2024 రండి, నన్ను అనుసరించండి
సెప్టెంబరు 21-27. “బహు ఆశ్చర్యకార్యము”: యెషయా 13–14; 22; 24–30; 35


“సెప్టెంబరు 21–27. ‘బహు ఆశ్చర్యకార్యము’: యెషయా 13–14; 22; 24–30; 35,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“సెప్టెంబరు 21–27. ‘బహు ఆశ్చర్యకార్యము,’” రండి, నన్ను అనుసరించండి: 2026

యౌవనుడైన జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమైన దేవుడు మరియు యేసు క్రీస్తు

Sacred Grove [పరిశుద్ధ వనము], బ్రెంట్ బోరప్ చేత

సెప్టెంబరు 21–27: “బహు ఆశ్చర్యకార్యము”

యెషయా 13–14; 22; 24–3035

ప్రభువు ప్రవక్తలను చేయమని అడిగిన విషయాలలో ఒకటి ఏదనగా, పాపము యొక్క పర్యవసానములను గూర్చి హెచ్చరించడం. పాత నిబంధన ప్రవక్తలకు తరచుగా దీని అర్థము, వారు పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉందని బలమైన రాజ్యాల పాలకులకు చెప్పడం. అది అపాయకరమైన పని, కానీ యెషయా నిర్భయంగా ఉన్నాడు మరియు ఇశ్రాయేలు, యూదా మరియు చుట్టుప్రక్కల దేశములతో కలిపి—అతడి కాలములోని రాజ్యములకు అతడి హెచ్చరికలు ధైర్యముగలవి (యెషయా 13–23 చూడండి).

అయితే, యెషయా నిరీక్షణ సందేశాన్ని కూడా కలిగియున్నాడు. ప్రవచించబడిన నాశనములు ఈ రాజ్యములపై వచ్చినప్పటికీ, పునఃస్థాపనకు మరియు క్రొత్తవిగా చేయుటకు ఒక అవకాశాన్ని యెషయా ముందుగా చూసాడు. ఆయన వద్దకు తిరిగి రమ్మని ప్రభువు తన జనులను ఆహ్వానిస్తారు. ఆయన “ఎండమావులు మడుగులగునట్లు … ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టునట్లు” (యెషయా 35:7) చేస్తారు. ఆయన ఇశ్రాయేలీయులకు వాగ్దానము చేసిన దీవెనలను వారికి పునఃస్థాపిస్తూ, “బహు ఆశ్చర్యకార్యము”ను (యెషయా 29:14) జరిగిస్తారు. యెషయా లేదా ఆ కాలంలో బ్రతికియున్న వారెవరూ ఈ ఆశ్చర్యకార్యమును చూడడానికి జీవించిలేరు. కానీ మనము ఈరోజు దానిని చూస్తున్నాము. వాస్తవానికి, మనము దానిలో భాగము.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

యెషయా 13:1–11, 19–22; 14:1–20

గర్వము మరియు ప్రాపంచికత విఫలమవుతాయి.

యెషయా కాలంలో, బబులోను శక్తివంతమైన పాలకుడు గల శక్తివంతమైన రాజ్యం. ఇప్పుడు బబులోను ప్రాచీన చరిత్ర. కాబట్టి యెషయా 13-14లో బబులోనుకు యెషయా ఇచ్చిన సందేశం నేడు మనకు ఎందుకు ముఖ్యమైనది? ఎందుకంటే నేటికీ మన చుట్టూ ఉన్న విషయాలైన గర్వం, దురాశ మరియు పాపములను బబులోను సూచిస్తున్నది. మీరు యెషయా 13:1–11, 19–22; 14:1–20 చదివినప్పుడు, ఈ ప్రతీకవాదము గురించి ఆలోచించండి. ఇటువంటి ప్రశ్నలను కూడా మీరు పరిగణించవచ్చు:

  • బబులోనీయ రాజు యొక్క గర్వము మరియు సాతాను గర్వము మధ్య ఏ పోలికలను మీరు చూస్తారు? (యెషయా 14:4–20; మోషే 4:1–4 చూడండి). ఈ వచనాలలో మీకైమీరు కనుగొన్న హెచ్చరికలు ఏవి?

