“సెప్టెంబరు 28–అక్టోబరు 4. ‘నా జనులను ఓదార్చుడి’: యెషయా 40–49,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“సెప్టెంబరు 28–అక్టోబరు 4. ‘నా జనులను ఓదార్చుడి,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
Healing the Blind Man [అంధుడిని స్వస్థపరచడం], కార్ల్ హైనిక్ బ్లాక్ చేత, ఫ్రెడెరిక్స్‌బర్గ్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీ వద్ద
సెప్టెంబరు 28–అక్టోబరు 4: “నా జనులను ఓదార్చుడి”
యెషయా 40–49
యెషయా 40వ అధ్యాయములో మొదటి మాట “ఓదార్చుడి.” అది ప్రవక్త సందేశములో భిన్నమైన భావన, భిన్నమైన ఉద్ఘాటన యొక్క ప్రారంభాన్ని గుర్తిస్తుంది. యెషయా యొక్క పూర్వపు రచనలు ఇశ్రాయేలు మరియు యూదాను వారి పాపాల కారణంగా రాబోయే నాశనం మరియు చెర గురించి హెచ్చరించాయి. అయితే ఈ తరువాతి ప్రవచనాలు భవిష్యత్తులో 150 సంవత్సరాలకు పైగా యూదులను ఓదార్చడానికి ఉద్దేశించబడ్డాయి—యెరూషలేము మరియు దేవాలయం ధ్వంసం చేయబడిన తర్వాత మరియు జనులు బబులోను చేత చెరపట్టబడిన తర్వాత. కానీ ఈ ప్రవచనాలు ఓడిపోయిన, నిరుత్సాహపడిన ఇశ్రాయేలీయుల కంటే భవిష్యత్తులో ముందున్న వారిని మరింత ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఓడిపోయి, నిరుత్సాహపడిన మరియు తప్పిపోయిన మనతో కూడా అవి మాట్లాడతాయి.
ఇశ్రాయేలీయులకు మరియు మనకు యెషయా సందేశము సరళమైనది: “భయపడకుడి” (యెషయీ 43:1). సమస్తము కోల్పోబడలేదు. ప్రభువు మిమ్మల్ని మరచిపోలేదు మరియు మీ ఆధీనములో లేనట్లుగా కనబడిన పరిస్థితులపై ఆయనకు శక్తి ఉన్నది. “ఆకాశములను సృజించిన” (యెషయా 42:5) ప్రభువు బబులోను కంటె, పాపము కంటె, మిమ్మల్ని చెరపట్టిన వాటన్నిటికంటే శక్తిమంతుడు కాదా? “నేను నిన్ను విమోచించియున్నాను, నా యొద్దకు మళ్లుకొనుము,” (యెషయా 44:22) అని ఆయన వేడుకున్నారు. మీ విషయంలో, విమోచించబడడానికి మీకవసరమైన దేనినైనా ఆయన—స్వస్థపరచగలరు, పునఃస్థాపించగలరు, బలపరచగలరు, క్షమించగలరు మరియు ఓదార్చగలరు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
యెషయా 40–49
యేసు క్రీస్తు నన్ను ఓదార్చగలరు మరియు నాకు నిరీక్షణను ఇవ్వగలరు.
ఇశ్రాయేలీయులు బబులోనులో బందీలుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఏర్పరచబడిన, నిబంధన జనులుగా వారి స్థానమును వారు శాశ్వతంగా కోల్పోయారేమోనని అనేకమంది ఆశ్చర్యపడియుండవచ్చు. మీరు యెషయా 40–49 చదివినప్పుడు, ఓదార్పు మరియు నిరీక్షణను అందించే లేఖన భాగాల కోసం వెదకండి. మీరు కనుగొనే ప్రతీ గద్యభాగములో, ఈ వచనాలలో ప్రభువు మీతో చెప్పబోయే దానిని ధ్యానించండి మరియు వ్రాయండి. మీరు ప్రారంభించగల కొన్ని ఆలోచనలు ఇక్కడున్నాయి:
-
40:11, 29–31:
-
41:10–13, 17–18:
-
42:6–7:
-
43:1–7, 25:
-
44:1–4, 21–24:
-
46:3–4:
-
49:7–16:
ఆయన గురించి మీరు ఏమి తెలుసుకోవాలని ప్రభువు కోరుతున్నారని మీరు అనుకుంటున్నారు?
