2024 రండి, నన్ను అనుసరించండి
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: “‘ఇంటికి రండి,’ అని ఇశ్రాయేలీయులందరికి యేసు చెప్పును”


“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ‘‘ఇంటికి రండి,’ అని ఇశ్రాయేలీయులందరికి యేసు చెప్పును,”’” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ‘‘ఇంటికి రండి,’ అని ఇశ్రాయేలీయులందరికి యేసు చెప్పును,”’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

ఆలోచనల చిహ్నము

జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు

“‘ఇంటికి రండి,’ అని ఇశ్రాయేలీయులందరికి యేసు చెప్పును”

సీనాయి అరణ్యములో, మోషే ఇశ్రాయేలీయులను కొండ క్రింద సమావేశపరిచాడు. అప్పుడే స్వేచ్ఛను పొందిన ఈ బానిసల సమూహాన్ని ఒక బలమైన జనముగా మార్చాలని ఆయన కోరుతున్నట్లు అక్కడ ప్రభువు ప్రకటించారు. “మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని” ఆయన చెప్పారు (నిర్గమకాండము 19:6). అతి పెద్ద, శక్తివంతమైన శత్రువుల చేత చుట్టబడినప్పుడు కూడా, వారు ఫలించి, అభివృద్ధి చెందుతారని ఆయన వాగ్దానమిచ్చారు.

ఇశ్రాయేలీయులు విస్తారముగా లేదా బలముగా ఉండుట వలన లేదా నైపుణ్యము కలిగి ఉండుట వలన ఇదంతా జరుగలేదు. “కాగా [ఆయన] మాట శ్రద్ధగా విని, [ఆయన] నిబంధనను అనుసరించి నడిచిన యెడల” ఇది జరుగుతుందని ప్రభువు వివరించారు (నిర్గమకాండము 19:5). వారిని బలముగా చేసేది దేవుని యొక్క శక్తే కానీ వారి స్వశక్తి కాదు.

అయినప్పటికీ, ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ ఆయన స్వరమును వినలేదు మరియు కాలక్రమేణా వారు ఆయన నిబంధనను పాటించుట మానివేసారు. అనేకమంది ఇతర దేవతలను ఆరాధిస్తూ, వారి చుట్టూ ఉన్న సంప్రదాయాల ఆచారాలను పొందుపరచుకున్నారు. ఇతరుల నుండి ప్రత్యేకపరచి, వారిని ఒక రాజ్యముగా చేసిన ముఖ్యమైన విషయాన్ని—అనగా ప్రభువుతో వారి నిబంధన అనుబంధాన్ని వారు తిరస్కరించారు. వారిని రక్షించడానికి దేవుని శక్తి లేనప్పుడు, వారి శత్రువులను ఆపగలిగేది ఏదీ లేదు.

చెదరగొట్టబడుట

దాదాపు క్రీ.పూ. 735 మరియు 720 మధ్య, అనేకసార్లు అష్షూరు రాజు పన్నెండు గోత్రములలో పదివాటికి గృహమైన ఇశ్రాయేలు యొక్క ఉత్తర రాజ్యమును ముట్టడి చేసి, అష్షూరు సామ్రాజ్యములో వేర్వేరు భాగాలకు వేలమంది ఇశ్రాయేలీయులను బందీలుగా కొనిపోయాడు. ఈ ఇశ్రాయేలీయులు కొంతవరకు “తప్పిపోయిన గోత్రములుగా” పిలువబడ్డారు, ఎందుకంటే వారు తమ స్వదేశమునుండి తీసివేయబడి ఇతర రాజ్యముల మధ్య చెదరగొట్టబడ్డారు. కానీ వారు లోతైన భావములో కూడా తప్పిపోయారు: కాలక్రమేణా దేవుని యొక్క నిబంధన జనులుగా వారి గుర్తింపు భావనను వారు కోల్పోయారు.

