2024 రండి, నన్ను అనుసరించండి
సెప్టెంబరు 14-20. “దేవుడే నా రక్షణాధారము”: యెషయా 1–12


“సెప్టెంబరు 14-20. ‘దేవుడే నా రక్షణాధారము’: యెషయా 1–12,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“సెప్టెంబరు 14-20. ‘దేవుడే నా రక్షణాధారము,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

ఒక కాగితపు చుట్టపై వ్రాస్తున్న యెషయా

The Prophet Isaiah Foretells Christ’s Birth [యెషయా ప్రవక్త క్రీస్తు పుట్టుక గురించి ముందుగా చెప్పును], హ్యారీ ఆండర్సన్ చేత

సెప్టెంబరు 14-20: “దేవుడే నా రక్షణాధారము”

యెషయా 1–12

మీరు యెషయా గ్రంథాన్ని చదవడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, గద్యభాగాలు పరిచయమున్న వాటిలా మీకనిపించవచ్చు. అది ఎందుకంటే, పాత నిబంధన ప్రవక్తలందరిలో చాలా తరచుగా ఇతర లేఖన గ్రంథాలలో, అలాగే రక్షకుని చేత ఉదహరించబడిన వారిలో ప్రవక్త యెషయా ఒకరు. యెషయా మాటలు తరచు కీర్తనలలో మరియు ఇతర పవిత్ర సంగీతంలో కనిపిస్తాయి.

ఎందుకింత తరచుగా యెషయా ఉదహరించబడ్డాడు? ఖచ్చితంగా దానికి కారణం దేవుని వాక్యాన్ని స్పష్టంగా, జ్ఞాపకముంచుకోదగిన భాషలో వ్యక్తపరిచే బహుమానాన్ని యెషయా కలిగియుండడం. కానీ, ఇది అంతకు మించినది. తరతరాలకు యెషయా ప్రవక్తలను ప్రేరేపించాడు, ఎందుకంటే ఆయన బోధించిన సత్యాలు ఆయన స్వంత తరాన్ని (క్రీ.పూ. 740 మరియు 701 మధ్య) అధిగమించాయి. దేవుని యొక్క గొప్ప కార్యమైన విమోచన గురించి ఆయన వ్రాసాడు, అది ఒక దేశం లేదా ఒక సమయం కంటే ఎంతో పెద్దది. మిగిలిన ఇశ్రాయేలీయుల నుండి వేరుచేయబడినప్పటికీ, అతడు మరియు అతని జనులు ఇంకా దేవుని నిబంధన జనులలో భాగమేనని యెషయా నుండి నీఫై నేర్చుకున్నాడు. మెస్సీయ గురించి తమ కళ్ళ ముందు నెరవేర్చబడిన ప్రవచనాలను క్రొత్త నిబంధన లేఖకులు యెషయాలో కనుగొన్నారు. ఇశ్రాయేలు సమకూర్పు మరియు సీయోను నిర్మాణము యొక్క కడవరి-దిన కార్యము కొరకు ప్రేరేపణను యెషయాలో జోసెఫ్ స్మిత్ కనుగొన్నారు. మీరు యెషయాను చదివినప్పుడు, మీరేమి కనుగొంటారు?

యెషయా మరియు ఆయన వ్రాతల గురించి మరింతగా తెలుసుకోవడానికి, బైబిలు నిఘంటువులో “యెషయా” చూడండి. యెషయా జీవించిన కాలం గురించి సమాచారం కొరకు 2 రాజులు 15–20 మరియు 2 దినవృత్తాంతములు 26–32 చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

యెషయా 1–12

యెషయా యొక్క మాటలన్నీ నెరవేర్చబడును.

“[యెషయా] పలికిన మాటల ప్రకారము, అతడు పలికిన సంగతులున్నియు ఉండెను మరియు ఉండును” (3 నీఫై 23:3) అని రక్షకుడు బోధించారు. మీరు యెషయా గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, యెషయా దినము, రక్షకుని మర్త్య పరిచర్య మరియు కడవరి దినములు వంటి శీర్షికలతో ప్రవచనాల పట్టికను రూపొందించడం గురించి ఆలోచించండి. యెషయా యొక్క అనేక ప్రవచనాలు ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో నెరవేరాయని గమనించండి (బైబిల్ నిఘంటువు, “యెషయా” చూడండి).

అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు: “యెషయా గ్రంథములో అనేక ప్రవచనాలు ఉన్నాయి, అవి అనేక నెరవేర్పులను కలిగి ఉన్నాయి. ఒకటి యెషయా కాలంలోని వ్యక్తులతో లేదా తర్వాతి తరం పరిస్థితులతో ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది. మరొక అర్థం, తరచుగా ప్రతీకాత్మకమైనది, యెరూషలేము నాశనం చేయబడినప్పుడు మరియు దేవుని కుమారుడు సిలువ వేయబడిన తర్వాత దాని జనులు చెదరగొట్టబడినప్పుడు, మధ్యస్థ కాలంలోని సంఘటనలను సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. అదే ప్రవచనం యొక్క మరొక అర్థం లేదా నెరవేర్పు రక్షకుని రెండవ రాకడను సూచించే సంఘటనలకు సంబంధించింది. ఈ ప్రవచనాలలో అనేకం బహుళ అర్థాలను కలిగి ఉండగలవు అనే వాస్తవం వాటిని అర్థం చేసుకోవడంలో మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ నుండి మనం బయల్పాటును కోరుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది” (“Scripture Reading and Revelation,” Ensign, Jan. 1995, 8).

యెషయాను అర్థం చేసుకోవడం. “ఈ విషయములను శ్రద్ధగా వెదకండి; ఏలయనగా యెషయా మాటలు గొప్పవి” (3 నీఫై 23:1; 2–3 వచనాలు కూడా చూడండి) అని రక్షకుడు చెప్పారు. అయినప్పటికీ, చాలామందికి యెషయాను అర్థం చేసుకోవడం కష్టం కాగలదు. క్రింది ఉపాయాలు సహాయపడవచ్చు:

  • యెషయా ఉపయోగించిన చిహ్నాలను మరియు ఉదాహరణలను ధ్యానించండి.

  • “నేను యేసు క్రీస్తు గురించి ఏమి నేర్చుకుంటున్నాను?” అని మిమ్మల్ని మీరు అడగండి (1 నీఫై 19:23 చూడండి).

  • మన కాలానికి సంబంధించిన అంశాల కోసం వెదకండి.

  • నిఘంటువు, పాదవివరణలు, అధ్యాయ శీర్షికలు మరియు లేఖన దీపిక వంటి అధ్యయన సహాయాలను ఉపయోగించండి.

యెషయా 1; 3–5

సెమినరీ చిహ్నము
ప్రవక్తలు పాపం గురించి హెచ్చరిస్తారు మరియు పశ్చాత్తాపం ద్వారా నిరీక్షణను వాగ్దానం చేస్తారు.

అన్ని కాలాలలోని ప్రవక్తల వలె, యెషయా వారి ఆధ్యాత్మిక స్థితి గురించి జనులను నిరంతరం హెచ్చరించాడు. మీరు యెషయా 1; 35 చదువుతున్నప్పుడు, జనులు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారో వివరించే వాక్యభాగాల కొరకు చూడండి (ఉదాహరణకు, యెషయా 1:2–4, 21–23; 3:9, 16–17; 5:11–12, 20–23 చూడండి). మన కాలంలో మీరు అదేవిధమైన ఏ సమస్యలను చూస్తున్నారు? ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక స్థితి యొక్క పర్యవసానాల గురించి హెచ్చరించే వచనాల కోసం కూడా మీరు వెదకవచ్చు (యెషయా 1:7; 3:17–26; 5:5–7, 13–15 వంటివి).

హెచ్చరికలకు అదనంగా, రక్షకుని ద్వారా విమోచన కొరకు నిరీక్షణ యొక్క సందేశాలను కూడా యెషయా ఇచ్చాడు (ఉదాహరణకు, యెషయా 1:16–19, 25–27; 3:104 చూడండి). ఈ సందేశాల నుండి ప్రభువు గురించి మీరేమి నేర్చుకుంటారు? ఈ వచనాలలో ఉన్న ప్రభువు యొక్క సందేశము మనం నమ్మాలని సాతాను కోరుతున్న దానినుండి భిన్నంగా ఎలా ఉంది?

యెషయాలాగే, నేడు ప్రవక్తలు పాపం మరియు దాని పర్యవసానాల గురించి మనల్ని హెచ్చరిస్తున్నారు మరియు వారు యేసు క్రీస్తు ద్వారా నిరీక్షణ సందేశాలను అందిస్తారు. మీరు ఆలోచించగల మాదిరులు ఏవి? అటువంటి హెచ్చరికలు మరియు వాగ్దానాల కోసం చూస్తూ, మీరు గత సర్వసభ్య సమావేశం నుండి ఒక సందేశాన్ని సమీక్షించాలనుకోవచ్చు.

యెషయా 24; 11-12

కడవరి దినాలలో దేవుడు గొప్ప కార్యము జరిగిస్తారు.

