2024 రండి, నన్ను అనుసరించండి
ఆగష్టు 10–16. “నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను”: యోబు 1–3; 12–14; 19; 21–24; 38–40; 42


“ఆగష్టు 10–16. ‘నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను’: యోబు 1–3; 12–14; 19; 21–24; 38–40; 42,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“ఆగష్టు 10–16. ‘నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

ఇతర వ్యక్తులతో చుట్టుముట్టబడిన యోబు

The Judgments of Job [యోబు గురించి తీర్పులు], జోసెఫ్ బ్రిక్కీ చేత

ఆగష్టు 10– 16: “నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను”

యోబు 1–3; 12–14; 19; 21–24; 38–40; 42

మంచివారికే ఎందుకు చెడు జరుగుతుందని—లేదా ఆ విషయానికొస్తే, చెడ్డవారికి ఎందుకు మంచి జరుగుతుందని ఆశ్చర్యపడడం సహజమే. న్యాయవంతుడైన దేవుడు దానిని ఎందుకు అనుమతిస్తాడు? యోబు గ్రంథము ఇటువంటి ప్రశ్నలను పరిశోధిస్తుంది. చాలా చెడు విషయాలు జరిగిన మంచి వ్యక్తులలో యోబు ఒకడు. యోబు శ్రమల కారణంగా, అతడు నిజంగా మంచివాడేనా అని అతని స్నేహితులు ఆశ్చర్యపడ్డారు. యోబు తన నీతియుక్తత గురించి స్థిరముగా చెప్పాడు మరియు దేవుడు నిజంగా అందరిపట్ల న్యాయవంతుడేనా అని ఆశ్చర్యపడ్డాడు. కానీ అతడు శ్రమించి, ఆశ్చర్యపడినప్పటికీ, యేసు క్రీస్తు నందు తన చిత్తశుద్ధిని, విశ్వాసాన్ని యోబు నిలుపుకున్నాడు. యోబు గ్రంథములో విశ్వాసము ప్రశ్నించబడి, పరీక్షించబడింది, కానీ ఎన్నడూ పూర్తిగా విడిచిపెట్టబడలేదు. దాని అర్థము, అన్ని ప్రశ్నలు జవాబివ్వబడ్డాయని కాదు. కానీ, అవి జవాబివ్వబడే వరకు, ప్రశ్నలు మరియు విశ్వాసము ఏకకాలంలో ఉంటాయని, ఈ మధ్యలో ఏమి జరిగినప్పటికీ, “నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను” (యోబు 13:15) అని మన ప్రభువు గురించి మనం చెప్పగలమని యోబు గ్రంథము బోధిస్తుంది.

యోబు గ్రంథమును సమీక్షించడానికి, లేఖన దీపికలో “యోబు” (సువార్త గ్రంథాలయము) చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

యోబు 1–3; 12–13

అన్ని పరిస్థితులందు నేను దేవుడిని నమ్మగలను.

యోబులోని మొదటి కొన్ని అధ్యాయాలు మన విరోధిగా లేదా నేరారోపకునిగా సాతాను పాత్రను కవితాత్మకంగా నొక్కి చెప్తాయి; అవి దేవుడు మరియు సాతాను మధ్య పరస్పర సంభాషణను వివరించవు. యోబు గురించి సాతాను చెప్పినదానిని (యోబు 1:9–11; 2:4–5 చూడండి) మీరు చదువుతున్నప్పుడు, “నేను దేవునిపట్ల ఎందుకు విశ్వాసంగా ఉండాలి?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. సాతాను సూచించిన కారణం మూలంగా మాత్రమే ప్రభువుపట్ల విధేయత చూపడం ఎందుకు ప్రమాదకరము?

అతని శ్రమల పట్ల యోబు స్పందన గురించి మిమ్మల్ని ఆకట్టుకునేది ఏది? (యోబు 1:20–22; 2:9–10 చూడండి).

దేవుడు అతడిని శిక్షిస్తున్నాడని యోబు స్నేహితులు సూచించారు (యోబు 4–5; 8; 11 చూడండి). ఈ ఆలోచనతో మీరు ఏ సమస్యలను చూస్తున్నారు? 12–13 అధ్యాయములలో యోబు స్పందనను చదవండి. నమ్మకంగా ఉండేందుకు అతనికి సహాయం చేసేలా దేవుని గురించి యోబుకు తెలిసినదేమిటి? సవాళ్ళను ఎదుర్కొనేందుకు మీకు సహాయపడేలా దేవుని గురించి మీకేమి తెలుసు?

యోబు 19

యేసు క్రీస్తు నా విమోచకుడు.

కొన్నిసార్లు మనం అత్యంత కష్టమైన సమయాల్లో అతి ముఖ్యమైన సత్యాలను నేర్చుకుంటాము. యోబు 19:1–22లో యోబు వివరించిన శ్రమలను మరియు 23–27 వచనములలో అతడు ప్రకటించిన సత్యాలను ధ్యానించండి. మీ విమోచకుడు సజీవుడని మీకెలా తెలుసు? మీ జీవితంలో ఈ జ్ఞానము ఏ ప్రత్యేకతను కలిగియున్నది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–12; 122 కూడా చూడండి.