చివరికి యూదా దక్షిణ రాజ్యంలో చాలామంది జనులు కూడా ప్రభువు నుండి దూరమయ్యారు. అష్షూరీయులు ఆ రాజ్యంలో చాలా వరకు దాడి చేసి జయించారు; యెరూషలేము మాత్రమే అద్భుతంగా కాపాడబడింది. తరువాత, క్రీ.పూ. 597 మరియు 580 మధ్య, బబులోనీయులు దేవాలయంతో సహా యెరూషలేమును నాశనం చేశారు మరియు అనేక మందిని బందీలుగా తీసుకెళ్ళారు. దాదాపు 70 సంవత్సరాల తరువాత, యూదా యొక్క ఒక శేషము యెరూషలేముకు తిరిగి వెళ్లి, దేవాలయమును తిరిగి కట్టడానికి అనుమతించబడ్డారు. అయినప్పటికీ, అనేకమంది బబులోనులో ఉండిపోయారు.

అగ్ని చేత దహించివేయబడిన యెరూషలేము

The Destruction of Jerusalem by Nebuzar-adan [నెబుజారదన్ చేత యెరూషలేము యొక్క నాశనము], విలియం బ్రాస్సి హోల్ చేత, © Providence Collection/licensed from goodsalt.com

తరములు గతించినప్పుడు, అన్ని గోత్రముల నుండి ఇశ్రాయేలీయులు “వారెరుగని అన్యజనులలో సుడిగాలితో … చెదరగొట్టబడ్డారు” (జెకర్యా 7:14). కొందరిని ప్రభువు వేరే దేశాలకు నడిపించారు. ఇతరులు నిర్బంధం నుండి తప్పించుకోవడానికి లేదా రాజకీయ లేదా ఆర్థిక కారణాలతో ఇశ్రాయేలును విడిచిపెట్టారు.

ఈ సంఘటనలను మనము ఇశ్రాయేలు చెదరగొట్టబడుట అని పిలుస్తాము. అనేక కారణముల వలన, చెదిరిపోవుట గురించి తెలుసుకోవడం ముఖ్యమైనది. ఒక కారణం చేత అది పాత నిబంధన యొక్క ప్రధాన విషయముగా ఉన్నది—అదేమనగా అనేకమంది పాత నిబంధన ప్రవక్తలు ఇశ్రాయేలు చెదరిపోవుటకు దారితీసిన ఆధ్యాత్మిక పతనానికి సాక్షులుగా ఉన్నారు. వారు దానిని ముందుగా చూసారు మరియు దాని గురించి హెచ్చరించారు. వారిలో కొంతమంది దానిలో జీవించారు కూడా. పాత నిబంధన యొక్క తరువాయి భాగములో మీరు యెషయా, యిర్మీయా, ఆమోసు మరియు ఇతర ప్రవక్తల గ్రంథాలను చదువుతున్నప్పుడు దానిని జ్ఞాపకముంచుకోవడం సహాయకరంగా ఉంటుంది. ఈ భావనను మనస్సులో ఉంచుకొని, అష్షూరు మరియు బబులోను, విగ్రహారాధన మరియు దాస్యము, నిస్సహాయస్థితి మరియు చివరికి పునఃస్థాపించబడుట గురించి వారి ప్రవచనాలను మీరు చదువుతున్నప్పుడు, వారు దేని గురించి మాట్లాడుతున్నారో మీరు తెలుసుకుంటారు.

ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడుటను అర్థము చేసుకోవడం మోర్మన్ గ్రంథమును మీరు బాగా గ్రహించడానికి సహాయపడుతుంది, ఎందుకంటే మోర్మన్ గ్రంథము చెదిరిపోయిన ఇశ్రాయేలు శాఖ యొక్క నివేదిక. ఈ నివేదిక క్రీ.పూ. 600వ సంవత్సరము దగ్గరలో బబులోనీయులు ముట్టడి చేయడానికి కొంచెం ముందుగా, లీహై కుటుంబము యెరూషలేము నుండి పారిపోవుటతో మొదలవుతుంది. ఇశ్రాయేలు చెదరగొట్టబడుట గురించి ప్రవచించిన ఆ ప్రవక్తలలో లీహై ఒకరు. మరియు అతడి కుటుంబము ఇశ్రాయేలు సంతతి యొక్క తమ శాఖను తీసుకొనివెళ్ళి, ప్రపంచానికి మరొకవైపున, అమెరికాలో నాటి ఆ ప్రవచనము నెరవేర్చబడుటకు సహాయపడింది.

