2024 రండి, నన్ను అనుసరించండి
జూన్ 29–జూలై 5. “యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి”: 1 రాజులు 12–13; 17–22


“జూన్ 29–జూలై 5. ‘యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి’: 1 రాజులు 12–13; 17–22,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“జూన్ 29–జూలై 5. ‘యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

మండుచున్న బలిపీఠము ముందున్న ఏలీయా

Elijah Contends against the Priests of Baal [బయలు యాజకులతో వాదించుచున్న ఏలీయా], జెర్రీ హార్‌స్టన్ చేత

జూన్ 29–జూలై 5: “యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి”

1 రాజులు 12–13; 17–22

ఇశ్రాయేలీయులు కలవరమందుండిరి. రాజ్యము విభజించబడింది, పది గోత్రములు ఇశ్రాయేలుకు ఉత్తరము వైపునున్న రాజ్యమును, రెండు గోత్రములు యూదాకు దక్షిణము వైపునున్న రాజ్యమును నిర్మించాయి. కానీ ఒకదాని నుండి మరొకటి విడిపోవడం కంటే ఘోరమైనది రెండు రాజ్యాలు తమ నిబంధనల నుండి వేరుచేయబడడం. దుష్ట రాజులు జనులను ప్రభువు నుండి దూరంగా నడిపించారు మరియు చాలామంది జనులు తమ విశ్వాసం నుండి కదిలించబడ్డారు.

ఈ నేపథ్యంలో, ప్రభువు ఏలీయాను ప్రవక్తగా పిలిచారు. ఒక వ్యక్తి చెడ్డ పరిస్థితులలో కూడా ప్రభువుపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండగలడని అతని జీవితం చూపిస్తుంది. పరలోకము నుండి అగ్ని క్రిందకు రావడం వంటి మనోహరమైన బహిరంగ అద్భుతాలతో కొన్నిసార్లు అటువంటి విశ్వాసానికి ప్రభువు స్పందిస్తారు. అయితే, విశ్వాసురాలైన విధవరాలు మరియు ఆమె కుమారుడి వ్యక్తిగత అవసరాలను తీర్చడం వంటి నిమ్మళమైన, వ్యక్తిగత అద్భుతాలను కూడా ఆయన చేస్తారు. చాలా తరచుగా ఆయన అద్భుతాలు ఎంత వ్యక్తిగతంగా ఉంటాయంటే అవి ఒక్క వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి—ఉదాహరణకు, “మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము” (1 రాజులు 19:12) ద్వారా ప్రభువు తననుతాను మీకు బయల్పరచడం వంటివి.

ఏలీయా గురించి అధిక సమాచారము కొరకు, బైబిలు నిఘంటువులో “ఏలీయా” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

1 రాజులు 12:1-20

క్రీస్తు వంటి నాయకులు తాము నడిపించే జనులకు సేవచేస్తారు.

1 రాజులు 12:1–14లో సొలొమోను కుమారుడైన రెహబాము రాజు చేసిన తప్పును మీరెలా వివరిస్తారు? రెహబాము తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి క్రీస్తువంటి ఏ లక్షణాలు సహాయపడగలిగియుండేవి? (7వ వచనము; మత్తయి 20:25–28; మోషైయ 2:10–21 చూడండి). ఒక సంఘ పిలుపు‌లో అయినా లేదా మీ స్వంత జీవితానికి నాయకుడిగా అయినా—మీరు ఈ లక్షణాలను ఒక నాయకుడిగా ఎలా ఉపయోగించగలరు?

1 రాజులు 17:8–16; 19:19–21

సెమినరీ చిహ్నము
త్యాగము చేయమని ఇవ్వబడే ఆహ్వానము యేసు క్రీస్తునందు నా విశ్వాసాన్ని సాధన చేయడానికి గల ఒక అవకాశము.

