2024 రండి, నన్ను అనుసరించండి
అక్టోబరు 19–25. “గర్భమునుండి నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని”: యిర్మీయా 1–3; 7; 16–18; 20


“అక్టోబరు 19–25. ‘గర్భమునుండి నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని’: యిర్మీయా 1–3; 7; 16–18; 20,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“అక్టోబరు 19–25. ‘గర్భమునుండి నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

మరొక వ్యక్తి వైపు చూస్తున్న యిర్మీయా

Jeremiah [యిర్మీయా], వాల్టర్ రేన్ చేత

అక్టోబరు 19–25: “గర్భమునుండి నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని”

యిర్మీయా 1–3; 7; 16–1820

మొదట, తాను ఒక మంచి ప్రవక్తగా ఉండగలడని యిర్మీయా అనుకోలేదు. “అయ్యో, మాటలాడుటకు నాకు శక్తి చాలదు,” (యిర్మీయా 1:6) అని అతడు ప్రతిఘటించాడు. “నీ నోట నా మాటలు ఉంచియున్నాను” (9b వచనము) అని ప్రభువు అతడికి అభయమిచ్చారు. తాను అనుభవములేని “బాలుడు” అని యిర్మీయా భావించాడు (6వ వచనము), కానీ అతడు గ్రహించిన దానికంటే నిజంగా ఎక్కువగా సిద్ధపడ్డాడని — అతడు పుట్టకముందే ఈ పిలుపుకు నియమించబడ్డాడని ప్రభువు వివరించారు (5వ వచనము చూడండి). కనుక యిర్మీయా తన భయాలను ప్రక్కన పెట్టి, పిలుపును అంగీకరించాడు. యెరూషలేము యొక్క రాజులు మరియు యాజకుల భూటకపు పరిశుద్ధత వారిని నాశనము నుండి రక్షించదని అతడు హెచ్చరించాడు. మాటలాడుట చేతకాని “బాలుడను” అనుకొన్న అతడు దేవుని వాక్యము “[అతడి] హృదయములో అగ్నివలె మండుటను” భావించాడు మరియు చెప్పక మానలేదు (యిర్మీయా 20:9).

యిర్మీయా కథ మీ కథ కూడా. మీరు పుట్టకముందే దేవుడు మిమ్మల్ని కూడా ఎరిగియుండి, జీవితంలో మీ నియమితకార్యము కోసం మిమ్మల్ని సిద్ధం చేశారు. మిగిలిన విషయాల మధ్య, ఆ కార్యము యిర్మీయా ముందుగా చూసిన దానిని కలిపియున్నది: దేవుని యొక్క జనులను ఒకరి తరువాత ఒకరిని సమకూర్చి, “[వారిని] సీయోనుకు రప్పించుట” (యిర్మీయా 3:14). ఏమి చేయాలో లేదా చెప్పాలో మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు కూడా, మీరు “భయపడరాదు…; నేను మీకు తోడైయున్నాను, ఇదే యెహోవా వాక్కు” (యిర్మీయా 1:8, 19).

యిర్మీయా గ్రంథమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “యిర్మీయా” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

యిర్మీయా 1:4–19; 7:1–7; 20:8–9

ప్రవక్తలు దేవుని వాక్యాన్ని చెప్పడానికి పిలువబడ్డారు.

ప్రవక్తల గురించి ఎన్నడూ వినని ఒక స్నేహితుడితో మీరు మాట్లాడుతున్నారని ఊహించుకోండి మరియు యిర్మీయా 1:4–19లో ప్రవక్తగా ఉండమని యిర్మీయాకు ఇచ్చిన పిలుపును ఉపయోగించి మీరు ఆ భావనను వివరించాలని నిర్ణయించుకున్నారు. దేవుని ప్రవక్తల గురించి కొంత బోధించేలా ఈ వచనాలలో మీరు ఏమి కనుగొంటారు? యిర్మీయా 7:1–7; 20:8–9లో కూడా మీరు చూడవచ్చు.

