“జూలై 20–26. ‘నీవే మాకు దిక్కు’: 2 సమూయేలు 14–20; 26; 30,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“జూలై 20–26. ‘నీవే మాకు దిక్కు,’” రండి, నన్ను అనుసరించండి: 2026
King Jehoshaphat’s Prayer [యెహోషాపాతు రాజు యొక్క ప్రార్థన], కీలి రే చేత
జూలై 20–26: “నీవే మాకు దిక్కు”
2 దినవృత్తాంతములు 14–20; 26; 30
యూదా రాజ్యం చుట్టుముట్టబడింది. మూడు శక్తివంతమైన శత్రు దేశాల సైన్యాలు ఒక్కసారిగా యుద్ధానికి సిద్ధమై ముందుకు సాగుతున్నాయి. ఈ అత్యవసర సమయంలో, యూదా రాజైన యెహోషాపాతు పరలోకం మరియు భూమి యొక్క రాజు వైపు తిరిగాడు. యెహోషాపాతు తన జనులను దేవాలయంలో సమకూర్చి, ప్రార్థించాడు. అతడు వారి మానవ బలహీనతను గుర్తించి, విడుదల కోసం వేడుకున్నాడు. ప్రతిస్పందనగా, ప్రభువు తన రక్షణను వాగ్దానం చేశారు: “భయపడకుడి జడియకుడి” (2 దినవృత్తాంతములు 20:17).
మనల్ని నాశనం చేస్తానని బెదిరిస్తూ దండయాత్ర చేసే సైన్యం మన ఇంటి ముందు ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మనం ప్రతికూలత మరియు చెడు చేత చుట్టుముట్టబడినట్లు భావిస్తాము. మన విడుదల మార్గం యెహోషాపాతు కోరుకున్నటువంటిదే మరియు మన ప్రార్థన కూడా అతని దానివలె ఉండవచ్చు: “మా దేవా, … మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు” (2 దినవృత్తాంతములు 20:12).
2 దినవృత్తాంతములు 14–30 లో, మీరు యెహోషాపాతు మరియు యూదాలోని ఇతర రాజుల గురించి చదువుతారు. వారి విశ్వాసాధారిత సంస్కరణలు, విజయాలు మరియు సవాళ్లు మీ స్వంత జీవితానికి ఎలా వర్తిస్తాయో పరిగణించండి.
2 దినవృత్తాంతములు గ్రంథమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “దినవృత్తాంతములు” చూడండి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
2 దినవృత్తాంతములు 14–16
దేవునిపై నమ్మకముంచడం నాకు శాంతిని కలిగిస్తుంది.
ఆసా యూదా రాజుగా ఉన్నప్పుడు, నేడు మనమందరం ఎదుర్కొన్నట్లే, అతను చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతను ఎదుర్కొన్న పరీక్షల గురించి మీరు చదువుతున్నప్పుడు, అతను తన నమ్మకాన్ని ఎక్కడ ఉంచాడో మరియు కాలక్రమేణా అది ఎలా మారిందో గమనించండి.
|
సూచిక |
ఆసా ఎదుర్కొన్న సవాళ్ళు |
ఆసా నమ్మకముంచినది |
|---|---|---|
సూచిక 2 దినవృత్తాంతములు 14:9–12 | ||
సూచిక 2 దినవృత్తాంతములు 15:1–8 | ||
సూచిక 2 దినవృత్తాంతములు 16:1–10 |
కొన్నిసార్లు మనం ప్రభువును నమ్మడాన్ని ఎందుకు మానేస్తాము? ఆసా జీవితం నుండి మీరు ఇంకేమి నేర్చుకుంటారు?
ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “దేవునితో మన సంబంధము,” లియహోనా, మే 2022, 78–80 కూడా చూడండి.
2 దినవృత్తాంతములు 18
జనాదరణ పొందనప్పటికీ, నేను సత్యాన్ని సమర్థించగలను.
సిరియాకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో యెహోషాపాతు మరియు అహాబు రాజుల విజయాన్ని అంచనా వేయడానికి మీకాయా ప్రవక్త చాలా ఒత్తిడిని అనుభవించియుండవచ్చు. 2 దినవృత్తాంతములు 18:1–12లో ఆ ఒత్తిడికి సంబంధించిన రుజువు కోసం చూడండి. 13–27 వచనములలో మీకాయా ధైర్యం మరియు చిత్తశుద్ధికి మీరు ఏ రుజువును కనుగొంటారు? (14వ వచనములో, మీకాయా వ్యంగ్య ప్రతిస్పందనను ఇచ్చాడని గమనించండి; అతని నిజమైన సమాధానం 16వ వచనములో ఉంది.) 28–34 వచనములలో మీకాయా మాటలు ఎలా నెరవేరాయి?
మీకాయా ఎదుర్కొన్నట్లుగా మీరు ఒత్తిడిని ఎదుర్కొనే కొన్ని పరిస్థితులు ఏమిటి? ప్రభువు కొరకు మరియు ఆయన బోధనల కొరకు నిలబడడానికి మీకు ధైర్యాన్ని ఇచ్చేది ఏది?
యెహోషాపాతు రాజు కాలంలో మూడు దేశాలు యెరూషలేముపై దాడి చేశాయి.
2 దినవృత్తాంతములు 20:1–25
కష్టసమయాల్లో నేను దేవుని వైపు మరియు ఆయన ప్రవక్తల వైపు తిరుగగలను.
మీరు 2 దినవృత్తాంతములు 20:1–12 చదువుతున్నప్పుడు, యూదాపై దాడి చేయడానికి అనేక దేశాలు వచ్చినప్పుడు రాజైన యెహోషాపాతు ఏమి చేశాడో చూడండి. మీరు ఎదుర్కొనే సవాలుతో కూడిన పరిస్థితులలో మీరు అతని చర్యలను ఎలా అన్వయించగలరు?
యెహోషాపాతు ప్రార్థనకు ప్రభువు యొక్క ప్రతిస్పందన 14–17 వచనములలో కనిపిస్తుంది. కష్ట సమయాల్లో మిమ్మల్ని లేదా మీకు తెలిసిన వారిని ఓదార్చగల ఏ వాక్యభాగాలను మీరు అక్కడ కనుగొంటారు?
మరుసటి రోజు, యెరూషలేము యొక్క జనులు ప్రత్యర్థి సైన్యాన్ని ఎదుర్కోవడానికి బయలుదేరారు. మీరు 2 దినవృత్తాంతములు 20:20 చదువుతున్నప్పుడు, యెహోషాపాతు యెరూషలేము జనులకు ఇచ్చిన సందేశం కొరకు చూడండి. అతని మాటలు ఎలా నెరవేర్చబడ్డాయి? (22–23 వచనములు చూడండి). ఆయనను విశ్వసించినందుకు మరియు ఆయన ప్రవక్తలను అనుసరించినందుకు దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదించారు?
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు: “నా అనుభవం ఏమిటంటే, మీరు ప్రవక్త యొక్క ప్రకటనల వెనుక ప్రశ్నార్థక గుర్తులు పెట్టడం మానేసి, దానికి బదులుగా ఆశ్చర్యార్థక చిహ్నాలు పెట్టి, దానిని చేస్తే, ఆశీర్వాదాలు కురుస్తాయి. ‘ప్రవక్త ఒక ప్రవక్తగా ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడడు?’ అని నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. ‘నేను ఆయనలా ఎలా ఉండగలను?’” అనేదే నా ఆసక్తి అయ్యుంది (in Lane Johnson, “Russell M. Nelson: A Study in Obedience,” Ensign, Aug. 1982, 24).
సిద్ధాంతము మరియు నిబంధనలు 21:4–6; యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు మార్గదర్శి (2022), 4–5 లోని “ప్రేరేపిత ఎంపికలు చేయండి” విభాగాన్ని కూడా చూడండి.