ఆకలితోనున్న ఆమె కుమారుడు మరియు ఆమె తినడానికి ముందు అతనికి ఆహారము, నీరు ఇవ్వమని సారెపతులోని విధవరాలిని ఏలీయా ప్రవక్త అడిగాడు. ఆయన ఎందుకు అలా చేసి ఉండవచ్చు? ఏలీయా అభ్యర్థన ఈ చిన్న కుటుంబానికి ఒక దీవెనగా కూడా చూడబడవచ్చు. వారికి ప్రభువు యొక్క దీవెనలు అవసరము మరియు బలమైన విశ్వాసము యొక్క దీవెనతో పాటు—త్యాగము తరచు దీవెనలను తెస్తుంది.

1 రాజులు 17:8–16ను మీరు చదివినప్పుడు, మీరే ఆ విధవరాలు అయినట్లు ఊహించండి. ఆమె గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? యేసు క్రీస్తు నందు విశ్వాసం అవసరమైన ఎంపికల జాబితాను కూడా మీరు చేయవచ్చు (ఉదాహరణల కొరకు, యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శి [2022] చూడండి). విశ్వాసాన్ని అభ్యసించడం గురించి ఈ విధవరాలి నుండి మీరేమి నేర్చుకుంటారు?

1 రాజులు 19:19–21లో ఏలీయా చర్యలు ఏ విధంగా విధవరాలి చర్యలను పోలియున్నాయి?

రక్షకుడిని అనుసరించడానికి మీరు చేసిన త్యాగాల గురించి ఆలోచించండి. ఈ త్యాగాల గురించి 1 రాజులు 17:8–16; 19:19–21 మీకేమి బోధిస్తుంది? త్యాగాలు చేయమని ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు, రక్షకుని గురించిన మీ జ్ఞానం మీకెలా సహాయం చేస్తుంది? ఆయన మిమ్మల్ని ఎలా దీవించారు?

మత్తయి 4:18–22; 6:25–33; లూకా 4:24–26 కూడా చూడండి.

10:13

Elijah and the Widow of Zarephath

1 రాజులు 18

“యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి.”

తుఫానులకు, వర్షాలకు దేవుడుగా పిలువబడే బయలును ఆరాధించడానికి తమకు మంచి కారణాలు ఉన్నాయని ఇశ్రాయేలీయులు భావించి ఉండవచ్చు. మూడేళ్ళ కరువు తరువాత వారికి వానలు చాలా అవసరమయ్యాయి. బయలు ఆరాధన సామాజికంగా అంగీకరించబడింది మరియు రాజు, రాణిల చేత ఆమోదించబడింది. 1 రాజులు 18ని మీరు చదివినప్పుడు, మన కాలంలో ఎవరైనా ప్రభువును అనుసరించడం గురించి ఎందుకు అనిశ్చితంగా ఉండవచ్చో ఆలోచించండి. ఈ అధ్యాయములో, ప్రభువు తన గురించి ఏమి బోధించడానికి ప్రయత్నిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? రక్షకుడిని అనుసరించడానికి నిబద్ధులైయుండేందుకు ఏ అనుభవాలు మీకు సహాయపడ్డాయి?

హోరేబు కొండపై ఏలీయా

ఏలీయా యొక్క వివరణ, విల్సన్ ఆంగ్ చేత

1 రాజులు 19:1–18

ప్రభువు తరచు నిమ్మళమైన, సరళమైన విధానాలలో మాట్లాడతారు.

దురదృష్టవశాత్తు, కర్మెలు పర్వతంపై జరిగిన అద్భుతం ఏలీయా నియమితకార్యాన్ని సులభతరం చేయలేదు. నిజానికి, అతని ప్రాణం ప్రమాదంలో ఉంది మరియు అతను అరణ్యంలో ఒక గుహలో దాక్కోవలసి వచ్చింది. అక్కడ ఒంటరితనము మరియు నిరాశతో శ్రమపడుతూ అతడు ప్రభువుతో ఒక అనుభవాన్ని కలిగియున్నాడు, అది కర్మెలు పర్వతంపై జరిగిన దానికంటే చాలా భిన్నమైనది. మీకు అవసరమైన సమయాల్లో ప్రభువు మీతో ఎలా సంభాషిస్తారనే దాని గురించి 1 రాజులు 19:1–18లో ఏలీయా అనుభవము మీకేమి బోధిస్తుంది?