ఈ వచనాలలో ఉన్న వాగ్దానాలను మీ జీవితంలో ప్రభువు ఎలా నెరవేర్చారు?
పాట్రిక్ కీరన్, “ఆయన తన రెక్కల యందు స్వస్థత కలిగి లేచును: మనము విజేతల కంటే ఎక్కువగా ఉండవచ్చు,” లియహోనా, మే 2022, 37–40 కూడా చూడండి.
అదనపు లేఖనాన్ని ఉపయోగించండి. కొన్నిసార్లు మనం మన అధ్యయనాన్ని మోర్మన్ గ్రంథంలోని వచనాలతో చేర్చితే పాత నిబంధనను బాగా అర్థం చేసుకోగలము. ఉదాహరణకు, మోర్మన్ గ్రంథ ప్రవక్తలైన నీఫై మరియు జేకబ్ ఇత్తడి పలకలపై యెషయా వ్రాసిన వ్రాతలకు ప్రవేశం కలిగియున్నారు (1 నీఫై 19:22–23 చూడండి) మరియు వారు రక్షకుని గురించి బోధించడానికి ఈ ప్రవచనాలను ఉపయోగించారు. నీఫై మరియు జేకబ్ యెషయా 48–49ను వారి జనులతో ఎలా పోల్చారో తెలుసుకోవడానికి 1 నీఫై 22 చూడండి. ఈ అధ్యాయాలను మీ స్వంత జీవితంతో పోల్చడానికి అది మీకు సహాయపడవచ్చు.
ప్రభువుకు విధేయులగుట ద్వారా “నదివలె … శాంతిని” మనము కలిగియుండగలము (యెషయా 48:18).
యెషయా 40–49
“నీవు నా సేవకుడవు.”
యెషయా 40–49 అంతటా ప్రభువు తన “సేవకుడు” మరియు “సాక్షులు” గురించి మాట్లాడారు. ఈ మాటలు యేసు క్రీస్తును (యెషయా 42:1–7 చూడండి), ఇశ్రాయేలీయులను (యెషయా 45:4 చూడండి) మరియు యూదులను యెరూషలేముకు తిరిగి వెళ్ళడానికి, దేవాలయాన్ని పునర్న్మించడానికి అనుమతించిన కోరెషు రాజును (యెషయా 44:26–28; 45:1–4 చూడండి) సూచించగలవు. గద్యభాగాలు ప్రభువు యొక్క సేవకునిగా మరియు ఒక సాక్షిగా మీకు ఎలా అన్వయిస్తాయో కూడా మీరు పరిగణించవచ్చు. ఉదాహరణకు, ఇటువంటి ప్రశ్నలను ధ్యానించండి:
యెషయా 40:1–3, 9–11; 43:9–12 ఏ భావములో మీరు యేసు క్రీస్తు యొక్క సాక్షి? ఆయన సాక్షిగా మీరు పంచుకోగల “మంచి వార్తలు” ఏమిటి? ఒక కోర్టు విచారణలో మీరు సాక్షి స్థానంలో పిలువబడ్డారని మీరు ఊహించవచ్చు. ఈ విచారణలో, యెషయా 43:11లో నమోదు చేయబడిన దావాను యేసు క్రీస్తుపై మోపారు. యేసు వాదనకు మద్దతుగా మీరు ఏ సాక్ష్యం ఇవ్వగలరు? మీ జీవితం నుండి మీరు ఏ సాక్ష్యాన్ని అందిస్తారు?
