“ఆగష్టు 31–సెప్టెంబరు 6. ‘సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక’: కీర్తనలు 102–103; 110; 116–119; 127–128; 135–139; 146–150,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“ఆగష్టు 31–సెప్టెంబరు 6. ‘సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
Reverential Return [భక్తిగల పునరాగమనము], కెల్సీ మరియు జెస్సీ లైట్‌వీవ్ చేత
ఆగష్టు 31–సెప్టెంబరు 6: “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక”
కీర్తనలు 102–103; 110; 116–119; 127–128; 135–139; 146–150
కీర్తనల గ్రంథానికి సనాతన యూదుల నామము తెహిల్లిమ్ అనే హెబ్రీ పదము, దాని అర్థము “స్తుతులు.” ఇది హల్లెలూయా (దానర్థము “యెహోవాను స్తుతించు” లేదా “ప్రభువును స్తుతించు”) కేకకు సంబంధించినది. కీర్తనల ముఖ్య సందేశాన్ని ఒక్క పదములో మీరు చెప్పవలసినట్లయితే, స్తుతించు అనునది మంచి ఎంపికవుతుంది. కీర్తనలలో కొన్ని “యెహోవాను స్తుతించుడి” (ప్రత్యేకించి, కీర్తనలు 146–50 చూడండి) అనే తిన్నని ఆహ్వానాన్ని కలిగియుంటాయి మరియు అవన్నీ ఆరాధన, స్తుతి యొక్క భావనను ప్రేరేపించగలవు. ప్రభువు యొక్క శక్తి, ఆయన కనికరము మరియు ఆయన చేసిన గొప్ప పనులపై కేంద్రీకరించమని కీర్తనలు మనల్ని ఆహ్వానిస్తాయి. వీటిలో దేనికొరకు మనము ఆయనకు ఎన్నడూ తిరిగి చెల్లించలేము, కానీ మనము ఆయనను స్తుతించగలము. ఆ స్తుతి వివిధ వ్యక్తుల కొరకు వివిధ రూపాలలో ఉండవచ్చు—అది పాడుట, ప్రార్థించుట లేదా సాక్ష్యమిచ్చుటను కలిపియుండవచ్చు. అది తరచు ప్రభువుకు మరియు ఆయన బోధనలను అనుసరించుటకు లోతైన నిబద్ధతకు దారితీస్తుంది. మీ జీవితంలో “యెహోవాను స్తుతించుడి” అనగా అర్థమేమైనప్పటికీ, మీరు కీర్తనలను చదివి ధ్యానిస్తున్నప్పుడు, వాటిని చేయాలని మీరు మరింత ప్రేరణను పొందగలరు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
కీర్తనలు 102–3; 116
నా బాధలో ప్రభువు నన్ను ఓదార్చగలరు.
సవాళ్ళలో తరచు కలిగే ఆతురత మరియు ఒంటరితనము యొక్క భావాలను కీర్తనలు 102:1–11 ఎలా వివరిస్తాయో గమనించండి. బహుశా మీరు లేదా మీకు తెలిసిన ఇతరులు అలాంటి భావాలను అనుభవించి ఉండవచ్చు. మీరు కీర్తనలు 102:12–28; 103; 116 చదువుతున్నప్పుడు, మీ శ్రమలలో మీరు “యెహోవా నామమున ప్రార్థన చేయగలరు” (కీర్తనలు 116:13) అనే నమ్మకాన్ని మీకిచ్చే వాక్యభాగాల కొరకు చూడండి. ఆయన యందు మీకు నిరీక్షణనిచ్చే వాక్యభాగాలను గుర్తించాలని, కంఠస్థం చేయాలని లేదా ఇతరులతో పంచుకోవాలని మీరు కోరవచ్చు.
యెషయా 25:8; హెబ్రీయులకు 2:17–18; ఆల్మా 7:11–13; కెమిలి ఎన్. జాన్సన్, “క్రీస్తే ఉపశమనం,” లియహోనా, మే 2023, 81–83 కూడా చూడండి.