సమకూర్చబడుట

అయినప్పటికీ, ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడుట, కథలో సగభాగము మాత్రమే. ప్రభువు తన జనులను మరచిపోరు లేదా వారు ఆయనను విడిచిపెట్టినప్పుడు కూడా ఆయన వారిని విడిచిపెట్టరు. ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడతారనే అనేక ప్రవచనాలు దేవుడు ఒకరోజు వారిని సమకూర్చుననే అనేక వాగ్దానములతో కూడియున్నవి.

ఆ దినము నేడే—మన దినము. సమకూర్చబడుట ఇదివరకే ప్రారంభమైంది. 1836 లో, సీనాయి కొండ క్రింద మోషే ఇశ్రాయేలీయులను సమావేశపరచిన వేల సంవత్సరాల తరువాత, కర్ట్‌లాండ్ దేవాలయములో జోసెఫ్ స్మిత్‌కు మోషే ప్రత్యక్షమై “భూమి యొక్క నలుమూలల నుండి ఇశ్రాయేలీయులను పోగుచేయుటకు తాళపు చెవులను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11) అప్పగించాడు. ఇప్పుడు, ఈ తాళపుచెవులు కలిగిన వారి నడిపింపు క్రింద, ప్రభువు సేవకులు వెళ్ళగలిగే ప్రతీ రాజ్యము నుండి ఇశ్రాయేలు గోత్రములు సమకూర్చబడుతున్నాయి.

కర్ట్‌లాండ్ దేవాలయములో జోసెఫ్ స్మిత్‌ మరియు ఆలీవర్ కౌడరీలకు అగుపించిన మోషే

Moses, Elias, and Elijah Appear in the Kirtland Temple [కర్ట్‌లాండ్ దేవాలయంలో అగుపించిన మోషే, ఎలియాసు మరియు ఏలీయా], గ్యారీ ఈ. స్మిత్ చేత

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ సమకూర్పును “నేడు భూమి మీద జరుగుతున్న అత్యంత ముఖ్యమైన విషయముగా” పిలిచారు. దాని పరిమాణానికి, దాని ప్రాముఖ్యతకు, దాని ఘనతకు ఏదీ సరిపోదు. మీరు ఎన్నుకున్నట్లైతే, మీరు కోరుకుంటే, మీరు కూడా దానిలో పెద్ద భాగం పొందగలరు.“

మనము ఏవిధంగా సహాయం చేయగలము? ఇశ్రాయేలును సమకూర్చుట అనగా అర్థమేమిటి? వారు ఒకసారి నివసించిన దేశానికి పన్నెండు గోత్రములను తిరిగి పునఃస్థాపించుట అని దానర్థమా? వాస్తవానికి, దాని అర్థము ఇంకా గొప్పది, ఇంకా ఎక్కువ నిత్యమైనది. అధ్యక్షులు నెల్సన్ వివరించినట్లుగా:

సమకూర్చుట గురించి మనం మాట్లాడినప్పుడు, మనం కేవలం ఈ ప్రాథమిక సూత్రాన్ని చెప్పుచున్నాము: తెరకు ఇరువైపులా ఉన్న మన పరలోక తండ్రి యొక్క పిల్లలలో ప్రతీఒక్కరు, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త సందేశమును వినుటకు అర్హులు.…

“దేవునితో నిబంధనలు చేయుటకు మరియు వారి ముఖ్యమైన బాప్తిస్మపు నిబంధనలు, దేవాలయ నిబంధనలు పొందుట వైపు ఒక అడుగు వేయుటకు—ఏ సమయంలోనైనా, మీరు చేసేది ఏదైనా, అదిఎవరికైనా తెరకు ఇరువైపులా—సహాయపడిన యెడల, ఇశ్రాయేలును సమకూర్చుటకు మీరు సహాయపడుతున్నారు. అది అంత సులభమైనది.”

