“ఆగష్టు 3–9. ‘నీవు ఈ సమయమును బట్టియే … వచ్చితివేమో’: ఎస్తేరు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“ఆగష్టు 3–9. ‘నీవు ఈ సమయమును బట్టియే … వచ్చితివేమో,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
Queen Esther Saves Jehovah’s People [ఎస్తేరు రాణి యెహోవా జనులను కాపాడును], శామ్ లాలర్ చేత
ఆగష్టు 3–9: “నీవు ఈ సమయమును బట్టియే … వచ్చితివేమో”
ఎస్తేరు
ఎస్తేరు గ్రంథములో అనేక సంఘటనలు అదృష్టముగా లేదా యాదృచ్ఛికంగా కనబడతాయి. ఒక అనాథయైన యూదా అమ్మాయి, తన జనులు వధింపబడకుండా రక్షించడానికి తగిన సమయంలో పర్షియా రాణిగా ఎలా మారిందని ఇంకేవిధంగా మీరు వివరిస్తారు? రాజును హత్య చేయడానికి పన్నిన కుట్రను వినడానికి ఎస్తేరు బంధువైన మొర్దకైకు కలిగిన అవకాశములేవి? ఇవి యాదృచ్ఛికములా లేదా దైవిక ప్రణాళికలో భాగమా? ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్ ఇలా గమనించారు: “యాదృచ్ఛికంగా కనబడే ఒక అవకాశం, వాస్తవానికి పరలోకమందున్న తండ్రిచేత పర్యవేక్షించబడింది. … మన జీవితాల యొక్క చిన్న వివరాలలో ప్రభువు యొక్క ప్రభావమును మనం చూడవచ్చును” (“దైవిక రూపకల్పన చేత,” లియహోనా, నవ. 2017, 56). ఈ “చిన్న వివరాలలో” ప్రభువు యొక్క ప్రభావమును మనము ఎల్లప్పుడూ గుర్తించలేకపోవచ్చు. కానీ, ఆయన ఉద్దేశ్యములను నెరవేర్చడానికి ఆయన హస్తములలో మనము సాధనములు కాగలిగినప్పుడు, ఆయన మన మార్గమును నడిపించి “ఈ సమయమును బట్టి” (ఎస్తేరు 4:14) మనల్ని సిద్ధపరచగలరని ఎస్తేరు అనుభవం నుండి మనం నేర్చుకుంటాము.
ఎస్తేరు గ్రంథమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “ఎస్తేరు గ్రంథము” చూడండి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
ఎస్తేరు
నేను ఇతరులను ఆశీర్వదించగల పరిస్థితులలో ప్రభువు నన్ను ఉంచుతారు.
మనలో ప్రతీ ఒక్కరం “ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో నిలబడి, [మనము] మాత్రమే చేయగల ముఖ్యమైన పనిని కలిగి ఉన్నామని అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ బోధించారు. … ప్రభువు మీ బాధ్యతలను మీకు అప్పగించడానికి ఒక కారణం ఉంది. మీరు మాత్రమే చేరుకోగలిగే, స్పృశించగలిగే వ్యక్తులు మరియు హృదయాలు ఉండవచ్చు. బహుశా మరెవరూ అదే విధంగా చేయలేకపోవచ్చు” (“Lift Where You Stand,” Liahona, Nov. 2008, 56).