  • రక్షకుడు “నీ బాధ, నీ ప్రయాసము నుండి విశ్రాంతిని” ఎలా కలుగచేస్తారు? (యెషయా 14:3).

ఆయన సమాధి వద్ద మరియకు అగుపించిన పునరుత్థానుడైన యేసు

“మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును” (యెషయా 25:8).

యెషయా 22:22–23; 24:21–23; 25:6–8; 26:19; 28:16

యేసు క్రీస్తు వాగ్దానమివ్వబడిన మెస్సీయ.

ఆయన ప్రాయశ్చిత్త త్యాగము, పునరుత్థానము మరియు రెండవ రాకడతో పాటు, రక్షకుని నియమితకార్యమును యెషయా బోధనలు సూచిస్తాయి. మీరు ఈ వచనాలను చదివినప్పుడు మీ మనస్సులోనికి వచ్చే ఆయన నియమితకార్యము యొక్క అంశాలు ఏవి: యెషయా 22:22–23; 24:21–23; 25:6–8; 26:19; 28:16? రక్షకుని గూర్చి మీకు జ్ఞాపకం చేసేలా మీరు కనుగొన్న ఇతర గద్యభాగాలేవి?

యేసు క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పడానికి అభ్యాసకులకు అవకాశాలను ఇవ్వండి. “యేసు క్రీస్తు సువార్త యొక్క బోధకునిగా ఉండడమంటే అర్థము, ఆయన బోధనలు, విమోచన శక్తి మరియు పరిపూర్ణమైన ప్రేమను అర్థం చేసుకొని, వాటిపై ఆధారపడేలా ఇతరులకు సహాయపడడం” (రక్షకుని విధానములో బోధించుట8). మీరు బోధించిన ప్రతీసారి దీనిని చేయడానికి ఒక సులువైన మార్గము, “రక్షకుని గురించి మీకు కొంత బోధించేలా ఈ వారం లేఖనాలలో మీరు ఏమి కనుగొన్నారు?” వంటి ప్రశ్నను అడగడం. అప్పుడు అభ్యాసకులను తమ అనుభవాలు పంచుకోనివ్వండి మరియు ఒకరి విశ్వాసాన్ని మరొకరు బలోపేతం చేసుకోనివ్వండి.

యెషయా 24:1–12; 28:1–8; 29:7-13; 30:8–14

ప్రభువు నుండి మరలిపోవుట ఆధ్యాత్మిక ప్రమాదాన్ని తెస్తుంది.

నిబంధన జనులు ఆయన నుండి దూరమవుతున్నారని హెచ్చరించడానికి ప్రభువు తన కనికరమందు యెషయాను పంపారు. యెషయా 24:5; 29:13; 30:8–12లో దీని యొక్క ఆధ్యాత్మిక హెచ్చరిక సంకేతాలను మీరు కనుగొనగలరో లేదో చూడండి. ఈ వైఖరులు మరియు చర్యలు ఆధ్యాత్మికంగా ఎందుకు ప్రమాదకరమైనవి?

ప్రభువు నుండి మరలిపోవడం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరించడానికి, యెషయా కొన్ని చిరస్మరణీయ పోలికలను ఉపయోగించాడు. మీరు వాటిని అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రభువు నుండి మరలిపోవడం ఎలా ఉంటుందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి:

  • ఆనందములేని, వట్టి దేశము (యెషయా 24:1–12).

  • మద్యము మత్తు (యెషయా 28:7-8).

  • ఆకలిదప్పులు (యెషయా 29:7–10).

  • విరిగిన గోడ లేదా పాత్ర (యెషయా 30:13–14).

ప్రభువుకు దగ్గరగా ఉండడం మీకెందుకు ముఖ్యమైనది?

యెషయా 29; 30:18–26; 35

సెమినరీ చిహ్నము
కోల్పోబడిన లేదా విరిగిన వాటిని ప్రభువు పునరుద్ధరించగలరు.