మీరు మీ స్నేహితుడికి నేటి సజీవ ప్రవక్త గురించి కూడా బోధించాలనుకోవచ్చు. ఈ వచనాలలో సహాయపడేది ఏదైనా ఉందా? ఉదాహరణకు, మన కాలంలోని ప్రవక్తలు దేనిని “పెల్లగిస్తారు” లేదా “పడదోస్తారు”? వారు ఏమి “కడతారు” మరియు “నాటుతారు”? (యిర్మీయా 1:10). మన సజీవ ప్రవక్త దేవునిచే పిలువబడ్డారని మీకు ఎలా తెలుసు?

విశ్వాస ప్రమాణాలు 1:6, 9 కూడా చూడండి.ChurchofJesusChrist.org

1:37

Why Do We Have Prophets?

యిర్మీయా 1:5

సెమినరీ చిహ్నము
నేను పుట్టకముందే దేవుడు నన్ను ఎరిగియున్నారు.

యిర్మీయా 1:5లో తన గురించి యిర్మీయా ఏమి నేర్చుకున్నాడు? క్రొత్తగా పిలువబడిన ప్రవక్తగా, అతడు ఆ సమాచారాన్ని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమైనది?

యిర్మీయా 1:5లో యిర్మీయా తన గురించి నేర్చుకున్న వాటిలో చాలా వరకు మీ విషయంలో కూడా నిజం. మీరు పుట్టకముందే దేవుడు మిమ్మల్ని కూడా ఎరిగియున్నారు మరియు నిర్దిష్ట బాధ్యతల కొరకు మిమ్మల్ని సిద్ధం చేసారు. మీరు పుట్టకముందు మీ జీవితం గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆల్మా 13:1–4; సిద్ధాంతము మరియు నిబంధనలు 138:53–56; మరియు అబ్రాహాము 3:22–23 చదవండి. మీరు కనుగొన్న సత్యాల జాబితాను మీరు తయారు చేయవచ్చు. ఈ సమాచారాన్ని తెలుసుకోవడం మీకు ఎందుకు ముఖ్యమైనది?

ఈ సత్యాలు ఎల్డర్ అహమద్ ఎస్. కార్బిట్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయో తెలుసుకోవడానికి, ఆయన సందేశం “మీరు ఇశ్రాయేలును సమకూర్చగలరు!” (లియహోనా, మే 2021, 63-63) అధ్యయనం చేయండి. మీ పూర్వమర్త్య జీవితం గురించి తెలుసుకోవడం మీ మర్త్య జీవితాన్ని జీవించే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మీ పూర్వమర్త్య జీవితం గురించి చెప్పినది ఇక్కడ ఉంది:

“మీ పరలోక తండ్రికి మీరు చాలా కాలంగా తెలుసు. మీరు, ఆయన కుమారుడు లేదా కుమార్తెగా, ఈ ఖచ్చితమైన సమయంలో భూమిపైకి రావడానికి, భూమిపై ఆయన గొప్ప కార్యములలో నాయకులుగా ఉండడానికి ఆయనచేత ఎన్నుకోబడ్డారు. మీరు మీ శారీరక లక్షణాల కోసం కాదు, కానీ సాహసం, ధైర్యం, నిష్కపటమైన హృదయం, సత్యం కోసం దాహం, జ్ఞానం కోసం ఆకలి మరియు ఇతరులకు సేవ చేయాలనే కోరిక వంటి మీ ఆధ్యాత్మిక లక్షణాల కోసం ఎంపిక చేయబడ్డారు.

“మీరు ఈ లక్షణాలలో కొన్నింటిని పూర్వమర్త్య జీవితంలో అభివృద్ధి చేసారు. మిగిలినవి మీరు నిరంతరం వెదుకుతున్నప్పుడు మీరు భూమిపై అభివృద్ధి చేయవచ్చు” (“Decisions for Eternity,” Liahona, Nov. 2013, 107).

మీరు ఎదుర్కొనే కొన్ని పరిస్థితుల గురించి ఆలోచించండి, వాటిలో మీ పూర్వమర్త్య జీవితం గురించిన ఈ సత్యాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సత్యాలను గుర్తుచేసుకోవడానికి మీరు ఏమి చేయవచ్చు?

ఎడమవైపు, ఒక పెద్ద ఖాళీ తొట్టిలో నిలబడి ఉన్న వ్యక్తి; కుడివైపున, ఒక జలపాతం

యిర్మీయా 2:13లో, ప్రభువు జనుల ఆత్మీయ స్థితిని “బద్దలైన తొట్టెలతో” పోల్చారు మరియు తననుతాను “జీవజలముల ఊట”తో పోల్చుకున్నారు.