యెషయా ప్రవచనాలలో అనేకము మన కాలము కొరకు ప్రత్యేక అర్థమును కలిగియున్నాయి. వాటిని కనుగొనడానికి, భవిష్యత్తు-కాల క్రియల కోసం చూడండి (“ఉంటుంది” లేదా “వెళ్ళాలి” వంటివి). ఉదాహరణకు, మీరు యెషయా 2; 4; 11–12 చదువుతున్నప్పుడు, ఈ క్రియల కోసం చూడండి. మీరు వాటిని వర్తమాన కాల క్రియలతో భర్తీ చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు (ఉన్నారు లేదా వెళ్తున్నారు వంటివి). ఏ ప్రవచనాలు మీకు ప్రత్యేకంగా స్ఫూర్తినిస్తాయి? సీయోను గురించి, దేవాలయాలను నిర్మించడం మరియు ఇశ్రాయేలును సమకూర్చడం గురించి ఈ ప్రవచనాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

యెషయా 2:2–3 ప్రత్యేకించి కడవరి-దిన పరిశుద్ధులకు సంబంధించినది. ఈ ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయి? ఆయన మందిరంలో ప్రభువు యొక్క “మార్గాలు” మరియు “త్రోవల” గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? (3వ వచనము).

యెషయా 5:26 కూడా చూడండి.

యెషయా 6

ప్రవక్తలు దేవునిచేత పిలువబడ్డారు.

యెషయా 6లో, ఒక ప్రవక్తగా తన పిలుపును యెషయా వివరించాడు. మీరు ఈ అధ్యాయమును చదువుతున్నప్పుడు, యెషయా అనుభవాలలో ఏది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది? ప్రభువు, ఆయన ప్రవక్తలు మరియు వారు చేయాలని పిలువబడిన కార్యము గురించి మీ ఆలోచనా విధానాన్ని ఈ అధ్యాయము ఎలా ప్రభావితం చేస్తుంది?

శిశువైన యేసుతో మరియ

“ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను” (యెషయా 9:6).

యెషయా 7–9

యేసు క్రీస్తును నా రక్షకునిగా పంపుతానని దేవుడు వాగ్దానం చేశారు.

యెషయా పరిచర్య కాలంలో, ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు నుండి తనను తాను కాపాడుకోవడానికి సిరియాతో సంబంధము ఏర్పరచుకుంది. యూదా రాజైన ఆహాజును తమతో చేరమని బలవంతం చేయాలని ఇశ్రాయేలు మరియు సిరియా కోరాయి. కానీ ఆ సంబంధము విఫలమవుతుందని యెషయా ప్రవచించాడు మరియు ప్రభువు నందు నమ్మికయుంచమని ఆహాజుకు సలహా ఇచ్చాడు (యెషయా 7:7–9; 8:12–13).

యెషయా ఆహాజుకు సలహా ఇచ్చినప్పుడు, యెషయా 7:14; 8:13–14; 9:2, 6–7లో కనుగొనబడునటువంటి సుప్రసిద్ధ ప్రవచనాలనేకము ఆయన చేసాడు. ఈ ప్రవచనాలకు అర్థమేమిటో ఆహాజు కాలంలో పూర్తిగా స్పష్టం కానప్పటికీ, అవి స్పష్టంగా యేసు క్రీస్తుకు వర్తిస్తాయి (మత్తయి 1:21–23; 4:16; 21:44; లూకా 1:31–33 కూడా చూడండి). రక్షకునికి “ఇమ్మానుయేలు” అనేది ఎందుకు మంచి బిరుదు? (మత్తయి 1:23 చూడండి). ఆయన మీకు “ఆలోచనకర్త” లేదా “సమాధానకర్తయగు అధిపతి”గా ఎలా ఉన్నారు? (యెషయా 9:7). ఈ వచనాల నుండి రక్షకుని గురించి మీరు ఇంకేమి నేర్చుకుంటారు?

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

యెషయా 1:2–4, 16–19

యేసు క్రీస్తు మూలంగా, నేను పశ్చాత్తాపపడి, శుభ్రంగా ఉండగలను.

  • యెషయా 1:2–4లో, ప్రభువు జనులతో సంతోషంగా లేరనడానికి కారణాలను మీరు మరియు మీ పిల్లలు కనుగొనగలరు. 3వ వచనములో జంతువులతో పోల్చడాన్ని గమనించండి—మన “యజమాని” ఎవరు? మనకు ఆయన గురించి తెలుసని ఎలా చూపించాలి?