A Secure Anchor
సత్యం యొక్క సాధారణ ప్రకటనలను గుర్తించండి. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ ఇలా బోధించారు: “లేఖనాలు మనకు చాలా సిద్ధాంతపరమైన వజ్రాలను అందిస్తున్నాయి. ఆత్మ యొక్క కాంతి వాటి అనేక కోణాలపై ఆడినప్పుడు, అవి సిలెస్టియల్ భావనతో మెరుస్తాయి మరియు మనం అనుసరించాల్సిన మార్గాన్ని ప్రకాశింపజేస్తాయి” (“According to the Desire of [Our] Hearts,” Ensign, Nov. 1996, 21). మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, చిన్నవైనప్పటికీ శక్తివంతమైన సందేశాలను గుర్తించడానికి, వాటిపై గురుతు పెట్టడానికి మరియు ధ్యానించడానికి సమయాన్ని వెచ్చించడాన్ని పరిగణించండి. కొన్ని ఉదాహరణలు 2 దినవృత్తాంతములు 14:11; 15:7; 18:13; 20:15; 26:5లో కనుగొనబడగలవు. మీరు కనుగొనగల ఇతర “సిద్ధాంతపరమైన వజ్రాలు” ఏవి?
2 దినవృత్తాంతములు 26:3–21
గర్వము నాశనానికి దారి తీస్తుంది.
యూదాలోని అనేకమంది ఇతర రాజుల మాదిరిగానే, ఉజ్జియా పాలన కూడా గొప్ప విజయాలతో ప్రారంభమైంది, కానీ విషాదంతో ముగిసింది. 2 దినవృత్తాంతములు 26లో ఈ నమూనా కోసం చూడండి. ఏది ఉజ్జియా జీవితాన్ని మలుపు తిప్పిందని మీరు చెబుతారు?
మీరు 16 23 వచనములు చదువుతున్నప్పుడు, ఈ సమయంలో యాజకులు మాత్రమే దేవాలయంలో ధూపం వేయడానికి అనుమతించబడేవారని గుర్తుంచుకోండి. ఉజ్జియా రాజు దేవునికి అవిధేయత చూపాడని మీరెందుకు అనుకుంటున్నారు? విషాదకరమైన ఈ అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
2 దినవృత్తాంతములు 30
నేను సమాధానపరచువానిగా ఉండగలను.
2 దినవృత్తాంతములు 30లో, హిజ్కియా యూదా యొక్క రాజు. అతను పస్కా పండుగను జరుపుకోవడానికి యెరూషలేములో సమకూడమని ప్రత్యర్థియైన ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆహ్వానించాడు—ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలుగా ఈ పని చేయలేకపోయారు (1-12 వచనములు చూడండి). ఆహ్వానం గురించి మరియు ఇశ్రాయేలీయుల అతిథులు మరియు యూదాలోని వారి అతిధేయల ద్వారా అది ఎలా స్వీకరించబడింది అనే విషయంలో మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది?
చాలా కాలం గడిచినందున, యెరూషలేముకు వచ్చిన కొంతమంది సందర్శకులకు పస్కాలో ఎలా పాల్గొనాలనే వివరాలు తెలియవు. మీరు 2 దినవృత్తాంతములు 30:18–27 చదువుతున్నప్పుడు, హిజ్కియా ప్రతిస్పందన నుండి మరియు అతని ప్రతిస్పందన యొక్క ఫలితాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
రస్సెల్ ఎమ్. నెల్సన్, “సమాధానపరచువారు కావాలి,” లియహోనా, మే 2023, 98-101 కూడా చూడండి.
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
2 దినవృత్తాంతములు 14– 16; 20
నేను దేవుడిని నమ్మగలను.
-
ప్రభువును నమ్మాలనే ఆలోచనను పరిచయం చేయడానికి, వర్షం పడుతున్నప్పుడు మిమ్మల్ని పొడిగా ఉంచుతుందని మీరు నమ్మే గొడుగు లేదా జాకెట్ వంటి వాటిని మీ పిల్లలకు చూపించవచ్చు. మనం వీటిని ఎందుకు నమ్మగలము అనే దాని గురించి వారిని మాట్లాడనివ్వండి. అప్పుడు ప్రభువుపై మనకున్న నమ్మకంతో దానిని పోల్చడానికి వారికి సహాయం చేయండి. మనల్ని ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉంచుతారని మనం ఆయనను ఎందుకు నమ్ముతాము?