యిర్మీయా 2; 7

“వారు జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు.”

ఇశ్రాయేలీయులు నివసించిన ఎండిన నేలలో, జనులు నీళ్ల తొట్టెలని పిలిచిన భూగర్భ జలాశయాలందు అమూల్యమైన నీటిని నిల్వ చేసేవారు. యిర్మీయా 2:13లో చెప్పబడిన “బ్రద్దలైన నీళ్ల తొట్టె” దేనికి చిహ్నముగా ఉన్నదని మీరనుకుంటున్నారు? ఒక నీళ్ల తొట్టెపై ఆధారపడుట కంటె నీటి ఊట నుండి నీటిని పొందుట ఎందుకు మేలైనది? “జీవజలముల ఊటను” విడిచిపెట్టుట అనగా అర్థమేమిటి? మీరు యిర్మీయా 2 మరియు 7 చదివినప్పుడు, ప్రభువు యొక్క జీవజలములను జనులు ఎలా విడిచిపెట్టారో గమనించండి (ఉదాహరణకు, యిర్మీయా 2:26–28; 7:2–11 చూడండి). రక్షకుడు మీకు ఇచ్చే దానికి “జీవజలం” ఎందుకు మంచి చిహ్నం? మీరు జీవజలాన్ని ఎలా పొందుతున్నారో ఆలోచించండి.

యిర్మీయా 7 “ప్రభువును ఆరాధించడానికి … ప్రభువు మందిరంలోకి” ప్రవేశిస్తున్న వ్యక్తుల కొరకు ఉద్దేశించబడింది, కానీ వారి చర్యలు వారి బాహ్య భక్తికి సరిపోలలేదు (2–11 వచనాలు చూడండి). 21–23 వచనములలో మీ కోసం ప్రభువు కలిగియున్నారని మీరు భావించిన సందేశాలేవి?

వస్తు పాఠములను ఉపయోగించండి. ప్రభువు యొక్క ప్రవక్తలు తరచూ ఆధ్యాత్మిక సత్యాలను సుపరిచితమైన వస్తువులతో పోలుస్తారు. మీరు సువార్తను నేర్చుకునేటప్పుడు మరియు బోధిస్తున్నప్పుడు అలా చేయడాన్ని పరిగణించండి. ఉదాహరణకు, యిర్మీయా 2:13ని ఊహించుకోవడానికి, మీరు పగిలిన లేదా విరిగిన పాత్రలో నీటిని ఉంచవచ్చు లేదా మంచినీటి ఊట నుండి త్రాగవచ్చు. యేసు ఎలా “జీవజలముల ఊట” వంటివారు? (యిర్మీయా 2:13). ఆయన జీవజలము నుండి మనము ఎలా త్రాగగలము?

యిర్మీయా 3:14–18; 16:14–21

ప్రభువు తన జనులను సమకూరుస్తారు.

యిర్మీయా 16:14-15లో, యిర్మీయా ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల నిర్గమనాన్ని కడవరి దినాలలో ఇశ్రాయేలు యొక్క సమకూర్పుతో పోల్చాడు. మీ అభిప్రాయం ప్రకారం, దేవుని జనులకు నిర్గమము కంటే సమకూర్పే ఎందుకు ముఖ్యమైనది?

సమకూర్పు ఎలా జరుగుతుందని యిర్మీయా 3:14–18; 16:14–21 సూచిస్తాయి?

Hope of Israel” అనే తన సందేశంలో, యిర్మీయా వలె, ఇశ్రాయేలు యొక్క సమకూర్పు “నేడు భూమిపై జరుగుతున్న అత్యంత ముఖ్యమైన విషయమని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు (worldwide youth devotional, June 3, 2018, Gospel Library). ఆయన సందేశాన్ని చదవండి లేదా వినండి మరియు (ఎ) అధ్యక్షులు నెల్సన్ ఇశ్రాయేలు యొక్క సమకూర్పును ఎలా నిర్వచించారు, (బి) దాని ప్రాముఖ్యతను ఆయన ఎలా వివరిస్తున్నారు మరియు (సి) సమకూర్పులో మీరెలా భాగం కావచ్చు అని మీరు కనుగొనగలరేమో చూడండి.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

యిర్మీయా 1:5

నేను పుట్టకముందే పరలోక తండ్రి నన్ను ఎరిగియున్నారు.