కార్ల్ హీన్రిచ్ బ్లాచ్ (1834-1890), Christ Healing the Sick at Bethesda [బేతెస్ద వద్ద రోగులను స్వస్థపరుస్తున్న యేసు], 1883, ఆయిల్ ఆన్ కాన్వాస్, 100 ¾ x 125 ½ అంగుళాలు. బ్రిగమ్ యంగ్ యూనివర్శిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, జాక్ ఆర్. మరియు మేరీ లోయిస్ వీట్లీ అందించిన నిధులతో కొనుగోలు చేయబడింది, 2001.
కీర్తనలు 110; 118
యేసు క్రీస్తు కీర్తనల నుండి ప్రవచనాలను నెరవేర్చారు.
యేసు క్రీస్తు యొక్క జీవితము మరియు పరిచర్య వైపు దారిచూపే వాక్యభాగాలను కీర్తనలు కలిగియున్నాయి. ఇక్కడ కొన్ని మాదిరులున్నాయి:
-
కీర్తనలు 110:1–4 (మత్తయి 22:41–45; హెబ్రీయులకు 5:4–10; 6:20 చూడండి)
-
కీర్తనలు 118:22 (మత్తయి 21:42; అపొస్తలుల కార్యములు 4:10–11; 1 పేతురు 2:7 చూడండి)
-
కీర్తనలు 118:25–26 (మత్తయి 21:9 చూడండి)
యేసు క్రీస్తు గురించి ఈ వచనాలు మీకు ఏమి బోధిస్తాయి? ఆయన గురించి దీనిని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము?
కీర్తనలు 119
దేవుని వాక్యము నన్ను ఆయన త్రోవలో నిలుపుతుంది.
మన జీవితాలను పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళే ప్రయాణంతో పోల్చే అనేక వాక్యభాగాలను కీర్తనలు 119 కలిగియుంది. మీరు చదువుతున్నప్పుడు, “నడుచుకొను,” “త్రోవ,” “మార్గము,” “పాదము,” మరియు “తిరుగుట” వంటి పదాల కొరకు చూడండి. మీరెక్కడ ఉండేవారు, ఇప్పుడు మీరెక్కడ ఉన్నారు మరియు మీరు ఏ వైపు కొనసాగుతున్నారు అని మీ స్వీయ జీవన గమనాన్ని ధ్యానించండి. ఇంటికి తిరిగి వెళ్ళే మీ ప్రయాణం గురించి ఈ కీర్తన నుండి మీరేమి నేర్చుకుంటారు? ఇతరుల మార్గాలను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు? ఈ కీర్తన ప్రకారము,ఆయన దారిలో నిలిచేందుకు మీకు సహాయపడడానికి దేవుడు ఏమి సమకూర్చారు?
మార్గాన్ని లేదా భౌగోళిక పటాన్ని అనుసరించడం మీరు ఎక్కడికైనా విజయవంతంగా ప్రయాణించడంలో సహాయపడిన సమయం గురించి ఆలోచించండి. దేవుని మార్గాన్ని అనుసరించడం గురించి ఆ అనుభవం మీకు ఏమి బోధిస్తుంది?
అనేక ఇతర లేఖనాలలో, ప్రభువు మరియు ఆయన ప్రవక్తలు ఒక మార్గం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ వచనాలను శోధించడం మరియు మీరు నేర్చుకున్న వాటిని వ్రాయడం లేదా ఇతరులతో పంచుకోవడం వంటివాటిని పరిగణించండి.
|
లేఖనము |
దేవుని వద్దకు వెళ్ళే మార్గం గురించి నేనేమి నేర్చుకుంటాను |
|---|---|
లేఖనము సామెతలు 4:11–19 | |
లేఖనము మత్తయి 7:13–14 | |
లేఖనము | |
లేఖనము | |
లేఖనము | |
లేఖనము |
దేవుని మార్గంలో ఉండేందుకు ఈ సత్యాలు మీకు ఎలా సహాయపడగలవు?
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి ఈ క్రింది సలహా నుండి మీరు ఏ అదనపు అంతర్దృష్టులను నేర్చుకోవచ్చు?
