో రాయడానికి మీ పిల్లలకు సహాయం చేయవచ్చు. ఈ విషయాలను మన హృదయాల నుండి ఎలా బయటకు తీయాలి? కీర్తనలు 51:10, 17లో “హృదయం” అనే పదాన్ని కనుగొనమని మీ పిల్లలను అడగండి. పశ్చాత్తాపం గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయో మాట్లాడండి. హృదయం లోపల ఉన్న పదాలను చెరిపివేసి, మనము పశ్చాత్తాపపడినప్పుడు యేసు మనల్ని మార్చగల మార్గాలను వివరించే కొత్త పదాలను మీ పిల్లలను వ్రాయనివ్వండి.

  • “విరిగి నలిగిన హృదయం” (కీర్తనలు 51:17) కలిగియుండడం అంటే ఏమిటో తెలుసుకోవడానికి మీరు మీ పిల్లలకు సహాయం చేయాలనుకోవచ్చు. వారు ఒకరి తరువాత ఒకరు గట్టి పెంకు గల ఒక గుడ్డు లేదా ఒక గింజ వంటి దానిని పగుల గొట్టి తెరవడం చేయవచ్చు. పరలోక తండ్రి యొక్క ప్రేమను మనం అనుభూతి చెందకుండా నిరోధించే వాటితో పెంకు‌ను పోల్చడానికి మీరు వారికి సహాయం చేయవచ్చు. ఆయనకు మన హృదయాలను మనము ఎలా తెరవగలము?

  • మీరు కలిసి రక్షకుని చిత్రాన్ని కూడా చూడవచ్చు మరియు ఆయనను వర్ణించడానికి వారు ఏ పదాలను ఉపయోగిస్తారని మీ పిల్లలను అడగవచ్చు. కీర్తనలు 86: 5, 13, 15లో ఆయనను వర్ణించే పదాలను కనుగొనడానికి వారిని ఆహ్వానించండి. ఆయన గురించి ఈ విషయాలను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము?

కీర్తనలు 61:2–3

యేసు క్రీస్తు నా కొండ.

  • మీ పిల్లలు కీర్తనలు 61:2–3లోని చిహ్నాల చిత్రాలను గీయడాన్ని ఆనందించవచ్చు. యేసు క్రీస్తు ఎత్తయిన “కొండ” (2వ వచనము), “ఆశ్రయము,” మరియు “బలమైన కోట” (3వ వచనము)గా ఎలా ఉన్నారు?

రాతితో నిర్మించిన కావలి బురుజు

“నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, బలమైన కోటగానుంటివి” (కీర్తనలు 61:3).

కీర్తనలు 66:16; 77:11; 78:6–7

“ప్రభువు యొక్క కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును”.

  • మీ పిల్లలకి ఇష్టమైన కొన్ని లేఖన కథలను పంచుకోమని అడగండి (Gospel Art Book [సువార్త కళా పుస్తకము]లోని చిత్రాలు సహాయపడవచ్చు). ఈ కథలు ప్రభువు గురించి మనకు ఏమి బోధిస్తాయి? మీరు కీర్తనలు 66:16 కలిసి చదివి, “ప్రభువు నా కొరకు చేసిన కార్యములేవి?” అనే ప్రశ్నకు వంతులవారీగా సమాధానమివ్వవచ్చు.

  • మీరు కీర్తనలు 77:11; 78:6–7 కలిసి చదివినప్పుడు, మీ జీవితంలో ఆయన చేసిన కార్యములతో సహా మీరు “ప్రభువు యొక్క కార్యములను మనస్సునకు తెచ్చుకోవడానికి” (కీర్తనలు 77:11) ఎలా ప్రయత్నిస్తున్నారో ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. “ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవడానికి” సంస్కారము మనకెలా సహాయపడుతుంది? (మొరోనై 4:3; 5:2).

కీర్తనలు 71:8

యేసు క్రీస్తు గురించి నేను ఇతరులకు చెప్పగలను.

  • మీ పిల్లలతో కలిసి కీర్తనలు 71:8 చదివిన తర్వాత, పెద్ద నోరు గీయమని వారిని ఆహ్వానించండి. యేసు క్రీస్తు గురించి మనం ఇతరులకు చెప్పగలిగే విషయాలను సూచించే చిత్రాలు లేదా పదాలతో నోటిని “నింపడం”లో మీకు సహాయం చేయమని వారిని అడగండి.

  • మీరు యేసు క్రీస్తు చిత్రాన్ని ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వవచ్చు. చిత్రాన్ని పట్టుకున్న వ్యక్తి ఆయన గురించి తనకు తెలిసిన ఒక విషయం చెప్పగలడు. ఈ విషయాలను తెలుసుకునేందుకు మనం ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు?

పిల్లలకు పంచుకోవడానికి చాలా విషయాలున్నాయి. “పిల్లలు ఏదైనా క్రొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు, సహజంగానే దానిని ఇతరులతో పంచుకోవాలని అనుకుంటారు. ఒకరికొకరు, వారి కుటుంబ సభ్యులకు మరియు వారి స్నేహితులకు సువార్త సూత్రాలను బోధించే అవకాశాలను పిల్లలకు ఇవ్వడం ద్వారా ఈ కోరికను ప్రోత్సహించండి. మీరు బోధిస్తున్న సూత్రాలకు సంబంధించి వారి ఆలోచనలు, భావాలు మరియు అనుభవాలను మీతో పంచుకోమని కూడా వారిని అడగండి. సరళమైన, స్వచ్ఛమైన మరియు శక్తివంతమైన అంతరార్థములను వారు కలిగియున్నారని మీరు కనుగొంటారు” (రక్షకుని విధానములో బోధించుట32).

కీర్తనలు 86:7

పరలోక తండ్రి నా ప్రార్థనలను ఆలకిస్తారు మరియు జవాబిస్తారు.

  • చాలా కీర్తనలు దేవునికి ప్రార్థనల వంటివి. మీరు మీ పిల్లలతో కీర్తనలు చదువుతున్నప్పుడు, దూరంగా ఉన్న వ్యక్తులతో సంభాషించడానికి మనము ఉపయోగించే ఫోను లేదా ఉత్తరం వంటి వాటిని మీరు వారికి చూపించవచ్చు. తర్వాత కీర్తనలు 86:7 చదవండి. పరలోక తండ్రికి మనం ఎలా “మొరపెట్టెదము”? ఆయన మనకు ఎలా జవాబిస్తారు?

  • సూసన్ హెచ్. పోర్టర్, “ప్రార్థించండి, ఆయన అక్కడ ఉన్నారు,” లియహోనా, మే 2024, 77–79 కూడా చూడండి. పరలోక తండ్రి మీ ప్రార్థనలకు జవాబిచ్చిన సమయాల గురించి ఒకరికొకరు చెప్పుకోండి.

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

యేసు యొక్క చిత్రము

Come unto Christ [క్రీస్తు యొద్దకు రండి], కేసి చైల్డ్స్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: నేను తప్పు ఎంపిక చేసుకున్నప్పుడు, నేను మారడానికి యేసు సహాయం చేయగలరు