  • యిర్మీయా 1:5లో బోధించబడిన ముఖ్యమైన సత్యాన్ని పరిచయం చేయడానికి, మీరు మీ పిల్లలకు ఒక శిశువు చిత్రాన్ని చూపించవచ్చు (లేదా, వీలైతే, మీ పిల్లలు శిశువులుగా ఉన్నప్పటి చిత్రాలను చూడవచ్చు). వారు పుట్టక ముందు వారు ఎక్కడ నివసించారో తెలుసా అని మీ పిల్లల్ని అడగండి.

బిడ్డను ఎత్తుకున్న బాలిక

యిర్మీయా 1:4–19

ప్రవక్తలు ప్రభువు యొక్క మాటలు చెప్పడానికి పిలువబడ్డారు.

  • లేఖనాల నుండి జీవించి ఉన్న ప్రవక్త లేదా ప్రవక్తల చిత్రాలను చూపించడాన్ని పరిగణించండి (కొన్నింటిని మీరు సంఘ పత్రికలు, Gospel Art Book [సువార్త కళా పుస్తకము] మరియు రండి, నన్ను అనుసరించండి లో కనుగొనవచ్చు). ఈ ప్రవక్తల గురించి వారికి ఏమి తెలుసో మీ పిల్లల్ని అడగండి.

  • ప్రవక్తలు ఏమి చేస్తారనే దాని గురించి బోధించడానికి, మీరు యిర్మీయా 1 నుండి 5, 7, 10 మరియు 19 వచనాలు వంటి కొన్ని ఉపయోగకరమైన వచనాలను ఎంచుకోవచ్చు. మీ పిల్లల్లో ప్రతీ ఒక్కరు వచనాలలో ఒకదానిని ఎంచుకుని, దానిని చదివి, ప్రవక్తల గురించి వారు తెలుసుకున్న విషయాలను పంచుకోవచ్చు.

యిర్మీయా 16:14–16

పరలోక తండ్రి పిల్లలు ఆయన వద్దకు తిరిగి రావడానికి నేను సహాయం చేయగలను.

  • మీరు యిర్మీయా 16:16ను చదువుతున్నప్పుడు, మీ పిల్లలు గదిలో చుట్టూ ఉన్న వస్తువులను “చేపలు పట్టడం” లేదా “వేటాడడం” చేసినట్లు నటించవచ్చు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ వచనంలోని మత్స్యకారులు మరియు వేటగాళ్లను సువార్తికులతో పోల్చారు (see “The Gathering of Scattered Israel,” Liahona, Nov. 2006, 81). సువార్తికులు ఏం చేస్తారు? చెదిరిపోయిన ఇశ్రాయేలీయుల కోసం మనం “చేపలు పట్టడం” మరియు “వేటాడడం” ఎలా చేయవచ్చు? (see “A Message for Children from President Russell M. Nelson” [video], ChurchofJesusChrist.org).

    3:30

    Video: A Message for Children from President Russell M. Nelson

యిర్మీయా 18:1–6

కుమ్మరి మట్టిని మలచినట్లు, ప్రభువు నా జీవితాన్ని నడిపించగలరు.

  • ఈ వచనాలను పరిశోధించడానికి, కుండలు ఎలా తయారు చేయబడతాయో మీరు చర్చించవచ్చు లేదా చూపించవచ్చు (ఈ నమూనా చివరిలో ఉన్న చిత్రాన్ని చూడండి). యిర్మీయా18:1–6లో మన కొరకు ప్రభువు కలిగియున్న సందేశమేమిటి? ప్రభువు యొక్క హస్తములలో మన్నుగా ఉండుట అనగా అర్థమేమిటి? (యెషయ 64:8 కూడా చూడండి).

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చక్రంపై కుండలను రూపొందిస్తున్న చేతులు

“జిగటమన్ను కుమ్మరిచేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు” (యిర్మీయా 18:6).

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: పరలోక తండ్రి పిల్లలు ఆయన వద్దకు తిరిగి రావడానికి నేను సహాయం చేయగలను