-
ప్రభువుపై నమ్మకం ఉంచడం ద్వారా ఆసా రాజు మరియు యెహోషాపాతు రాజు సవాళ్లపట్ల ఎలా స్పందించారో కనుగొనడానికి మీరు మీ పిల్లలకు సహాయం చేయవచ్చు (2 దినవృత్తాంతములు 14:11; 20:3–5, 12 చూడండి). మీరు ప్రభువును నమ్ముతున్నారని చూపించే మార్గాలను పరస్పరం పంచుకోండి.
2 దినవృత్తాంతములు 20:1–29
దేవుడు నా ప్రార్థనలను విని, జవాబిస్తారు.
-
యెహోషాపాతు ప్రార్థన మరియు ప్రభువు సమాధానం యొక్క కథను మీ పిల్లలకు అర్థం చేసుకోవడానికి ఈ వారం ప్రోత్సాహకార్యక్రమ పేజీ సహాయపడుతుంది. దేవుడు మీ ప్రార్థనలను విని, వాటికి సమాధానమిచ్చిన సమయాల గురించి మీరు మరియు మీ పిల్లలు పంచుకోవచ్చు. మీరు ఆశించని రీతిలో లేదా సమయాల్లో సమాధానాలు వచ్చిన క్షణాలను కూడా చేర్చడాన్ని పరిగణించండి.
2 దినవృత్తాంతములు 26:3–23
నేను వినయంగా ఉండగలను.
-
గర్వం యొక్క ప్రమాదాల గురించి తెలుసుకోవడానికి, మీ పిల్లలు బ్లాకులు లేదా చిన్న కప్పులతో ఒక గోపురాన్ని నిర్మించవచ్చు. వారు ప్రతి బ్లాకును లేదా కప్పును గోపురంపై ఉంచినప్పుడు, 2 దినవృత్తాంతములు 26:3–15 నుండి ఉజ్జియా సాధించిన వాటిలో ఒకదాన్ని గుర్తించడంలో వారికి సహాయపడండి. వారు గోపురాన్ని పూర్తి చేసిన తర్వాత, ఉజ్జియా దానిని ఎత్తుగా మరియు బలంగా ఎలా ఉంచియుండవచ్చో మీ పిల్లలతో చర్చించండి. ఏది దానిని పడిపోయేలా చేయగలదు? ఆ తర్వాత, మీరు 16వ వచనమును చదువుతున్నప్పుడు, మన మనస్సులలో “గర్వించి చెడిపోవడం” అంటే ఏమిటనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. 16–23 వచనములలో ఉజ్జియాకు ఏమి జరిగిందో మీ పిల్లలతో పంచుకోండి. వారు తమ గోపురాన్ని పడగొట్టనివ్వండి. వినయంగా ఉండేందుకు మనం ఏమి చేయగలమనే దాని గురించి మాట్లాడండి.
King Hezekiah and the People Thank God [రాజైన హిజ్కియా మరియు జనులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు], © Lifeway Collection/licensed from goodsalt.com
2 దినవృత్తాంతములు 30
నేను సమాధానపరచువానిగా ఉండగలను.
-
ఇశ్రాయేలు రాజ్యము నుండి యూదా పొరుగువారిని వారితో పస్కా జరుపుకోవడానికి హిజ్కియా ఆహ్వానించడం పై చిత్రంలో చూపబడింది. మీరు మీ పిల్లలతో ఈ చిత్రాన్ని చూసి, 2 దినవృత్తాంతములు 30:18–19 చదవవచ్చు, ఇది కొంతమంది అతిథులు మోషే చట్టం ప్రకారం తమను తాము పవిత్రపరచుకోలేదని వివరిస్తుంది. హిజ్కియా ఏమి చేసాడు? ఇది అతిథులు ఎలా భావించేలా చేసియుండవచ్చు? ఇతరులను ఆదరించే విధానంలో వారు హిజ్కియాలా ఎలా ఉండగలరో ఆలోచించడానికి మీ పిల్లలకు సహాయం చేయండి.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.