ఎస్తేరు యొక్క కథను మీరు చదివినప్పుడు, ఈ వ్యాఖ్యానము ఆమెకు ఎలా అన్వయించబడుతుందో ధ్యానించండి. యూదులను రక్షించడానికి ప్రభువు ఆమెకు సాధ్యపరచిన విధానాల కొరకు చూడండి (ఉదాహరణకు, ఎస్తేరు 2:21–23; 3:10–14; 4:14–16 చూడండి). తరువాత ఇతరులను ఆశీర్వదించే అవకాశాలను ఆయన మీకు ఎలా ఇచ్చారో ధ్యానించండి. “ఈ సమయమును బట్టి” ఆయన మీకు మార్గనిర్దేశం చేసిన కొన్ని పరిస్థితులు లేదా సంబంధాలు ఏవి? (ఎస్తేరు 4:14). మీరు గోత్రజనకుని దీవెనను కలిగియుంటే, మీరు చేయడానికి ప్రభువు కలిగియున్న కార్యము గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి దానిని చదవడాన్ని పరిగణించండి. ఈ కార్యమును సాధించడానికి మీరేమి చేయగలరు?
ChurchofJesusChrist.org
For Such a Time as This
వినడం కంటే చేయడం ద్వారా మనం ఎక్కువగా నేర్చుకుంటాము. బోధకులకు ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా సలహా ఇచ్చారు: “మన ఉద్దేశ్యం ‘నేను వారికి ఏమి చెప్పగలను?’ అని ఉండకూడదు. బదులుగా, మనల్ని మనం అడుగవలసిన ప్రశ్నలు ఏమిటంటే, ‘నేను వారిని ఏమి చేయమని ఆహ్వానించగలను? వారు ప్రతిస్పందించడానికి ఇష్టపడితే, వారి జీవితాలలోకి పరిశుద్ధాత్మను ఆహ్వానించడాన్ని ప్రారంభించే ఏ ప్రేరేపిత ప్రశ్నలను నేను అడుగగలను?’” (రక్షకుని విధానములో బోధించుట, 25లో). ఎస్తేరు గురించి మీరు మీ కుటుంబానికి లేదా ఒక తరగతికి బోధిస్తున్నట్లయితే, వారు నేర్చుకోవడంలో సహాయపడడానికి మీరు వారిని ఏమి చేయమని అడగవచ్చు?
“మొర్దకై వంగకయు … నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించెను ” (ఎస్తేరు 3:5).
ఎస్తేరు 3; 5:9–14; 7
గర్వము, కోపము నాశనానికి దారితీయగలవు.
ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు, మొర్దకై యొక్క విశ్వాసము నుండి, అదేవిధంగా హామాను యొక్క గర్వము, కోపము నుండి మనము నేర్చుకుంటాము. ఎస్తేరు 3; 5:9–14 మీరు చదివినప్పుడు, హామాను యొక్క భావనలు, మాటలు మరియు క్రియలను గమనించండి. అతడు మరియు అతడి ప్రేరణలను గూర్చి అవి ఏమి తెలియజేస్తాయి? అతడు ఎదుర్కొన్న పర్యవసానములు ఏమిటి? (ఎస్తేరు 7 చూడండి). హామాను గురించి చదవడం, మీ భావాలను మరియు క్రియలను ఏది ప్రేరేపిస్తుందో నిర్ధారించుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఏవైనా మార్పులు చేయడానికి మీరు ప్రేరేపించబడ్డారా? సహాయము కొరకు మీరు పరలోక తండ్రి తట్టు ఎలా తిరుగగలరు?
సామెతలు 16:32; ఆల్మా 5:28 కూడా చూడండి.
ఎస్తేరు 3–4; 5:2–3; 8:11–12
ఉపవాసం నేను ప్రభువును నమ్ముతున్నాను మరియు ఆయనపై ఆధారపడతాను అని చూపిస్తుంది.
ఎస్తేరు మరియు మిగిలిన యూదులు ఎందుకు ఉపవాసముండాలని నిర్ణయించుకున్నారో గమనించండి (ఎస్తేరు 3:13; 4:1–3, 10–17 చూడండి). ఉపవాసము వారిని ఎలా దీవించింది? (ఎస్తేరు 5:2–3; 8:11–12 చూడండి). ఉపవాసముండమని ప్రభువు మనల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరు ఉపవాసాన్ని మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదంగా ఎలా చేసుకోవచ్చో పరిగణించండి.