యెషయా 41:8–13; 42:6; 44:21. ఏమి చేయమని ప్రభువు మిమ్మల్ని పిలిచారు? ఆయనకు సేవ చేయడానికి సంఘ పిలుపులను, అదేవిధంగా ఇతర అవకాశాలను పరిగణించండి. ఆయన సేవకుడిగా కావడానికి ఆయన మిమ్మల్ని ఎలా “ఏర్పరిచారు” లేదా సిద్ధం చేశారు? మీరు సేవ చేస్తున్నప్పుడు ఆయన మీకు ఎలా మద్దతు ఇస్తారు?
యెషయా 49:1–9. మీ ప్రయత్నాలు మరియు సేవ “వ్యర్థముగా, వృధాగా” కనపించినప్పుడు సహాయపడగలిగేలా ఈ వచనాలలో మీరు కనుగొనే సందేశాలేవి? (4వ వచనము).
యెషయా 40:3–8, 15–23; 42:15–16; 47:7–11
దేవుని యొక్క శక్తి లోకసంబంధమైన శక్తి కంటె గొప్పది.
యెషయా దేవుని యొక్క అసమానమైన శక్తిని గూర్చి ఆయన జనులకు పలుమార్లు జ్ఞాపకం చేసాడు, వారిని చుట్టుముట్టిన అణచివేసే ప్రాపంచిక శక్తితో పోల్చాడు కూడా. మీరు యెషయా 40:3–8, 15–23; 42:15–16; మరియు 47:7–11 చదివినప్పుడు, ఈ సందేశము కోసం చూడండి (47వ అధ్యాయము ఇశ్రాయేలును చెరపట్టిన బబులోనుకు ఇవ్వబడిందని గమనించండి). ఈ గద్యభాగాలు లోకసంబంధమైన విషయాలను గూర్చి మీకు ఏమి బోధిస్తాయి? అవి దేవుని గురించి మీకేమి బోధిస్తాయి? చెరలో ఉన్న యూదులకు ఈ సందేశము ఎందుకు విలువైనదో ధ్యానించండి. అది మీకెందుకు విలువైనది?
యెషయా 48:10; 49:13–16
నా శ్రమల ద్వారా ప్రభువు నన్ను శుద్ధి చేయగలరు.
మీరు యెషయా 48:10 చదివినప్పుడు, మీ స్వంత “ఇబ్బంది కొలిమి” గురించి ఆలోచించండి. ప్రభువు మిమ్మల్ని ఎలా “శుద్ధి” చేస్తున్నారు? మీరు శ్రమలను అనుభవిస్తున్నప్పుడు యెషయా 49:13–16 మీకు ఎలా సహాయం చేస్తుంది?
The Refiner's Fire
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
యెషయా 40:3-5
“యెహోవాకు మార్గమును” సిద్ధపరచుటలో నేను సహాయపడగలను.
-
యెషయా 40:3–5లో వివరించిన విధంగా “యెహోవాకు మార్గమును సిద్ధపరచడం” అంటే ఏమిటో వివరించడానికి కొన్ని మార్గాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, మీరు మరియు మీ పిల్లలు వంకరగా ఉన్నదాన్ని సరిచేయవచ్చు, చిందరవందరగా ఉన్న నేలను శుభ్రం చేయవచ్చు లేదా రాతి నేలలో స్పష్టమైన మార్గాన్ని రూపొందించవచ్చు. బాప్తిస్మమిచ్చే యోహాను మరియు జోసెఫ్ స్మిత్ యొక్క చిత్రాలను కూడా మీరు చూపించవచ్చు (Gospel Art Book [సువార్త కళా పుస్తకము], సంఖ్యలు 35, 87 చూడండి). ప్రభువు యొక్క రాకడ కోసం వారు మార్గమును ఎలా సిద్ధపరిచారు? (లూకా 3:2–18; సిద్ధాంతము మరియు నిబంధనలు 135:3 చూడండి). మనము ఏవిధంగా సహాయం చేయగలము? అహరోను యాజకత్వం కలిగియున్నవారు ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయడంలో ఎలా సహాయం చేస్తారనే దాని గురించి మాట్లాడడానికి ఇది ఒక అవకాశం కావచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:26–28 చూడండి).