ప్రభువు మీతో మాట్లాడినట్లు మీరు భావించే సమయాల గురించి ఆలోచించండి. ఆయన మీతో సంభాషించే విధానాన్ని మీరు ఎలా వివరిస్తారు? ఆత్మ యొక్క స్వరాన్ని వివరించడానికి “నిశ్చలమైన” మరియు “చిన్న” అనే పదాలు ఎందుకు మంచి మార్గాలు? హీలమన్ 5:30; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:22–23; 11:12–14 లో మీరు కనుగొన్న ఇతర పదాలేవి? మరింత తరచుగా ప్రభువు యొక్క నడిపింపును పొందడానికి మీరేమి చేయాలి?

కీర్తనలు 46:10 కూడా చూడండి.

అభ్యాసాన్ని మెరుగుపరచడానికి బహుళ ఇంద్రియాలను ఉపయోగించండి. మనమందరం మన పంచేంద్రియాల ద్వారా ప్రపంచం గురించి నేర్చుకుంటాము. ఆ ఇంద్రియాలను ఉపయోగించడం సువార్త అభ్యాసాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఉదాహరణకు, మీరు 1 రాజులు 19లో ప్రభువు యొక్క స్వరం గురించి నేర్చుకుంటున్నప్పుడు లేదా బోధిస్తున్నప్పుడు “నిశ్చలమైన” మరియు “చిన్న” అనే పదాలను వివరించడానికి మీరు ఉపయోగించగల చిత్రాలు లేదా శబ్దాల గురించి ఆలోచించండి.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

1 రాజులు 17

ఆయన యందు నేను విశ్వాసము కలిగియున్నప్పుడు, ప్రభువు నన్ను దీవిస్తారు.

  • 1 రాజులు 17లోని విశ్వాసపూరితమైన కథలను నేర్చుకోవడంలో మీ పిల్లలకు సహాయపడడానికి, మీరు కథలను వివరించడానికి పక్షులు, రొట్టె లేదా బాలుడు వంటి చిత్రాలను లేదా వస్తువులను వారికి చూపించవచ్చు. మీరు ఈ కథలను మీ పిల్లలకు చెప్పేటప్పుడు, ప్రతి కథకు సంబంధించిన చిత్రాన్ని లేదా వస్తువును కనుగొనడానికి వారిని ఆహ్వానించండి. “ప్రవక్తయైన ఏలీయా” (పాత నిబంధన కథలు, 121–24లో) ఈ కథలను చెప్పడంలో మీకు సహాయం చేస్తుంది. యేసు క్రీస్తుపై విశ్వాసం చూపించడం గురించి ప్రతి కథ మనకు ఏమి బోధిస్తుంది?

    1:58

    Elijah the Prophet

  • యేసు క్రీస్తుపై తమ విశ్వాసాన్ని చూపించగల మార్గాల గురించి ఆలోచించడంలో మీ పిల్లలకు సహాయం చేయండి. వారితో కలిసి విశ్వాసం గురించి పాట పాడండి, ఉదాహరణకు “I Have Faith in the Lord, Jesus Christ [నాకు ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసం ఉంది]” (Gospel Library) మరియు పాట నుండి విశ్వాసం గురించి మీరు నేర్చుకున్న వాటిని ఒకరితో ఒకరు పంచుకోండి.

ఏలీయా, ఒక విధవరాలు మరియు ఆమె కుమారుడు

ఏలీయా మరియు విధవరాలి కుమారుడు స్వస్థత పొందడం యొక్క వివరణ, చార్ల్స్ ఎడ్మండ్ బ్రాక్ చేత

1 రాజులు 17:8–16

త్యాగం చేయమని ప్రభువు నన్ను కోరినప్పుడు, నేను విశ్వాసంతో లోబడగలను.