మీరు మళ్లీ ఎప్పటికీ కనుగొనలేరని అనుకున్నదాన్ని మీరు ఎప్పుడైనా కోల్పోయారా? లేదా ఏదైనా విరిగిపోయి ఉండవచ్చు మరియు అది ఎప్పటికీ మరమ్మత్తు చేయబడదని మీరు ఆందోళన చెందియుండవచ్చు. మనము ప్రభువు నుండి మరలిపోయినప్పుడు, మనం ఎన్నటికీ తిరిగి రాలేమని లేదా స్వస్థత పొందలేమని అనుకోవాలని సాతాను మనల్ని కోరుతున్నాడు. అయితే, ఆయన దగ్గరకు తిరిగి రావడానికి మనకు సహాయం చేయడానికి ప్రభువు చేయబోయే కొన్ని అద్భుతమైన విషయాలను యెషయా వివరించాడు. ప్రభువు, ఆయన ప్రేమ మరియు ఆయన శక్తి గురించి యెషయా 29:13–24; 30:18–26; 35 నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? మీకు స్వస్థత అవసరమైనప్పుడు మీకు నిరీక్షణనిచ్చేలా ఈ గద్యభాగాలలో బహుశా మీరు ఒక వాక్యభాగాన్ని కనుగొనవచ్చు. సహోదరి ఏమీ ఎ. రైట్ గారి సందేశము “విరిగిన దానిని క్రీస్తు స్వస్థపరుస్తారు” (లియహోనా, మే 2022, 81–84) లో కూడా మీరు చూడవచ్చు.

ప్రభువు తన శక్తిని, కనికరమును వ్యక్తపరిచే ఒక విధానము ఏదనగా, ఆయన సువార్తను పునఃస్థాపించుట. యెషయా 29 ఆ పునఃస్థాపన యొక్క సంఘటనలకు సమాంతరాలను కలిగియున్న అనేక గద్యభాగాలను కలిగియున్నది. ఉదాహరణకు:

మీ అభిప్రాయం ప్రకారం, ప్రభువు తన సువార్తను పునఃస్థాపించడాన్ని వివరించడానికి “అద్భుతము” మరియు “ఆశ్చర్యకరము” (యెషయా 29:14) అనేవి ఎందుకు మంచి పదాలు? పునఃస్థాపన గురించిన ప్రవచనాలను నెరవేర్చడంలో మీరు ఎలా సహాయపడగలరు? ఉపాయముల కొరకు, గెరిట్ డబ్ల్యు. గాంగ్ గారి సందేశము “ప్రతీ రాజ్యములు, జాతులు మరియు ఆయా భాషలు మాటలాడువారు (లియహోనా, నవ. 2020, 38–41) లో చూడండి.

యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: ప్రపంచమునకు ద్విశతాబ్ది ప్రకటన,” (సువార్త గ్రంథాలయము) కూడా చూడండి.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

యెషయా 14:3; 25:8-9; 28:16

యేసు క్రీస్తు నన్ను పాపము మరియు మరణము నుండి రక్షించగలరు.

  • యెషయా వ్రాతలలో రక్షకుడిని చూడడానికి మీరు మీ పిల్లలకు ఎలా సహాయం చేస్తారు? యెషయా 14:3; 25:8; లేదా 28:16లో ఆయనను వారికి గుర్తుచేసే వాక్యభాగాలను కనుగొనడానికి మీరు వారికి సహాయపడవచ్చు. వారు యెషయాలోని ఈ వచనాలను రక్షకుని గురించి బోధించే మత్తయి 11:28–30; 1 కొరింథీయులకు 15:53–57; హీలమన్ 5:12 వంటి ఇతర వచనాలతో కూడా సరిపోల్చగలరు. మన కొరకు ప్రభువు చేసిన గొప్ప విషయాలేవి?

  • యెషయా 25:8-9ని కలిసి చదివిన తర్వాత, మీరు గెత్సేమనేలో, సిలువపై మరియు ఆయన పునరుత్థానం తర్వాత రక్షకుని చిత్రాలను చూడవచ్చు. చిత్రాలలో ఏమి జరుగుతోంది, వారు యేసును ఎందుకు ప్రేమిస్తున్నారు మరియు “ఆయన రక్షణనుబట్టి సంతోషించడం” (9వ వచనము) అనే దాని గురించి మీ పిల్లల్ని మాట్లాడనివ్వండి.