  • యెషయా 1:16–18ని ఊహించడానికి, మీరు మరియు మీ పిల్లలు ప్రకాశవంతమైన ఎరుపు మరియు స్వచ్ఛమైన తెల్లని రంగులో ఉన్న వాటిని చూడవచ్చు. లేదా మీరు ఏదైనా ఉతకడానికి కలిసి పని చేయవచ్చు. మనం ఆధ్యాత్మికంగా ఎలా అపవిత్రులం అవుతాము? మనం శుభ్రంగా ఉండేందుకు యేసు ఎలా సహాయం చేస్తారు? ఈ వచనాల నుండి రక్షకుని గురించి మనం ఏమి నేర్చుకుంటాము? మీరు ఆయన గురించి ఎలా భావిస్తున్నారో మరియు ఆయన మీ కోసం ఏమి చేసారో మీ పిల్లలతో పంచుకోండి.

యెషయా 2:2–4

దేవాలయంలో, నేను యేసు క్రీస్తు గురించి నేర్చుకుంటాను.

  • “యెహోవా మందిర పర్వతము సమస్త జనులను” (యెషయా 2:2) ఆకర్షించు సమయాన్ని యెషయా ముందుగా చూసాడు. ప్రభువు యొక్క మందిరానికి వెళ్లేందుకు మీ పిల్లలు ఉత్సాహంగా ఉండేందుకు మీరు ఎలా సహాయం చేయగలరు? వారి ఇంటి చిత్రాన్ని గీయడానికి మీరు వారిని ఆహ్వానించవచ్చు. ఆ తర్వాత యెషయా 2:2ని కలిసి చదివి, “ప్రభువు గృహమైన” దేవాలయం యొక్క చిత్రాన్ని గీయమని వారిని ఆహ్వానించండి. యెషయా 2:3ని కలిసి చదవండి. వారి కుటుంబాలతో సహా దేవాలయానికి వచ్చే అనేక మంది వ్యక్తులను వారి చిత్రాలకు జోడించమని వారిని ఆహ్వానించండి.

  • మీరు యెషయా 2:2–3ని కలిసి చదివి, మిమ్మల్ని మరియు మీ పిల్లలను దేవాలయానికి వెళ్లేలా ప్రేరేపించే విషయాన్ని గుర్తించవచ్చు. అప్పుడు, యెషయా 2:4ని కలిసి చదివిన తర్వాత, దేవాలయం వారికి ఎలా శాంతిని కలిగిస్తుందో మీరు చర్చించవచ్చు.

సాయంకాలము చీకటిపడే సమయములో సాల్ట్‌ లేక్ దేవాలయము

సాల్ట్ లేక్ దేవాలయము

యెషయా 7:14; 9:6–7

నా రక్షకునిగా ఉండుటకు యేసు క్రీస్తు భూమి మీదకు వచ్చారు.

  • క్రీస్తు గురించిన యెషయా ప్రవచనాలను పరిచయం చేయడానికి, మీరు మరియు మీ పిల్లలు అధ్యక్షుడు, బిషప్పు లేదా బోధకుడు వంటి వ్యక్తుల బిరుదుల గురించి మాట్లాడవచ్చు. ఈ వ్యక్తుల గురించి ఈ బిరుదులు మనకు ఏమి చెబుతున్నాయి? యెషయా 7:14 మరియు 9:6–7లో యేసు క్రీస్తు బిరుదులను కనుగొనడంలో మీ పిల్లలకు సహాయపడండి (ఈ వారం ప్రోత్సాహకార్యక్రమ పేజీని కూడా చూడండి). ఈ బిరుదులలో ప్రతీ ఒక్కటి ఆయన గురించి ఏమి బోధిస్తుంది? ఈ వచనాల నుండి యేసు క్రీస్తు గురించి మనం ఇంకేమి నేర్చుకుంటాము?

  • మీరు మీ పిల్లలతో “ప్రవక్తయైన యెషయా” (పాత నిబంధన కథలు, 150–51లో) కూడా పంచుకోవచ్చు. యేసు క్రీస్తు పుట్టడానికి చాలా సంవత్సరాల ముందు ఆయన గురించి యెషయాకు ఏమి తెలుసు అని అడగడానికి క్రమానుగతంగా ఆగండి. అప్పుడు మీరు యెషయా 7:14; 9:6–7లోని యెషయా ప్రవచనాలు ఎలా నెరవేరాయో మాట్లాడటానికి మత్తయి 1:21–23; లూకా 1:31–33 ఉపయోగించవచ్చు.

    1:18

    Isaiah the Prophet

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

దేవాలయం పైన ఆకాశంలో మెరుపు

దేవాలయము “గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను యుండును” (యెషయా 4:6) అని యెషయా బోధించాడు. ఐడహో ఫాల్స్ ఐడహో దేవాలయము

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: యేసు క్రీస్తు గురించి యెషయా ప్రవచించాడు