యెషయా చెప్పినట్లుగా, “ఒకరినొకరు” (యెషయా 27:12) లేదా యిర్మీయా ఊహించినట్లుగా, “ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరినిగాను” (యిర్మీయా 3:14) ఇది జరుగుతుంది.

ఇశ్రాయేలును సమకూర్చుట అనగా దేవుని పిల్లలను ఆయన యొద్దకు తిరిగి తెచ్చుట. దాని అర్థము ఆయనతో వారి నిబంధన సంబంధమునకు వారిని పునఃస్థాపించుట. దాని అర్థము చాలా కాలం క్రితం ఆయన స్థాపించుటకు ఉద్దేశించిన “పరిశుద్ధమైన జనమును” తిరిగి స్థాపించుట (నిర్గమకాండము 19:6).

ఇంటికి రండి

దేవునితో నిబంధన చేసుకున్న వారిగా మీరు ఇశ్రాయేలు సంతతిలో భాగము. మీరు సమకూర్చబడ్డారు మరియు మీరు సమకూర్చేవారు. నిబంధన జనుల యొక్క శతాబ్దాల సుదీర్ఘ పురాణగాథ దాని అంతానికి చేరుకుంటోంది మరియు మీరు కీలకమైన పాత్రధారులు. “‘ఇంటికి రండి’ అని యేసు ఇశ్రాయేలీయులందరికి” చెప్పే సమయము ఇదే.

సమకూర్చువారి సందేశము ఇదే: నిబంధన చేయుటకు ఇంటికి రండి. సీయోనులో ఇంటికి రండి. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన, యేసు క్రీస్తు యొద్దకు ఇంటికి రండి, ఆయన మీ తండ్రియైన దేవుని యొద్దకు ఇంటికి మిమ్మల్ని తీసుకొనివస్తారు.

వివరణలు

  1. ద్వితీయోపదేశకాండము 28:1–14 చూడండి.

  2. 2 రాజులు 17:6-7; 2 దినవృత్తాంతములు 36:12-20.

  3. 2 రాజులు 17:1-7 చూడండి. అష్షూరు చేత చెరపట్టబడిన పది గోత్రములు రూబేను, సిమ్యోను, ఇశ్శాఖారు, జెబులూను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఎఫ్రాయిము, మరియు మనష్షే. లేవీయ గోత్రపు సభ్యులు వారి యాజకత్వ బాధ్యతలను నెరవేర్చడానికి మిగిలిన గోత్రపు భూభాగాలంతటా విస్తరించబడ్డారు.

  4. 2 రాజులు 19; యెషయా 10:12–13 చూడండి.

  5. 2 రాజులు 24–25; 2 దినవృత్తాంతములు 36; యిర్మీయా 39; 52 చూడండి.

  6. ఎజ్రా 1; 7; నెహెమ్యా 2 చూడండి.

  7. 2 నీఫై 1:1-5; ఓంనై 1:15-16 చూడండి.

  8. 2 రాజులు 25:22–26; యిర్మీయా 42:13–19; 43:1–7 చూడండి.

  9. క్రీ.శ. 70 లో, యెరూషలేము మరియు దాని దేవాలయము మరలా నాశనము చేయబడింది, ఈసారి రోమీయుల చేత మరియు మిగిలిన యూదులు అనేక రాజ్యములంతటా చెదిరిపోయారు.

  10. యిర్మీయా 29:18; యెహెజ్కేలు 22:15; హోషేయ 9:17; ఆమోసు 9:9; 1 నీఫై 1:13 చూడండి.

  11. 1 నీఫై 15:12 చూడండి.

  12. 1 నీఫై 1:13, 18-20; 10:12–14 చూడండి.

  13. యెషయా 5:26; 27:12; 54; యిర్మీయా 16:14–15; 29:14; 31:10; యెహెజ్కేలు 11:17; 34:12; 37:21–28; జెకర్యా 10:8; 1 నీఫై 10:14; 22:25; 3 నీఫై 16:1–5; 17:4 చూడండి.

  14. Russell M. Nelson, “Hope of Israel” (worldwide youth devotional, June 3, 2018), Gospel Library.

  15. Russell M. Nelson, “Hope of Israel.

  16. 2 నీఫై 30:2 చూడండి.