  • మీరు ఇష్టపడే వ్యక్తి చనిపోయినప్పుడు మీరు అనుభవించిన బాధను మీ పిల్లలకు చెప్పడానికి మీరు ఎంచుకోవచ్చు. యేసు క్రీస్తు మూలంగా మీకు లభించిన ఓదార్పు గురించి సాక్ష్యమివ్వండి. మీ పిల్లలు ఏడుపు ముఖం గీసి, మీరు యెషయా 25:8ని కలిసి చదువుతున్నప్పుడు కన్నీళ్లను తుడిచివేయవచ్చు.

గెత్సేమనేలో యేసు

Thy Will Be Done [మీ చిత్తము జరుగును గాక], కెన్ స్పెన్సర్ చేత

యెషయా 25:4–6

యేసు నాకు “గాలివాన తగులకుండా ఆశ్రయమిస్తారు.”

  • మీరు మరియు మీ పిల్లలు తుఫాను సమయంలో సురక్షితమైన ఆశ్రయాన్ని లేదా వేడిగా ఉన్న వేసవి రోజున నీడ యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడైనా అనుభవించారా? లేదా మీరు ఆకలితో ఉన్నప్పుడు మంచి భోజనాన్ని ఆస్వాదించారా? మీరు యెషయా 25:4–6 చదువుతున్నప్పుడు, ఈ అనుభవాల గురించి మాట్లాడండి. యేసు ఈ విషయాల వలె ఎలా ఉన్నారు?

యెషయా 29:11–18, 24

సువార్త పునఃస్థాపన అనేది ఒక “ఆశ్చర్యకార్యము.”

  • మీరు మరియు మీ పిల్లలు యెషయా 29:14 చదువుతున్నప్పుడు, “అద్భుతం” మరియు “ఆశ్చర్యం” అని అర్థం వచ్చే ఇతర పదాలను వారితో పంచుకోండి. కడవరి దినాలలో ప్రభువు చేసే కొన్ని ఆశ్చర్యకార్యములను సూచించే వస్తువులను లేదా చిత్రాలను కనుగొనడంలో వారిని మీకు సహాయం చేయనివ్వండి. వీటిలో మోర్మన్ గ్రంథ ప్రతి, దేవాలయం యొక్క చిత్రం లేదా మొదటి దర్శనం యొక్క చిత్రం (ఈ నమూనా ప్రారంభంలో ఒకటి ఉంది) ఉండవచ్చు. అప్పుడు మీ పిల్లలు ఒక వస్తువును ఎంచుకుని, అది వారికి ఎందుకు అద్భుతంగా ఉందో పంచుకోవచ్చు.

  • మరియు పునఃస్థాపన అంటే ఏమిటో పిల్లలు అర్థం చేసుకోవడానికి బహుశా వ్యక్తిగత అనుభవం సహాయపడవచ్చు. ఉదాహరణకు, మీరు మరియు మీ పిల్లలు మీరు కోల్పోయిన ఒకదాని గురించి మరియు మీరు దానిని ఎలా కనుగొన్నారు అనే దాని గురించి మాట్లాడవచ్చు. దీన్ని సువార్త పునఃస్థాపనతో పోల్చడానికి మీ పిల్లలకు సహాయం చేయండి. యెషయా 29:13–15 ప్రకారం, మనకు పునఃస్థాపన ఎందుకు అవసరం? తన సువార్తను పునఃస్థాపించడానికి ప్రభువు ఏ ఆశ్చర్యకార్యములు చేస్తున్నారు? (ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీ చూడండి).

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

సిలువపై యేసు

The Crucifixion [సిలువ వేయడం], కార్ల్ హైనిక్ బ్లాక్ చేత, ఫ్రెడెరిక్స్‌బర్గ్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీ వద్ద

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: సువార్త పునఃస్థాపన అనేది ఒక “ఆశ్చర్యకార్యము”