యోబు 21–24

సెమినరీ చిహ్నము
“ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును.”

యోబు 21–24లో, మీరు యోబు మరియు అతని స్నేహితుల మధ్య జరిగిన చర్చను చదువుతారు. ఈ చర్చలో చాలా మంది జనులు అడిగిన ఒక ప్రశ్న ఉంది: నీతిమంతులు కొన్నిసార్లు ఎందుకు బాధపడతారు?

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తలో మనకు అన్ని సమాధానాలు లేనప్పటికీ, కష్టాలు మరియు బాధలను అర్థం చేసుకోవడానికి సహాయపడే కొన్ని సత్యాలను మనం కలిగియున్నాము. ఈ సత్యాలలో కొన్నింటిని కలిగియున్న కడవరి-దిన లేఖనాలు క్రింద ఉన్నాయి. పరలోక తండ్రి మరియు ఆయన ప్రణాళిక గురించి ఈ లేఖనాలు మీకు ఏమి బోధిస్తాయి?

మీరు అధ్యయనం చేసిన దాని ఆధారంగా, “నీతిమంతులు బాధపడడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు?” వంటి ప్రశ్నకు మీరు ఎలా సమాధానం చెప్పవచ్చు?

నక్షత్రాలు నిండిన ఆకాశం క్రింద మరొక వ్యక్తితో పడవలో ఉన్న యేసు

Calm and Stars [ప్రశాంతత మరియు నక్షత్రాలు], యాంగ్‌సుంగ్ కిమ్ చేత. havenlight.com వారి చిత్ర సౌజన్యం

యోబు 38–40; 42

దేవుని దృష్టికోణం నా దానికంటే గొప్పది.

తన స్నేహితుల నిందారోపణల చేత (యోబు 16:1–5; 19:1–3 చూడండి) నిరాశపరచబడి, తన కష్టం కొరకు వివరణను కోరుతూ యోబు మళ్ళీ మళ్ళీ దేవునికి మొరపెట్టాడు (యోబు 19:6–7; 23:1–931 చూడండి). యోబు గ్రంథంలో ప్రభువు స్పష్టమైన కారణం చెప్పలేదు. కానీ 38–40 అధ్యాయాలలో ఆయన ఒక ముఖ్యమైన సందేశాన్ని బోధించారు. ఆ సందేశమును మీరు ఎలా సంక్షిప్తపరచగలరు? ఉదాహరణకు, యోబు 38:1– 7, 18–24లో ప్రభువు యొక్క ప్రశ్నల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

ప్రభువు యోబుతో తాను సృష్టించిన వాటి గురించి మరియు ఇతర అద్భుత కార్యముల గురించి మాట్లాడినట్లు మీరు గమనించవచ్చు (యోబు 38–39 చూడండి). మీరు ఆ సృజనల‌లో కొన్నింటిని (లేదా వాటి చిత్రాలు) చూడవచ్చు. దేవుని గురించి, మీ శ్రమల గురించి భిన్నంగా ఆలోచించడంలో ఈ విషయాలు మీకు ఎలా సహాయపడతాయి? అవి యోబు దృష్టికోణాన్ని ఎలా మార్చాయి? (యోబు 42:1–6 చూడండి; మోషే 1:8–10 కూడా చూడండి).

మన దృష్టికోణాన్ని మార్చడంలో సహాయపడే రెండు సర్వసభ్య సమావేశ సందేశాలు ఇక్కడ ఉన్నాయి: తమారా డబ్ల్యు. రూనియా, “దేవుని పిల్లల నిత్య గుర్తింపు ద్వారా దేవుని కుటుంబాన్ని చూడడం” (లియహోనా, నవ. 2023, 62–69); రస్సెల్ ఎమ్. నెల్సన్, “సిలెస్టియల్‌గా ఆలోచించండి!లియహోనా, నవ. 2023, 117–20). ఏ సందేశంలోనైనా, తదుపరిసారి మీ శ్రమలు ఎక్కువగా అనిపించినప్పుడు మీరు గుర్తుంచుకోవాలనుకునే దాని కోసం చూడండి. మీరు నేర్చుకున్న వాటిని మీరెలా గుర్తు చేసుకుంటారు?

సృజనాత్మకంగా ఉండండి. నేర్చుకోవడం అనేది చదవడం, ఆలోచించడం మరియు మాట్లాడడాన్ని మాత్రమే కలిగి ఉండవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు గుర్తుంచుకోదగిన అభ్యాసం భౌతికంగా చురుకైన మార్గాల్లో వస్తుంది. ఉదాహరణకు, యోబు 38-40లో ప్రభువు యోబు దృక్పథాన్ని ఎలా మార్చారనే దాని గురించి మీరు చదివినప్పుడు, మీరు కాలినడకన వెళ్లి, ప్రభువు సృష్టించిన పెద్ద మరియు చిన్న వాటిలో కొన్నింటిని చూడవచ్చు. లేదా మీరు వివిధ దృక్కోణాల నుండి ఒక వస్తువును చూడవచ్చు—పై నుండి, క్రింద నుండి, దగ్గరగా, దూరంగా, మొదలైనవి.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

యోబు 1–2; 1219

కష్ట సమయాల్లో యేసు క్రీస్తుపై విశ్వాసం నాకు సహాయం చేస్తుంది.