“జీవితంలో మన ప్రయాణం విజయవంతం కావాలంటే, మనం దైవిక నిర్దేశాన్ని అనుసరించాలి. ‘ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36] అని ప్రభువు చెప్పారు. మరియు కీర్తనాకారుడు ఇలా వ్రాసాడు, ‘నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది’ [కీర్తనలు 119:105]. …
“జీవితంలో మీ ప్రయాణంలో, మీరు చాలా అడ్డంకులను ఎదుర్కొంటారు మరియు కొన్ని తప్పులు చేస్తారు. లోపాన్ని గుర్తించి అవసరమైన దిద్దుబాటు చేయడానికి లేఖనాధారమైన మార్గదర్శకత్వం మీకు సహాయం చేస్తుంది. మీరు తప్పు దిశలో వెళ్లడం మానేస్తారు. మీరు లేఖనాధారమైన మార్గాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు. అప్పుడు మీరు ‘నిత్యజీవమునకు నడిపించు తిన్నని, ఇరుకైన మార్గమందు’ [2 నీఫై 31:18] ప్రవేశించడానికి అవసరమైన పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణతో కొనసాగుతారు” (“Living by Scriptural Guidance,” Ensign, Nov. 2000, 17).
డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “తప్పిపోయినవాడు మరియు ఇంటికి నడిపించే మార్గము,” లియహోనా, నవ. 2023, 86-88 కూడా చూడండి.
కీర్తనలు 134–36
ప్రభువు సకల విగ్రహముల కంటే అధిక శక్తిమంతుడు.
కీర్తనలు 135:15–18 ప్రకారము, అబద్ధ దేవుళ్ళను నమ్మడం ఎందుకు అవివేకము అనేదానిని గమనించండి. విగ్రహాలను పోలియున్న దేనియందు నమ్మకముంచుటకు మీరు శోధింపబడవచ్చు? కీర్తనలు 134–36లో కీర్తనాకారులు చేసినట్లు, ప్రభువు చేయగల విషయాలను మీరు జాబితా చేయవచ్చు. ఆయన మీ కొరకు చేసిన శక్తివంతమైన విషయములేవి?
కీర్తనలు 139
ప్రభువుకు నా మనస్సు తెలుసు.
ప్రభువుకు మీ గురించి—మీ ఆలోచనలు మరియు చర్యలు, బలాలు మరియు బలహీనతల గురించి తెలుసునని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడేలా కీర్తనలు 139లో మీరు ఏమి కనుగొంటారు? ఈ సత్యము మీ జీవితమును, మీ ఎంపికలను ఎలా ప్రభావితం చేస్తుంది?
కీర్తనలు 146–50
“యెహోవాను స్తుతించుడి.”
ఈ చివరి స్తుతి కీర్తనలను మీరు చదువుతున్నప్పుడు, ప్రభువును స్తుతించడానికి మీకు గల కారణాలను గురించి ఆలోచించండి. ఆయనను స్తుతించుట ఎందుకు ముఖ్యమైనది? మీరు ఆయనను స్తుతించగల కొన్ని విధానాలేవి?
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
కీర్తనలు 102:1–2.
ప్రభువు నన్ను ఓదార్చుతారు మరియు నాకు నిరీక్షణనిస్తారు.
-
మన కష్టాల్లో ప్రభువు మనకు ఎలా సహాయం చేస్తారనే దాని కొరకు చూస్తూ, మీరు లేదా మీ పిల్లలలో ఒకరు కీర్తనలు 102:1–2 చదవగలరు. ఆయన సహాయాన్ని మనం ఎలా కనుగొనగలము? మీకు సహాయం అవసరమైనప్పుడు దేవుడు మీ ప్రార్థనలు విన్నారని భావించిన సమయాలను కూడా మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.
కీర్తనలు 119:105
దేవుని వాక్యము వెలుగు వంటిది.