యెషయా 43:10
నేను ప్రభువు యొక్క సాక్షిగా ఉండగలను.
-
కలిసి యెషయా 43:10 చదివిన తర్వాత, ఒక సాక్షిగా ఉండడం అంటే ఏమిటనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. మీరు “సాక్షి”గా ఉండవచ్చని మీరు అనుభవించిన విషయాలను పరస్పరం పంచుకోండి—ఉదాహరణకు, మీరు రుచి చూసిన ఆహారం, మీరు సందర్శించిన స్థలం లేదా మీకు తెలిసిన వ్యక్తి. ప్రభువు యొక్క సాక్షిగా ఉండడం అంటే అర్థమేమిటి? ఆయన గురించి మనం ఇతరులకు ఏమి చెప్పగలం?
యెషయా 44:3–4; 45:8
ప్రభువు నాపై తన దీవెనలను “కుమ్మరిస్తారు”.
-
ఈ వచనాలను చదివిన తర్వాత, మీ పిల్లలు ఒక మొక్కకు నీరు పోసి, ప్రభువు వారిపై కుమ్మరించిన ఆశీర్వాదాల గురించి మాట్లాడవచ్చు. మనం మొక్కకు నీరు పోసినప్పుడు ఏమవుతుంది? ప్రభువు యొక్క ఆశీర్వాదాలు మనం ఎదగడానికి ఎలా సహాయపడ్డాయి?
మన “నీతి సముద్ర తరంగములవలె [ఉండగలదు]” (యెషయా 48:18).
యెషయా 48:17-18
దేవుని ఆజ్ఞలను పాటించడం వల్ల శాంతి లభిస్తుంది.
-
నదులు మరియు సముద్రపు అలల చిత్రాలు లేదా వీడియోలు మీ పిల్లలకు యెషయా 48:18ను (ఈ నమూనాలోని చిత్రాలు వంటివి) ఊహించుకోవడంలో సహాయపడగలవు. మీ పిల్లలు తమ అరచేతులను, చేతులను నదిలా మరియు సముద్రపు అలల్లా కదిలించడాన్ని ఆనందించవచ్చు. శాంతి ఒక నదివలె ఎలా ఉండగలదు? నీతి సముద్ర తరంగము వలె ఎలా ఉండగలదు? దేవుని ఆజ్ఞలను పాటించడం నదిలా ప్రశాంతంగా ఉండడానికి లేదా అలలా బలంగా ఉండడానికి మీకు ఎలా సహాయపడిందనే దాని గురించి మాట్లాడండి.
యెషయా 49:14–16
ప్రభువు నన్ను ఎన్నటికీ మరచిపోరు.
-
యెషయా 49:14–16 రాబోయే సంవత్సరాల్లో మీ పిల్లలకు గొప్ప ఓదార్పునిస్తుంది. మీరు 14వ వచనాన్ని చదువుతున్నప్పుడు, ఏది జనులు మరచిపోబడినట్లు లేదా విడిచిపెట్టబడినట్లు భావించేలా చేస్తుందనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. ప్రభువు మనల్ని మరచిపోలేదని మనమెలా తెలుసుకోగలము?
-
15–16 వచనాలను పరిచయం చేయడానికి, వారు ఎప్పటికీ మరచిపోలేని వారి గురించి మీరు మీ పిల్లలను అడగవచ్చు–కుటుంబ సభ్యుడు లేదా స్నేహితులు వంటివారు. యెషయా 49:15–16 ప్రకారం, ప్రభువు మనల్ని ఎందుకు మరచిపోరు? అప్పుడు మీరు యేసు క్రీస్తు గురించి మీ భావాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.