  • యోబు గురించి వారికి ఏమి తెలుసో చెప్పమని మీ పిల్లలను ప్రోత్సహించండి. వారికి సహాయం కావాలంటే, మీరు వారికి యోబు 1:1, 13–22; 2:7–10 లేదా (పాత నిబంధన కథలు, 145-47లో) “యోబు” చూపించవచ్చు. సవాళ్లకు యోబు ఎలా స్పందించాడు? (యోబు 1:21; 2:10 చూడండి).

    1:55

    Job

  • ప్రభువు గురించి అతనికి తెలిసిన దానిని బట్టి యోబు తన సవాళ్లలో విశ్వాసపాత్రంగా ఉన్నాడు. బహుశా మీరు మరియు మీ పిల్లలు యేసు క్రీస్తు ఇతరులతో సంభాషిస్తున్న చిత్రాలను చూడవచ్చు (క్రింద ఉన్నటువంటిది లేదా Gospel Art Book [సువార్త కళా పుస్తకము]లోని చిత్రాలు వంటివి). ఆయన గురించి మీకు తెలిసిన దాని గురించి మరియు ఆయన ఎలా ఉంటారనే దాని గురించి మాట్లాడండి. ప్రభువు గురించి యోబుకు ఏమి తెలుసు అని చూపించే కొన్ని వచనాలు ఇక్కడ ఉన్నాయి: యోబు 12:10, 13, 16; 19:25–27. ఆయన గురించి ఈ విషయాలు తెలుసుకోవడం ఎందుకు విలువైనది?

ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి సమీపిస్తున్న యేసు

He Healed Them All [ఆయన వారందరినీ స్వస్థపరచెను], మైఖేల్ మామ్ చేత

యోబు 14:14.

యేసు క్రీస్తు వలన, నేను చనిపోయిన తరువాత కూడా తిరిగి జీవిస్తాను.

  • యోబు 14:14లో యోబు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. బహుశా మీరు మరియు మీ పిల్లలు యోబుకు ఎలా సమాధానం చెప్పాలో వంతులవారీగా పంచుకోవచ్చు. ఆల్మా 11:42–44లో మీరు ఉపాయముల కొరకు చూడవచ్చు.

1:11

#BECAUSEofHIM: An Easter Message of Hope and Triumph

యోబు 16:1–5; 22:5

మంచి స్నేహితులు ఒకరినొకరు ఉద్ధరిస్తారు మరియు ప్రోత్సహిస్తారు.

  • యోబు విచారంగా ఉన్నప్పుడు, అతని స్నేహితులు అతను పాపం చేసినందున దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడని చెప్పారు (యోబు 22:5 చూడండి). మనం యోబు స్నేహితులమైతే, అతనికి సహాయం చేయడానికి మనమెలా ప్రయత్నిస్తాం? విచారంలో ఉన్న ఇతరులకు మన మాటలు ఎలా సహాయపడగలవు? (యోబు 16:5 చూడండి). మీరు ఈ ప్రశ్నలను చర్చించేటప్పుడు ఈ నమూనా‌లో ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చిత్రాలను చూపించడాన్ని పరిగణించండి.

  • మంచి స్నేహితుని యొక్క కొన్ని లక్షణాలను జాబితా చేయమని మరియు ఈ లక్షణాలను కలిగి ఉన్న స్నేహితుని పేరు చెప్పమని మీ పిల్లలను అడగండి. తర్వాత మీరు యేసు క్రీస్తు చిత్రాన్ని చూడవచ్చు. యేసు మనలో ప్రతీ ఒక్కరికి ఏయే విధాలుగా మంచి స్నేహితుడు? మీరు కష్టకాలంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆలోచించవచ్చు. మీరు వారికి క్రీస్తులాంటి స్నేహితునిగా ఎలా ఉంటారో ప్రణాళిక చేయండి.

యోబు 19:23–27

యేసు క్రీస్తు నా విమోచకుడు.

  • యోబు 19:23–27 చదివిన తర్వాత, మన విమోచకుడు సజీవుడని మీకెలా తెలుసనే దాని గురించి మీరు మరియు మీ పిల్లలు మాట్లాడవచ్చు. ఒక పుస్తకములో మీ సాక్ష్యమును (లేదా రక్షకుని చిత్రాలు) పెట్టడానికి మీరు కలిసి పనిచేయవచ్చు (23వ వచనము చూడండి).

  • యేసు క్రీస్తు సజీవుడని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము?

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ఇతర వ్యక్తులతో చుట్టుముట్టబడిన యోబు

Job and His Friends [యోబు మరియు అతని స్నేహితులు], ఇల్యా రెపిన్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: యేసు క్రీస్తు నా విమోచకుడు