-
చీకటిలో ఉండటం ఎలా ఉంటుందనే దాని గురించి మీ పిల్లలు సరదాగా మాట్లాడవచ్చు. లేదా చీకట్లో చేయడం కష్టమైన విషయాల గురించి చర్చించుకోవచ్చు. కళ్ళు మూసుకుని చిత్రాన్ని గీయడం వంటివి చేయమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. వెలుగు మరియు దేవుని వాక్యం గురించి కీర్తనలు 119:105 నుండి మనం ఏమి నేర్చుకుంటాము?
-
ఈ క్రింది వచనాలలో, ఆయన మార్గంలో ఉండేందుకు మనకు సహాయం చేయడానికి పరలోక తండ్రి మనకు ఇచ్చిన వాటి కోసం వెదకండి: కీర్తనలు 119:47–48; 119:105; 1 నీఫై 11:25; 2 నీఫై 31:20. దేవుని మార్గంలో ఉండేందుకు మనం ఏమి చేయగలము?
-
మీ పిల్లలు కీర్తనలు 119:105లో పేర్కొన్న విషయాల చిత్రాలను చూసి ఆనందించవచ్చు. వారు వచనాన్ని చదివేటప్పుడు చిత్రాలను క్రమంలో ఉంచవచ్చు.
కీర్తనలు 139:1–3, 23–24
పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నన్ను ఎరిగియున్నారు మరియు నన్ను ప్రేమిస్తున్నారు.
-
మీ పిల్లలలో ప్రతీ ఒక్కరి గురించి మీకు తెలిసిన విషయాల యొక్క చిన్న జాబితాలను రూపొందించండి. మీరు జాబితాలను ఒక్కొక్కటిగా చదివేటప్పుడు, మీరు ఎవరిని వివరిస్తున్నారో ఊహించమని పిల్లలను అడగండి. తర్వాత, కీర్తనలు 139:1–3ని కలిసి చదివిన తర్వాత, పరలోక తండ్రికి మరియు యేసుకు మన గురించి తెలిసిన విషయాలను మీరు జాబితా చేయవచ్చు.
-
కీర్తనలు 139:23–24లోని పదాలను ఒక కాగితంపై లేదా బోర్డుపై రాయండి. దేవుడు మన కోసం చేయగలిగిన వాటిని వివరించే పదాల క్రింద గీత గీయడానికి మీ పిల్లలను ఆహ్వానించండి. దేవుడు ఈ పనులు చేయాలని మనం ఎందుకు కోరుకుంటున్నాము?
కీర్తనలు 146:1, 5–9
నేను ప్రభువును స్తుతించగలను.
-
ఎవరైనా వారిని మెచ్చుకున్నప్పుడు లేదా వారు మంచి పని చేశారని చెప్పినప్పటి అనుభవాలను మీ పిల్లలు పంచుకోవచ్చు. కీర్తనలు 146:6–9 నుండి ప్రభువు చేసిన కొన్ని మంచి విషయాలను పంచుకోండి (మీ పిల్లలకు తెలియని పదాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి). ఆయన మన కోసం చేసే ఇతర విషయాల గురించి మాట్లాడటానికి మీ పిల్లలను ఆహ్వానించండి. ఆ విషయాల కోసం మనం ఆయనను ఎలా స్తుతించగలం?
ఇంట్లో నేర్చుకోండి; ఇతరులతో పంచుకోండి. “సువార్త నేర్చుకొనుటకు కేంద్రము”గా గృహము ఉండాలని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు (“మార్గదర్శకులైన కడవరి-దిన పరిశుద్ధులగుట,” లియహోనా, నవ. 2018, 13). కీర్తనల గురించి మీ వ్యక్తిగత లేదా కుటుంబ అధ్యయనాన్ని లోతుగా చేయడానికి ఈ వారం మీరు ఏమి చేయవచ్చు? మీ అధ్యయనం తర్వాత, మీరు నేర్చుకున్న మరియు అనుభూతి చెందిన వాటిని ఇతరులతో పంచుకోవడం గురించి ఆలోచించండి. మీరు దీన్ని సంభాషణలో, సందేశం లేదా సామాజిక మాధ్యమం ద్వారా లేదా సంఘములో చేయవచ్చు.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.