యెషయా 58:6–12 కూడా చూడండి.ChurchofJesusChrist.org
Fasting: Young Single Adult Ward, Amanda
ఎస్తేరు 3:1–11; 4:10–17; 5:1–4; 9:17–19
సరైన దానిని చేయడానికి తరచుగా గొప్ప ధైర్యము అవసరము.
మొర్దకై మరియు ఎస్తేరు వారి నమ్మకాల కొరకు నిలబడినప్పుడు, వారు తమ జీవితాలను అపాయంలో పడవేసుకున్నారు. మన ఎంపికలు తక్కువ తీవ్రమైన పరిణామాలను కలిగియుండవచ్చు, కానీ సరైన దానిని చేయడానికి ఇంకను ధైర్యము అవసరము కావచ్చు. సరైన దానిని చేయడానికి ధైర్యము కలిగియుండుట గురించి ఎస్తేరు 3:1–4; 4:10–17 నుండి మీరేమి నేర్చుకుంటారు? ధైర్యము చూపించిన తరువాత మొర్దకై మరియు ఎస్తేరు అనుభవించిన భిన్నమైన పరిణామాలను గమనించండి (ఎస్తేరు 3:5–11; 5:1–4 చూడండి). వారు చేసిన ఎంపికలను చేయడానికి ఎస్తేరు మరియు మొర్దకై దేవుని గురించి ఏమి తెలుసుకోవాలి?
సరైనదాని కోసం నిలబడడానికి మీకు ధైర్యం అవసరమయ్యే పరిస్థితుల గురించి ఆలోచించండి. ప్రభువు నందు ధైర్యాన్ని కనుగొనడంలో మీకు సహాయపడేలా ఎస్తేరు మరియు మొర్దకై నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
ఎస్తేరు యొక్క ధైర్యం “శుభదినానికి” దారితీసింది (ఎస్తేరు 9:17-19 చూడండి). క్రీస్తులాంటి ధైర్యం మీకు ఎలా “శుభదినాన్ని” ఇచ్చింది?
Courage
Dare to Stand Alone
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
ఎస్తేరు 2:5–7
నేను నా కుటుంబానికి సేవ చేయగలను.
-
ఎస్తేరు కోసం మొర్దకై చేసినట్లుగా, అవసరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సహాయం చేయడం గురించి మీ పిల్లలకు బోధించడానికి ఎస్తేరు 2:7 ను ఉపయోగించమని మీరు ప్రేరేపించబడవచ్చు. మీరు వచనాన్ని కలిసి చదవవచ్చు లేదా మీ స్వంత మాటలలో సంక్షిప్తపరచవచ్చు. అప్పుడు మీరు మరియు మీ పిల్లలు మీ సహాయం అవసరమయ్యే కుటుంబ సభ్యుల గురించి ఆలోచించవచ్చు. వారికి సహాయపడడానికి ఒక ప్రణాళిక చేయండి.
ఎస్తేరు 3:1–11; 4:10–17
ధైర్యంగా ఉండేందుకు ప్రభువు నాకు సహాయం చేయగలరు.
-
ధైర్యం అంటే మీరు భయపడినప్పుడు కూడా సరైనది చేయడం అని మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి ఎస్తేరు మరియు మొర్దకై ఉదాహరణలు సహాయపడగలవు. మొర్దకై … అతడు ధైర్యంగా ఉన్నాడు మరియు ఎస్తేరు … ఆమె ధైర్యంగా ఉంది అనే వాక్యభాగాలను వ్రాయడాన్ని పరిగణించండి. మీరు కలిసి ఎస్తేరు కథను నేర్చుకున్నప్పుడు, మీ పిల్లలు ఈ వాక్యాలను పూర్తి చేయడానికి మార్గాలను సూచించవచ్చు. మీరు ఎస్తేరు 3:1–11; 4:10–17 లేదా (పాత నిబంధన కథలు, 166–70లో) “ఎస్తేరు రాణి” చదవవచ్చు లేదా ఈ నమూనాలోని చిత్రాలు చూడవచ్చు. అప్పుడు … చేత నేను ధైర్యంగా ఉంటాను అని వ్రాసి, ధైర్యం అవసరమయ్యేవి వారు చేయాలని పరలోక తండ్రి కోరుకునే విషయాలను జాబితా చేయడానికి మీ పిల్లల్ని ఆహ్వానించండి.