  • ఏలీయాకు ఏమి ఇవ్వమని ప్రభువు విధవరాలిని అడిగారు (1 రాజులు 17:12–13 చూడండి) మరియు దానికి ప్రతిఫలంగా ఆ విధవరాలు ఏమి పొందింది (1 రాజులు 17:15–16 చూడండి) అనేదాని చిత్రాన్ని బహుశా మీ పిల్లలు చిత్రించగలరు. (ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీ కూడా చూడండి.) మంచి దాని కోసం వారు కోరుకున్నదాన్ని వదులుకున్న ఇతర వ్యక్తుల చిత్రాల కోసం కూడా వారు చూడవచ్చు. Gospel Art Book [సువార్త కళా పుస్తకము] లేదా రండి, నన్ను అనుసరించండి లో చిత్రాలను కనుగొనమని మీ పిల్లలను ఆహ్వానించండి. దేనిని త్యాగం చేయమని ప్రభువు మనల్ని కోరుతున్నారు? ఆయన మనల్ని ఎలా దీవిస్తారు?

1 రాజులు 18:17-39

నేను యేసు క్రీస్తును అనుసరించడానికి ఎంచుకోగలను.

  • మీరు 1 రాజులు 18:17-39 కలిసి చదువుతున్నప్పుడు, మీ పిల్లలు ఒక వచనం ఎంచుకుని, అది వివరించే చిత్రాన్ని గీయవచ్చు. వారి స్వంత మాటలలో కథను చెప్పడానికి వారు తమ చిత్రాలను ఉపయోగించవచ్చు. (పాత నిబంధన కథలు, 125–28లో “ఏలీయా మరియు బయలు యాజకులు” కూడా చూడండి.)

    2:17

    Elijah and the Priests of Baal

  • మీ పిల్లలు యేసు క్రీస్తును అనుసరించాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితుల గురించి ఆలోచించడంలో వారికి సహాయపడండి. బహుశా వారు సరైన ఎంపిక చేస్తున్నట్లుగా తమ స్వంత చిత్రాలను గీయవచ్చు. మీరు యేసును అనుసరించడానికి ఎందుకు ఎంచుకున్నారో ఒకరితో ఒకరు పంచుకోండి.

1 రాజులు 19:9-12

పరిశుద్ధాత్మ యొక్క మిక్కిలి నిమ్మళమైన స్వరం ద్వారా ప్రభువు నాతో మాట్లాడతారు.

  • మీరు 1 రాజులు 19:9–12 యొక్క సారాంశం చెప్తున్నప్పుడు, బలమైన గాలి, భూకంపం మరియు అగ్నిని సూచించే అభినయాలను చేయడానికి మీ పిల్లలను ఆహ్వానించండి. ఆ తర్వాత, “మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము” (12వ వచనము) అని నిశ్శబ్ద స్వరంతో మీరు కలిసి చెప్తున్నప్పుడు కదలకుండా కూర్చోమని వారిని ఆహ్వానించండి. (పాత నిబంధన కథలు, 129– 31లో “ప్రభువు ఏలీయాతో మాట్లాడును” కూడా చూడండి.) పరిశుద్ధాత్మ యొక్క మిక్కిలి నిమ్మళముగా మాటలాడు స్వరమును మీరు అనుభవించిన సమయాల గురించి మీ పిల్లలకు చెప్పండి.

    1:48

    The Lord Speaks to Elijah

  • ఆత్మను గుర్తించకుండా మనల్ని ఏది కలవరపెడుతుంది? ఆయన మాట వినడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

సారెపతు యొక్క విధవరాలు మరియు ఆమె కుమారుడు

Widow of Zarephath [సారెపతు యొక్క విధవరాలు], రోస్ డేటాక్ డాల్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: త్యాగం చేయమని ప్రభువు నన్ను కోరినప్పుడు, నేను విశ్వాసంతో లోబడగలను