2:45Queen Esther
-
యేసు క్రీస్తు ధైర్యంగా ఉన్న సమయాల గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు—ఉదాహరణకు, గెత్సెమనేలో మరియు సిలువపై మన పాపాల కోసం ఆయన బాధలు అనుభవించినప్పుడు (మత్తయి 26:36–39; 27:33–35 చూడండి). మీ పిల్లలు ధైర్యంగా ఉన్న సమయాన్ని పంచుకోమని అడగండి మరియు మీ స్వంత అనుభవాలను కూడా పంచుకోండి.
ఎస్తేరు 4:1–3, 10–17
ఉపవాసము ప్రభువు యొక్క దీవెనలను తెస్తుంది.
-
ఎస్తేరు 4:1–3, 10–17 చదవడం మీ పిల్లలకు ఉపవాసం గురించి నేర్పించడానికి మీకు సహాయపడగలదు. ఎస్తేరు మరియు యూదులు ఎందుకు ఉపవాసం చేశారు? మీరు ఎందుకు ఉపవాసం చేస్తారో మీ పిల్లలకు చెప్పండి. ఇంతకు ముందెన్నడూ ఉపవాసం చేయని స్నేహితుడికి దాని గురించి ఎలా వివరిస్తారని కూడా మీరు వారిని అడగవచ్చు. ఉపవాసం వల్ల కలిగే ఆశీర్వాదాలను అర్థం చేసుకోవడానికి మన స్నేహితులకు మనం ఎలా సహాయం చేయవచ్చు?
-
మీ పిల్లలకు ప్రభువు సహాయం అవసరమయ్యే దాని గురించి ఆలోచించమని వారిని ప్రోత్సహించండి. తదుపరి ఉపవాస ఆదివారం వారు దానిని తమ ఉపవాసంలో భాగంగా చేసుకోవాలని సూచించండి.
ఎస్తేరు ధైర్యవంతురాలు కాబట్టి, ఆమె ప్రభువు యొక్క జనులను కాపాడగలిగింది.
ఎస్తేరు 4:14
నేను దేవుని హస్తములలో సాధనముగా ఉండగలను.
-
ఎస్తేరు భయపడినప్పుడు, “ఈ సమయమును బట్టియే” (ఎస్తేరు 4:14) రాణిగా ఉండడానికి ప్రభువు ఆమెకు సహాయం చేసాడని వివరించడం ద్వారా మొర్దకై ఆమెను ప్రోత్సహించాడని అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడండి. దీని ద్వారా మొర్దకై ఏమి చెప్తున్నాడు? ఎస్తేరు ప్రభువు కొరకు ఎలా ఒక సాధనంగా ఉందో ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మనం ప్రభువు కొరకు ఎలా ఒక సాధనంగా ఉండగలం?
-
సాధనం అంటే ఏమిటో మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి మీరు ఎలా సహాయపడగలరు? బహుశా మీరు సంగీత వాయిద్యంపై పాటను వాయించడానికి ఎవరినైనా ఆహ్వానించవచ్చు లేదా ఒక సాధనాన్ని ఉపయోగిస్తున్న వారి చిత్రాన్ని చూపించవచ్చు. అప్పుడు మీరు దేవుని చేతుల్లో ఒక సాధనంగా ఉండడం అంటే ఏమిటో మాట్లాడవచ్చు.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.